పేద పిచ్చుక పుట్టినరోజు | Telugu Stories | telugu Fairy Tales | Best Birds Stories Telugu

ఒక అడవిలో తుని పిచ్చుక, లూసీ పావురం, చోటు చిలుక మంచి స్నేహితులు, ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్ళేవి కలిసే తిరిగేవి, అడవిలో కొన్ని పక్షులు తుని పిచ్చుక లూసీ పావురం చోటు చిలుక స్నేహాన్ని చూసి ముచ్చటపడితే ఇంకా చిచ్చు కాకి లాంటి కొన్ని పక్షులు మాత్రం వాటి స్నేహాన్ని చూసి కుళ్ళుకునేవి. కానీ ముగ్గురు స్నేహితులు మాత్రం ఎవ్వరిని పట్టించుకునే వారు కాదు, అలా ఒకరోజు తుని పిచ్చుక లూసీ పావురం చోటు చిలుక అడవిలో ఆహరం కోసం వెతుకుతూ ఉండగా తుని పిచ్చుక ఇలా అంటుంది.

తుని పిచ్చుక : మిత్రులారా మనం చూస్తూనే ఉన్నాం కదా మధ్య ఒక్కొక్కరు పుట్టిన ఎంతలా హడావిడి చేస్తూ తమ తమ పుటిన రోజును ఒక పండుగలా జరుపుకుంటున్నారు, నా పుట్టిన రోజు దగ్గర్లోనే ఉంది, నాకు కూడా అల్లా పుట్టినరోజు జరుపుకోవాలని ఉంది, అందరిలా కేక్ కట్ చెయ్యాలి స్నేహితులని ఇంటికి పిలిచి వాళ్లకు మంచిగా రుచి కరమైన వంటలు చేయించి పార్టీ ఇవ్వాలి ఇలా నాకు కూడా కోరికలు ఉన్న పేదరికం వళ్ళ అలాంటి వాటన్నింటికి దూరంగా ఉండాలి. మన లాంటి వాళ్లకి పుట్టిన రోజు వేడుకలు చేసుకునే అవకాశషం కూడా లేదా అని అంటుంది తుని పిచ్చుక బాధపడుతూ

లూసీ పావురం : చూడు తుని నువ్వు బాధపడడం లో ఎలాంటిఅర్ధం లేదు, ఎందుకంటే నీకు మన పరిస్థితి పూర్తిగా తెలుసు, రోజు తిండి కోసం మైళ్ళకి మైళ్ళు తిరుగుతే గాని మన కడుపులు నిండవూ అలాటి పరిస్థితుల్లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం అసాధ్యం, మన దగ్గర మంచిగా డబ్బులు ఉన్న రోజు నీ పుట్టిన రోజు వేడుకని మేమె ఘనంగా జరుపుతాము, ఇప్పుడు ఎక్కడ ఆహారం ఉందొ వెతుకుదాం పద అని అంటుంది,

అలా కొంత సేపు వెతికిన తరువాత వాటికి దొరికిన కొన్ని పళ్ళను తీసుకొని ఎవరి గూటికి అవ్వి వెళ్లిపోతాయి,

తుని పిచ్చుక మాత్రం తన గూటిలో కూర్చొని బాధపడుతూవు ఉంటుంది.

తుని పిచ్చుక : ఏంటి నాకు ఈ పేదరికం వాళ్ల అన్ని ఆక్షలే, కోరుకున్న తిండి తినలేను వెతుక్కుని తినాల్సి వస్తుంది, పుట్టిన రోజు జరుపుకోవడానికి కూడా పేదరికమే అడ్డుగా ఉంది, ఈ పేదరికాన్ని నేనేమన్నా కోరుకొని తెచ్చుకున్ననా, పేదరికం లో పుట్టడం నేను చేసిన తప్పా అని బాధపడుతూ ఉంటుంది.

కొంత సేపటి తరువాత చోటు చిలుక లూసీ పావురం దగ్గరకు వెళ్తుంది.

లూసీ పావురం : ఏంటి మిత్రం ఎప్పుడు లేనిది ఈ సమయం లో ఇక్కడకు వచ్చావు అని అం=దిగుతుంది.

చోటు చిలుక : ఏంటో మిత్రమా ఈరోజు మన స్నేహితురాలు తుని పిచ్చుక బాధపడుతుంటే నాకు నచ్చలేదు, తనేమన్న అష్ట ఐశ్వర్యలు  అడిగిందా కేవలం తన పుట్టిన రోజు జరపమనే కదా అడిగింది అది కూడా తీర్చేలేక పోతే మనం స్నేహితులం ఎలా అవుతాము అని అంటుంది.

లూసీ పావురం : మిత్రమా నీకు ఇంకా నా ఉద్దేశ్యం అర్ధం కాలేదు కదూ , ఇందాక తుని పిచ్చుక అడిగినప్పుడే నేను తన పుట్టిన రోజు వేడుక జరపాలని నిర్ణయించుకున్నాను, తాను ఎంత గానో ఆశపడుతోంది కదా నేనెలా కాదంటాను చెప్పు, కానీ అక్కడే మేము నీ పుట్టిన రోజు జరుపుతాము అంటే తన సంతోషాన్ని అప్పడు ఇచ్చిన వాళ్ళం అవుతాము అదే మనం తన పుట్టిన రోజు నాడు అనుకోకుండా వెళ్లి తనని ఆశ్చర్య పరిస్తే ఊహించని పరిణామానికి తాను ఇంకా సంతోషిస్తుంది కదా అందుకే నేను ఎక్కడ అలా మాట్లాడాను అని అంటుంది.

చోటు చిలుక : మిత్రమా నీ తెలివికి నా జోహార్లు, మన ఇప్పుడే వెళ్లి తన పుట్టిన రోజుకు కావలసిన ఏర్పాట్లన్నీ రహస్యంగా జరుపుదాం పదా అని అంటుంది.

ఆరోజు నుంచి కొంత కొంత డబ్బులు పోగు చేసుకుంటూ తుని పిచ్చుక పుట్టిన రోజు ఏర్పాట్లు జరుపుతుంటారు.

ఇంతలో తుని పిచ్చుక పుట్టిన రోజు రానే వస్తుంది. లూసీ పావురం, చోటు చిలుక రెండు కలిసి తుని పిచ్చుక గూటికి వెళ్తాయి. గూటిలో దిగులుగా కూర్చొని ఉన్న తుని పిచ్చుక దగ్గరకు వెళ్లి చోటు చిలుక ఇలా అంటుంది.

చోటు చిలుక : మిత్రమా నువ్వు చాలా రోజులుగా సరిగ్గా తినడం లేదు, పుట్టిన రోజు నే తలుచుకుంటూ దిగులుగా ఉన్నావు, ఒక సారి గూడు వదిలి బయటకు రా అని అంటుంది.

తుని పిచ్చుక : ఎక్కడైతే ఏముంది మిత్రమా బాధపడడానికి, అంటూ తుని పిచ్చుక బయటకు వస్తుంది.

అప్పటి లోగానే బయట లూసీ పావురం పుట్టినరోజు ఏర్పాట్లు చేస్తుంది గూటి బయట ఉన్న కొమ్మ మీద.

వాటన్నింటిని చూసిన తుని పిచ్చుక ఎంతో ఆశ్చర్య పోతుంది. సంబరంతో ఉబ్బి తబ్బి పోతుంది.

తుని పిచ్చుక : మితులారా, ఇవ్వన్నీ నాకోసమే ఏర్పాటు చేశారా నాకు చాలా సంతోషంగా ఉంది, నేను నీ పుట్టిన రోజు ఎంతో నిరాశగా జారుతాడేమో అనుకున్నాను, మీరు ఈ నా పుట్టి రోజును జీవితం లో ఎప్పటికి మరిచిపోలేనిదిగా చేశారు అని అంటుంది,

లూసీ పావురం : ఈరోజు నీ మొహం లో ఇంత ఆనందం చూడడం కోసమే ఆరోజు అలా మాట్లాడాను, నువ్వు అడిగిన తరువాత మేము కాదంటామా నువ్వు మా ప్రియమైన స్నేహితురాలివి నిన్నెలా బాధపెడతాము మిత్రమా అని అంటుంది.

తుని పిచ్చుక  ఎంతో ఆనందంగా కేక్ కోసి పుట్టిన రోజు వేడుకని జరుపుకుంటుంది.

షార్ట్ స్టోరీ

తుని పిచ్చుక లూసీ పావురం చోటు చిలుక మంచి స్నేహితులు, ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్ళేవి కలిసే ఉండేవి, ముగ్గురిలో ఎవరికీ ఏ చిన్న అవసరం వచ్చిన మిగతా రెండు పక్షులు చూసుకునేవి, తుని పిచ్చుక పుట్టి రోజు దగ్గర పాడడం తో తుని పిచ్చుకకు పుట్టిన రోజు వేడుక జరుపుకోవాలని ఎంతో ఆశగా ఉంటుంది, అదే విషయాన్ని తన మిత్రులకు చెప్పగా ఒప్పుకోరు, కానీ తుని పిచ్చుక పుట్టిన రోజు నాడు మిగిలిన ఇద్దరు స్నేహితులు కలిసి తుని పిచ్చుక పుట్టిన రోజుని ఎంతో ఘనంగా జరుపుతారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *