పేద పిల్లల చేపల వేట 4 | Telugu Stories | Telugu Kathalu

గోవిందాపురం అనే గ్రామం నది ఒడ్డున ఉండేది, ఆ ఊరిలో చాలా మంది ప్రజలు చేపల వేట మీద ఆధారపడి జీవించేవారు, అలా చేపల వేట మీద ఆధారపడి జీవించేవారిలో రాజు కూడా ఒకడు, అతనికి ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉండేవారు, భార్య పేరు శ్యామల, కూతురు పేరు కీర్తి కొడుకు పేరు బాలు, రాజు రోజంతా ఎంతో కష్టపడి నదిలో చేపలు పట్టుకొస్తే శ్యామల వాటిని ఊరిలో అమ్ముతూ డబ్బులు సంపాదించేవారు, వాళ్ళు అలా రోజంతా ఎంతో కష్టపడినప్పటికీ కేవలం ఆ రోజు తినే అంత మాత్రమే సంపాదించగలిగేవారు, అలా ఉండగా ఒకరోజు శ్యామల రాజు దగ్గరికి వచ్చి

శ్యామల : ఏమండి మన పరిస్థితి ఏంటండీ ఎంత కష్టపడి సంపాదించినా కూడా కనీసం తినడానికి కూడా సంపాదించలేక పోతున్నాము, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, మన పరిస్థితి ఇలానే ఉంటె వాళ్ళని స్కూల్ కి పంపించాలన్నా వాళ్లకి ఇంకేదన్న అవసరాలు తీర్ర్చాలన్న ఎంతో కష్టం అవుతుంది, మనం అంటే ఎలాగూ ఈ పేదరికం లో కూరుకుపోయాము, వారసత్వనగా ఇవ్వడానికి పేదరికం వారసత్వ సంపదకాదు కదా అండి, ఎలాగోలా చేసి మనం బాగా డబ్బు సంపాదించి కనీసం పిల్లలని అయినా బాగా చూసుకోవాలి దానికి ఏమి చేయాలో ఆలోచించండి అంటుంది శ్యామల

రాజు : నేను ఆలోచించడం లేదు అనుకుంటున్నావా శ్యామల ఏను కూడా పిల్లల గురించి ఎంతో తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నాను, అందుకే ఎక్కువ చేపలు పట్టాలని పొద్దుననగా లేచి వెళ్తున్నాను కానీ నా దగ్గర కనీసం వాలా కూడా మంచిది లేదు, మిగతా వాళ్ళతో పోటీ పడలేక పోతున్నాను, వాళ్లకి చేపలు పట్టడం ఒక్కటే కాదు వేరే వ్యాపారాలు లేక వ్యవాసాయం ఉన్న వాళ్ళు అందరు, కాబట్టి వాళ్లకి ఈ చేపలు పాతడం మీద వచ్చిన డబ్బు మిగిలిపోతుంది కానీ మనం అలా కాదు కదా, చేపలు పట్ట్టడమే మన జీవనాధారం తప్పదు ఇంకా కష్టపడుతూనే ఉండాలి, పైగా నీటిలో ఉండడం వల్ల ఈ మధ్య నా ఆరోగ్యం కూడా సరిగా ఉండడం లేదు అని అంటాడు

శ్యామల : నాకు కూడా చేపలు అమ్మడానికి వెళ్ళినప్పుడు కళ్ళు తిరుగుతున్నాయండి, మీకు చెబితే మీరు కంగారు పెడతారేమో అని ఇన్ని రోజులుగా చెప్పడం లేదు, కానీ ఇప్పుడు చెప్పక తప్పడం లేదు, మనం మన ఆరోగ్యాన్ని ఇలాగే వదిలేస్తే మనకి ఏమైనా అయితే పిల్లల పరిస్థితి అయోమయం లో పడిపోతుంది. అని అంటుంది

రాజు : కానీ చేసేదేమి లేదు శ్యామల, పిల్లలు కడుపునిండా అన్నం తినడానికి మనం కడుపునిండా అన్నం తినక ఎన్ని రోజులు అవుతుంది, ఈ పరిస్థితులలో డాక్టర్ ని కలవడం అంటే అదొక ఖర్చు ఆ డబ్బులే ఉంటె కడుపునిండా అన్నమే తినేవాళ్ళం కదా, ఇప్ప్పటికీ అయితే ఇలా గడుస్తుంది కదా చూద్దాం ముందు ముందు ఏమి కానుందో అని అంటాడు రాజు ఎంతో నిరాశగా

అలా రోజులు గడుస్తూ ఉంటాయి, రోజు రోజుకు రాజు మరియు శ్యామల ల అనారోగ్యం క్షీణిస్తూ ఉంటుంది, కానీ వాళ్ళు ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా కష్టపడుతూనే ఉంటారు, కానీ ఆ కష్టాన్ని బాలు కీర్తిలకి తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు.

అలా ఒకరోజు రాజు చేపలు పట్టుకొని ఇంటికి వస్తాడు, ఎప్పటి లాగానే శయమాల ఆ చేపలను తీసుకెళ్లి ఊరిలో అమ్మడానికి వెళ్తు ఉండగా కీర్తి

కీర్తి : అమ్మ ఇంట్లో ఉంది ఉంది నాకు బోర్ కొడుతుంది నేను కూడా నీతో వస్తానమ్మా అని అంటుంది కీర్తి

శ్యామల : వద్దమ్మా నేను ఈ చేపలు అమ్మడానికి ఊరంతా తిరుగుతూ ఉంటాను, నువ్వు నాతో తిరగలేవు ఇంట్లోనే ఉండు అని అంటుంది కానీ కీర్తి ఆమాటలు పట్టించుకోకుండా శ్యామలకి కనిపించకుండా వెనుకనే వెళ్తుంది, ఇంతలో శ్యామల ఆరోగ్యం బాగోకపోవడం వల్ల కళ్ళు ఎండలో వెల్తూ ఉండడం వల్ల  కళ్ళు తిరిగి పడిపోతుంది అది చూసిన కీర్తి ఎంతో భయపడుతుంది, వెంటనే శ్యామల మొకం లమీద నీళ్లు చల్లి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తుంది, వెంటనే బాలు వెళ్లి డాక్టర్ని తీసుకొస్తాడు,

శ్యామలని పరిశీలించిన డాక్టర్ రాజుతో

డాక్టర్ : చూడు రాజు శ్యామల పరిస్థితి అస్సలు బాగోలేదు, సరైన ఆహారం తినకుండా ఎండలో పది తిరగడం వల్ల ఆమె ఒళ్ళు చాలా నీరసించిపోయింది,  ఆమె ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత మంచిది,  కాదని మొండిగా పనులు చేస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదం అని  చెప్తాడు

ఇంతలో బాలు డాక్టర్ దగ్గరికి వచ్చి

బాలు : డాక్టర్ అంకుల్, ఈ మధ్య మా నాన్న కూడా చాలా నీరసంగా ఉంటున్నాడు, సరిగా పని చేసే ఓపిక కూడా ఉండడం లేదు కానీ మా కోసం రోజు నదికి వెల్తూనే ఉన్నాడు అని చెప్తాడు డాక్టర్ కి

రాజు ని కూడా పరీక్షించిన డాక్టర్

డాక్టర్ : చూడు రాజు నువ్వు రోజు గంటల తరబడి నీటిలో ఉండడం వల్ల నీ ఊపిరితిత్హులకు నిమ్ము వచ్చింది, ఉబ్బసం ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది, ఇక నువ్వు నీటిలోకి వెళ్ళకూడదు నువ్వు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటె అంత మంచిది అని అంటాడు డాక్టర్

రాజు : అలా అనకండి డాక్టర్ నేను చేపలు పట్టడానికి వెళ్లకుంటే పిల్లలను ఎవరు చూసుకుంటారు ఇల్లు ఎలా గడుస్తుంది అని అంటాడు

ఇంతలో బాలు కీర్తి అక్కడికి వస్తారు

కీర్తి : నాన్న ఇన్నిరోజులు మీరు మా కోసం కష్టపడింది చాలు, మీ ఆరోగ్యం మెరుగు పడే వరకు మేము కష్టపడతాము, తమ్ముడు నేను చేపలు పట్టడానికి వెళ్లి డబ్బులు సంపాదిస్తాము, మీరు ఏమి మాట్లాడకుండా విశ్రాంతి తీసుకోండి అని అంటుంది కీర్తి

బాలు : అవును నాన్న అక్క చెప్పినట్టు ఇక నుంచి కొత్త కొత్త పద్దతులలో మేము చేపలు పట్టి ఎక్కువ డబ్బులు సంపాదిస్తాము అని అంటాడు

అలా అన్న తరువాత బాలు కీర్తి వీడియోలు చూస్తూ, పెద్ద పెద్ద వాళ్ళని కలిసి చేపలు పట్టడం లో కొత్త పద్ధతులు నేర్చుకుంటారు,

అలా నేర్చుకొని నదిలో చేపలు పట్టడానికి వెళ్తారు

అలా వాళ్ళు నేర్చుకున్న ఒక పద్ధతి ప్రకారంగా ఒక చికెన్ దుకాణానికి వెళ్లి కొంత చికెన్ కొనుక్కొని వెళ్తారు

ఒక పెద్ద గిన్నెలో చికెన్ వేసి నీటిలో కొంత లోతుకు దిగి గిన్నెని నీటిలో ఉంచుతారు అలా ఉంచి కొంత సేపు చూడగానే

పెద్ద పెద్ద చేపలు చికెన్ దగ్గరికి వచ్చి గిన్నెలో పడిపోతూ ఉంటాయి ఇలా చేస్తూ కొత్త పద్ధతి లో చేపలు పడుతూ ఉంటారు బాలు కీర్తి అలా అని పెద్ద పెద్ద చేపలు అవ్వడం వల్ల అవ్వి ఎక్కువ డబ్బులకి అమ్ముడుపోతూ ఉంటాయి, అలా బాలు కీర్త్తి కొద్దీ రోజుల్లోనే కొత్త పద్దతుల ద్వారా చాలా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు, అది చూసిన శ్యామల రాజు కూడా ఎంతో సంతోషిస్తారు అలా వచ్చిన డబ్బుతో శ్యామల మరియు రాజు ని ఆసుపత్రిలో చూపిస్తారు బాలు కీర్తి, అలా కొని రోజులు గడిచిన తరువాత రాజు పిల్లల దగ్గరికి వచ్చి

రాజు : బాలు, కీర్తి పిల్లల కోసం కష్టపడే తల్లిదండ్రులు ఉంటారు కానీ తల్లి దండ్రుల కోసం కోసం కష్టపడే పిల్లలని మిమ్మల్నే చూస్తున్నాను, ఇక మా కోసం మీరు కష్టపడింది చాలు, ఇప్పుడు మా ఆరోగ్యం కూడా కుదుటపడింది ఇక మీరు స్కూల్కి బెల్లి మంచిగా చదువుకోండి, మేము మీరు ఉపయోగించిన కొత్త పద్దతులలో చేపలు పట్టి ఎక్కువ డబ్బులు సంపాదిస్తాము అని అంటాడు, అప్పటినుండి అందరు ఎంతో సంతషంగా ఉంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *