పేద పిల్లల కోడిగుడ్డు ట్రైన్ Episode 67 | Telugu Stories | Telugu Fairy Tales | Story World Telugu

వీరేంద్రపురం అనే గ్రామంలో బాలు కీర్తి అనే ఇద్దరు అనాధ పిల్లలు ఉండేవారు, వాళ్ళు పుట్టిన కొన్ని రోజులకే వాళ్ళ అమ్మానాన్న రోడ్డు ఆక్సిడెంట్ లో చనిపోయారు అప్పటి నుంచి బాలు కీర్తి ఇద్దరు తమ వద్ద ఉన్న కోళ్లను పెంచుకుంటూ వాటి వల్ల వచ్చే డబ్బులతో బ్రతుకుతూ ఉంటారు, ఒకరోజు బాలు కీర్తి దగ్గరకు వచ్చి ఇలా అంటాడు

బాలు :  అక్క మనం రోజు ఇలా కోళ్లను పెంచి అమ్మడం వాటి వాళ్ల వచ్చే డబ్బులు మనకి చాలీ చాలక ఉన్న నాడు తింటున్నాము లేని నాడు పస్తులు పడుకుంటున్నాము, ఇలా ఎన్ని రోజులు అక్క మనకంటూ మంచి రోజులు రావా అని అడుగుతాడు ఎంతో బాధగా

కీర్తి : ఏమో తమ్ముడు మనం ఈ మాత్రం తినగలుగుతున్నాము అంటే ఈ కోళ్ల దయ వల్లనే ఇవ్వి కూడా లేకపోయి ఉంటె మనం ఈ పాటికి ఎప్పుడో ఆకలితి చచ్చిపోయే వాళ్ళం, ఒక వేళ బయటకు పోయి ఏదైనా పని చేసుకుందాము అంటే మనం  చిన్న పిల్లలం అని ఎవ్వరు పని కూడా ఇవ్వడం లేదు, మన అమ్మ నాన్నే బ్రతికి ఉంటె మనకి ఈ కష్టాలు బాధలు ఉండేవి కావు, పోయిన వాళ్ళని ఎలాగూ మనం తిరిగితీసుకు రాలేము కాబట్టి మనకి ఈ కష్టాలు తప్పవు అని బాలుకి నచ చెప్పడానికి ప్రయత్నిస్తుంది కీర్తి

అలా వాళ్ళిద్దరూ రోజంతా ఎంతో కష్టపడుతూ కోళ్ళని పెంచడం వాటి వల్ల  వచ్చినా గుడ్లని అమ్ముకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటారు

అలా ఉండగా ఒకసారి ఊరిలో అన్ని జంతువులకి ఎదో వింత రోగం వస్తుంది, ఆర్యోగం తగిలి బాలు కీర్తి పెంచుకుంటున్న కోళ్లు ఒక్కొక్కటిగా చచ్చిపోతూ ఉంటాయి

అప్పు బాలు కీర్తి దగ్గరికి వచ్చి

బాలు : అక్క ఇన్ని రోజులు మనం ఈ కోళ్ల మీద ఆధారపడి తినో తినకనో ఎదో రకంగా బ్రతుకు నెట్టుకొస్తున్నాము ఇప్పుడు మన జీవనాధారం అయినా కోళ్లు ఒక్కొక్కటిగా చచ్చిపోతున్నాయి, ఇప్పుడు మనం ఎలా బ్రతుకుతాము అక్క అని అంటాడు కీర్తితో ఏడుస్తూ

కీర్తి ; ఏడవకు తమ్ముడు దేవుడికి మన మీద చిన్న చూపు ఉన్నట్టుగా ఉంది, మనం బ్రతకాలని దేవుడికి లేనట్టుగా ఉంది అందుకే మనల్ని ఎలా చేస్తున్నాడు, మనం మన వీలున్నంత వరకు పోరాడదాము మన వాళ్ళ కానీ పక్షం లో దేవుడు రాతకి బాలి అయిపోదాము అని అంటుంది కీర్తి

కీర్తి మాట్లాడేది అంతా విన్న బాలు లేని ధైర్యాన్ని తెచ్చుకొని కీర్తి తో ఇలా అంటాడు

బాలు : సరే అక్క నువ్వన్నట్టే పోరాడదాము కానీ ఇప్పుడు ఏమి చేద్దామో కూడా నువ్వే చెప్పు అని అంటాడు

కీర్తి : చేయడానికి ఏమి లేదు తమ్ముడు ఎదో మాయదారి రోగం వచ్చి మన కాలాన్ని చచ్చిపోతున్నాయి అలా అన్ని చచ్చిపోక ముందే మనం మంచిగా ఉన్న కోళ్ళని ఒక్కో దాన్ని అమ్ముకుందాం అలా వచ్చిన డబ్బులని జాగ్రత్తగా దాచుకుందాము, మల్లి ఈ రోగం మన ఊరిలో లేకుండా పోయిన తరువాత మన దగ్గర ఉన్న డబ్బులతో ఎన్ని కోడి పిల్లలు వస్తే అన్నింటిని తెచ్చుకొని మల్లి పెంచుకుందాము అని  సలహా ఇస్తుంది కీర్తి

బాలు : సరే అక్క అలాగే అమ్ముదాము కానీ ఇలాంటి పరిస్థితుల్లో మన దగ్గర కోళ్లు కొనేది ఎవరు, మంచిగా ఉన్న కోళ్ళని కూడా రోగం వచ్చిన కోళ్లేమో అని ఎవరు కొనరు కావొచ్చు అని అంటాడు

కీర్తి : తప్పదు తమ్ముడు మనం ఆకలితో చచ్చిపోకుండా ఉండాలంటే ఎంత వస్తే అంతకే ఈ కోళ్ళని అమ్మేయాలి అని అంటుంది కీర్తి

వాళ్ళు అనుకున్నట్టు గానే ఒక్కో కోడిని తక్కువ తక్కువ డబ్బులకి అమ్ముతూ ఉంటారు, అలా అమ్ముతుండగా ఒక కోడి మాట్లాడుతూ బాలు కీర్తి లతో ఇలా అఞ్ఞతుంది

కోడి : పిల్లలు నా మాట ఒకసారి వినండి

కీర్తి : ఎవరు ఎవరు మాట్లాడేది ఎవరు అని భయపడుతూ అడుగుతుంది

కోడి : అమ్మ కీర్తి మీరు భయపడవలసిన అవసరం లేదు నేను ఒక మాయా కోడిని, నా శక్తులు పొందడం కోసం కొన్ని దుష్ట శక్తులు నా కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి, వాటి నుంచి తప్పించుకోవడం కోసం ఇలా ఇన్నరోజులు నీ దగ్గర ఉఉన్న కోట్లతో కలిసి బ్రతుకుతున్నాను, మీ ప్రేమ అనురాగాలు నేను ముగ్దురాలిని అయిపోయాను, మీకు ఇప్పుడు కష్టకాలం వచ్చింది అని తెలుస్తుంది ఇప్పుడు నేను మీకు సహాయం చేసే సమయం వచ్చింది,  నేను నా శక్తితో మీకు రోజు రెండు పెద్ద గుడ్లు ఇస్తాను మీరు ఆ పెద్ద గుడ్డుని పగల గొడితే మీకు అందులో నుండి పదుల సంఖ్యలో కోళ్లు వస్తాయి అలా వచ్చిన కోళ్ళని అమ్ముకుంటూ మీరు బ్రతకవచ్చు అని సలహా ఇస్తుంది మాయా కోడి

మయా కోడి ఇచ్చిన సలహాని బాలు కీర్తి ఇద్దరు ఒప్పుకుంటారు

తెల్లారి ఉదయం నుంచి మాయా కోడి రోజు రెండు పెద్ద కోడి గుడ్లు ఇస్తూ ఉంటుంది

అలా కొన్ని రోజులు ఇచ్చిన తరువాత మాయ కోడి బాలు తో ఇలా అంటుంది

కోడి : బాలు, నేను మీకు రోజు రెండు మాయా పెద్ద గుడ్లు ఇస్తున్నాను కదా మీరు వాటిలో వచ్చిన కోళ్ళని అమ్ముకుంటాము అని చెప్పారు కదా ఇప్పటివరకు వాటిని అమ్మినట్టు నాకు కనిపించలేదు ఇంతకు మీరు వాటిని అమ్మరా లేదా అని అడుగుతుంది

బాలు : లేదు ఇప్పటి వరకు మేము ఒక్క గుడ్డుని కూడా వాడలేదు దానికి కారణం లేకపోలేదు, ఎందుకంటే నువ్వు మాకు ఈ మాయా గుడ్లు ఇవ్వడం కంటే ముందే మేము కొన్ని కోళ్ళని అమ్మేశాము అలా అమ్మడం వల్ల కొన్ని డబ్బులు వచ్చాయి ఆ డబ్బులతినే ఇన్ని రోజులు బ్రతుకుతున్నాము, ఒకవేళ నువ్వు ఇచ్చిన కోళ్లను కూడా అమ్మి ఎక్కువడబ్బులు సంపాదించి ఉంటె మాకు సుకాలు విలాసాలు అలవాటు అవుతాయేమో అని బయమేసింది, అనుకూ ఇన్నిరోజులు వాటిని అమ్మలేదు, ఇప్పుడు వాటిని అమ్మడానికి ఒక మంచి ఉపాయం చేసాము అని చెబుతాడు

కోడి ఏంటి ఏంటా ఉపాయం అని ఎంతో ఆతృతగా అడుగుతుంది

బాలు కోడిని ఇంటి వెనుకకు తీసుకెళ్లి కోడి గుడ్లతో తయారు చేసిన ఒక ట్రైన్ ని చూపిస్తాడు

అంతలో కీర్తి అక్కడకు వచ్చి ఇలా అంటుంది

కీర్తి : ఓ మాయా కోడి నువ్వు మాకు దొరికిన అదృష్టం, కానీ ఇలా కష్టపడకుండా డబ్బులు సంపాదించే మార్గం దొరికిందని మేము బద్దకంగా అవుతామేమో అని ఈ ఉపాయం చేసాము, ఉపాయం ఏంటంటే ఈ కోడి గుడ్లని పగులగొట్టి ఇందులోనుండి వచ్చిన కోళ్ళని ఇంతకు ముందులాగే పెంచుకుంటాము, ఈ పెద్ద గుడ్లని పై భాగంలో పగల కొట్టడం వాళ్ళ ఇవి రైలు బోగీలుగా ఉంటాయి, ఈ గోడిగుడ్ల ట్రైన్ ని ఊరిలో తిప్పుతూ ఉంటాము, ఇందులో ఎక్కినా వారి దగ్గర టికెట్ రూపంలో డబ్బులు వసూలు చేస్తాము దాని వాళ్ళ మాకు ఎంతో కొంత ఆదాయం కూడా వస్తుంది కదా అని అంటుంది కీర్తి

అప్పుడు మాయా కోడి ఇలా అంటుంది

కోడి : మీ ఆలోచనే మీ పెట్టుబడి, ఇలా తెలివిగా ఆలోచించే వాళ్ళు ఉంటె చెత్త తో కూడా బంగారం సంపాదించవచ్చ్చు, మీరు ఇలా తెలివిగా ఉన్నన్ని రోజులు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని అంటుంది

ఆరోజు నుంచి బాలు కీర్తి ఆ కోడిగుడ్ల ట్రైన్ ని ఊరిలో తిప్పుతూ అందులో ప్రయాణికుల్ని ఎక్కించుకుంటూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు, ఊరిలో ప్రజలకి కూడా కోడిగుడ్ల ట్రై నచ్చడం తో అందరు ఎంతో ఆనందంగా అందులో ఎక్కుతూ ఉంటారు అలా ఎక్కువ జనాలు రావడం వల్ల బాలు కీర్తిలకు డబ్బులు వస్తూనే ఉంటాయి, ఇక్క అప్పటి నుంచి వాళ్ళ కస్టాలు తొలిగిపోతాయి

అప్పుడు కీర్తి బాలుతో ఇలా అంటుంది

కీర్తి : తమ్ముడు ఇన్ని రోజులు మనం లేని దాని గురించి ఆలోచిస్తూ వచ్చిన అవకాశాలని వదిలేశాము కావొచ్చు ఇప్పుడు చూడు ఒక తెలివైన నిర్ణయం మనల్ని పేదరికం నుంచి బయట పడేసింది, మనం ఎప్పుడూ ఇలా తెలివిగానే ఆలోచిస్తూ ఉండాలి అని అంటుంది కీర్తి

కీర్తి మాటలకు బాలు కూడా సరే అంటాడు, ఆ రోజు నుంచి బాలు కీర్తి ఎంతో సంతోషంగా ఉంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *