పేద పిల్లల గోల్డెన్ బైక్ Episode 85 | Telugu Stories | Telugu Fairy Tales | Story World Telugu

ఒక ఊరిలో రమణమ్మ అనే ఒక పేద మహిళ ఉండేది, ఆమెకు బాలు కీర్తి అనే ఇద్దరు పిల్లలు ఉండేవారు, రమణమ్మ ఊరిలో కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చూసుకుంటూ ఉండేది, బాలు కీర్తి మాత్రం వాళ్ళ ఇంటి పరిస్థితులని ఎప్పుడూ అర్ధం చేసుకునే వారు కాదు, ఎప్పుడూ ఎదో ఒకటి కావాలని ఎదో ఒకటి కొనివ్వమని రమణమ్మ ని సతాయిస్తూ ఉండేవారు, రమణమ్మ అప్పటికప్పుడు ఎదో ఒకటి చెప్పి వాళ్ళని ఆపేది అలా ఉండగా ఒకరోజు బాలు రమణమ్మ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు

బాలు : అమ్మ నాకు ఒక మినీ బైక్ కావాలి, నా తోటి పిల్లలందఱు మినీ బైక్ లు వేసుకొని తిరుగుత్న్నరు, వాళ్ళ నన్ను చూసి వెక్కిరిస్తుంటే నా చాలా అవమానంగా అనిపిస్తుంది, మొన్నటికి మొన్న రమేష్ అంకుల్ కొడుకు బన్నీ గాడు నా దగ్గరికి తాను కొనుక్కున్న మినీ మోటార్ బైక్ వేసుకొని వచ్చాడు, అది చూడడానికి చాలా బాగుంది, నాకు అది ఎంతో నచ్చడం తో ఒక సారి ఇవ్వమని అడిగాను దానికి వాడు తనది చాలా ఖరీదైన మోటార్ బైక్ అని అందరికి ఇస్తే పాడవుతుంది చెప్పి వెళ్ళిపోయాడు, అప్పటి నుంచి మల్లి నేను ఎక్కడ అడుగుతానో అని వాడు ఇటు వైపుగా రావడం కూడా మానేసాడు, అని అంటాడు

కీర్తి  ;అమ్మ నాకు కూడా అలాంటి అవమానాలే జరుగుతున్నాయి నీకు బైక్ నడపడం రాదు కాబ్బట్టి నను ఒక మినీ ట్రాక్టర్  కోనివ్వు అమ్మ ఎంచక్కక్క దాట్లో కూర్చొని ఊరంతా తిరుగుతాను అని అంటుంధీ

రమణమ్మ : బాలు నీకు ఒక మినీ మోటార్ బైక్ కావాలా? కీర్తి నీకు మినీ ట్రాక్టర్  కావాలా? ఎప్ప్పుడు మీరు మీ గురించే కానీ మన ఇంటి పరిస్థితి గురించి ఎప్పుదైనా ఆలోచించారా? నేను రోజంతా ఒళ్ళు హూనం చేసుకొని కష్టపడుతుంటే వచ్చే డబ్బులు మన తిండికి కూడా సరిపోవడం లేదు, అలాంటి పరిస్థితుల్లో మీకు మినీ బైక్ ట్రాక్టర్  కావలసి వచ్చాయా? పక్కోళ్లని చూసి ఎప్పుడు పోల్చి చూసుకోకూడదు, వాళ్ళకంటే డబ్బులు ఉన్నాయి పొలాలు ఆస్తులు ఉన్నాయి మ్మనకేమున్నాయి అని అంటుంది

కీర్తి : అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండడం వల్లనే పిల్లలను మంచిగా చూసుకుంటున్నారని అంటున్నవా అమ్మ? అని అంటుంది

బాలు : మరి డబ్బులు లేకుంటే పిల్లలకి  ఇబ్బంది వస్తుంది అని తెలిసినప్పుడు మరి మమ్మల్ని ఎందుకమ్మా పుట్టించావు, మేము ఈ భూమి మేడలు రాకపోయి ఉంటె మాకు ఈ కష్టాలు ఉండేవే కావు కదా అని అంటాడు

కీర్తి : అవునమ్మా, డబ్బులు లేక పోవడం మా తప్ప, మేము చిన్న పిల్లలం మాకు ఆదుకోవాలి అని కోరికలు ఉండవా, నీ కష్టాలు అన్ని మా మీద రుద్దుతావెందుకమ్మా అని అంటుంది

బాలు కీర్తి అన్న మాటలకు రమణమ్మ చాలా బాధపడుతు ఇంట్లోకి వెళ్ళిపోతుంది

అలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి బాలు కీర్తి రమణమ్మ తో సరిగా మాట్లాడడం మానేశారు, అలా ఉండగా ఒకరోజు రమణమ్మ తనలో తాను ఇలా అనుకుంటుంది

రమణమ్మ : ఏ ఆస్తి పాస్తీ నాకు లేకపోయినా, నన్ను పిల్లలని ఎంతో ప్రేమగా చూసుకునే నా భర్త చనిపోయినా కూడా నేను నా పిల్లల కోసం ఇన్ని రోజులు బ్రతుకుతూ వచ్చాను కానీ ఇప్పుడు ఆ పిల్లలే నన్ను కాదనుకుంటున్నారు, నా కన్నా వాళ్లకి ఆటవస్తువుల మీదే ఎక్కువ ఇష్టం ఉంది అలాంటప్పుడు నేను ఉంది కూడా లాభం లేదు గత కొన్ని రోజులు వాళ్ళు నాతో మాట్లాడడం కూడా మానేసారు, వాళ్లకి కావలసినదేదో ఇచ్చేసి నేను ఎటైనా వెళ్ళిపోతాను లేదా చచ్చి పోయి నా భర్త దగ్గరికి వెళ్ళిపోతాను అని అనుకుంటుంది

అలా అనుకున్న తరువాత  రమణమ్మ ఎక్కడ ఎవరు ఏ పని చెప్పిన ఎంత కష్టమైనా పన్ని అయినా చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. అలా కొద్దీ రోజులు గడుస్తాయి

ఒకరోజు కీర్తి బాలు తో ఇలా అంటుంది

కీర్తి : తమ్ముడు మనం ఆ రోజు అమ్మని అలా అనకుండా ఉండాల్సిందేమోరా, మనం అమ్మని బైక్ ట్రాక్టర్  కొనివ్వమనడమే కాకుండా అమ్మతో సరిగా మాట్లాడడం లేదు కూడా, నాకు నిన్న రమ్య ఆంటీ కలిసి అమ్మ గురించి కొన్ని విషయాలు కిచెప్పింది అని అంటుంది

బాలు : అమ్మ గురించా? ఎం ఆశయాలు అక్క అని అడుగుతాడు

కీర్తి : అమ్మ చాలా రోజులుగా ఎంతో దిగాలుగా ఉంటుందంటా, డబ్బులు ఇస్తారంటే ఎంత కష్టమైన పని అయినా చేస్తుందంటా, ఎందుకు అని అడిగితే మనకి మినీ ట్రాక్టర్  బైక్ కొనడం కోసం అని చెబుతుందంటా అని అంటుంది

బాలు : అవునక్క మనం అమ్మ మీద అరిచి పెద్ద తప్పు చేసాము, ఎలాగైనా మనమే కష్టపడి ఒక మినీ బైక్ లేదా ట్రాక్టర్  తాయారు చేసి అమ్మకు చూపిద్దాం అమ్మ కూడా ఎంతో సంతోష బడుతుంది అని అంటాడు

ఇద్దరు కలిసి అడవికి వెళ్లి వెదురుబొంగులతో ఒక మినీ బైక్ తాయారు చేస్తాఋ, బాలు అతన వెంట తీసుకెళ్లిన కొన్ని బ్యాటరీస్ సహాయం తో వెదురుబొంగులతో ఒక బాటరీ బైక్ తాయారు చేస్తాడు, దాన్ని తీసుకొని ఊరిలోకి వెళ్తుంటాడు బాలు ఇంతలో అతనికి ఒక స్వామిజి ఆపదలో కనిపిస్తాడు, ఆపదలో ఉన్న స్వామీజీని చూసిన బాలు వెంటనే అతనిని తీసుకొని ఆసుపత్రికి వెళ్తాడు, కొంత సేపటి తరువాత స్పృహలోకి వచ్చిన స్వామిజి బాలు ని చూస్తూ ఇలా అంటాడు

స్వామిజి : బాలు నువ్వు నా ప్రాణాలని కాపాడావు, నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అంటాడు,

బాలు ; స్వామి మిమ్మల్ని కాపాడానని అడగడం లేదు కానీ మా అక్క మీద ఉన్న ప్రేమతో అవకాశం వచ్చినదని అడుగుతున్నాను, నాకు మినీ బైక్ అంటే ఎంతో యిష్టం, మా అక్కకి మినీ ట్రాక్టర్  అంట ఇష్టం నెంన్తీ ఎలాగోలా వెదురుబొంగులతో మినీ బైక్ తాయారు చేసుకున్నాను, కానీ అక్కకు ట్రాక్టర్  చేయడం వీలు అవ్వడం లేదు మీరే ఎలాగైనా సహాయం చేయండిలా ని అంటాడు,

వెంటనే స్వామిజి బాలు మినీ బైక్ ని బంగారు బైక్ గా మార్చేస్తాడు, కీర్తి కోసం ఒక ఖరీదైన మినీ బైక్ ని ఇస్తాడు ఆ రెండు మినీ వెహికల్స్ ని   రమణమ్మ నాదగ్గరికి తీసుకెళ్తారు, బాలు కీర్త్తి ఇద్దరు కూడా రమణమ్మ కి క్షమాపణలు చెబుతారు అప్పటి నుండి బాలు కీర్తి రమణమ్మ ఎంతో సంతోషంగా ఉంటారు

1 మినిట్ స్టోరీ

ఒక ఊరిలో రమణమ్మ అనే ఒక పేద మహిళా ఉండేది, ఆమెకు బాలు కీర్తి అనే ఇద్దరు పిల్లలు, వాళ్ళు ఎప్పుడు కూడా రమణమ్మ పరిస్థితిని చూడకుండా రకరకాలైన వాటిని ఖరీదైన వస్తువులని అడుగుతూ ఉండేవారు, అలా ఉండగా ఒకరోజు బాలు కీర్తి మినీ బైక్ మరియు మినీ ట్రాక్టర్  కొనమని రమణమ్మని ఎంతో బాధపెడతారు, రమణమ్మ వాళ్ళ బాధ తట్టుకోలేక వాళ్లకి కావాల్సినవి కొనిచి చచ్చిపోవాలి అనుకుంటుంది, కానీ బాలు కీర్తి తమ తప్పు తెలుసుకొని ఒక మినీ బైక్ ని తాయారు చేస్తారు, అనుకోకుండా ఒక స్వామీజీని కాపాడతారు, స్వామిజి వాళ్ళ మినీ బైక్ ని బంగారు బైక్ గా మార్చేస్తాడు అప్పటి నుంచి వాళ్ళ జీవితం మారిపోతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *