పేద పిల్లల చేపల వేట | Telugu Stories | Telugu Kathalu

కృష్ణాపురం గ్రామానికి పెద్ద వరదలు రావడంతో అక్కడ వాళ్ళు నీళ్ళల్లో కొట్టుకు పోయి చెల్లాచెదురై పోతారు. అలా తల్లిదండ్రుల నుండి విడిపోయిన పిల్లలు కీర్తి బాలు. వాళ్ళిద్దరూ అక్క తమ్ములు. ప్రాణాలతో బయట పడ్డారు కానీ ఎక్కడికి వెళ్లాలో తెలీదు. వాళ్లు రామాపురం అనే గ్రామానికి చేరుకుంటారు. కొత్త ప్రదేశం ఎవరు కూడా తెలిసిన వాళ్ళు లేరు. ఒకపక్క ఆకలి మండిపోతుంది. ఏం చేయాలో తెలియక ఒకచోట కూర్చొని ఏడవడం మొదలుపెట్టారు….. అమ్మ నాన్న మీరు ఎప్పుడూ మా దగ్గరికి వస్తారు. అంటూ ఏడుస్తూ ఉంటారు బాలు….. అక్క అమ్మ నాన్న బ్రతికే ఉన్నరా. అంటూ జాలిగా అడుగుతాడు. అందుకు కీర్తి….. బాలు నువ్వేం బాధపడకు రా అమ్మ నాన్న కచ్చితంగా మళ్లీ మన దగ్గరికి వస్తారు.
అని ధైర్యం చెబుతుంది కానీ మనసులో మాత్రం ఆమెకు కూడా భయంగానే ఉంటుంది.
ఇక వాళ్లు అక్కడే చెట్టు దగ్గరే పడుకొని ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు వాళ్లు బిచ్చగాళ్లు అనుకొని డబ్బులు వేస్తూ మిగిలిపోయిన ఆహారం తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చి వెళ్తారు పిల్లలు ఇద్దరు కూడా ఆకలితో ఉండడంతో వాటిని తింటారు.
అలా రోజులు గడుస్తున్నాయి పిల్లలు ఇద్దరు కూడా ఇద్దరు బిచ్చగాళ్ళు అనుకొని . చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళకి అలా దానం చేస్తూ ఉంటారు కానీ వాళ్లకు అది ఏ మాత్రం నచ్చదు . ఇద్దరు కూడా ఏడుస్తూ…… అయ్యో అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు మీరు.
మమ్మల్ని అందరూ బిచ్చగాళ్లు లాగ చూస్తున్నారు. ఆకలికి తట్టుకోలేక మేము కూడా వాటిని తింటున్నాను మీరు త్వరగా వచ్చి మమ్మల్ని తీసుకు వెళ్ళండి అంటూ
బాధపడతాడు రోజులు గడిచాయి. ఒకరోజు ఇద్దరూ కూడా అక్కడే ఉన్న నది దగ్గరకు వెళ్తారు. చేపలు పట్టే వాళ్ళని చూస్తూ. ఉంటారు. ఇంట్లో చేపలు పట్టే ఒక వ్యక్తి
చేపలతో పాటు వలలో పడిన రెండు శవాలని తీసుకొని వస్తాడు.
ఒడ్డున ఉన్న వాళ్ళందరూ గుమ్మి కూడతారు.
వాళ్ల శవలని చూసి……. అయ్యో పాపం ఎవరు వీళ్ళు . మొన్న వరదలు వచ్చాయి కదా కృష్ణాపురం గ్రామంలో వాళ్ళు అనుకుంటా. అని చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఆ గుమ్మీ నీ చూసిన పిల్లలు ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు.
చనిపోయిన వాళ్ళు ఎవరో కాదు వాళ్ల తల్లిదండ్రులు. పిల్లలిద్దరూ వాళ్ళని చూసి పెద్దగా ఏడవడం మొదలు పెడతారు….. అమ్మానాన్న ఇన్ని రోజులు మీరు వస్తారు అని నేను ఎదురు చూశాము. కానీ మీరు ఇలా సవాలుగా మా దగ్గరికి వస్తారు అని అనుకోలేదు. అమ్మలే అమ్మా . అమ్మ నాన్న లే. లేవండి అంటూ ఇద్దరిలో చనిపోయిన ఆ తల్లిదండ్రుల శవాలపై పడి పెద్దగా ఏడుస్తూ ఉంటారు. అక్కడే ఉండు చూస్తున్నా శాంతమ్మ అనే చేపల వ్యాపారి. ఆ పిల్లలపై జాలుపడి……ఊరుకోండి పిల్లలు ఊరుకోండి.
అంటూ వాలను దగ్గర చేస్తుంది తర్వాత జరగాల్సిన కార్యక్రమం వాళ్ళ జరిపిస్తారు.
ఆ రోజు రాత్రి సమయం శాంతమ్మ పిల్లలిద్దర్నీ ఇంటికి తీసుకు వెళ్తుంది అక్కడ వాళ్ళకి భోజనం అందిస్తుంది.
కీర్తి బాల ఇద్దరూ కూడా…… మాకు భోజనం వద్దమ్మా. మేము ఇన్ని రోజులు అనాధలుగా బతికాము. దొరికింది తిన్నాము అదంతా కేవలం అమ్మ నాన్న వచ్చేంత వరకు నేను బ్రతికి ఉండాలి అని. ఇప్పుడు వాళ్లే లేనప్పుడు మేము ఎవరి కోసం బతకాలి.
అంటూ మారాం చేస్తారు.
శాంతమ్మ….. చూడండి పిల్లలు అలా అనుకుంటే నేను కూడా ఎప్పుడో చచ్చిపోవాలి. కానీ చనిపోయిన వాళ్ళ తో పాటు మనం కూడా వెళ్ళలేము కదా. కష్టమో నష్టమో బతుకు బండిని ఈడవాలి.
అని అంటుంది ఆ మాట వినగానే కీర్తి బాలు ఇద్దరు కూడా….. అంటే నీకు అమ్మ నాన్న లేరా. అందుకామె లేరు అని సమాధానం చెబుతుంది.మి అమ్మ నాన్న కూడా వరదలో చనిపోయారా. అందుకు ఆమె….. లేదు మా నాన్న చేపల వ్యాపారి. వేటకు వెళ్లి సుడిగుండంలో పడి చనిపోయాడు . ఆ బాధతోనే మా అమ్మ చనిపోయింది. ఒంటరి బ్రతుకు నాది. చేపల వ్యాపారం చేసుకుని
బతుకుని ముందుకు సాగించాము. అప్పుడే మా మామ అంటే పొద్దున వలలో మీ అమ్మానాన్న శవాలన్ని బయటకు తీశాడు కదా . ఆయనే మా ఆయన. నాలాగే అనాధ
తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు నా కడుపులో బిడ్డ పెడుతున్నాడు. నేను కూడా అప్పుడే అమ్మ నాన్న కోసం చనిపోతే ఇంత జీవితాన్ని గడిపే దాన్న. చెప్పండి ఇది రంగుల ప్రపంచం. భగవంతుడు మనల్ని
ఎంతకాలం భూమిపై ఉంచాలో రాసి పడతాడు. ఆ తర్వాత మనం కూడా ఆయన దగ్గరికి వెళ్లి పోతాము. మీ అమ్మను కూడా అక్కడే ఉన్నారు అని ధైర్యం చెబుతుంది.
అందుకు వాళ్లు కన్నీళ్లు తుడుచుకొని. భోజనం చేస్తారు. రోజులు గడిచాయి ఆ పిల్లలిద్దరూ కూడా శాంతము తోపాటు నదిలోకి వెళ్ళే చేపలు పట్టి.
ఆ చేపల్ని అమ్మడం మొదలు పెడతారు.
రోజు చేపలు అమ్ముతూ డబ్బు సంపాదిస్తారు.
శాంతమ్మ కంటే ఎక్కువగా డబ్బులు ఆ పిల్లలు ఇద్దరు సంపాదిస్తారు.
శాంతమ్మ….. పిల్లలు మీరు చేపల వ్యాపారం ఎలాగా చేస్తున్నారో అర్థం కావడం లేదు. నాకంటే ఎక్కువ డబ్బులు ఎలా సంపాదిస్తున్నాయి.
పిల్లలిద్దరూ…. ఫ్లాష్బ్యాక్ చెప్తాము విను శాంతమ్మ.
వాళ్లు….. రావాలి బాబు రావాలి తాజా తాజా చేపలు ఒకటి కొంటే ఒకటి ఉచితం. చేప కేవలం 200 రూపాయలు. రావాలి బాబు రావాలి ఆలోచించిన ఆశాభంగం.
అంటూ పిలుస్తూ కేకలు వేస్తూ అమ్మతో ఉన్నాము.
ఒకటి కొంటే ఒకటి ఉచిత అనడంతో ఎంతోమంది అక్కడకు వచ్చి వాటిని తీసుకెళ్తూ ఉన్నారు.
అందుకు శాంతం మా పెద్దగా నవ్వుతూ….హా హా హా మీరు నిజంగా మామూలోళ్లు కాదు .
జత చేపలు 150 రూపాయలు.
మీరు ఒకటి కొంటే ఒకటి ఉచితం అని చెప్పి రెండు వందల రూపాయలకు అమ్మేస్తున్నారు.
చాలా తెలివైన వాళ్ళు. అని వాళ్లని మెచ్చుకుంది. . ఇక పిల్లలు పెద్దగా నవ్వుతారు
పిల్లలు ఇద్దరు కూడా అక్కడ చేపల వ్యాపారం చేసుకుంటూ. వచ్చిన డబ్బు నిశాంత్ అమ్మకు ఇస్తూ ఉంటారు. శాంతమ్మ వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టకుండా వాళ్ళ కోసమే ఒక చోట దాచి పెడుతూ. ఆ పిల్లలు ఇద్దరి సొంత బిడ్డల్లా చూసుకుంటూ ఉంటుంది.
అలా రోజులు గడిచాయి .
కీర్తి బాల ఇద్దరు కూడా చేపల వ్యాపారం కి వెళ్లి చేపల అనుకుంటూ….. రావాలి బాబు రావాలి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. రావాలి బాబు రావాలి ధర తక్కువ రుచి ఎక్కువ.
అంటూ వాళ్ళ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. శాంతమ్మ గర్భవతి కావడంతో ఆమె చేపల వ్యాపారానికి వెళ్లదు.
ఇంట్లోనే ఉంటుంది పిల్లలు సంపాదించింది ఆమె ఏమాత్రం ఖర్చు పెట్టేది కాదు. వాళ్ల బంగారు భవిష్యత్తు మంచి బాట వేయాలని నిర్ణయించుకొని దాచి పెడుతూ ఉంటుంది.
రోజులు గడిచాయి ఆమె ఒక రోజు రాత్రి ప్రసావ వేదన పడుతూ ఉంటుంది.
కీర్తి బాలు ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు ఆ సమయంలో శాంతమ్మ భర్త కూడా ఇంట్లో లేకపోవడం మరింత ఆందోళనగా ఉంటుంది.
వాళ్లు అంబులెన్స్ కి ఫోన్ చేసి ఆమెను హాస్పిటల్కి చేరుస్తారు.
డాక్టర్…. పిల్లలు మీ అమ్మగారు అయినా మా అమ్మకు ఆపరేషన్ చాలా అర్జెంట్ గా చేయాలి. డబ్బులు కట్టేయండి.
త్వరగా ఆలస్యం చేయకండి మీరు ఆపరేషన్ మొదలుపెడతాం లేదంటే తల్లి బిడ్డ ఇద్దరి కి ప్రమాదం.
అని చెబుతుంది అందుకు పిల్లలు ఇద్దరు కంగారు పడిపోతుంటారు. కీర్తి…. బాలు నువ్వు అక్కడే ఉండు శాంతమ్మ మనకోసం దాచిపెట్టడం డబ్బు ఉంది కదా అవి తీసుకొని వస్తాను . జాగ్రత్త అని చెప్పి ఆమె ఇంటికి వెళ్తుంది. వాళ్ళు కష్టపడి సంపాదించిన
డబ్బు మొత్తం తీసుకొచ్చి హాస్పిటల్లో కడతారు.
ఆమెకు ఆపరేషన్ మొదలవుతుంది .
కొన్ని గంటల తర్వాత ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. డాక్టర్ దగ్గరికి వచ్చి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమమని చెప్తారు. రెండు రోజుల తర్వాత పిల్లలిద్దరూ శాంతమ్మ దగ్గరకు వెళ్తారు. ఇంతలో డాక్టర్ కూడా శాంతమ్మ దగ్గరకు వెళ్లి……. ఈ పిల్లలు సమయానికి బలే డబ్బు తీసుకువచ్చారు. లేకపోతే మీకు చాలా ప్రమాదం జరిగేది అని చెబుతుంది.
శాంతమ్మ….. పిల్లలు మీకు డబ్బులు ఎక్కడివి.
కీర్తి బాలు…. మేము సంపాదించిన డబ్బులు దాచి పెట్టావి కదా అవి తీసుకొచ్చాము.
అని చెప్తారు అందుకు ఆమె ఏడుస్తూ….. ఎంత పని చేశారు నేను ఆ డబ్బుతో మిమ్మల్ని బాగా చదివించాలి అని అనుకున్నాను. నా కోసం మీరు ఎంత త్యాగం చేస్తారు అని అసలు అనుకోలేదు అంటూ బాధ పడుతుంది.
కీర్తి బాలు….. శాంతమ్మ మా చదువు కంటే నీ ప్రాణం ముఖ్యం. నువ్వు లేకపోతే మేము ఎప్పుడో చనిపోయే వాళ్ళం. అందుకే నిన్ను కాపాడుకోవాలని ఇలా చేసాము.
శాంతమ్మ బాధపడుతూ…… ఇంత మంచి మంచి దేవుడు మీకు ఇచ్చాడు మీరు నా కడుపులో ఎందుకు పుట్టలేదని బాధ పడుతున్నాను. ఈరోజు చెబుతున్నాను నా బిడ్డ తో పాటే మీరు కూడా నా సొంత బిడ్డలు. నేను నా భర్త కష్టపడి ముగ్గురిని చదివిస్తాము.
మీరు బాగా చదివి మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలి. అని అంటుంది అందుకు వాళ్లు సారి అంటారు కొన్ని నెలల తర్వాత.
కీర్తి బాలు బడికి వెళుతూ ఉంటారు.
శాంతమ్మ భర్త చేపల వేటకు వెళ్తాడు శాంతమ్మ ఇంటి దగ్గరే చేపల వ్యాపారం చేసుకుంటూ పసిబిడ్డను చూసుకుంటూ ఉంటుంది.వల్ల జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు చక్కగా సాగిపోతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *