పేద పిల్లల ఆటలు | Telugu Stories | Telugu Kathalu

కీర్తి బాలు ఇద్దరు కూడా అక్క తమ్ముళ్ళు. వాళ్ళు పేదవాళ్ళు .క్రిష్ణ పురం గ్రామ ఊరి చివర్లో నివసిస్తూ ఉంటారు.
బాలు కీర్తి ఇద్దరు కూడా భిక్షాటన చేస్తూ వాళ్ళ కడుపు నింపు కుంటారు. అలా వాళ్ళ జీవితం ముందుకు సాగిపోతుంది. అలా ఉండగా ఒకరోజు వాళ్ళు భిక్షాటన చేస్తూ ఉంటారు. ఒక ముసలావిడ ఒక పెట్టింది తీసుకుని వస్తూ ఒక్కసారిగా కింద పడిపోతుంది. దాన్ని చూసిన కీర్తి బాలు ఇద్దరు కూడా….. అయ్యో పద పద అమ్మామ్మ కిందపడిపోయింది పడిపోయింది . అంటూ ఆమె దగ్గరకు వెళ్లి ఆమెను పైకి లేపుతారు.
ఆమె పైకి లేచి కూర్చొని చాలా కృతజ్ఞతలు పిల్లలు. అని వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది పిల్లలు…. అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్లాలో చెప్పు ఈ పెట్టి మేము తీసుకొని వస్తాము. అని అంటుంది అందుకు ఆమె….. సరే అయితే పదండి అమ్మ అంటూ వాళ్లకి దారి చూపిస్తుంది . ఆ పెట్టి ని వాళ్ళిద్దరు మోసుకుంటూ వస్తారు.
ఇక ఆమె వాళ్ళ ఇంటికి రాగానే పిల్లలిద్దరికీ. డబ్బులు ఇచ్చి….. పిల్లలు ఈ డబ్బులు నేను ఎందుకు ఇచ్చినో తెలుసా .
పిల్లలు….. మేము అడుక్కునే వాళ్ళం కదా అమ్మమ్మ అందుకే ఇచ్చావు.
ఆమె పెద్దగా నవ్వుతూ…హా హా హా తప్పు తప్పు. అందుకు నేను దీన్ని ఇవ్వలేదు మీరు కష్టపడ్డారు దానికి ప్రతిఫలం మీరు తీసుకున్నారు. నేను చెప్పేది ఏంటంటే మీరు అడ్డుకోవాల్సిన అవసరం లేదు .మీకు తోచిన చిన్న పని అయినా మీరు చేసుకోండి .
అర్థమైందా. అందుకు వాళ్లు సారే అంటారు.
అందుకు ఆమె…. అది సరే కానీ మీకు అమ్మానాన్న ఎవరు లేరా.
అందుకు వాళ్లు ఏడుస్తూ అమ్మ నాన్న చనిపోయారు అని చెబుతారు అందుకు ఆమె బాధ పడుతుంది.
వాళ్లకు ధైర్యం చెప్పి అక్కడి నుంచి పంపించి వేస్తుంది. రెండు నెలలు తరువాత వాళ్ళిద్దరూ కూడా కట్టెలు కొట్టుకొని కట్టెలు అమ్ముకుంటూ…… రావాలి బాబు రావాలి కేవలం 25 రూపాయలు మాత్రమే కట్టెలు.
అంటూ పిలుస్తూ అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ ముసలి ఆమె వాళ్లని చూసి అక్కడికి వెళ్లి….. శభాష్ నేను చెప్పినట్టుగా మీరు చేశారు చాలా బాగుంది. అయితే నేను ఒకటి చెప్తాను దాన్ని కూడా చేస్తారా.
అందుకు వాళ్ళు చెప్పు అమ్మమ్మ మేము తప్పకుండా చేస్తాము.
ఆమె….. పేదరికాన్ని తొలగించే ఒకే ఒక్క ఆయుధం చదువు. బాగా చదువుకుంటే ప్రపంచమంతా చుట్టి రావచ్చు. ఎందుకంటే చదువు అంటే జ్ఞానాన్ని పెంచుకోవడం.
మంచి జ్ఞానాన్ని మీరు పొందితే. పేదరికం మీ ముందు తలవంచుతుంది.
అందుకు వాళ్లు …… కానీ అమ్మమ్మ చదువుకోవడానికి మా దగ్గర డబ్బు లేదు కదా.
ఆమె బాలు వైపు చూసి….. చూడు బాలు నువ్వంటే మగపిల్లాడి బట్టలు లేకపోయినా గోచి కట్టుకొని బయట గర్వంగా తిరగ గలవు .
కానీ ఆడపిల్ల అలా కాదు కదా.
ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఆడపిల్ల చదివితే ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. నువ్వు కష్టపడి మీ అక్కని చదివించు. నేను కూడా మీకు సహాయం చేస్తాను. అని కొంత డబ్బును ఇచ్చి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఇక వాళ్ళు ఆమె చెప్పినట్లుగానే వాళ్ళ అక్కని చదివించాలని నిర్ణయించుకుంటాడు.
ఇక రోజులు గడచాయి వాళ్ళ అక్క బడి కి వెళ్తుంది. బాలు కష్టపడి కట్టెలు కొట్టి వాటిని అమ్మి డబ్బు సంపాదిస్తాడు.
అలా వచ్చిన డబ్బుతో చదువు మరియు వాళ్ళ ఖర్చులకు సరిపోతుంది.
రోజులు గడిచాయి రెండు రోజుల నుంచి వాళ్ళ అక్క బడికి వెళ్ళకుండా. ఇంటికి తిరిగి వస్తుంది. బాలు దానిని గమనించి…… అక్క ఏమైంది రెండు రోజుల నుంచి ఇంటికి తిరిగి వస్తున్నావు. బాలు ఇంట్లో పని చేసి బడికి వెళ్తున్నాను కదా . మా బడి చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళే సమయానికి గేటు మూసేస్తున్నారు .
బాలు…. అక్క ఇంట్లో పని నేను చేసుకుంటాను నువ్వు తొందరగా లేచి బడి కి వెళ్ళు.
కీర్తి….. బాలు ఇప్పటికే నా గురించి నువ్వు చాలా కష్టపడుతున్నావూ. ఇప్పుడు నేను ఇంటి పని కూడా చెయ్యకపోతే నీకు మరింత భారమవుతుంది . నేనే ఉదయాన్నే లెగు స్థానను.
అని అంటుంది అందుకు అతను సరే అంటాడు . ఇక ప్రతిరోజూ కీర్తి వేకువజామున నిద్రలేచి పని హడావిడిగా చేసుకొని. తర్వాత బయటికి వెళ్తుంది. ఆమె ఆ పుస్తకాలు బ్యాగు తగిలించుకుని . చాలా దూరం నడుస్తూ ఇబ్బంది పడుతూ ఉంటుంది.
బాలు దానిని గమనించి వాళ్ళ అక్క కోసం ఏమన్నా చేయాలి అనుకుంటాడు .
ఇక అతను కట్టెపుల్లలు మరియు మట్టితో ఒక సైకిల్ ని తయారు చేస్తాడు.
దాన్ని చూసి కీర్తి చాలా ఆశ్చర్యపోతుంది.
బాలు…. అక్క నువ్వు సైకిల్ మీద త్వరగా బడికి వెళ్ళచ్చు నేనే కష్టపడి తయారు చేశాను. దాన్ని చూసి ఆమె బాలుని హత్తుకొని….. నాకోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావూ బాలు. మరో జన్మంటూ ఉంటే నీకు తల్లి లాగ పుట్టి నీ రుణం తీర్చుకుంటాను అంటూ ఏడుస్తూ చాలా బాధపడుతుంది. ఇక ఆమె ఆ రోజు నుంచి
ఉదయాన్నే లేవాల్సి అవసరం లేదు. హడావిడిగా పనులు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆలస్యంగా లేచి తన పనులు ముగించుకొని సైకిల్ మీద బడి కి వెళ్తుంది.
అలా రోజులు గడిచాయి ఆదివారం సమయంలో ఆమె బాలు తో పాటు పనికి వెళుతూ ఉంటుంది. వాళ్ళు పని చేసుకొని అయిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. అక్కడ కొంత మంది పిల్లలు ఆడుకుంటూ కనబడతారు దాన్ని చూసి వాళ్లు కంటతడి పెట్టుకుంటూ….. మన కష్టలు కన్నీళ్లతో. మనం కష్టం చిన్నపిల్లల మన సంగతి మర్చిపోయాయి . ఆటలు కి దూరంగా ఉన్నాను చాలా సంతోషంగా ఆడుకొని ఎన్ని నెలలు అవుతుందొ.
అని వాళ్ళను చూస్తూనే ముందుకు వెళ్తారు .
బాలు…. అక్క ఈరోజు నుంచి ప్రతి రోజు ఆదివారం మనం పనికి వెళ్లడం లేదు . ఆడుకుంటున్నాము . అని చెప్పి ఆ సైకిల్ కి ఒక టైరు నీ కట్టి….. అక్కను దాని మీద కూర్చో నేను సైకిల్ తొక్కుతూ ఉంటాను నీకు చాలా మజా వస్తుంది. అని అంటాడు అందుకామె సరే అని చెప్పి టైర్ పై కూర్చుంటుంది బాలు సైకిల్ తొక్కుతూ. ఉంటాడు ఆమె …. కేకలు వేస్తూ బాలు బలే గా ఉంది. పోనీ ఇంకా వేగంగా పోనీ అంటూ అరుస్తుంది . అలా వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ
వాళ్ళ కష్టాన్ని మర్చిపోతారు.
అలా ప్రతి రోజు కూడా వాళ్లు ఆదివారం సమయంలో ఆడుకుంటూ ఆ ఒక్కరోజు వల్ల పడిన కష్టాన్ని మర్చిపోతారు.
అలా రోజులు గడుస్తున్న వి ఆ ముసలావిడ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్లకి ధైర్యం చెబుతూ డబ్బులు అందిస్తూ ఉంటుంది.
కీర్తి బాలు ఆదివారం సమయంలో ఆడుకుంటూ. మిగిలిన సమయంలో కీర్తి బాలుకి కూడా చదువు నేర్పిస్తూ ఉంటుంది .
అలా ప్రతిరోజూ సైకిల్ పై కీర్తి బడికి వెళ్లడం.
పాఠశాల నుండి వచ్చిన తర్వాత. బాలు కి చదువు చెప్పడం ఆ తర్వాత ఆడుకోవడం
జరుగుతూ ఉంటుంది అలా ఇద్దరూ కూడా చక్కగా చదువుకుంటూ, ఆడుకుంటూ వాళ్ళ జీవితాన్ని సాధిస్తారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *