పేద పిల్లల క్రిస్మస్ బహుమతులు | Telugu Stories | Telugu Kathalu | Banana Dreams TV Telugu

రచన – వివాన్ కృష్ణ, 9390462106

వాయిస్ : రాత్రి సమయం.. ముల్తాన్ పల్లి అనే చిన్న గ్రామంలో ఉన్న చర్చి అది.

            క్రిస్టమస్ పండుగ సందర్భంగా రంగు రంగుల లైట్లా వెలుగులతో మెరిసి  

            పోతూ ఉంది. రాబర్ట్ అనే వ్యక్తి మైక్ పట్టుకుని..

 రాబర్ట్ : మరి కొద్దిసేపట్లో క్రిస్టమస్ వేడుకలు మొదలు కానున్నాయి. ముల్తాన్ పల్లి

           గ్రామం, అలాగే చుట్టూ పక్కల ఊర్లల్లో ఉన్న క్రిస్టియన్ వాళ్ళకు స్వాగతం.

           సుస్వాగతం. అప్పటికి వరకు మనం కొన్ని ఏసు యొక్క ప్రాముఖ్యతను

           తెలిపే పాటలు విందాం! 

వాయిస్ : అంటూ పాటలు పెట్టాడు. ఆ చర్చికి కొద్ది దూరంలోనే కీర్తి, బాలు అనే పేద

            పిల్లల ఇల్లు ఉంది. ఇద్దరు మంచం మీదా దిగులుగా కూర్చుని ఉంటారు.

            వాళ్ళకు  ఏసు పాటలు వినబడుతు ఉంటాయి.

బాలు : అక్క..కాసేపట్లో క్రిస్టమస్ వేడుకలు మొదలవుతాయంటా !

   కీర్తి : నాకు వినబడింది బాలు ! నేనింకా పడుకోలేదు.

బాలు : అది కాదక్కా! క్రిస్టమస్ వేడుకలంటే ఏసు పుట్టిన రోజే కదా! కేక్ కట్ చేస్తారు

          కదా! కేక్ తో పాటు చాక్లెట్స్ ఇస్తారు కదా !

   కీర్తి : అవును తమ్ముడు. కేక్ కట్ చేస్తారు. చాక్లెట్స్ ఇస్తారు.

బాలు : నాకు కేక్ ను, చాక్లెట్స్ ను  తినాలనిపిస్తుందక్కా ! మనం కూడా చర్చి దగ్గరికి

         వెళ్దామక్కా ! మనం కూడా క్రిస్టమస్ వేడుకలలో పాల్గొద్దామక్కా!

  కీర్తి : వద్దు తమ్ముడు. మనం అక్కడికి వెళ్లకూడదు.

బాలు : ఎందుకు వెళ్లకూడదక్కా! మనం హిందువులమనా !

   కీర్తి : కాదు తమ్ముడు..పేదవాళ్ళమని ! అక్కడ అందరూ క్రిస్టమస్ వేడుకలు

          చేసుకుందామని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కొత్త కొత్త బట్టలు

          వేసుకుని వస్తారు. వాళ్ళ మధ్య మాసిన అతుకుల బట్టలు వేసుకుని మనం

          ఉంటే.. మనం కూడా క్రిస్టమస్ వేడుకలకు వచ్చామని అనుకోరు. ముస్తి

          వాళ్ళని, చిల్లర వాళ్ళని, అమ్మనాన్న లేని అనాధ పిల్లలని ఛీ కొడతారు.

           దూరంగా పొమ్మని అంటారు.

బాలు : అప్పుడు మనం మేము ముస్తి వాళ్ళం, చిల్లర  వాళ్ళం, అలాగే అనాధ పిల్లలం

          కాము. ఈ ఊరిలో ఉంటున్న వాళ్ళం. మేము అప్పుడప్పుడు చర్చికి

          వస్తుంటామని చెప్తాదామక్క !

  కీర్తి : నీకు వద్దని చెబుతుంటే అర్థం కావడం లేదా బాలు! అక్కడికి  వెళ్ళిన తరువాత

         మనల్ని ఎవరైనా చూసి కొడితే అందరి ముందు తట్టుకోలేము. తీడితే

          తట్టుకోలేము.

బాలు : అయితే మనం ఇలా వెళ్ళి అలా కేక్ ముక్కలు, చాకెట్స్ తీసుకుని ఎవరు          

         చూడకుండా జాగ్రత్త పడుతూ వచ్చేదాం !

వాయిస్ : కీర్తి కొంచెం కోపంగా..

    కీర్తి : ఇంత చెప్పిన అర్థం కావడం లేదా తమ్ముడు. ఈ రోజు కేక్, చాక్లెట్స్ తినకపోతే

           చనిపోతావా! వద్దని చెబుతుంటే ఒక్కటే కేక్, చాక్లెట్స్ అని అప్పటి నుంచి

           చంపుతున్నావు. వద్దు బాలు. మనం ఎక్కడికి పోయేది లేదు. పడుకో !

వాయిస్ : అని కోపంగా పక్కకు తిరిగి పడుకుంటుంది కీర్తి. ఆమె కళ్ళల్లో నుంచి

            కన్నీళ్లు బాధగా కారుతు ఉంటాయి. బాలు కూడా ఏమి మాట్లాడకుండా

            బాధతో పక్కకు తిరిగి పడుకుంటాడు. ఏడుస్తూ ఉంటాడు. క్రిస్టియన్ అందరూ

            చర్చి దగ్గరికి వచ్చారు. రాబర్ట్ కేక్ కట్ చేశాడు. అందరూ హ్యాపీ కిస్మస్

           చెప్పుకుంటున్నారు. కీర్తి లేచింది. కన్నీళ్లు తుడుచుకుని తమ్ముడు బాలును

           లేపింది. బాలు ఏడుస్తూ ఉంటాడు. ఓదార్పుగా..

   కీర్తి : నన్ను మన్నించు తమ్ముడు. మరోకసారి కోపగించుకొను. నీకు తెలుసు కదా

          బాలు..ఆ రాబర్ట్ అంకుల్ మనల్ని ఎక్కడ చూసిన పేద పిల్లలంటూ కొడతాడు.

         అనాధ పిల్లలంటూ తిడతాడు. పైగా మనం కనిపించినప్పుడల్లా మనకు ఒక

         రూపాయి దూరంగా విసిరేస్తాడు.

బాలు : అవునక్కా! నేను చాలా సార్లు చూశాను.

   కీర్తి : ఇప్పుడు మనం ఆ కేక్ కటింగ్ దగ్గరికి వెళ్ళితే అంతమంది ముందు మనల్ని

          తిడతాడు. కారణం లేకుండా కొట్టిన మనం ఆశ్చర్య పోనక్కర లేదు తమ్ముడు.

బాలు : కావొచక్కా! కానీ నాకు అమ్మవైనా, నాన్నవైనా నువ్వే కదక్కా! నేను నిన్ను

        తప్ప మరెవరిని అడుగుతాను చెప్పు ! నువ్వు కూడా ఏదైనా చెప్పాలనుకుంటే

        కోపం తెచ్చుకోకుండా అర్థమయ్యేలా చెప్పక్క!

  కీర్తి : సరే తమ్ముడు ! ఇప్పుడు మనమెళ్లి దూరంగా నిలబడి ఆ క్రిస్టమస్ వేడుకలు

         చూద్దాం పదా !

వాయిస్ : ఆ మాట విని బాలు సంతోష పడతాడు. కీర్తి, బాలు ఇద్దరు కలిసి ఒక చెట్టు

            దగ్గరికి వస్తారు. ఆ చెట్టు చాటున నిలబడి కీర్తి, బాలు కేక్ తింటున్న వాళ్ళను

            చూస్తుంటారు. ఇంతలో ఆకాశం నుంచి ఒక తార వాళ్ళ వైపు వస్తున్నట్టుగా

            అనిపిస్తుంది బాలుకు. అదే విషయాన్ని కీర్తి చెప్తాడు. ఇద్దరు చూస్తుండగానే

           ఒక నక్షత్రం ఆకాశం నుంచి వాళ్ళ ముందుకు ఆచ్చి శాంత క్లాజ్ లా

           మారిపోతుంది. కీర్తి, బాలు ఆశ్చర్యంగా, అద్భుతంగా చూస్తుంటారు.

శాంత క్లాజ్ : కీర్తి, బాలు..మేరీ కిస్మస్..హ్యాపీ క్రిస్మస్ !

వాయిస్ : అంటూ తన చేతిలో ప్రత్యక్షమై మెరుస్తున్న స్టార్ ను బాలుకు ఇస్తాడు. కీర్తి,

           బాలు ఇంకా నమ్మలేనట్టుగా అలా చూస్తుండి పోతారు.

శాంత క్లాజ్ : కీర్తి, బాలు..బాగున్నారా!

         కీర్తి : శాంత క్లాజ్..నువ్వు నిజంగానే వచ్చవా!

శాంత క్లాజ్ : మీకాంతగా అనుమానం ఉంటే ఒకసారి తాకీ చూడండి.

   వాయిస్ : కీర్తి, బాలు ఇద్దరు శాంత క్లాజ్ ను తాకీ చూస్తారు. నిజమే కల కాదు..

              వాళ్ళ ముందుకు ఆకాశంలో మెరిసే నక్షత్రం శాంత క్లాజ్ లా మారి వాళ్ళ

              ముందుకు వచ్చింది. ఆ చెట్టు దగ్గరి నుంచి కీర్తి, బాలును తీసుకుని వాళ్ళ

              ఇంటీకి వస్తాడు శాంత క్లాజ్. చిటి కేస్తాడు. కీర్తి ఇంటి దగ్గర స్టార్ వెలుగుతూ

              ఉంటుంది.    

శాంత క్లాజ్ : పిల్లలు..మీరు క్రిస్మస్ వేడుకలకు రాలేదని.. నేనే మీ దగ్గరికి క్రిస్మస్

               వేడుకలను తీసుకొచ్చాను.

వాయిస్ : అని అనగానే అందంగా ముస్తాబ్ చేయబడిన బల్ల ప్రత్యక్షమౌతుంది. ఆ బల్ల

             మీదా కేక్ ప్రత్యక్షమవుతుంది. అది చూసి బాలు చాలా సంతోష పడతాడు.

            బాలు కేక్ కట్ చేస్తాడు. శాంత క్లాజ్, కీర్తి ఇద్దరు సంబరంగా చప్పట్లు

            కొడతారు. బాలు కేక్ తింటూ ఉంటాడు.

శాంత క్లాజ్ : నా తరుపున నీకు బహుమతులు.. !

వాయిస్ : అనగానే ఇల్లు మారిపోతుంది. మంచాలు మారుతాయి. కొత్త బట్టలు

            మెరుస్తూ కనబడుతాయి. ఆ తరువాత.. రైస్ బ్యాగ్, కూరగాయలు, ఇంటి

            సరుకులు.. ఇంకా ఇంటి బయట బాలు ఆడుకోవడానికి బొమ్మలు,

            తొక్కదానికి సైకిల్..ఇలా ఒకటి తరువాత ఒకటి అన్నీ కీర్తి, బాలు ముందు

            ప్రత్యక్షమవుతాయి. బాలు కేక్ తినడం అయిపోతుంది.

శాంత క్లాజ్ : పేద పిల్లలమని కీర్తి, బాలు మీరు క్రిస్మస్ పండుగకు మీరు హాజరు

             కాలేదని మీ దగ్గరికే క్రిస్మస్ పండుగ వచ్చింది. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ! బై

             పిల్లలు !

వాయిస్ : అని చెప్పి శాంత క్లాజ్ మాయమవుతాడు. అలా కీర్తి, బాలు సంతోషంగా

            క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు.

-0-

సింగిల్ లైన్ స్టోరీ

 క్రిస్టమస్ పండుగ సందర్భంగా ముల్తాన్ పల్లి అనే చిన్న గ్రామంలో ఉన్న చర్చి రంగు రంగుల లైట్లా వెలుగులతో మెరిసి పోతూ ఉంటుంది. అక్కడ రాబర్ట్ అనే వ్యక్తి మైక్ పట్టుకుని క్రిస్టమస్ వేడుకల గురించి చెబుతుంటాడు. అదే ఊర్లో ఉన్న పేద పిల్లలు కీర్తి, బాలు..ఆ క్రిస్మస్ వేడుకలకు వెళ్లాలని అనుకుంటారు. కానీ రాబర్ట్ మంచి వాడు కాదనీ పేద పిల్లలంటే అతనికి ఇష్టం ఉండదని వేడుకలకు వెళ్లొద్దని కీర్తి, బాలుకు చెబుతుంది. దాంతో బాలూ బాధపడుతూ ఉంటాడు. ఆ తరువాత శాంత క్లాజ్ వచ్చి కేక్, సైకిల్, ఆడుకునే బొమ్మలు, ఇల్లు, మంచి బట్టలు ఇచ్చి వెళ్ళిపోతాడు. అలా ఆ పేద పిల్లలు కీర్తి, బాలు క్రిస్మస్ జరుపుకుంటారు.              

Add a Comment

Your email address will not be published. Required fields are marked *