పేద పిచ్చుక మిఠాయి వ్యాపారం | Telugu Stories | telugu Fairy Tales | Best Birds Stories Telugu

టుని అనే పిచ్చుక ఉద్యోగం చేసి బాగానే డబ్బులు సంపాదిస్తున్నా కూడా తనకి అది పెద్దగానచ్చేది కాదు, ఒకరోజు తుని పిచ్చుక తనలో తాను ఇలా అనుకుంటుంది.

టుని : ఇలా ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి సాయంత్రం అయితే అయిదు గంటలకు మల్లి రావడం ఇదే నా రోజు జరిగే తతంగం, ఇలా జరగడం ఎందుకో నాకు నచ్చడం లేదు నాకంటూ నాకు ఎంత డబ్బులు వచ్చినా నేను ఒకరి కింద పని చేయిస్తున్నట్టే కదా ఇలా ఒకరి కింద పని చేస్తే నాకంటూ గుర్తింపు ఉండదు, పైగా నా అడవిలో నా ఇంటికి నా తల్లి దండ్రులకి ఇంత దూరంగా ఉంటూ పని చేయాలి.  అందుకే నేను ఇక్కడ నుంచి వెళ్లి ఏదో ఒక చిన్న వ్యాపారం అయినా పెట్టుకోవాలి అని చెప్ప్పి టుని తన ఉద్యోగాన్ని కూడా వదిలేసి ఇంటికి వెళిపోతుంది.

ఇంటికి వెళ్లిన తరువాత టుని పిచ్చుక తల్లి చిచ్చు కాకి ఇలా అంటుంది.

చిచ్చు కాకి : అమ్మ టుని, ఏంటమ్మా చెప్పా చెయ్యకుండా వచ్చావు మీ ఆఫీస్ కి సెలవులు ఉన్నాయా? అనడుగుతుంది

టుని పిచ్చుక : అమ్మ నీకు ఒక విషయం చెప్పాలి అమ్మ, నాకు ఉద్యోగం చేయడం నచ్చలేదు అమ్మ అందుకే మన అప్పులు తీరే వరకు ఉద్యోగం చేసాను ఇప్పుడు మనకి ఏ అప్పులు లేవు కదా అందుకే ఉద్యోగం మానేసి ఏదైనా వ్యాపారం పెట్టుకుందాం అని వచ్చేసాను అని చెప్తుంది.

చిచ్చు : ఏంటి అంత మంచి ఉద్యోగం మానేసి వచ్చావా? ఇక్కడ ఉన్న నీ స్నేహితుల పరిస్థితి ఎలా ఉందో చూసావా, ఆ చోటు చిలుక లూసీ పావురం ఏమి చేస్తున్నాయి ఇక్కడ ఉంది ఏమి చేయాలో తెలియక రోజు కూలి పనులకి పోతున్నాయి అని అంటుంది.

టుని పిచ్చుక : లేదమ్మా నేను కూలి పనులు చేయడానికి కాదు మన ఊరిలోనే ఏదైనా వ్యాపారం పెట్టి ఇంటి దగ్గరే ఉండాలనేది నా కోరిక అని అంటుంది.

ఇంతలో లూసీ పావురం చోటు చిలుక అక్కడికివస్తాయి.

లూసీ పావురం : ఏంటమ్మా టుని కి పెళ్లి చూపులేమన్న వచ్చాయా ఉన్న పళంగా చెప్పా చేయకుండా వచ్చీసింది అని అడుగుతుంది.

టుని : అలాంటిది ఏమి లేదు లే కానీ, నేను నా జాబ్ మానేసి వచ్చాను ఇక్కడ ఏదైనా వ్యాపారం పెట్టాలని అని అంటుంది.

చోటు : ఇక్కడ ఏమి వ్యాపారం పెడతావు మిత్రమా అయినా మన దగ్గర ఏముందని అంత మంచి ఉద్యోగం వదియులేసి రావడానికి అని అంటుంది.

టుని : మిత్రం నువ్వు కోవా చాలా బాగా చేస్తావు కదా, అలానే అమ్మ గులాబ్ జామున్ లు చాలా బాగా చేస్తుంది, నాకు జిలెబీలు చేయడం చాలా బాగా తెలుసు, అలాగే లూసీ ఎంబీఏ వరకు చదువుకుంది కదా తనకి కస్టమర్స్ ని ఎలా మన దగ్గరికి వచ్చేలా చేయాలో తెలుసు, ఇక మనకి మనమే బాస్ కాబట్టి మనం ఒక పెద్ద స్వీట్స్ షాప్ పెట్టబోతున్నాము. అది ఎప్పుడు ఎలా అన్నది నేను చెప్తాను, ముందైతా దానికి సంబందించిన పనులు కొని ఉన్నాయి అవ్వి మనం చేదాం పదండి మిత్రులారా అని టుని పిచ్చుక లూసీ పావురాన్ని మరియు చోటు చిలుకని తీసుకొని వెళ్ళిపోతుంది.

ఇదంతా గమనిస్తున్న మహి గద్ద ఇలా అనుకుంటుంది.

మహి : ఓహో ఈ పిల్ల పిచ్చుకలు అన్ని కలిసి వ్యాపారం చేయాలి అనుకుంటున్నాయా? ఇవ్వి నీతి నిజాయితీలతో వ్యాపారం చేస్తే నా వ్యాపారాలు ఎలా సాగుతాయి ఎలాగైనా వీటిని వ్యాపారం చేయనీకుండా చేయాలి అనిఅనుకుంటుంది.

అలా కొన్ని రోజులు గడిచిపోతాయి, ఒక్క మంచి స్థలం చూసి స్వీట్ షాప్ ఓపెన్ చేస్తారు,

మహి గద్ద మాత్రం ఎవ్వరు టుని స్వీట్ షాప్ కి వెళ్ళవద్దు అని అడవిలో మిగతా పక్షులకి ప్రచారం చేస్తూ ఉంటుంది, అయినా కూడా చాలా పక్షులు టుని స్వీట్ షాప్ కి వెళ్తుంటాయి,

అలా రోజులు గడుస్తుంటాయి ఒకరోజు చి=ఓటు చిలుక మహి గద్ద దగ్గరికి వచ్చి ఇలా అంటుంది.

చోటు చిలుక : మహి మామ నువ్వు ఎవరైనా ఎదుగుతుంటే చూడలేవు అందుకే నీకు తగ్గ శాస్తి చెప్పడం తో పాటు మాకు కొంత పని జరగాలి అనుకున్నాము, అందుకే మాకు టుని వ్యాపారం పెట్టాలి అనుకుంటుంది అని ముందే తెలిసినప్పటికీ నువ్వు దొంగ చాటుగా వింటున్నావని గమనించి మల్లి నాటకం ఆడాము, నువ్వు అది విని ఊరిలో మా షాప్ గురించి చేదుగా ప్రచారం చేయాలని అనుకున్నావు కానీ ఎవ్వరికి తెలియని మా స్వీట్ షాప్ గురించి అందరికి నువ్వే తెలిసేలా చేసావు థాంక్స్ మామా అని చెప్ప్పి వెళ్ళిపోతుంది. మహి గద్దకి  తన చేదు స్వభావం గురించి అర్ధం అయ్యి ఇక నుంచి ఎప్పుడు కూడా ఎవరి గురించి చేదుగా మాట్లాడకూడదు అని అనుకుంటుంది.

టుని పిచ్చుక స్వీట్ షాప్ లో కూర్చుని వ్యాపారం చేస్తూ ఉంటుంది, ఇంతలో లూసీ పావురం అక్కడికి వచ్చి ఇలా అంటుంది.

లూసీ : మిత్రమా టుని మనకి మొదటి సారి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది, ఇంకో మూడు రోజులలో ఒక పెళ్లి ఉందంట అక్కడ పెళ్లి భోజనాలలో మన స్వీట్స్ కావాలంట ఆ పెళ్ళిలో మాన స్వీట్స్ బాగా చేశామంటే తిన్న వాళ్ళు ఒకరో తరువాత ఒకరు ఆర్డర్స్ ఇస్తూనే ఉంటారు అని చెప్తుంది.

ఆ మాట విన్న ఆనందం లో చిచ్చు కాకి కల్లలు తిరిగి పడిపోతుంది, వెంటనే టుని పిచ్చుక హాస్పిటల్ కి తీసుకెళ్లి డాక్టర్ కి చూపిస్తుంది. కొంత సేపటి తరువాత చిచ్చు కాకి టుని ని తన దగ్గరికి పిలిచి ఇలా అంటుంది.

చిచ్చు : అమ్మ టుని నువ్వు ఉద్యోగం వదిలేస్తున్నావు అంటే నాకు కోపం వచ్చింది కానీ, నువ్వు చెప్పిన మాటలే ఇప్పుడు జరుగుతున్నాయి తల్లి, నువ్వు నీ వ్యాపారం లో విజయం సాధిస్తాను అన్నావు, ఈరోజు అది జరిగింది. నాకేమైనా అయితే పక్కన ఉంది చూసుకుంటాను అన్నావు అది కూడా జరిగింది, ఇదేనేమో తల్లి జీవితం లో విజయం సాధించడం అంటే, దూరంగా ఉంటూ డబ్బు సంపాదించడం కంటే దగ్గరగా ఉంది ప్రేమలు పెంచుకోవడమే మంచిది అని అంటుంది.

టుని : అమ్మ మన ఊరిలో ఏ చిన్న వేడుక జరిగినా స్వీట్స్ కోసం వేరే ఊరు వెళ్లడం నాకు నచ్చలేదు, ఏదైనా శుభవార్త చెప్పే ముందు నోరు తీపి చేసుకోవాలి అంటారు కదా అంటే మనం ఒకరి ఆనందం లో భాగం అవుతున్నాం అన్నమాట, అలాగే అమ్మ ఇంకొక నెల రోజులలో మన షాప్ చూడు ఎంతలా అభివృద్హి చెందుతుందో? అని చెప్పి వెళ్ళిపోతుంది.

టుని చెప్పినట్టుగానే టుని స్వీట్ షాప్ ఎంతో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది, ఎంత డబ్బు వచ్చినా కూడా తుని పిచ్చుక చిచ్చు కాకి లూసీ పావురం చోటు చిలక ఒకరితో ఒకరు ఎంతో ప్రేమగా ఉండేవారు.

షార్ట్ స్టోరీ

పట్నం లో డబ్బులకోసం యంత్రం లా ఉద్యోగం చేయడం ఇష్టం లేని టుని పిచ్చుక తన ఉద్యోగాన్ని వదిలి పెట్టి, ఊరిలో ఓక స్వీట్ షాప్ పెట్టాలి అనుకుంటుంది. టుని పిచ్చుక తల్లి అయినా చిచ్చు కాకి, స్నేహితులు చోటు చిలుక లూసీ పావురం కలిసి పెద్ద స్వీట్ షాప్ పెడతాయి. రోజు రోజుకు టుని స్వీట్ షాప్ ఎంతో అభివృద్హి చెందుతుంది, అది చూసిన చిచ్చు కాకి మొదట ఉద్యోగం వదిలేసినప్పుడు తన బిడ్డని తిట్టినప్పటికీ, తన ఆలోచన మరియు అభివుద్ధిని చూసి ఎంతో గర్వపడుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *