పేద పిల్లలను కాపాడేది ఎవరు | Telugu Stories | Telugu Kathalu | Banana Dreams TV Telugu

వాయిస్ : ఈ భూభాగంలో తూర్పు దిక్కున ఉన్న మారుమూల గ్రామం రతనాల పేట

            అనే చిన్న ఊరు. ఆ ఊరిలో ముత్తయ్య అనే పేద కౌలురైతు ఉండేవాడు.

            అతనికి కీర్తి, బాలు అనే ఇద్దరు పిల్లలున్నారు. మొదటి భార్య తులసమ్మ

            చనిపోవడంతో అండాలును రెండో పెళ్లి చేసుకుంటాడు. అయిన ఏనాడూ

            పిల్లల పట్లా సవతి తల్లి ప్రేమను చూపించలేక పోయింది. కీర్తి, బాలు ఇద్దరు  

            తన కడుపులో పుట్టిన పిల్లలుగానే చూసుకుంటూ ఉండేది. కీర్తి, బాలు కూడా

            ఏనాడూ అండాలును పిన్ని అని పిలవలేదు. అమ్మ అంటూ ప్రేమగా

            పిలిచేవారు.

           కుండ నిండా నీళ్ళు..ఒక విషపు చుక్క కలుషితం చేసినట్టు.. కూతురు

           అండాలును చూసి పోదామని వచ్చిన తల్లి వేదావతికి ఇదంతా నచ్చేది కాదు.

           దాంతో కూతురిలో ఇంతకాలం దాగి ఉన్న సవతి తల్లిని నిద్రలేపింది. ఇప్పుడు

           ఈ పేద పిల్లలను కాపాడేది ఎవరు ? అది కాలం నిర్ణయిస్తుంది. కర్ర తీసుకుని  

           కీర్తి, బాలు పడుకున్న మంచాలా దగ్గరికి వస్తుంది. దెబ్బలు కొడుతూ..

అండాలు : దొర బిడ్డల్లాగా ఇప్పటికీ వరకు పడుకుంటే..ఇంట్లో పనులన్నీ ఎవరు

             చేస్తారు. లెండి !

వాయిస్ : అంటూ కొడుతూ కీర్తి, బాలును నిద్రలేపుతుంది. దెబ్బలకు నిద్రలేచిన బాలు

             ఏడుస్తూ ఉంటాడు. కీర్తి మాత్రం…

      కీర్తి : ఏమైందమ్మా? ఎందుకు కొడుతున్నావు? నిన్నటి వరకు ఇలా లేవు. ఈ

            రోజు ఏమైంది నీకు ?

అండాలు : ఎవరే మీకు అమ్మ? నేను మిమ్ముల్ని కనలేదు. మీరు నాకు పుట్టలేదు.

             మీరు నా సవితి పిల్లలు. నేను మీకు అమ్మను కాదు..అమ్మగారిని!

       కీర్తి : ఇదేంటి కొత్తగా! ఈ రోజు ఇలా మాట్లాడుతున్నావు. ఏమైంది నీకు ?

 అండాలు : ఏంటే కీర్తి..నోరు లేస్తుంది. నోరు అదుపులో పెట్టుకో !

వాయిస్ : అని చేతిలో ఉన్న కర్రతో రెండు దెబ్బలు వేస్తుంది. బాలు ఆ దెబ్బలకు

            ఏడుస్తూనే ఉంటాడు. అది చూసి కోపంగా…

అండాలు : ఏయ్..ఎందుకురా ఏడుస్తున్నావు? మూయ్ ! ఇప్పుడు ఏడుపు వినిపిస్తే

             నా చేతిలో ఉన్న కర్ర విరుగుతుంది. ఇద్దరికీ చెబుతున్నాను. ఈ రోజు నుంచి

            నేను మీకు అమ్మను కాదు అమ్మగారిని..ఈ ఇంటికి యజమానురాలును!

            నేను చెప్పింది చేస్తేనే మీకు అన్నం..లేకపోయే మీకు తప్పదు సున్నం !

    కీర్తి : అది కాదమ్మా.. నీకు ఈ రోజు ఏమైంది? రాత్రి వరకు మంచిగానే ఉన్నావు

          కదా! తెల్లారే సరికి ఏమైంది నీకు ?

అండాలు : చెప్పితే అర్థం  కావడం లేదా ! నా కడుపున పుట్టిన పిల్లలకే నేను అమ్మను.

             నా సవతి పిల్లలైన మీకు కాదు. పడుకున్న వరకు చాలు.. ఇక లేచి ఇంటి

            పని వంట చేయండి.

వాయిస్ : అని గట్టిగా ఇద్దరినీ బెదిరిస్తుంది అండాలు. కీర్తి, బాలు అంతా

            అయోమయంగా ఉంది. నిన్నటి వరకు అమ్మను అంటూ ప్రేమను పంచిన

            అమ్మ…ఇప్పుడేమో అమ్మగారిని అంటూ అన్నీ పనులు చేయమని

            చెబుతుంది. కొడుతుంది. ఏమై ఉంటుంది? అని కీర్తి ఆలోచన చేస్తూ ఇల్లు

           ఊడుస్తూ ఉంటుంది. తగిలిన దెబ్బలకు బాలు బాధపడుతూ,  మౌనంగా

           కన్నీళ్లు కారుస్తూ..పాల కోసం పాలు పోసే పాపాయమ్మ దగ్గరికి వెళ్తాడు.

పాపాయమ్మ : ఏరా బాలు..నువ్వు వచ్చావు. మీ అమ్మ లేదా?

వాయిస్ : బాలు ఏమి మాట్లాడకుండా, పాలు పోసిన చెంబును తీసుకుని కన్నేళ్లు

           కారుస్తూ ఇంటికి వస్తాడు. బయట మంచంలో కూర్చున్న అండాలుకు

           ఇవ్వబోతు..

 బాలు : అమ్మ..పాపాయమ్మ నిన్ను అడిగింది. ఎప్పుడు నీ అమ్మ వచ్చేది ఈ రోజు

          నువ్వు వచ్చావు. మీ అమ్మకు ఒంట్లో బాగాలేదా అంది అడిగింది.  నేను

          అప్పటి నుంచి ఆలోచన చేస్తూ వచ్చాను. ఈ రోజు నిజంగానే మా అమ్మకు

          బాగాలేదనిపిస్తుంది. ఏమి జరిగిందో చెప్పమ్మా! ఎందుకిలా ఉన్నావు?

అండాలు : నీకు మాటలతో చెప్పితే అర్థం కావడం లేదు. కర్రతో చెప్పితేనే వింటావని

             అర్థమయింది.

    బాలు : వద్దులే అమ్మగారు.. పాలు తెచ్చాను తీసుకోండి !

అండాలు : లోపల పనిపిల్ల ఉంది. దానికివ్వు. వేడి వేడి టీ పెట్టి తీసుకురమ్మని చెప్పు.

   బాలు : అలాగే అమ్మగారు !

వాయిస్ : అని చెప్పి అక్కడి నుంచి పాలు తీసుకుని ఇంట్లోకి వస్తాడు. అక్కడ కీర్తి ఇల్లు

            ఉడుస్తూ ఉంటుంది.

బాలు : ఇక్కడ పని పిల్లవు నువ్వేనా !

   కీర్తి : ఏంట్రా బాలు.. ఏమి మాట్లాడుతున్నావు. పనిపిల్ల ఏంటి  ?

బాలు : నేను అన్నది కాదక్క ! బయట అమ్మగారు కూర్చున్నారు కదా!  ఆ

          అమ్మగారు నిన్ను పనిపిల్లను నన్ను పనిపిల్లాడిని చేసింది.

వాయిస్ : మరోమాట మాట్లాడకుండా ఇద్దరు కలిసి వంటగదిలోకి వెళ్తారు. అక్కడ కట్టెల

            పొయ్యి మీదా పాలు పెడుతుంది. కీర్తి, బాలు ఇద్దరు కలిసి ఉన్నట్టుండి

            అమ్మ ఇలా ఎందుకు మారిపోయిందని మాట్లాడుకుంటూ ఆలోచనలో

            పడతారు. పొయ్యి మీదున్న బాలు మరిగి పొంగిపోతాయి. అవి పట్టానట్టుగా

          కీర్తి, బాలు ఆలోచనలో ఉంటారు. అప్పుడే అక్కడికి కర్ర తీసుకుని వస్తుంది

          అండాలు. కీర్తి, బాలును చూస్తుంది. ఇద్దరు ఏదో దీర్గంగా ఆలోచన

          చేస్తుంటారు. ఇద్దరిని మళ్ళీ కొడుతుంది. కీర్తి, బాలు ఆ దెబ్బలకు

          ఉలిక్కిపడతారు.

అండాలు : మనం తిరుపతికి పోతున్నాం. వెళ్ళి బట్టలు సర్దుకోండి.

       కీర్తి : అదేంటి ఇంత సడెన్ గా !

అండాలు : నా యిష్టం. మరొక మాట మాట్లాడకుండా బట్టలు సర్ధుకోండి.

   బాలు : నాన్న వస్తున్నాడా?

అండాలు : లేదు..మనమే వెళ్తున్నం !

      కీర్తి : కనీసం అమ్మమ్మనైనా తీసుకుపోదాం !

అండాలు :  వస్తుంది లే !

వాయిస్ : కీర్తి, బాలు, అండాలు, అండాలు తల్లి వేదవతి నలుగురు ట్రైన్ లో తిరుపతికి  

           బయలుదేరుతారు. కీర్తి, బాలుకు ఏమి అర్థం కాదు. అయోమయంగా చూస్తూ

           ఉంటారు. కీర్తి, బాలును చూస్తూ వేదవతి తనలో తను..

వేదవతి : మిమ్ముల్ని తిరుపతికి తీసుకెళ్లి నా కూతురు చంపేయాలనుకుంటుంది.

            పాపం !

వాయిస్ : ట్రైన్ వెళ్తూ వెళ్తూ ఒక నది బ్రిడ్జి మీద అగుతుంది. సాంకేతిక లోపమని

            మాట్లాడుకుంటారు. ట్రైన్ ఎక్కి చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అందాలు

            చూద్దామని కీర్తి, బాలును తీసుకుని ట్రైన్ పైకి వెళ్తుంది అండాలు. ట్రైన్ పైన

           కీర్తి, బాలుకు భలే సరదాగా ఉంది. చుట్టూ పక్కల కొండలు, పారుతున్న నది

           నీళ్ళు..పచ్చని చెట్లు భలే బాగుంది.

వాయిస్ : కీర్తి,బాలు సంతోష పడుతుండగా, అండాలు కీర్తిని కిందకు తోసేయ్యాలని

             చూస్తుంది. తెలివిగా కీర్తి పక్కకు తప్పుకుంటుంది. దాంతో అండాలు ఆ ట్రైన్

             పై నుంచి కిందకు పడబోతు ఉండగా కీర్తి, బాలు గట్టిగా పట్టుకుంటారు.

            అప్పుడు అండాలుకు పూర్తిగా అర్థమవుతుంది. కీర్తి, బాలును తీసుకుని

            కిందకు వస్తుంది. అప్పరు వేదవతి ఫోనులోమాట్లాడుతూ ఉంటుంది.

వేదవతి : పిచ్చిది నేను చెప్పింది నిజమని నమ్మి ఆ పిల్లలను భలే కొడుతుంది. నేనే

            ఉన్నవి లేనివి కల్పించి చెప్పాను. గుడ్డిగా నమ్మింది.

వాయిస్ : అని మాట్లాడుతూ ఉండగా, అక్కడికి వచ్చిన అండాలు, కీర్తి, బాలు

             ముగ్గురు చూస్తారు. అండాలు గట్టిగా కొడుతుంది. ఆ తరువాత కీర్తి

            కొడుతుండు. ఆ తరువాత బాలు కొడతాడు. అండాలు కీర్తి, బాలు ముగ్గురు

            తిరిగి సంతోషంగా వాళ్ళ ఇంటికి వస్తారు.

-0-

సింగిల్ లైన్ స్టోరీ

రతనాల పేట అనే గ్రామంలో ముత్తయ్య అనే కౌలురైతు ఉండేవాడు. అతనికి కీర్తి, బాలు అనే ఇద్దరు పిల్లలున్నారు. మొదటి భార్య తులసమ్మ చనిపోవడంతో అండాలును రెండో పెళ్లి చేసుకుంటాడు. అయిన ఏనాడూ పిల్లల పట్లా సవతి తల్లి ప్రేమను చూపించలేక పోయింది. కీర్తి, బాలు ఇద్దరు తన కడుపులో పుట్టిన పిల్లలుగానే చూసుకుంటూ ఉండేది. కీర్తి, బాలు కూడా ఏనాడూ అండాలును పిన్ని అని పిలవలేదు. అమ్మ అంటూ ప్రేమగా పిలిచేవారు. ఇది చూసి ఓర్వలేని అండాలు తల్లి వేదవతి, బయటి వాళ్ళకు, చుట్టుపక్కల వాళ్ళకు నువ్వు మంచిదానివి కాదవి చెబుతున్నారు. వాళ్ళను కొడుతున్నవని చెబుతున్నారని కీర్తి, బాలు మీదా లేనిపోనివి చెప్పి అండాలుతో పిల్లలను కొట్టిస్తుంది. చంపాలని చూస్తుంది. ఆ తరువాత నిజం తెలుసుకుని పిల్లలను దగ్గరికి తీస్తుంది.                                          -0-

Add a Comment

Your email address will not be published. Required fields are marked *