పేద పిల్లల క్రిస్మస్ Episode 84 | Telugu Stories | Telugu Fairy Tales | Story World Telugu

ఒక ఊరిలో బాలు కీర్తి అనే ఇద్దరు పిల్లలు ఉండేవారు, కిన్ని రోజుల క్రితం వరకు వాళ్ళ అమ్మ నాన్నలతో సంతోషంగా ఉండేవారు కానీ అనుకోని ఒక ప్రమాదం లో బాలు కీర్తి అమ్మ నాన్న చనిపోవడం వల్ల ఇప్పుడు అనాధలుగా మిగిలిపోయారు అలా ఉండగా ఒకరోజు బాలు కీర్తి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు

బాలు : అక్క ఈ సారి క్రిస్టమస్ పండుగ దగ్గరికి వస్తుంది ప్రతి సారి మనం మన అమ్మ నాన్నలతో ఎంతో ఆనందంగా జరుపుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు అమ్మ నాన్నలు లేకుండా క్రిస్టమస్ వేడుకలు జరుపుకోవాలా అక్క అని అడుగుతాడు బాలు

కీర్తి : మన అమ్మానాన్నలు మనకు లేకుండా పోయారు తమ్ముడు ఇక నుంచి మనకి దేవుడే దిక్కు, మనకి అమ్మైనా నాన్నైనా దేవుడే, అమ్మ నాన్న లేరని బాధ పడకుండా ఉండడడం కోసమైనా మనం దేవుడి మీద భారం వెయ్యక తప్పదు అని అంటుంది

అలా వాళ్ల్లు మాట్లాడుకుంటూ ఉండగా పక్కన ఇంట్లో ఉండే చంటి అనే పిల్లవాడు ఉండేవాడు, చంటి వాళ్ళ నాన్నకు బాగా డబ్బులు ఉంటాయి, డబ్బు వున్నదని అందరితో ఎంతో పొగరుగా ప్రవర్తించే వాడు, బాలు కీర్తి ని చూస్తే ఎప్పుడు ఏడిపిస్తూ ఉండేవాడు, అనుకోకుండా  బాలు కీర్తి మాట్లాడుకుంటూ ఉండగా చంటి అక్కడికి వచ్చి బాలు కీర్తిని చూస్తూ ఇలా అంటాడు

చంటి : ఏయ్ పేద పిల్లలు, ఏంటి ఇక్కడే ఉన్నారు మీరు ఇంకా క్రిస్మస్ కి సంబందించిన వేడుకలు ఇంకా మీరు మొదలు పెట్టలేదా? అయినా మీరెలా మొదలు పెడతారు లే, మీ దగ్గర డబ్బులున్నాయా లేక డబ్బులు ఇవ్వడానికి అమ్మ నాన్న ఉన్నారా? మా లాగా మీకు డబ్బులు లేవు అమ్మ నాన్నలు లేరు మీరెలా చేసుకుంటారు లే, క్రిస్మస్ రోజు మేము చాలా పెద్ద పార్టీ చేసుకుంటున్నాము, మీరు రాకండి మీరు మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు అంటే మా పరువు పోతుంది, క్రిస్మస్ అయినా తరువాత రోజు రండి మేము చేసుకున్న పార్టీ లో ఏవైనా మిగిలిపోయిన పదార్ధాలు ఉంటె ఇస్తాను పాపం మీరు మేము తినేలాంటి ఖరీదైన పదార్థాలు ఎప్పుడైనా తిన్నారో లేదో? అని చాలా వెటకారంగా మాట్లాడి వెళ్లి పోతాడు

చంటి వెళ్ళిపోయినా తరువాత బాలు కీర్త్తి తో ఇలా అంటాడు

బాలు : చూసావా అక్క చంటి గాడి పొగరు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని మన దగ్గర లేవని వాడు మనలని ఎంత చులకనగా మాట్లాడుతున్నాడో అని అంటాడు

కీర్తి : డబ్బు లేని వారంటే డబ్బున్న వాళ్లకి ఎప్పుడైనా చులకనేరా, దాంట్లో మనలని ఏమైనా అంటే ఎదురు మాట్లాడి వాదించడానికి మన అమ్మ నాన్న కూడా లేరని వాళ్ళ ధైర్యం అందుకే నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటారు తప్పదు తమ్ముడు మనకి ఇలాంటి మాటలు మనం కూడా బాగా డబ్బులు సంపాదించే వరకు ఇంతే మనం ఇంతే అని అంటుంది

అలా చూస్తూ ఉండగానే క్రిస్మస్ వచ్చేస్తుంది

కీర్తి : తమ్ముడు మనం ఈ సారి క్రిస్మస్ వేడుకలు చేసుకుందాం అనుకున్నాం కానీ మన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, ఇప్పుడు ఎలా రా అని అంటుంది

బాలు : అక్క క్రిస్మస్ కి శాంతా క్లాస్ వచ్చి చాలా మందికి బహుమతులు ఇస్తారని చెబుతారు కదా మనకి అలా ఎవ్వరు ఇవ్వరా అక్క అని అడుగుతాడు,

కీర్తి : తమ్ముడు అలాంటివి అన్ని డబ్బున్న వాళ్ళు వాళ్ళ వాళ్లని ఆశ్చర్య పరచడానికి చేసే ఒక చర్య అంతే మనం ఎవరికీ తెలుసని మనకి ఎవరు బహుమతులు ఇస్తారు తమ్ముడు అని అంటుంది

అదే ఊరిలో గణపతి అనే  ఉండేవాడు, అతనికి సేవా కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం అతని దగ్గర ఎంత దబ్బబు ఉన్న కూడా డబ్బుందన్న పొగరు మాత్రం ఏ మూలా ఉండేది కాదు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరిని ఎంతో ప్రేమగా పలకరించేవారు, ఎవరికీ ఏ సహాయం కావలన్నా ముందుండేవాడు, అలా ఉండగా ఒకరోజు గణపతి కి ఒక్క ఆలోచన వచ్చింది

అప్పుడు తనలో తాను ఇలా అనుకుంటాడు

గణపతి : అవును నేను ఎవరడిగినా నాకు తోచినతా సహాయం చేస్తూనే ఉన్నాను కానీ వాళ్ళు నిజంగా అవసరం ఉంది డబ్బులు అడుగుతున్నారా లేక నేను ఇస్తున్ననై అడిగి తీసుకెళ్తున్నారా అని మాత్రం చూడడ లేదు అదే అదునుగా తీసుకొని చాలా మంది నా దగ్గర డబ్బులు తీసిని విలాసాలకు ఖర్చు చేస్తున్నారు, అలా చేయడం వల్ల వాళ్లకి నేను డబ్బిచ్చి మరి చెడగొడుతున్నటుగా అవుతుంది దానికి నేను ఒకటి చేయాలని ఆలోచించి  ఇప్పుడు ఎలాగూ క్రిస్మస్ పండుగ వస్తుంది కదా నేను శాంతా క్లాస్ లా వేషం వేసుకొని ఊరంతా తిరుగుతాను, అప్పడు  ఎవరికీ నేయిజంగా డబ్బు అవసరం ఉందొ, ఎవరు నిజంగా కష్టాలు అనుభవిఇస్తున్నారో తెలుస్తుంది, ఇలా ఎవరికీ పడితే వారికి సహాయం చేసే బదులు నిజంగా వసరం ఉన్న వాళ్లకు చేయద్దం మంచిది కదా అని అనుకుంటాడు, అలా గణపతి తాను శాంతా క్లాస్ లా వేషం వేసుకొని ఊరిలో అందరిని గమనిస్తూ అవసరం ఉన్న వారికి కొన్ని బహుమతులు ఇస్తూ తిరుగుతూ ఉంటాడు, అలా వెళ్తుండగా గణపతికి దిగాలుగా ఇంటి ముందు కూర్చున్న బాలు కీర్తి కనిపిస్తారు

వాళ్ళని చూసిన గణపతి సంత క్లాస్ వేషము లో వాళ్ళ దగ్గరికి వెళ్లిఇలా మాట్లాడుతాడు

గణపతి : పిల్లలు ఏంటి ఇక్కడ కూర్చున్నారు? మీరు ఇలా క్రిస్మస్ పండుగ రోజుల్లో ఇలా దిగాలుగా కూర్చుంటే నేను చూడ్డలెను నేను మీకోసం శాంటా క్లాస్ ని వచ్చాను మీ కోసం చాలా రకాల బహుమతులు తెచ్చాను ఇటు చూడండి అని అంటాడు

బాలు : అయ్ నిజంగానే శాంతా క్లాస్ వచ్చాడు, మన కోసం చాలా రకాల బహుమతులు తెచ్చాడక్క అక్క అక్క చూడక్క అని బాలు చాలా సంతోషంగా అరుస్తూ కేకలు వేస్తూ ఉంటాడు

కీర్తి కి నిజ్జంగానే శాంతా క్లాస్ వచ్చాడన్న ఆనందం తో పాటు బాలు చాలా సంతోషంగా ఉన్నదన్న ఆనందం కూడా తోడయ్యి ఆమె ఇంకా సంతోషంగా ఉంటుంది,

శాంతా క్లాస్ వేషం లో అవీచిన గణపతి బాలు కీర్తి క్రిస్మస్ చెట్టు తో పాటు ఇంకా చాలా రకాల బహుమతులు ఇస్తాడు, అవ్వి చ్చోఓసి బాలు కీర్తి ఎంతో సంతోషపడతారు

ఇంతలో అక్కడికి చంటి వస్తాడు

చంటి : శాంతా తాత నువ్వు ఇలా పేద వాళ్ళ ఇంటికి రావడం నాకు ఏ మాత్రం నచ్చలేదు, నువ్వు మా ఇంటికి రావాలని నేను ఎన్నో రకాల ఏర్పాట్లు చేసి ఉంచాను అయినా నువ్వు మా ఇంటికి రాకుండా దిక్కు మొక్కు లేని వీళ్ళ ఇంటికి రావడం ఏంటో నాకు అర్ధం కావడం లేదు అని అంటాడు

గణపతి : నయినా నీకు చాలా డబ్బులు ఉన్నాయి వాటియాతో వచ్చిన పొగరు కూడా ఉంది, ఇలా ఉన్న నీ ఇంటికి ఎవరు వస్తారు నాయనా? దేవుడిదైనా మనిషి అయినా ఇంటికి రావాలంటే వాళ్ళు డబ్బున్నోళ్ల లేనోళ్ల అని చూడడు, వాళ్ళు మనసు మంచిదా? లేక ఎప్పుడూ ఎదో ఒక కీడు తాలిస్తుందా అని చూసి మరి వస్తాడు, అందుకే నేను వీళ్ళ దగ్గరికి వచ్చాను అని అంటాడు

అని గణపతి ఛాతికి ఒక చాకొలేట్ ఇస్తాడు

చంటి : వాళ్లకి అంత పెద్ద పెద్ద బహుమతులు ఇచ్చి నాకు ఈ చిన్న చాకొలేట్ ఇస్తావా నాకేమద్దు అని అంటాడు

బాలు : చంటి నీకు నిజంగా ఈ బహుమతులు కావాలంటే తీసుకో అని అంటుంది

చంటి : ఏంటి మీకు వచ్చిన బహమతులు నన్ను తీసుకోమంటున్నావా? ఏఈ ఒక్క మత్తొ మీ గోప ప్రేమ నాకు అరదమయ్యిండి కీర్తి ఇక మిమ్మల్ని ఎప్పుడు ఏమి అన్నాను మిమ్మల్నే కాదు ఇక డబ్బు పొగరుతో ఎవరితో ఏమి మాట్లాడను అని అంటాడు

గణపతి : ఈ మార్పే నాయనా అసలైన పండుగా అని చెప్పి అక్కడనుంచి వెళ్ళిపోతాడు ఆ రోజు నుంచి చంటి బాలు కీర్తి ఎంతో స్నేహంగా ఉంటారు 

1 మినిట్ స్టోరీ

ఒక ఊరిలో బాలు కీర్తి అనే ఇద్దరు అనాధ పిల్లలు ఉండేవారు, వాళ్ళ అమ్మ నాన్న బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళు క్రిస్మస్ ఎంతో ఘనంగా జరుపుకునేవారు, అమ్మ నాన్న చనిపోవడం తో వేడుకలు ఎలా జ్జరుపుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు, అలా ఉండగా పక్కింట్లో ఉండే చంటి అనే తన దగ్గర డబ్బు ఉండనే పొగరుతో బాలు కీర్తి ని ఎంతో అవమానిస్తూ ఉండేవాడు, క్రిస్మస్ రోజు దిగాలుగా కూర్చున్న బాలు కీర్తి దగ్గరకు శాంతా క్లాస్ వచ్చి కొన్ని బహుమతులు ఇస్తాడు, అప్పుడే అక్కడికే వచ్చిన చంటిని దగ్గరికి పిలిచి కొన్ని మంచి మాటలు చెప్పి అతని మనసు మార్చేస్తాడు, అప్పటినుంచి బాలు కీర్తి చంటి ఎంతో స్నేహంగా ఉంటూ ఉంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *