పేద అమ్మాయి మామిడిపళ్ల వ్యాపారం | Telugu Stories | Telugu Moral Stories | Telugu Kathalu

ఒక ఊరిలో రంగయ్య అనే ఒక పేద కూలి ఉండేవాడు, అతనికి సుజాత అనే ఒక భార్య మరియు అమ్ములు అనే ఓక కూతురు ఉండేది, రంగయ్య తనకి వచ్చిన పనులు దొరికినప్పుడు ఎంతో కష్టపడి పనులు చేస్తూ వచ్చిన డబ్బులు తనం భర్య సుజాతకి ఇచ్చేవాడు, సుజ్జాత ఉన్న డబ్బులనే పొదుపు చేస్తూ ఇంటిని నడుపుతుండేది, అలా రోజులు ఎంతో కష్టంగా తినడానికి తిండి కూడా లేక పస్తులతో గడిచిపోతూ ఉండేవి. ఇలా ఉండగా రంగయ్యకి ఆరోగ్యం కూడా సరిగా ఉండడం లేదు, ఎప్పుడు ఎదో ఒక సమస్యతో బాధపడుతూ ఉండేవాడు, ఆరోగ్యం బాలిక పోవడం తో ఎవ్వరు పనులు కూడా ఇచ్చేవారు కాదు, దాంతో ఇల్లి గడవడం మరింత కష్టాంగా మారిపోయింది, ఒకరోజు ఒంట్లో ఓపిక లేకుండా మంచం పై పడుకొని ఉన్న రంగయ్య దగ్గరకు సుజాత వచ్చి ఇలా అంటుంది.

సుజాత : ఏమండి మన ఆర్థిక పరిస్థి రోజు రోజుకి మరింత దిగజారిపోతోంది, ఇన్ని రోజులు మన దగ్గర డబ్బులు ఉన్న లేకున్నా అప్పుడో ఇప్పుడో మీరు ఇచ్చిన డబ్బులని పోగుచేసిన వాటితో మనకు తినడానికి ఏవో కొన్న్ని బియ్యం వచ్చినాయి, ఇప్పుడు డబ్బులు మొత్తం అయిపోయాయి పైగా ఇంట్లో వండడానికి ఏమి మిగలలేదు, మనం అంటే ఎలాగోలా పస్తులు ఉంటూ పనులు దొరుకుతాయని పడిగాపులు కాస్తాము కానీ అమ్ములు చిన్న పిల్ల దాని కడుపు నింపకుంటే మనం దానికి తల్లిదండ్రులు అని చెప్పుకునే అర్హత కూడా లేదండి, మీ ఆరోగ్యం చూస్తేనేమో నాకు భయం వేస్తుంది, అమ్ములు భవిష్యత్హు ఆలోచిస్తే చచ్చిపోవాలనిపిస్తుంది నేను ఏమి చెయ్యాలో కూడా నాకు అర్ధం కావడం లేదండి, అని అంటుంది సుజాత

రంగయ్య : నన్ను ఏమి చేయమంటావు సుజాత నువ్వు చూస్తూనే ఉన్నావుకద్దా నేను నాకు చేతనయినంత పని చేస్తూనే ఉన్నాను, కానీ ఎక్కడ పని మాత్రం దొరకడం లేదు, ఒక వేళా పని దొరికిన రోజు నా శరీర బలహీనత నన్ను పని చెయ్యనివ్వడం లేదు, నన్ను ఎలాంటి పరిస్థితుల్లో చూస్తూ ఎవ్వరు నన్ను పాపానికి పిలవడం కూడా మానేశారు ఇక నాకు పని దొరుకుతుందనే ఆశ కూడా చచ్చిపోయింది, నాకు ఇక ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయేమో  చావు నాకు దగ్గర పడినట్టు ఉంది అందుకే ఇలా జరుగుతుంది అని అంటాడు రంగయ్య

సుజాత : అలా ఎందుకు మాటాడుతున్నారండి, అమ్ములు ఈ మాటలన్నీ వియంటే ఎంత బాధ పడుతుంది చెప్పండి, మీ ఒంట్లో ఓపిక లేనంత మాత్రాన మన కుటుంబం రోడ్డున పడుతుందా నేను లేనా, రేపటి నుంచి నేను పనికి వెళ్హటాను మన కుటుంబాన్ని కాపాడుకుంటాను అని అంటుంది సుజాత

రంగయ్య : నిన్ను నా భార్యగా తెచ్చుకొని నీకు లేని పోనీ కష్టాలు పెడుతున్నాను సుజాత నన్ను క్షమించు అని అంటాడు రంగయ్య

ఇంతలో అమ్ములు అక్కడికి వస్తుంది.

అమ్ములు : నాన్న ఇప్పటి వరకు మీరు మాట్లాడుకున్న మాటలన్నీ నేను విన్నాను, నా కోసం మీరు ఇంతలా కష్టపడడం నన్ను ఎంతగానో బాధిస్తుంది, మీరు ఒప్పుకుంటానంటే నా దగ్గర ఒక ఆలోచన ఉండి మీకు చెప్తాను అని అంటుంది.

రంగయ్య : నా చిట్టి తల్లి చెప్తే నేను కాదు అందమా అది ఈ జన్మలో జరగదు, నువ్వు ఏమి చెప్పాలి అనుకుంటున్నావా చెప్పు తల్లి అని అంటాడు అమ్ములు తల నిమురుతూ

అమ్ములు : నాన్న ఈ మధ్య కాలంలో రెండు మూడు సంవత్సరాలకే పంటలు పండే కొన్ని రకాల మామిడి చెట్లు వచ్చాయి, ఎలాగోలా చేసి వాటిని మనం కొనుక్కొచ్చి మన ఊరి చివరన మనకి ఉన్న కొంచం పొలంలో వేసుకుంటే రెండు సంవత్సరాలలో మనకి కాయలు వస్తాయి వాటిని అమ్మి మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అని అంటుంది.

సుజాత : నీ ఆలోచన్ బాగానే ఉంది కానీ మొక్కలు కొనాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నపని కదా అంత డబ్బు మన దగ్గర లేదు కదా ఎక్కడ నుంచి తీసుకువస్తాము అని అంటుంది.

రంగయ్య : నాకు కూడా అలన్తి ఆలోచన ఉంది, డబ్బు గురించి మీరేం దిగులు పడకండి, నా తల తాకట్టు పెట్టి అయినా డబ్బు తీసుకు వస్తాను, అని రంగయ్య ఊరిలోకి వెళ్లి చాలా మందిని అడిగి వడ్డీకి డబ్బు తీసుకు వస్తాడు, తాను ఛేచ్చిన డబ్బుతో నాణ్యతమైన కొన్ని రకాల మామిడి పళ్ళని తీసుకు వస్తాడు,  రంగయ్య, సుజాత మరియు అమ్ములు కలిసి ఎంతో కష్టపడి మామిడి తోటని పెంచుతారు, రంగయ్య మామిడి తోటని చూసుకుంటూ ఏ పనికి పోకుండా అతిగా కష్ట పడక పోవడం వల్ల తన ఆరోగ్యం కొంత కుదుట పడుతూఉంది, అలా కొన్ని రోజులు గడిచే సరికి రంగయ్య తోటలో మామిడి చెట్లన్నీ ఇరగ కాయలు కాయడం మొదలవుతుంది. రంగయ్య తోటలో కాసిన పళ్ళని ఒక బుట్టలో పెట్టుకొని ఊరూరా తిరుగుతూ అమ్ముతుంటాడు, అలా అమ్మడం వల్ల వాళ్లకి డబ్బులు వస్తాయి కానీ ఒకరోజు మామిడి పళ్ళని అమ్ముతున్న రంగయ్యకి కళ్ళు తిరగడంతో సైకిల్ పైనుండి పడిపోతాడు ,హతాను తీసుకెళ్లిన పళ్ళన్నీ నెల పాలు అవ్వ్వుతాయి, తండ్రి దెబ్బలు తగిలి ఉండడం అమ్ములకి ఏ మాత్రం నచ్చేది కాదు.

అమ్ములు : నాన్న ఇలా ఉండడం నాకు ఏ మాత్రం నచ్చడం లేదు, ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ నను ఆడిస్తూ ఉండే నాన్న ఇలా మంచానికి పరిమితం కావడం నేనే చూడలేక పోతున్నాను, అని తనలో తాను అనుకుంటుంది వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది అమ్ములు

అమ్ములు : ;అమ్మ నాన్న ఆరోగ్యం కుదుట పడాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని డాక్టర్ చెప్ప్పాడు కదా, నేను సైకిల్ పై మామిడి పళ్ళని పెట్టుకొని ఊరూరా తిరుగుతూ అమ్ముతాను అమ్మ దాంతో ఎంతో కొంత డబ్బులు మనకి వస్తాయి అని అంటుంది. ఆరోజు నుంచి అమ్ములు తమ తోటలో కాసిన మామిడి పళ్ళని సైకిల్ పై పెట్టుకొని ఊరూరా తిరుగుతూ అమ్ముతూ ఉంటుంది, సుజాత తన భర్త యోగ క్షేమాలు చూసుకుంటూ తమ తోట దగ్గరికి మామిడి పండ్లు కొనడానికి వచ్చిన వాళ్లకి అమ్ముతూ కొంత డబ్బులు సంపాదిస్తుంది. అల్లా కొన్ని రోజులు గడిచేసరికి వాళ్ళ దగ్గరకొన్ని డబ్బులు జమ అవుతాయి. తమ దగ్గర ఉన్న డబ్బులతో రంగయ్యని ఆసుపత్రిలో చూపించి రంగయ్య ఆరోగ్యం కుదుట పడేలా చేస్తారు. తన ఆరోగ్యం కుదుట పడిన తరువాత  రంగయ్య మల్లి ఎప్పటి లాగానే ఆమెది పండ్లు అమ్మడానికి ఊరూరా తిరుగుతుంటాడు, అమ్ములు ని ఒక మంచి పాఠశాలలో చేపించి చదువు చెప్పిస్తుంటాడు రంగయ్య, రంగయ్య మల్లి ఎప్పటిలాగా అవ్వడం చూసిన సుజాత మరియు అమ్ములు ఎంతగానో సంతోషిస్తారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *