పేద పిల్లల చలికాలం 2 | Telugu Stories | Telugu Kathalu | Banana Dreams TV Telugu

వాయిస్ : ఒకానొక ఊరిలో అమ్మనాన్న లేని పేద పిల్లలు, అనాధ పిల్లలైన కీర్తి, బాలు

            అనే ఇద్దరు పిల్లలు ఉండేవాళ్లు. కీర్తి, బాలు అక్కాతమ్ముళ్ళు. కీర్తి బాలుకు

            ప్రేమను పంచే అమ్మైతే, బాలు కీర్తికి దైర్యం చెప్పే నాన్న. ఎక్కడికి వెళ్ళిన

            అక్క చేతిని వదలకుండా తోడుగా ఉంటాడు. నీడలా ఉంటూ తన తమ్ముడు

            బాలును చూసుకుంటూ ఉంటుంది.

            అది చలికాలం.. పైగా రాత్రి..తమకున్న చిన్నపాటి ఇంట్లో అతుకుల దుప్పటి

            కప్పుకుని పడుకున్నారు. ఆ పేద పిల్లలకు ఆ అతుకుల దుప్పటి సరిగ్గా

            సరిపోవడం లేదు. దాంతో చలికి వణుకుతూ నిద్ర పోకుండా తమ బతుకులు

            ఏంటో తెలుసుకుని బాధ పడుతూ ఉంటారు.

   బాలు : అక్క.. ఈ అతుకుల దుప్పటి నువ్వు కప్పుకుని పడుకో! నేను కాసేపు

             మెళుకువగా ఉంటాను. ఎలాగూ దుప్పటి మన ఇద్దరికీ సరిపోవడం లేదు.

            నువ్వు పడుకున్నప్పుడు కప్పుకుని పడుకో ! అప్పుడు నేను మెళుకువగా

           ఉంటాను.

   కీర్తి : ఆ తరువాత నువ్వు పడుకున్నప్పుడు నేను మెళుకువగా ఉండాలి అంతేనా

         తమ్ముడు.

బాలు : ఆవునక్కా! మనకు ఉన్నది ఒక్కటే దుప్పటి. వేసుకోవడానికి చలికాలం కోట్లు

          కూడా లేవు. పోనీలే పాపం పేద పిల్లలు కదా.. అని ఎవరైనా దయతలిచి రెండు

          చలి కోట్లు ఇస్తే ఎంత బాగుండునో కదా అక్క!

  కీర్తి : అవునురా తమ్ముడు. కానీ మనమంటే ఎవరికి జాలీ, దయ లేవులే తమ్ముడు.

బాలు : లేదక్కా! మనం అలా అనుకోవడానికి లేదు. మనమంటే జాలీ, దయ ఉన్నాయి

          కాబట్టే ఈ ఊరిలో మనం ఇంకా ఉన్నాం ! ఉంటున్నాం కూడా !

   కీర్తి : అవును బాలు. నువ్వు చెప్పేది నిజమే ! నువ్వు మాట్లాడుతుంటే అచ్చం

         నాన్నలాగే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది తమ్ముడు.

బాలు : నాన్ననే అనుకో అక్క! అమ్మా కీర్తి..నాన్నను చెబుతున్నాను. ఈ దుప్పటి

         కప్పుకుని పడుక్కోమ్మా !

   కీర్తి : నా కంటే తమ్ముడు చిన్నవాడు కదా నాన్న. అందుకే తమ్ముడిని

          కప్పుకొమ్మని చెప్పు నాన్న !

బాలు : సరే..మీ అక్కాతమ్ముళ్ళక్కు చెప్పేదాని కంటే బయట మంట వేసుకుని

          చూర్చోవడం మంచిది !

వాయిస్ : అని బాలు బయటికి వచ్చి మంట పెడతాడు. అది చూసి కీర్తి కూడా అక్కడికి

            వస్తుంది. అక్కాతమ్ముడు ఇద్దరు కలిసి మంటకు చలికాచుకుంటూ

            కూర్చుంటారు.

 బాలు : అక్క..ఇప్పుడు మనకు అమ్మనాన్న ఉండి ఉంటే నలుగురం ఆ మంట దగ్గర

          కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళం కదక్కా!

   కీర్తి : అవును తమ్ముడు. జాలీ లేని ఆ దేవుడు అమ్మానాన్నను తీసుకెళ్లినందుకు

         ఆయన మీదా కోపం ఉన్న, నీకు అక్కని నాకు తమ్ముడిని ఇచ్చినందుకు

         ఆయనకు ఋణపడి ఉండటమే కదా మనం చేసేది !

వాయిస్ : అని కీర్తి, బాలు ఆ మంటకు చలి కాచుకుంటూ తమ తల్లిదండ్రుల గురించి

            మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో వాళ్ళ దగ్గరికి అమ్మలా చూసుకునే

            జేజమ్మ అనే ఒక పెద్దవిడా వస్తుంది. కబుర్లు చెప్పుతుంది. ఇద్దరు పిల్లలు

            సంతోషంగా నవ్వుతూ ఉంటారు. రెండు మూడు గంటలు గడిచిన తరువాత

            కీర్తి, బాలు నిద్ర వస్తుందని, జేజమ్మకు చెప్పి తమ ఇంట్లోకి వెళ్తారు కీర్తి,

            బాలు. ఇద్దరు ఆ అతుకుల దుప్పటి కప్పుకుని పడుకుంటారు. అలా ఆ రోజు

            రాత్రి గడిచిపోయింది.

            మరుసటి రోజున కీర్తి, బాలు ఏదైనా పని దొరుకుతుందేమోనని ఇంట్లో నుంచి

            బయటకు వస్తారు. చెరోక దిక్కు వెళ్తారు. అప్పుడు కీర్తి..

   కీర్తి : తమ్ముడు చలికి తట్టుకోలేక పోతున్నాడు. ఎలాగైనా తమ్ముడి కోసం ఒక శ్వేటర్

          తీసుకోవాలి ! నేను పని చేస్తున్న విషయం తెలిస్తే బాధపడుతాడు.

వాయిస్ : అనుకుని రోడ్డు మీదా శ్వేటర్స్ అమ్ముతున్న రమేశ్ అనే వ్యక్తి దగ్గరికి

            వస్తుంది.

రమేశ్ : చెప్పమ్మా..ఏమి కావాలి.

   కీర్తి : ఒక మంచి శ్వేటర్ కావాలి. నాకు తమ్ముడు ఉన్నాడు. ఇంటి దగ్గర  ఉన్నాడు.

          వాడికి సరిపోయేలా ఒక శ్వేటర్ ఇవ్వండి.

రమేశ్ : మంచిది అయితే అయిదొందలు. మాములుది అయితే మూడు వందలు.

    కీర్తి : మంచిదే ఇవ్వు. కానీ నా దగ్గర డబ్బుల్లేవు. కావాలంటే నీకు ఈ శ్వేటర్స్

           అమ్మి పెడతాను.

రమేశ్ : మంచిది నీకు కావాలంటే నువ్వు ఐదు శ్వేటర్స్ అమ్మాలి.

    కీర్తి : అమ్ముతాను. అమ్మిన తరువాత నా మంచి శ్వేటర్ ను తీసుకెళ్లిపోతాను.

వాయిస్ : అని కీర్తి శ్వేటర్స్ చేతుల మీదా వేసుకుని..అమ్మడం మొదలు పెడుతుంది.

            అటుగా వెళ్తున్నా బాలు కూడా, తన అక్కకు తెలియకుండా ఒక శ్వేటర్

            కొనివ్వాలని రమేశ్ దగ్గరికి వస్తాడు. మంచి శ్వేటర్ కావాలని, డబ్బులు

            లేవని..కావాలంటే శ్వేటర్స్ అమ్మి పెడతానని అంటాడు. అందుకు రమేశ్

            ఒప్పుకుంటాడు. దాంతో బాలు కూడా శ్వేటర్స్ అమ్మడం మొదలు పెడతాడు.

రమేశ్ : ఈ పిల్లలను చూస్తుంటే ఆక్కాతమ్ముళ్ళలాగా అనిపిస్తున్నారు. తమ్ముడికి

          తెలియకుండా నా దగ్గర శ్వేటర్స్ అమ్ముతు ఒక శ్వేటర్ తీసుకుంది. అక్కకు

          తెలియకుండా తమ్ముడు కూడా నా దగ్గర శ్వేటర్స్ అమ్ముతు ఒక శ్వేటర్

           తీసుకున్నాడు.

వాయిస్ : అనుకుని తన పని చేసుకుంటూ ఉన్నాడు రమేశ్. ఇంతలో రమేశ్ కు

            ఎడమ వైపుకు వెళ్ళిన కీర్తి శ్వేటర్స్ అమ్ముతు ఉంటుంది.

   కీర్తి : రావాలమ్మా రావాలి.. చలికాలం వచ్చేసింది. అందుకే శ్వేటర్స్ కు డిమాండ్

         ఉంది ఇప్పుడు ! మేము మా దగ్గర చాలా ధరలకే శ్వేటర్స్ అమ్ముతున్నాం.

         రండి బాబు రండి తల్లులు..!

వాయిస్ : అని అరుస్తూ తన దగ్గర ఉన్న శ్వేటర్స్ మొత్తం అమ్మేస్తుంది కీర్తి. రమేశ్

            దగ్గరికి వచ్చి అమ్మిన శ్వేటర్స్ యొక్క డబ్బులిచ్చి, థాంక్స్ చెప్పి తను

           సెలక్ట్ చేసుకున్న శ్వేటర్ తీసుకుని ఇంటికి వస్తుంది. తమ్ముడు బాలు కోసం

           ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలో తమ్ముడు బాలు, సంతోష పడుతూ అక్క

            కోసం తీసుకున్న శ్వేటర్ తీసుకుని ఇంటికి వస్తాడు. కీర్తి కూడా బాలు కోసం

            ఎదురు చూస్తుంది. ఇద్దరు కలిసుకుంటారు. కీర్తి తెచ్చిన శ్వేటర్ తమ్ముడు

             బాలుకు ఇస్తూ..

   కీర్తి : తమ్ముడు నువ్వు బాగా చలికి వణుకుతున్నావురా ! అందుకే నీకు శ్వేటర్  

          కొన్నాను.

బాలు : నాకు తెలుసక్కా! నువ్వు ఈ తమ్ముడి కోసం బాగా ఆలోచిస్తావని ! అందుకే

         ఇప్పుడు నేను నీ గురించి ఆలోచించి ఒక శ్వేటర్ తీసుకున్నాను.

వాయిస్ : అని అక్క కీర్తి తెచ్చిన శ్వేటర్ తమ్ముడు బాలుకు ఇస్తుంది. ఆ తరువాత

            బాలు తెచ్చిన శ్వేటర్ కీర్తికి ఇస్తాడు. ఇద్దరు శ్వేటర్స్ వేసుకుంటారు. ఒకరిని

            చూసి ఒకరు సంతోష పడుతూ ఉంటారు.

-0-

Add a Comment

Your email address will not be published. Required fields are marked *