పేద అమ్మాయి పెళ్లి Telugu Story – Telugu Kathalu – Telugu Fairytales – Kattappa Kathalu

అయోధ్యాపురం అనే గ్రామం లో సురేంద్ర అనే ఒక వ్యక్తి ఉండేవాడు, అతనికి విజయ, వనిత , రవళి అనే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు  , తల్లి ఆ పిల్లల చిన్నప్పుడే చనిపోయింది. అందువల్ల ఆ ముగ్గురు ఆడపిల్లల ఆలనా పాలనా అంత తండ్రే చూస్తూ వచ్చాడు, వాళ్ళు ఎంత పేదవారు అయినప్పటికీ సురేంద్ర వారికి ఏ లోటు తెలియకుండా పెంచాడు, సురేంద్రకి తన తండ్రుల నుంచి వచ్చిన కొంత పొలం ఉంది, ఆ పొలం లో వ్యవసాయం చోస్తూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు, అతని సంపాదన అంతంత మాత్రంగానే ఉండేది. అలా పొలంతో వచ్చిన కొంచం డబ్బుతోనే మూగ్గురు పిల్లలని చదివించాడు. ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లలకు పెళ్లి వయసు వచ్చింది.

సురేంద్ర ఒకరోజు పొలం పనులు చేస్తుండగా తన స్నేహితుడైన రాజయ్య అక్కడికి వచ్చి

రాజయ్య :- ఏరా సురేంద్ర నీ పిల్లలు ముగ్గురు పెళ్లి వయసుకి వచ్చారు కదా? ఇప్పటివరకు వచ్చిన ప్రతి రూపాయి వారి చదువుల కోసం అని, వాళ్ళ అవసరాల కోసం అని కరచుపెట్టావ్ ఇప్పుడు ఏమి పెట్టి వాళ్ళ పెళ్లి చేస్త్తవు? ఇప్పుడు నీకు ఏమి మిగిలింది ఈ ఒక్క పొలం తప్ప ఇందులో పాండే పంట కూడా అంతంత మాత్రమే నీ కష్టాలకు ఆ దేవుడే ఒక మార్గం చూపించాలి అని అంటాడు

సురేంద్ర :- అలా అంటావేంటి రాజయ్య? పిల్లలకు మనం ఏది ఇచ్చినా ఎన్నో కొన్ని రోజులకి అది పోతుంది అది దాబ్బైనా బంగారం అయినా మనం వాళ్ళ చదువు కంటే గొప్ప అతి ఏమి ఇవ్వగలం చెప్పు అందుకే నా శాయశక్తులా  నా కూతుళ్లు ముగ్గురిని వాళ్ళు చదువుకున్నంత చదివించాను, ఇంకా పెళ్లి విష్యం అంటావా వాళ్ళ తెలివి, గుణగణాలకి మెచ్చి ఎవరో ఒకరు రాకపోతారా  కట్నకానుకలు కావాలి అని పట్టు పెట్టె ఏదైనా మంచి సంబంధం వస్త్తే ఈ పొలం అమ్మేస్తాను., నేను ఎలాగోలా బ్రతికేసాతానులే రాజయ్య నా పిల్లల జీవితం నాకు ముఖ్యం అని చెప్తాడు

అలా రోజులు గడుస్తుండగా సురేంద్ర ఒకరోజు తన పెద్దకూతురు విజయ దగ్గరికి వచ్చి

సురేంద్ర :- అమ్మ విజయ ఒక వారం రోజుల క్రితం నిన్ను చూడడానికి వచ్చిన పెళ్లి వాళ్లకి నువ్వు నచ్చావంటా అమ్మ నెలరోజుల్లో పెళ్లి  పెట్టుకుందాం అన్నారు, నీతో ఒక మాట చెప్పాలని నిన్ను రమ్మన్నాను అమ్మ,

విజయ :- నాన్న నీ దగ్గర ఇప్పుడు పెళ్లి చేసేంత డబ్బులు లేవు కదా నాన్న ఇప్పటికిప్పుడు పెళ్లి చేయడం అంటే ఎలా?

సురేంద్ర :- దానికి ఏముందమ్మా మన పొలం ఉంది కదా దానిని అమ్మేస్తాను అని చెప్తాడు

విజయ :- నాన్న ఆ పొలం అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు, నువ్వు ఆ భూమిని తల్లి లా చూసుకున్నావు, ఇప్పుడు నా కోసం అమ్మేయడం ఏంటి నాన్న, న కోసం నువ్వు ఇంత కషటపడతాను అంటే నేను పెళ్లి చేసుకోవడమే మానేస్తాను నాన్న నాకు పెళ్లి వద్దు ఏమి వద్దు, నేను కూడా నీతో పాటు కష్టపడతాను వచ్చిన డబ్బులతో ఇద్దరు చెల్లెల పెళ్లి చేద్దాం నాన్న అని ఏడుస్తూ చెపుతుంది తండ్రి తో

ఇప్పటి నుంచి సురేంద్రకి ఇష్టం లేకున్నా విజయ ని పొలం పనులకు తీసుకెళ్లక తప్పేది కాదు, ఇద్దరు కలిసి పొలం పనులు చేస్తూ వచ్చిన డబ్బులతో కొన్ని చెల్లెలా పెళ్లిల కోసం పక్కకి పెడుతూ ఉండేది విజయ,

అలా రోజులు కొనసాగుతుండగా ఒకేరోజు రమేష్ అనే ఒక వ్యక్తి సురేంద్ర దగ్గరికి వచ్చి

రమేష్ :- నమస్తే అంకుల్ నా పేరు రమేష్ నేను మీ చిన్న మ్మాయి రవళి నేను క్లాసుమేట్స్ కాలేజ్ లో మేము ఇద్దరం ప్రేమించుకున్నాం, ఆ విషయం మీ అమ్మాయికి చెబితే మీతో మాట్లాడమని చెప్పింది. మీకు కూడా నేను నచ్చితే మీ ప్రమేయం తో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం అంకుల్ మీరేమంటారు? అని అడుగుతాడు

అప్పుడే సురేంద్ర కి ఒక మెరుపు లాంటి ఆలోచన వస్తుంది వెంటనే ఆలోచనని అమలు చేయాలని అనుకుంటాడు. ఆలోచనే తధ్యంగా రమేష్ ని పక్కకి తీసుకెళ్లి

సురేంద్ర :- బాబు రమేష్, నిన్ను చూస్తుంటే నువ్వు బాగా డబ్బున్న వాడిలా ఉన్నావు.  నువ్వు మా చిన్న అమ్మాయి రవళి ని ప్రేమించానని చెబుతున్నావు, నీ ప్రేమ నిజమైనదో కాదో నాకు తెలియాలంటే నీకో పరీక్షా పెడతాను నువ్వు గనక ఆ పరీక్షలో గెలిస్తే నిన్ను నా చిన్న కూతురు రవళిని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను

రమేష్ :- చెప్పండి అంకుల్ రవళి కోసం ఎలాంటి పరీక్షలకైనా వెనకాడను చెప్పండి అంకుల్

సురేంద్ర :- చూడు బాబు మాది చాలా పేద కుటుంబం ఉన్న కొంత పొలం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాము, కానీ నాకు ముగ్గురు ఆడపిల్లలు రవళికి ఇద్దరు అక్కలు ఉన్నారు, వాళ్లకి పెళ్లి చేయకుండా చిన్న పిల్లకి పెళ్లి చేయలేను, నీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా మా స్థాయికి తగినట్టుగా ఒక ఇద్దరు పిల్లలని చూసి మా అమ్మాయిలకు పెళ్లి చేసి రావళిని ప్రేల్లి చేసుకో బాబు అని చెప్తాడు సురేంద్ర

రమేష్ సరే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు

ఒక రోజు రమేష్ ఇద్దరు యువకుల్ని తీసుకొని సురేంద్ర దగ్గరికి వెళ్తాడు

రమేష్ ఆ ఇద్దరు యువకులని చూపిస్తూ

రమేష్ :- అంకుల్ ఇతని పేరు కృష్ణ ఇతడు తనకి ఉన్న పొలం ని సాగుచేస్తూ  కొనసాగిస్తున్నాడు, అమ్మ నాన్న ఎవరు లేరు మీ పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకొని మీ తోనే మీ ఇంటి దగ్గరే ఉంటాడు

ఇంకొక వ్యక్తిని చూపిస్తూ ఇతని పేరు రాజు ఇతను బాగా చదువుకున్న వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ చాలా డబ్బులు సంపాదించాడు. మీ రెండవ అమ్మాయి వనితా చాలా తెలివైన అమ్మాయి అయినంఅందునా మీ రెండవ అమ్మాయి వనిత కి ఇతని కి జోడి సరిగ్గా ఉంటుంది.

నేను ఇన్ని రోజులు రాత్రియంబవళ్ళు ఎంతో కష్టపడి చూసిన వాళ్లలో బనకు వీళ్ళు నచ్చారు మీకు కూడా నచ్చరు అంటే ముగ్గురి పెళ్లిళ్లు ఒకే ముహూర్తం లో చేసుకోవచ్చు పైగా మా ముగ్గురిలో ఏ ఒక్కరికి కూడా రూపాయి కట్నం కూడా వద్దు అని  చెబుతాడు

రమేష్ మాటలు విన్న తర్వాత సురేంద్ర కళ్ళలో నీళ్లు తిరుగుతాయి

వనిత, విజయ లకి కూడా ఆ ఇద్దరు కుర్రాళ్ళు నచ్చడం తో ఒక మంచి ముహూర్తం చూసి మూగురికి ఒకే వేదికపై పెళ్లిళ్లు చేస్తాడు సురేంద్ర ఇచ్చిన మాట ప్రకారమే పెద్ద అమ్మాయి విజయ ఆమె భర్త కృష్ణ సురేంద్ర దగ్గరే ఉంటూ పొలం పనులు చేసుకుంటూ ఉంటారు అందరు పెళ్లిళ్లు చేసుకొని ఎంతో హాయిగా బ్రతుకు తుంటారు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *