పేద పిల్లలు విమానం దొంగతనం Episode 155 |Telugu Stories | Telugu Kathalu | Banana Dreams TV Telugu

ఒక ఊరిలో బాలు కీర్తి అనే ఇద్దరు అనాధ పిల్లలు ఉండేవారు, వాళ్లకి అమ్మ నాన్న తో పాటు తెలిసిన వాళ్ళు కానీ చుట్టాలు కానీ ఎవ్వరు లేక పోవడం తో ఒంటరిగానే బ్రతుకుతుంటారు. అలా ఉండగా ఒకరోజు అదే ఊరిలో ఉండే వినయ్ అనే ఒక ధనవంతుల పిల్లడు బాలు కీర్తిలా దగ్గరికి ఒక విమానం బొమ్మ పట్టుకొని వస్తాడు.

బాలు : అక్క ఆ విమానం బొమ్మ చూడు ఎంత బాగుందో మనం కూడా అలాంటి బొమ్మ కొనుక్కుందాం అక్క అని అంటాడు.

కీర్తి : తమ్ముడు మనం బాగా డబ్బులు సంపాదించిన తరువాత అదేంటి దానికంటే మంచి బొమ్మే కొనుక్కుందాం లేరా ఇప్పుడైతే తినడానికి ఎక్కడ ఏమి దొరుకుతుందో వెతుకుక్కుందాం పదా అని అంటుంది, ఇంతలో వినయ్ అక్కడికి వచ్చి చాలా పొగరుగా మాట్లాడుతుంటాడు.

వినయ్ : ఎరా బాలుగా నా విమానం బొమ్మ చూసావా? ఎంత పెద్దగా ఉందొ, నేను విమానం లో ఢిల్లీ వెళ్లి వచ్చేప్పుడు ఈ విమానం బొమ్మ కొనుక్కున్నాను, ఇది కీ ఇస్తే గాల్లోకి కూడా ఎగర గలదు. మీరు మీ జీవితం లో వవిమానం ఎక్కడం కాదు, కనీసం ఇలాంటి విమానం బొమ్మ కూడా కొనలేరు, దీని ధర ఎంతో తెలుసా పది వేళా రూపాయలు మీరు మీ జీవితం మొత్తం కష్టపడినా అంత డబ్బు ఒక్క సారి చూడలేరు, అని బాలు కీర్తి ని అవమానించి వెళ్ళిపోతాడు.

బాలు : సరే అక్క మనకి ఇలాంటి అవమానాలు మనకి రోజు జరిగేవే కానీ పదా వెళదాం, దేని మీద అయినా ఆశపడడానికి కూడా స్థోమత ఉండాలి అక్క, మన లాంటి పెద్ద వాళ్లకు ఆశపడే అర్హత కూడా లేదు అని అంటాడు.

కీర్తి : నిజమే తమ్ముడు ఆశ పడడానికి కూడా అర్హత స్థోమత కావలి, పదా ఎఈరోజుకి ఏమి దొరుకుతుందో వెతుక్కుందాం అని అడవి వైపుకు వెల్తూ ఉంటారు,

కీర్తి : తమ్ముడు మనకి తినడానికి ఏదైనా దొరుకుతుందో లేదో కూడా తెలియదు, తినడానికి ఏమి దొరకక పోయిన కనీసం నీళ్ళైనా తాగుదాం నేను వెళ్లి నీళ్లు తీసుకువస్తాను, అని ఇంట్లోకి వెళ్లి ఒక బొట్లే లో నీళ్లు తీసుకువస్తుంది. ఇద్దరు కలిసి అడవి మార్గం గుండా వెళ్తుంటారు. అక్కడ వాళ్లకి ఓక్ స్వామిజి పడిపోయి ఉండడం గమనిస్తారు, వెంటనే బాలు వెళ్ళి కొన్ని నీళ్లు స్వామిజి మీద పోస్తాడు.

కీర్తి : స్వామిజి ఏమయ్యింది మీకు ఇలా పడిపోయారేంటి? అని అడుగుతుంది.

స్వామిజి : తినడానికి ఏమి దొరకక ఇలా అయ్యాను, మీరు ఇప్ప్పుడు నీరు ఇచ్చారు కదా మల్లి కొన్ని గంటలు ఆకలి ఆపుకోగలను అని అంటాడు.

బాలు కీర్తి కలిసి అడవిలోకి వెళ్తారు. వాళ్లకి కొన్ని పండ్లు మాత్రమే దొరుకుతాయి, వాటిలో కొన్ని స్వామిజి కి ఇచ్చి ఇలా అంటాడు బాలు

బాలు : స్వామి ఈరోజు అడవిలో ఏమి డదొరకలేదు, ఇవ్వి కొన్ని మాత్రమే దొరికాయి ఇవ్వి తినండి స్వామి అని ఇస్తాడు.

స్వామిజి : అయ్యో ఈ కొన్ని పండ్లు మీకు కూడా సరిపోవు, ఆ కొన్నింటిలోనే నాకు ఇస్తే మీరేమి టీతింటారు మీరు ఏమి తినక చాలా రోజులు అయినట్టు మీ మొఖాలు చూస్తేనే తెలుస్తుంది. ఇప్ప్పటికీ కూడా తినకపోతే మీరు కూడా చనిపోతారు, అని అంటాడు స్వామిజి

బాలు : స్వామి మేము బ్రతికి ఉన్న చనిపోయినా కనీసం పక్క వాళ్లకి కూడా తెలియదు మీ లాంటి బ్రథయికి ఉంటె ఎంతో మందికి సహాయం చేయగలరు, మీరు బ్రతకాలి స్వామి అని అంటాడు.

స్వామిజి : మీ మంచితనానికి నేను దాసోహం అయ్యాను, మీకు ఎప్పుడు ఏ సహాయం కావల్లనా నా దగ్గరికి రండి ఎలాంటి సహాయం చేస్తాను అని అంటాడు స్వామిజి

బాలు కీర్తి ధన్యవాదాలు  చెప్ప్పి బాలు కీర్తి కలిసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు.

వాళ్ల్లు అలా కొంత దూరం వెళ్ళాక వాళ్లకి ఒక విమానం ఎగురుతూ కనిపిస్తుంది.

బాలు : అక్క ఇదేంటి ఎప్పుడు లేనిది ఈరోజు కొత్తగా మన ఊరి మించి ఇంత దగ్గరగా విమానం ఎగురుతుంది అని అంటాడు.

కీర్తి : నీకు తెలియదా తమ్ముడు, మన ఊరి దగ్గర్లో ఒక కొత్త విమానాశ్రయం పడుతుంది, వాటిల్లో భాగంగా పరీక్షిస్తున్నారు కావొచ్చు, అని అంటుంది

బాలు : అంటే ఇక నుంచి మన ఊరి నుచి కూడా విమానాలు ఎగురుతాయి కదా అక్క అని అంటూ ఇంటికి వెళ్లి స్వామిజి కి ఇవాగా మిగిలిన పళ్ళని తింటారు బాలు కీర్తి.

ఇంతలో మల్లి అక్కడికి వస్తాడు వినయ్

వినయ్ : బాలు నా విమానం ఎలా గాల్లో ఎగురుతుందో చూడు నిజమైనా విమానం లా ఎగురుతుంది చూడు అని కీ ఇచ్చి విమానాన్ని గాల్లోకి ఎగురవేస్తారు వినయ్.

కొంతసేపు అలా ఎగురవేసి వెళ్ళిపోతాడు.

బాలు  ; అక్క మనం ఎప్పటికైనా విమానం ఎక్కగలమా అక్క అని అంటాడు,

కీర్తి : రేపటి తిండి గురు=ఇంచి ఆలోచించడం బెటర్ తమ్ముడు అని అంటుంది.

ఒక రోజు బాలు ఎగురుతున్న విమానాల్ని చూస్తూ ఉండిపోతాడు, అప్పుడే అటుగా వెళ్తున్న స్వామిజి దిగాలుగా ఉన్న బాలు ని చూసి

స్వామిజి : అయ్యో ఈ కుర్రాడేంటి ఇక్కడ దిగులుగా కూర్చున్నాడు ఏమయ్యిందో ఎదో ఆపద కలిగి ఉండొచ్చు, నా ప్రాణాలు కాపాడిన ఇతనికి నేను ఎదో ఒక సహాయం చెయ్యాలి  అని బాలు దగ్గరికి వెళ్తాడు.

బాలు దగ్గరికి వెళ్లిన స్వామిజి

స్వామిజి : బాబు ఏమయ్యింది నీకు ఇలా దిగులుగా ఉన్నావు అని అంటాడు.

బాలు : స్వామి వినయ్ అనే ధనవంతుల పిల్లడు తన దగ్గర ఉన్న బొమ్మ చూపిస్తూ మమ్మల్ని ఏడిపిస్తున్నాడు, లాఫ్=జె మేము జీవితం లో ఒక్క సారి అయినా విమానం ఎక్కాలని ఉంది అని అంటాడు.

వెంటనే స్వామిజి ఒక మాయా తాడు ఇచ్చి వెళ్ళిపోతాడు.

ఇంతలో కీర్తి అక్కడికి వస్తుంది.

మాయా తాడు సహాయం తో బాలు కీర్తి కలిసి గాలిలో ఎగురుతున్న విమానానికి మాయ తాడుని విసిరేసి తాడు సహాయం తో వింమానాన్ని కిందకు లాగుతారు, విమానాన్ని కిందకు లాగిన తరువాత విమానం వాళ్ళ ముందు ఉండడం చూసి బాలు కీర్తి ఎంతో ఆనందపడతారు.

వెంటనే ఊరి వాళ్ళందరిని పిలిచి విమానం లో ఎక్కించి బాలు కీర్తి కలిసి విమానం ని గాల్లోకి తీసుకెక్టారు, ఊరి వాళ్ళు అందరు జీవితంలో  మొదటి సారి విమానం ఎక్కడం తో చాలా ఆనందపడతారు, విమానం ఎక్కడానికి కారకులైన బాలు కీర్తి కి ధన్యవాదాలు తెలుపుకుంటారు, విన్మనం లో తిరగడం అయిపోయిన తరువాత బాలు కీర్తి మాయ తాడు సహాయం తో విమానాన్ని వదిలేస్తారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *