పేద పిల్లలను కాపాడేది ఎవరు 3 | Telugu Stories | Telugu Kathalu | Banana Dreams TV Telugu

వాయిస్ : వెంకన్నగూడెం అనే చిన్న ఊరూకు పెద్ద మనిషిగా భూపతి ఎన్నో మంచి

           పనులు చేశారు. అందుకు ఆయనను ఆ ఊరి ప్రజలు ఎప్పుడు

           మెచ్చుకుంటారు. కానీ నేడు పేద పిల్లలైన కీర్తి, బాలు అనే తన మొదటి భార్య

           పిల్లలకు అంబికను సవతి తల్లి చేసి అనారోగ్యంతో మంచాన పడ్డాడు. ఈ ఒక్క

          విషయంలో మాత్రం అందరూ భూపతిని తప్పు పడతారు. మన్నించలేమని

          ముఖం మీదనే చెప్పుతుంటారు.

          భూపతి రెండో భార్య అంబికా, సవతి పిల్లలైన కీర్తి, బాలును వదిలించుకోవాలని

          అనుకుంటుంది. అందుకు ఆయుర్వేద వైద్యుడు సుబ్బయ్య సహాయం

          కావాలని అతనితో మాట్లాడాలని రమ్మంటుంది. అంబికా, సుబ్బయ్య ఇద్దరు

          కలిసి మాట్లాడుకుంటారు.

అంబికా : నువ్వు ఏమి చేస్తావో..ఎలా చేస్తావో నాకు తెలియదు. ఆ పిల్లలు ఇక్కడి

            నుంచి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడైనా అనాధ శవల్లా చెదలు పట్టి పోవాలి.

సుబ్బయ్య : అలాగే అమ్మగారు. మీరు చేపినట్టు చేస్తున్నాను. దానికి తగ్గట్టుగా

               డబ్బులు ఇవాలి కదమ్మా !

అంబికా : ఇస్తాను. ముందుగా నేను చెప్పినట్టు చేయడం మర్చిపోకూ !

వాయిస్ : ఏమి మాట్లాడకుండా సుబ్బయ్య అంబికా దగ్గరి నుంచి విడిపోయి భూపతి

            దగ్గరికి వెళ్తాడు. విశాలమైన ఆ పెద్ద ఇంట్లో పొడవైన మంచం మీదా భూపతి

            పడుకుని ఉంటాడు. అతనిని ఆయుర్వేద వైద్యుదు పక్కనే కీర్తి, బాలు అనే

           ఇద్దరు పిల్లలు నిలబడి ఉన్నారు. సుబ్బయ్య, భూపతి పెద్ద మనిషిని చెక్

            చేసి..చెప్పాలా వద్దా అనే సందేహంతో కీర్తి, బాలు పిల్లలను, అంబికా, అంబికా

            కొడుకు రాకేశ్ ను చూస్తూ ఉంటాడు.

అంబికా : పరువలేదు సుబ్బయ్య గారు చెప్పండి…నా భర్త ఆరోగ్యం ఎలా ఉంది?

సుబ్బయ్య : అయ్యగారు బతికే అవకాశం ఉందమ్మా ! నేను చెప్పినట్టు చేస్తే

              అయ్యగారు ఖచ్చితంగా బతుకుతారు.

వాయిస్ : ఆ మాట విని కీర్తి, బాలు చాలా సంతోష పడతారు.

   బాలు : అక్క వైద్యుడు చెప్పింది విన్నావుగా ! మనం మన నాన్నను రక్షించుకునే

            అవకాశం  ఉండంటా !

     కీర్తి : విన్నాను తమ్ముడు.. అయ్యా వైద్యుడు గారు మీరు చెప్పినట్టు చేయడానికి

           మేము సిద్దంగా ఉన్నాం. చెప్పండి ఏమి చేయాలి ?   

అంబికా : ఎంత కమ్మని మాట చెప్పారు. ఎంత కష్టమైన నా భర్తను రక్షించుకుంటాను.

            చెప్పండి ఏం చేయమంటారు?

సుబ్బయ్య : మన ఊరు ఉత్తరాన ఉన్న అడవిలో సంజీవని అనే  ఒక మొక్క

               ఉంటుంది. ఆ మొక్కను తీసుకొచ్చి తాగిస్తే ఖచ్చితంగా భూపతి గారు

              బతుకుతారు. కానీ ఉత్తరాన ఉన్న సముద్రం దాటి అడవికి వెళ్ళి అక్కడ

             ఉన్న సంజీవని అనే తీసుకురావాలంటే ప్రాణాలతో చెలగాటం చేయాలి !

వాయిస్ : సుబ్బయ్య చెప్పింది విని ఒక నిర్ణయానికి వచ్చి కీర్తి, బాలు ఇద్దరు ఆ

            సంజీవని తీసుకురావడానికి బయలుదేరుతారు. అంబికాకు కావాల్సింది

           కూడా అదే ! సంజీవని పేరుతో సన్నటి చిల్లు పడిన పడవలో ముందుకు

          వెళ్తుంటారు కీర్తి, బాలు. ఆ సన్నటి చిల్లు పడిన విషయం కీర్తి, బాలు అప్పుడే

           గుర్తించి ఉంటే కథ వేరుగా ఉండేది. కానీ తమ నాన్నకు సంజీవని

           తీసుకురావలనీ ఆతృతలో ఉన్నారు. చిల్లు పడిన పడవలో కీర్తి, బాలు ఇద్దరు

           సంతోషంగా, మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తుంటారు.

బాలు : అక్క..మనం ఈ సంజీవని తీసుకుని వెళ్ళిన తరువాత సుబ్బయ్యకు ప్రత్యేక

         బహుమతి ఇద్దామ్!

  కీర్తి : అవును తమ్ముడు తివ్వాలి.

బాలు : మన నాన్న తిరిగి మళ్ళీ మనతో మాట్లాడుతానని మనం అనుకోలేదు కదా

          అక్క!

  కీర్తి : అవును తమ్ముడు. ఆ దేవుడు మన మొర అలకించాడు. అమ్మను తీసుకెళ్లి

         అన్యాయం చేసిన ఆ దేవుడు..తిరిగి మనకు ఈ సంజీవని రూపంలో న్యాయం

         చేస్తాడు. చేస్తున్నాడు.

వాయిస్ : ఇలా తండ్రితో తమకున్న అనుబంధాన్ని తలుచుకుంటూ, మాట్లాడుకుంటూ

            సముద్రంలో పడవను నెట్టుకుంటూ ముందుకు వెళ్ళి అవతలి ఒడ్డుకు

            చేరుకుంటారు. అప్పటికీ ఆ పడవలోకి నీలు వస్తుంటాయి. ఒడ్డున  

           పెట్టినప్పుయిడు అయిన ఆ పడవ ఒకసారి చెక్ చేసుకుంటే బాగుండేది. కానీ

           తమ తండ్రి మీద ప్రేమ కీర్తి, బాలును ఎక్కడికి వెళ్ళనీయకుండా ఏమి

          చేయనీయకుండా చేస్తుంది. కీర్తి, బాలు అడవిలోకి వెళ్ళి సంజీవని కోసం

          చూస్తుంటారు. ఒక చోట సంజీవని మెరుస్తూ కనబడుతుంది,

వాయిస్ : ఆ సంజీవని చూసిన కీర్తి, బాలు ఇద్దరు సంతోషంగా ఆ సంజీవనిని తీసుకుని

            తిరిగి పడవ దగ్గరికి వస్తారు. పడవ ఎక్కుతారు. అప్పుడు పడవలో ఉన్న

          నీళ్ళను బాలు గమనిస్తాడు. ఆ నీళ్ళ గురించి కీర్తిని అడిగిన పట్టించుకునేది

          కాదు. సంజీవని తీసుకుని తిరిగి వస్తుండగా పడవలోకి నీళ్ళు పూర్తిగా

          వచ్చేస్తుంటాయి.

బాలు : అక్కా..ఈ నీళ్ళను గమనించవా! మనం వెళ్తున్నా కొద్ది ఈ నీళ్ళు ఎక్కువవు

              తున్నాయీ !

వాయిస్ : ఆ మాట విని కీర్తి అప్పుడు గమనిస్తుంది  ఆ పడవలో ఉన్న నీళ్ళను. ఒక

            చోట పడవకు చిల్లు పడి ఉంటుండు.  ఆ పడిన చిల్లు నుంచి నీళ్ళు

            పడవలోకి వస్తున్నాయని గమనించిన కీర్తి ఏమి చేయలేకపోతుంది. కీర్తి,

            బాలు కంగారూ పడుతుండగా…ఒక మొసలి తలని ఆ నీళ్ళల్లో నుంచి

            బయటకు పెట్టి కీర్తి, బాలును చూస్తూ ఉంటుంది. అది చూసి కీర్తి, బాలు

            భయపడుతూ ఉంటారు. 

బాలు : అక్క…ఇప్పుడు ఈ పేద పిల్లలను కాపాడేది ఎవరు? పడవకు చిల్లు పడింది.

        ఇది మనం తీసుకోకుండా పడవ ఎక్కేశాము. ఇప్పుడు మన ప్రాణాలు, నాన్న

        ప్రాణాలు మనమే తీసుకుని పోతున్నాం !  

వాయిస్ : ఇవతలి ఒడ్డుకు కొద్ది దూరంలో పడవ ఆగిపోతుంది. ఆ ఒడ్డుకు పడవకు

            మద్య మొసలి తలెత్తి నిలబడి భయంకరంగా వాళ్ళను చూస్తూ ఉంటుంది,

            ఇప్పుడు ఆ చిల్లు పడిన పడవ నుంచి ఎలా బయట పడాలని ఆలోచన

           చేస్తుంతే కీర్తి, బాలుకు అనిపించింది. బురుడీ కొట్టింటి అక్కడి నుంచి ఎలా

          తప్పించుకోవాలని చూస్తున్న సమయంలో అంబికా కొడుకు రాకేశ్, ఒడ్డుకు

           వచ్చి ఒక తాడును కీర్తి, బాలుకు విసురుతాడు. ఆ తాడును కీర్తి, బాలు

            ఇద్దరు గట్టిగా పట్టుకుంటారు. రాకేశ్ లాగుతూ ఉంటాడు. పడవ ముందుకు

           కదులుతున్న కొద్ది మొసళ్ళు కూడా కదులుతూ ఉన్నాయీ.

వాయిస్ : కీర్తి, బాలు పట్టుకున్న తాడును రాకేశ్, ఒద్దిన నాటిన ఒక ఇనుప కడ్డీకి

           కడతాడు. ఒక కాటన్ బాక్స్ నిండా చికెన్ తీసుకొచ్చి, పడవ చుట్టూ ఉన్న 

           మొసళ్ళను చూస్తూ ఆ చికెన్ నీళ్ళల్లోకి విసిరేస్తాడు. దాంతో ఆ మొసళ్ళు

           అన్నీ కిందికి వెళ్లిపోతాయి. రాకేశ్, కీర్తి, బాలు ఎక్కిన పడవను ఒడ్డుకు

           లాగుతాడు. దాంతో కీర్తి, బాలు ఒడ్డుకు వస్తారు. తెచ్చిన సంజీవనితో తండ్రిని

           బాగుంచేయిస్తారు. తను చేసిన తప్పు తెలుసుకుని మన్నించమని

          అడుగుతుంది అంబికా! ఇక అప్పటి నుంచి రాకేశ్, కీర్తి, బాలు ముగ్గురు కలిసి

           సంతోషంగా ఉంటారు.

-0-

సింగిల్ లైన్ స్టోరీ

వెంకన్నగూడెమనే చిన్న గ్రామానికి భూపతి పెద్ద దిక్కు. ఆయనకు అంబికా రెండో భార్యగా కీర్తి, బాలు పిల్లలకు సవతి తల్లి భూపతి ఇంటికి వస్తుంది. కొన్ని రోజులకు రాకేశ్ అనే కొడుకును కంటుంది. భూపతి ఆస్తి మొత్తం తన కొడుకు రాకేశ్ కే దక్కాలని  కీర్తి, బాలును అడ్డు తొలిగించుకోవాలని అనుకుంటుంది. అప్పుడే భూపతి ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఆయుర్వేద వైద్యుడు సుబ్బయ్యతో కలిసి ఒక డ్రామా ఆడి లేని సంజీవని ఉన్నదని నమ్మించి చిల్లు పడిన పడవలో కావాలని పంపించి చంపేద్దామని అనుకుంటారు. కానీ ఆ దేవుడు అంబిక కొడుకు రాకేశ్ రూపంలో కీర్తి, బాలును కాపాడుతాడు.

-0-

Add a Comment

Your email address will not be published. Required fields are marked *