పేద అమ్మాయి డబ్బుల పంట | Telugu Stories | Telugu Fairy Tales | Telugu Kathalu | Kattapa Kathalu

ఒక ఊరిలో అను అనే ఒక పేద అమ్మాయి వాళ్ళ అమ్మతో కలిసి నివసిస్తుండేది, అను వాళ్ళ అమ్మ పేరు వీణ ఒకరోజు వీణ తనలో తాను ఇలా అనుకుంటుంది,

వీణ : నా ఆరోగ్యం రోజు రోజులకు పాడవుతుంది, ఇప్పుడు నాదగ్గర ఉన్న డబ్బులు చాలా కొన్ని మాత్రమే, నేను కనీసం మందులు వాడినా కూడా నా కూతురుకి సరైన తిండి పెట్టలేక పోవచ్చు,నా ప్రాణానికి ఏమైనా పర్లేదు కానీ నా కూతురు మాత్రం ఆనందంగా ఉండాలి, నేను బ్రతికి ఉన్నన్నాని రోజులు తనకి ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలి అని అనుకుంటుంది, ఇంతలో బయట నుంచి అను పరిగెత్తుకుంటూ వస్తుంది.

అను :అమ్మ అమ్మ నీకోసం మీనా అత్త వచ్చింది, అని అంటుంది

వీణ : హా వస్తున్నానని చెప్పమ్మా అని కిచెప్పి టిఫిన్ డబ్బా తీసుకొని వెళ్తుంది.

అప్పటికే వీణ కోసం బయట ఎదురుచూస్తున్న మీనా ఇలా అంటుంది.

మీనా : ఎంత సేపు ఎదురుచూడాలి వీణ నీకోసం ఇప్పటికి చాలా ఆలస్యం అయ్యింది ఇంకా ఆలస్యం అయితే మన యజమాని మనలని పనిలోకి రానివ్వడు, నువ్వు ఇంత సేపు బయటకు రాకపోతే నీ ఆరోగ్యం బాలేదేమో అని అనుకున్నాను, ఇంతకీ నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అంటుంది.

వీణ : అను ఇక్కడే ఉంది కదా మీనా తాను వింటే బాధ పడుతుంది, నా ఆరోగ్యం బాగుండడం లేదని తనకేమి చెప్పలేదు అని అంటుందో మీనా ని బలవంతంగా తీసుకెళ్లి పోతుంది.

ఆరోజు సాయంత్రం మీనా అను దగ్గరుకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయాసపడుతూ ఇలా చెప్తుంది.

మీనా : అమ్మ అను మీ అమ్మకి చాలా రోజులు ఒంట్లో అస్సలు బాగుండడం లేదు, నీకు నేను ఎన్ని సార్లు చెప్పాలని ప్రయత్నించినా నన్ను చెప్పనివ్వడం లేదు, కానీ ఇప్పుడు పని చేస్తూ చేస్తూనే నోట్లో నుంచి రక్తం వాంతులు చేసుకొని కింద పడిపోయింది, వెంటనే మా యజమాని తనని ఆసుపత్రికి తీసుకెళ్లాడు నేను ఈవిషయం నీకు చెప్పాలని ఇలా వచ్చాను పదా ఆసుపత్రికి వెళదాం అని అను ని తీసుకొని ఆసుపత్రికి వెళ్తుంది మీనా.

మీనా ఆసుపత్రికి వెళ్లి బెడ్ పై ఉన్న వాళ్ళ అమ్మని చూసి ఎంతో బాధపడుతు ఇలా అంటుంది.

అను : అమ్మ ఎందుకమ్మా ఇన్ని రోజులు నీ ఒంట్లో బాగోలేదన్న విషయం నా దగ్గర దాచిపెట్టావు, నేను నీ కష్టం కూడా నాతో చెప్పుకోలేనంత పరాయి దానిని అయిపోయాన అమ్మ అని తల్లి దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అను ఇంతలో డాక్టర్ అక్కడికి వస్తాడు

డాక్టర్ : అమ్మ అను అంటే నువ్వేనా, నీతో కొంచం మాట్లాడాలి ఇలా రా అమ్మ అని అను అని బయటకు తీసుకెళ్తాడు.

డాక్టర్ : చూడమ్మా అను మీ అమ్మ పరిస్థితి ఏమి బాలేదు, ఆపరేషన్ చెయ్యడానికి పది లక్షల రూపాయలు కావలి, అలాగే తాను అస్సలు అలసిపోకూడదు, కంగారు పడకూడదు ఇక నీ తల్లి బాధ్యత నీ చేతుల్లోనే ఉంది తీసుకెళ్ళు అని అంటాడు. అను వీణను తీసుకొని ఇంటికి వెళ్తుంది.

వీణ : అమ్మ అను డాక్టర్ గారు ఏమి చెప్పారమ్మ అని అంటుంది,

అను : అమ్మ నీ ఆరోగ్యానికి ఏమి అవ్వలేదు, కాకపోతే నువ్వు కొన్ని రోజులు ఏ పని చేయకుండా ఉండాలని చెప్పరాని అబద్దం చెబుతుంది.

అను : ఇక నుంచి నువ్వు ఎటు పోవలసిన అవసరం లేదు నేను పనికి వెళ్లి డబ్బులు తీసుకు వస్తాను మల్లి నీ ఆరోగ్యం కుదుట పడిన తరువాతే నువ్వు ఇంట్లో నుంచి బయటకు కదలాలి అని అంటుంది

వీణ : అమ్మ నేను నీకు ఎప్పుడు చెప్పలేదు, మనకి కొంత భూమి ఉంది, దాంట్లో పానం పంట పండించుకుందాం అని అంటుంది

అను :సరే మ్మ నువ్వు నాకు సలహాలు ఇస్తూ నాతోనే ఉంటానంటే నేను అందులో డబ్బులు డబ్బులు పండించినట్టు గా పండిస్తానమ్మా పంట అని అంటుంది.

కొన్ని రోజులపాటు వీణ చెప్పినట్టు చేస్తూ వీణ సలహాలు తీసుకుంటూ అను తమకున్న కొంత పొలం లోనే పంట పండిస్తూ ఉంటుంది. ఇంకా కొన్ని రోజులు అయితే పంట చేతికి వస్తుందనగా అను ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్లి అమ్మ అంత నువ్వు చెప్పినట్టే చేసాను పంట కూడా చాలా బాగా పండుతుంది, నువ్వు చూస్తే చాలా సంతోషిస్తావమ్మా నువ్వు నాకు తోడుగా ఉంటె నేను ఏమైనా చెయ్యగలనమ్మా అని అంటుంది. తెల్లారి ఉదయం రోజు లాగే అను తన పొలానికి వెళ్ళగానే అక్కడ ఏపుగా పండిన పంట అంతా భూమి పాలు అయిపోయి ఉంటుంది, ఒక్క చెట్టు కూడా పనికి రాకుండా అయిపోతుంది. ఆపినంత అలా అయిపోవడాన్ని చూసిన అను అంతో ఆశ్చర్యానికి గురవుతుంది.

అను : అయ్యో దేవుడా ఏంటి ఇలా చేసావు, ఉన్న కొంత భూమిలో ఎదో పంట పండించుకొని మాకు తినే అంత సంపాదించుకుందామంటే కూడా చేతికొచ్చిన పంట నాశనం అయ్యేలా చేసావు, రేపో మాపో మా అమ్మ పొలం చూడడానికి వస్తుంది. తాను పంట అంత ఇలా అయిపోయిందని చూస్తే కంగారు పడితే తన ప్రాణాలకి ఏదైనా జరగొచ్చు అని ఏడుస్తూ ఉంటుంది అను అలా ఏడుస్తూ ఏడ్సుస్తూనే కళ్ళు తిరిగి పడిపోతుంది. కొత్త సేపటి తరువాత అనుకి మెలుకువ వస్తుంది, లేచి చూడగానే నాశనం అయ్యి పడిఉన్న తన పంట అంత చక్కగా ఉంటుంది, వాటికి ఆశ్చర్యంగా డబ్బులు కాసి ఉంటాయి, వాటిని చూసి అను ఆతృతగా వెళ్లి కొన్ని డబ్బులని తెంపుతుంది, మల్లి వాటి స్థానం లో కొత్త డబ్బు నోట్లు వస్తాయి, అలా డబ్బులు రావడం చోసిన అను తన తల్లి ఆపరేషన్ కి కావలసినన్ని డబ్బులు పోగు చేసి ఒక సంచిలో పెట్టుకొని ఇంటికి తీసుకెళ్తుంది. వెంటనే వాళ్ళ అమ్మని ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్ చూషిస్తుంది, కొంత డబ్బు ఊరిలో ఉన్న పేదలకి పంచిపెడుతుంది.

షార్ట్ స్టోరీ

ఓక్ ఊరిలో వీణ అనే పేద మహిళా తన కూతురు అనుతో కలిసి ఉంటుంది. తన భర్త చనిపోయినప్పటినుంచి వీణ రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడడం తో థన్ ఆరోగ్యం క్షీనిస్తుంది, అప్పటి నుంచి అను తమకు ఉన్న కొంత పాలం పండిస్తూ ఉంటుంది, ఒక రోజు తమ అపాంత అంతా పాడైపోతుంది, అది చూసి కీర్తి చాలా ఏడ్చి కళ్ళు తిరిగి పడిపోతుంది, లేచి చూసే సరికి పంట అంత డబ్బుల పంట గా మారిపోతుంది, మొత్తం డబ్బులను పోగుచేసుకొని అను తన తల్లికి ఆపరేషన్ చేయిస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *