పేద కోడలు vs ధనవంతుల కోడలు | Telugu Kathalu | Telugu Story | Bedtime Stories | Panchatantra kathalu

గోవిందపురం మన గ్రామంలో అంజన అనే ఒక ఆమె ఉండేది ఆమెకు ఇద్దరు కొడుకులు. మొదటి కొడుకు పేరు రాజు అతని భార్య పేరు శ్రీలత. శ్రీలత ఒక పేద కుటుంబం నుంచి ఆ ఇంటికి కోడలిగా వచ్చింది. అయినప్పటికీ అత్తగారు ఆమెతో బాగా చూసుకునే వాళ్ళు. కోడలు కూడా చాలా మంచిది భర్తతో పాటు పొలం వెళ్లి వాళ్ల పనులలో సహాయం చేస్తూ ఉంటుంది ఇక రెండో కొడుకు పేరు కృష్ణ . అతను బాగా చదువుకున్నాడు ఆ ఊరిలో వ్యాపారం చెయ్యాలని ఆ పని హడావిడిలో తిరుగుతూ ఉంటాడు. అలా వుండగా ఒక రోజు బాగా డబ్బు లేని అమ్మాయి . కృష్ణ దగ్గరికి వస్తుంది.
ఆమె కృష్ణ తో… కృష్ణ ఎలా ఉన్నావ్.
నేను రాదని కృష్ణ ఆమెను చూసి…. రాధా నువ్వా చాలా రోజులు అయింది నిన్ను చూసి ఎలా ఉన్నావ్.
రాధా… ఏమి బాగోలేదు. ఎందుకంటే ఇంత దూరం నేను నీకోసం వెతుక్కుంటూ వచ్చాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను కృష్ణ నన్ను పెళ్లి చేసుకో అంటూ ఏడుస్తుంది.
అతను చుట్టూ వైపు చూస్తూ…. రాధా ఏడవకు పక్కన వాళ్ళు అందరు నన్నే చూస్తున్నారు. నేను నిన్ను ఏదో చేశాను అని అనుకుంటారు. రాధా…. ఏదేమైనా సరే నా మనసులో మాట చెప్పేసాను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా చెప్పు .
అతను…. సరే పద మా ఇంటికి మా అమ్మ అన్న వదిన తో మాట్లాడదాం. అని అంటాడు అందుకనే సరే అంటుంది. ఇంకా అతను సరాసరి ఆమెను ఇంటికి తీసుకెళ్తాడు.
ఇక వాళ్లతో జరిగిన విషయాలు చెబుతాడు అందుకు. వాళ్ళు ఏ మాత్రం అభ్యంతరం చెప్పరు పెళ్లికి అంగీకరిస్తారు. ఎక్కువ ఇద్దరూ చాలా సంతోష పడతారు.
ఆమె వాళ్ల నాన్నకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని పిలుస్తుంది తండ్రి కూడా అక్కడికి వస్తాడు. మంచి చెడు అన్ని మాట్లాడుకుంటారు. కొన్ని రోజుల్లోనే పెళ్లి కూడా జరిగిపోతుంది.
పెళ్ళయిన కొన్ని రోజులకు రాధా తండ్రి వాళ్లకి ఫ్రిడ్జ్ , డబల్ కాట్ మంచం, ఏసి , టీవీ అన్నిటినీ బహుమతిగా పంపిస్తాడు.
వాటన్నిటినీ చూసి అత్త ఆశ్చర్యపోతూ… రాధా ఇవన్నీ మీ నాన్నగారు పంపించరా చాలా బాగున్నాయి.
రాధా…. మనకోసమే అత్తయ్య ఇక్కడ సౌకర్యాలు ఏమీ లేవు . అయినా పెళ్లయిన తర్వాత వస్తువులను కట్నంగా పంపించడం మా ఆచారం మీ పెద్ద కోడలు కట్నకానుకలు ఏమి తీసుకురాలేద అత్తయ్య.
అని అంటుంది అందుకు అత్త…. దానీ మొఖం దాని దగ్గర ఏమున్నాయి. కట్నం కూడా సరిగ్గా ఇంతవరకు ఇవ్వలేదు. నా పెద్ద కొడుక్కి బండి కొని పెడతాము అన్నారు ఇంతవరకు బండి కూడా లేదు.
పాపం వాడు ఎక్కడికైనా వెళ్లాలంటే ఇబ్బందిపడుతూ ఉన్నాడు.
రాధా…. అయ్యో అత్తయ్య బావగారికి రేపొద్దున మంచి బైక్ మన ఇంటి ముందు ఉంటుంది చూడండి. అని అంటుంది.
అత్తా సంతోషపడుతూ…. అబ్బా నువ్వు ఇంటికి వచ్చిన వెంటనే లక్ష్మీదేవి మా ఇంట్లో అడుగు పెట్టింది. నా పెద్ద కోడలు వచ్చింది ఇంతవరకు మాకు కలిసొచ్చింది లేదు . అదొక ముష్టి మొహంది పైగా నష్టం జాతకురాలేమో. మాకు అసలు కలిసి రావడం లేదు.
అంటూ పెద్ద కోడలు అని తిడుతుంది ఆ మాటలన్నీ చాటుగా పెద్ద కోడలు విని చాలా బాధపడుతుంది.
ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు చిన్న కోడలు చెప్పినట్టు కానీ ఆ ఇంటి ముందు బైక్ ఉంటుంది. దానిని చూసి అందరూ ఆశ్చర్యపోతారు రాముతో…. బావగారు ఈ బైక్. ఈ మరదలు మీ కోసం బహుమతిగా ఇస్తుంది. అని అంటుంది అందుకు అతను సంతోషపడుతు. నవ్వుతాడు అందుకు అత్త…. నా చిన్న కోడలు బంగారం అంటూ ఆమెను పోగొడుతుంది.
ఇక ఎవరి పనులు వాళ్ళు వెళ్తారు. చిన్న కోడలు ఇంట్లో కూరగాయలు కత్తిరిస్తూ ఉండగా ఆ వేలు కు గాయమయ్యే అమ్మా అంటూ పెద్దగా అరుస్తుంది .
అత్త కంగారుపడుతూ…. అయ్యో ఏమైందమ్మా. అంటూ అక్కడికి వస్తుంది కోడలు వేలు చూపించడంతో అత్త…. అయ్యో ఎంత పెద్ద గాయం అయింది . రక్తం చూడు ఎలా పోతుందో అసలైన నిన్ను ఇంటి పనులు ఎవరు చేయమని చెప్పారు. అది ఉంది కదా ఇంట్లో అది చేస్తుంది . నువ్వు మాత్రం ఏ పని చేయకుండా అలా తీరిగ్గా కూర్చుని అమ్మ అసలుకే డబ్బున్న కుటుంబం నుంచి వచ్చావు. మీ నాన్నగారు నిన్ను ఎంతో సుకుమారంగా పెంచరో మాకు తెలుసు.
నీకు ఏమన్నా అయితే మీ నాన్న మమ్మల్ని ఊరుకుంటాడా. అంటూ ఆమెను
వంటగది నుంచి పంపించేస్తుంది .
పెద్ద కోడలితో…. ఒసేయ్ చిన్న కోడలు ఒక్క పని కూడా చేయదు పని మొత్తం నువ్వే చేయాలి. అని అంటుంది అందుకు ఆమె సరే అంటుంది ఆ రోజు నుంచి పెద్ద కోడలు ఎవరు కూడా సరిగ్గా చూసుకునే వాళ్ళు కాదు ఎవరు కూడా పెద్దగా మాట్లాడేవాళ్ళు కాదు భర్త అత్త మరిది ముగ్గురు కూడా చిన్న కోడలికి అడుగులకు మడుగులొత్తుతూ ఉంటారు.
పాపం పెద్దకోడలు ఎంతో కష్ట పడుతూ వాళ్లకోసం రుచికరమైన భోజనం తయారు చేస్తోంది. వాళ్ళు భోజనం చేసిన తరువాత అన్ని పాత్రలు శుభ్రం చేస్తుంది . బండెడు బట్టలు అన్ని ఉతికి ఆర వేస్తుంది. అలా ఒకటి కాదు రెండు కాదు అన్ని కష్టమైన పనులు మొత్తం తానే స్వయంగా చేస్తుంది అత్తా రెండో కోడలు మాత్రం టీవీ చూస్తూ వాళ్ళ జల్సా చేస్తూ ఉంటారు.
అలా రోజులు గడుస్తున్నాయి . అత్త రెండో కోడల్ని గారాబంతో నెత్తిన కూర్చో పెడుతుంది.
ఆమె కూడా ఆలుసు తో చాలా గర్వంగా
పెద్ద కోడలితో మాట్లాడుతూ ఉంటుంది.
చిన్న కోడలు పెద్ద కోడలు ఎన్ని మాటలు అన్నా. వాళ్ళందరూ చూస్తూ ఉంటారు కానీ ఎవరు కూడా పట్టించుకోరు .
రోజులు గడుస్తున్నాయి ఒక రోజు
అత్తగారి ఆరోగ్యం బాగోక మంచాన పడుకుంటుంది.
చిన్న కోడలు టీవీ చూస్తూ ఉంటుంది పెద్ద కోడలు తన భర్త కి భోజనం తీసుకోవడం కోసం పొలం వెళుతుంది.
ఇంతలో అత్తగారికి దాహం కలిగి…. అమ్మ రాధా కొంచెం నీళ్లు ఇవ్వమ్మా. అని అంటుంది ఆమె మాత్రం . అస్సలు పట్టించుకోకుండా టీవీ చూస్తూ ఉంటుంది. అత్త… అమ్మ రాధ అంటూ పెద్దగా కేకలు వేస్తోంది.
రాధా చాలా కోపంగా…. ఏమిటి ఏం కొంపలు మునిగిపోయేది అని అలా కేకలు వేస్తున్నారు. టీవీ లో మంచి సీన్ లు వస్తున్నాయి . ఇప్పుడే పిలుస్తూ ఉంటారు ఏం కావాలి.
అత్త.. దాహంగా ఉంది నీళ్లు ఇవ్వమ్మా.
కోడలు…. పక్కనే ఉన్నాయి గా తీసుకొని చావండి అంటూ అక్కడ గ్లాస్ పెట్టి వెళ్లి పోతుంది. అత్త గ్లాసు అందుకుంటూ ఒక్కసారిగా మంచం పైనుంచి కింద పడుతుంది. దాన్ని చూసి చూడనట్టుగా ఉంటుంది చిన్న కోడలు అప్పుడే పెద్దకోడలు అక్కడికి వచ్చి…. అయ్యో అత్తయ్య ఒక్క నిమిషం అంటూ ఆమె దాహం తీరుస్తుంది.
పెద్ద కోడలు చిన్న కోడలి తో…. రాధా అత్తగారికి బాగోలేదు కదా ఇలా. పట్టించుకోకుండా ఉంటే ఎలా చెప్పు.
ఆమె…. అడ్డమైన సేవలు చేయడానికి నేను ఏమి మీలాగా దాసిని కాదు. నా రేంజ్ ఏంటి నేనేంటి. అని గర్వంగా మాట్లాడి కోపంగా లోపలి వెళ్ళిపోతుంది.
ఆ మాటలకి అత్త కొంచెం బాధ పడుతుంది రోజులు గడుస్తున్నాయి . అత్త గారి ఆరోగ్యం బాగోక పోవడం వలన పెద్ద కోడలు ఆమెను బాగా చూసుకుంటూ ఉంటుంది .
చిన్న కోడలు ఆమెను చూసి…. చి చి ఏమో ఏమో మాకు అనుకుంటారేమో అని భయంగా ఉంది నేను నా మొగుడు తీసుకొని నా ఇంటికి వెళుతున్నాను. నాకు ఇక్కడ ఉండడం అస్సలు ఇష్టం లేదు అని. భర్త తో మాట్లాడుతూ ఉంటుంది దానికి ఒప్పుకోడు. ఇక ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది .
పెద్దకోడలు వాళ్ళకి నా చెబుతూ ఉంటుంది కానీ చిన్న కోడలు ఏమాత్రం ఒప్పుకోకుండా
.. నేను ఒక్క క్షణం కూడా ఉండను అని చెప్పి తన సూట్ కేస్ తీసుకుని వెళ్లి పోతుంది. పెద్దకోడలు ఆమె ను ఆపడానికి ప్రయత్నించినా ఆగదు. అత్త… అమ్మ దాన్ని వదిలేయ్ దానిని నెత్తిన పెట్టుకోండి నేనే. నాకు ఇదంతా కావాల్సిందే. బంగారం లాంటి నిన్ను మొదలుపెట్టాను . ముళ్ళ లాంటి ధనిని నెత్తిన పెట్టుకున్నాడు ఇప్పుడు అది నాకు
గుచ్చుకొని మంచి గుణపాఠం నేర్పింది. అంటూ బాధపడుతుంది. కోడలు … విరుకొండ అత్తయ్య అంటూ సద్ది చెబుతుంది.
కొన్ని రోజులకి అత్త ఆరోగ్యం కుదుటపడుతుంది. చిన్న కోడలు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుంది. అప్పుడు అత్త ఆమె చేత పనులు చేయించడం మొదలు పెడుతుంది ఇద్దరినీ సమానంగా చూస్తుంది.
ఇంకా చేసేది ఏమి లేక చచ్చినట్టు గా చిన్న కోడలు తన మనసు మార్చుకొని వాళ్లతో కలిసి ఉంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *