పేద పిల్లల టైరులో మనీ | Telugu Stories | Telugu Fairy Tales | Story World Telugu

వాయిస్ : భూషణ్ అనే వ్యక్తీ తన కారును డ్రైవింగ్ చేసుకుంటూ రోడ్డు మీద అలా

ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడు తనలో తను..

భూషణ్ : ఈ పోలీసులకు ఎక్కడ పని లేదు. ఒక కన్ను ఎప్పుడు చూడు నా మీదా వేసే ఉంచుతారు. ఇప్పుడు నేను నా హవాలా మనీ బిజినెస్ ను ఎలా చేసుకోవాలి? నేను బతకాలి కదా.. నాకు భార్య, పిల్లలు అనే భాద్యతలు ఉంటాయి కదా! వాటికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి కదా! ఇప్పటికి ఎన్నో ఊర్లు తిరిగాను. ఇంకా తిరుగుతూనే ఉన్నాను. ఇప్పుడు నేను నా హవాలా మనీ వ్యాపారాన్ని పోలీసుల కళ్ళు కప్పి ఎలా చేసుకోవాలి?

వాయిస్ : అని మాట్లాడుకుంటూ అలా ముందుకు కారును డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటాడు. అలా కొద్ది దూరం వెళ్ళిన తరువాత, టప్ మని ఏదో పేలిన సౌండ్ వస్తుంది. కారు అదుపు అప్పి ఒక పక్కన ఆగిపోతుంది.

భూషణ్ : టైరు పెలినట్టుంది. ఇప్పుడు మనసులో అనుకున్నాను. ఏ అడ్డు లేకుండా కారు ముందుకు వెళ్తున్నట్టుగా నా హవాలా మనీ బిజినెస్ కూడా సాగితే ఎంత బాగుండును అని. ఇంతలోనే ఈ కారు ఇలా ఆగిపోయింది.

వాయిస్ : అనుకుంటూ కారు దిగుతాడు భూషణ్. నాలుగు టైర్లను చెక్ చేస్తాడు. ఒక టైరు పేలిపోయి కనిపిస్తుంది.

భూషణ్ : షిట్..ఇప్పుడు నా దగ్గర స్టేప్నీ కుడా లేదు. ఇదేదో ఊరులా ఉంది. ఇక్కడ పంచర్ షాపు ఎక్కడ ఉందో తెలుసుకుంటే సరిపోతుంది. కారు ఊరిలో ఆగి నాకు చాల పెద్ద ఉపాకారం చేసింది. ఏదైనా అడవిలో కానీ, రోడ్డు మీదా కానీ ఆగిపోటి ఉంటె న పరిస్థితి ఏమిటి ? గోవిందా…గోవింద!

వాయిస్ : అలా పంచర్ షాపును చూసుకుంటూ ముందుకు నడుచుచుకుంటూ వెళ్తుంటాడు. అలా వెళ్ళిన అతనికి కొద్ది దూరంలో చెప్పులు కుడుతున్న కీర్తి, బాలు అనే పేద పిల్లలు కనబడుతారు. వాళ్ళ దగ్గర రెండు పాత టైర్లు కూడా ఉంటాయి. వాటిని చూసి..

భూషణ్ : ఈ పిల్లలు పంచర్ కుడా వేస్తారేమో అడగాలి.

వాయిస్ ; అనుకుంటూ వాళ్ళ దగ్గరికి నడుస్తుంటాడు. చెప్పుల షాపు దగ్గర…   

కీర్తి : తమ్ముడు..ఈ రోజు ఇంత వరకు ఒకరు కూడా రాలేదు. ఏమిచేద్దాంరా !

బాలు : వచ్చేంత వరకు ఎదురు చూద్దాం! ఇది కూడా తెలియదు నీకు..ఎలా బతుకుతావో ఏమో !

కీర్తి : నీలాంటి తెలివైన తమ్ముడు నాకు తోడూ నీడగా ఉండగా నేను సంతోషంగానే బతుకుతాను తమ్ముడు.

బాలు : సరే సరే..ఇప్పటికైనా నీకు అర్థమయిందా…మన ఇద్దరిలో నేనే తెలివైన వాడినని !

కీర్తి : అదే తెలివితో మన చెప్పుల వ్యాపారం బాగా సాగేతట్టుగా ఏదైనా చేయొచ్చు కదరా తమ్ముడు !

బాలు : ఏం చేయమంటావు ? రాత్రి పూట దొంగలా అందరి ఇంటికి వెళ్లి అందరి చెప్పులను కట్ చేసి రానా! అప్పుడు అందరు నా చెప్పుల షాపు ముందు లైన్ కడతారు.

కీర్తి : తమ్ముడు ఈ ఆలోచన ఏదో బాగుందిరా! ఇలా చేద్దాం. అప్పుడు మనకు డబ్బులే డబ్బులు..

బాలు : అవును..ఎవరికైనా దొరికితే దెబ్బలే దెబ్బలు..

వాయిస్ : అని కీర్తి, బాలు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి భూషణ్ వస్తాడు. టైరు పంచర్ షాపు గురించి అడుగుతాడు. పక్కనే సూరయ్య పంచర్ షాపు ఉందని చెప్తారు.

భూషణ్ ; మరి మీ దగ్గర టైర్స్ ఉన్నాయి కదా!

కీర్తి : వీటిని చీల్చి అడిగిన వాళ్ళ కోసం చెప్పులు కుడతాం!

వాయిస్ : అని చెప్పగానే భూషణ్ కు టైరు మధ్య హవాలా డబ్బులు పెట్టి సరాఫరా చేయొచ్చనే ఆలోచన వస్తుంది. మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి సూరయ్య దగ్గరికి వెళ్తాడు. సూరయ్య పనిలేక ఏమిలేక ఈగలను తోలుకుంటూ, దోమలను చంపుకుంటూ ఉంటాడు. భూషణ్ వెళ్లి జరిగింది చెప్తాడు. వెంటనే సంతోషంగా చేతి నిండా పని దొరికిందని సంబర పడుతూ, పంచర్ కు సంబంధించిన పెట్టెను తీసుకుని అక్కడి నుంచి భూషణ్ తో బయలు దేరుతాడు. కారు దగ్గరికి వస్తాడు. పంచర్ వేస్తాడు. పెద్ద నోట్ ఇస్తాడు. చిల్లర లేదని చెప్తాడు సూరయ్య. 

భూషణ్ : ఏంటి..రెండు వందలకు కూడా చిల్లర లేదా! అలాంటప్పుడు నువ్వు ఇక్కడ ఎలా బతుకుతున్నవయ్యా!

సూరయ్య : ఏదో ఆ దేవుడు ఇచ్చినంతలో ఇలా నేట్టుకోస్తున్నాను బాబు. మీకు తెలిసిన పని ఏదైనా ఉంటె చెప్పండి బాబు చేస్తాను.

భూషణ్ ; నాకు పెద్ద టైర్ల కంపనీ ఉంది. ఆ టైర్లను తీసుకొచ్చి నీ దగ్గర పెడతాను. ఈ చుట్టూ పక్కల వాళ్ళు టైర్లు కావాలని నాకు ఫోన్లు చేస్తారు. నేను నీ దగ్గరికి పంపిస్తాను. నువ్వు వాళ్లకు టైర్లు ఇచ్చి, వాళ్ళ దగ్గరి నుంచి డబ్బులు తీసుకుని జాగ్రత్తగా పెట్టుకోవాలి. నేను రాగానే నాకిస్తే చాలు. నువ్వు ఈ పని చేసినందుకు నీకు చాలా డబ్బులు వస్తాయి. నువ్వు బాగు పడతావు.

వాయిస్ : అంటూ తన చేతిలో ఉన్న డబ్బుల కట్టాను చూపిస్తూ ఉంటాడు. ఆ డబ్బుల కట్టాను చూడగానే సూరయ్యలోని డబ్బాశ బయటపడింది. ఆ డబ్బుల  కట్టాను తీసుకుంటాడు. మరింకా ఆలస్యం చేయకుండా భూషణ్, తనకొచ్చిన ఆలోచనను అమలు చేస్తాడు. ఒక పాత టైర్ల షాపు తెరుస్తాడు. అక్కడ టైర్లను కట్ చేసి, వాటిలో డబ్బులు పెడుతూ, తిరిగి ట్యూబ్ ను పెట్టి గాలి కొడుతూ ఉంటాడు. రెండు రోజుల తరువాత ఒక ఆటో ట్రక్ నిండా టైర్లను తీసుకొచ్చి సూరయ్య షాపు దగ్గర పెడతాడు. ఒక ఫోన్ కొనిస్తాడు. తిరిగి మళ్ళీ డబ్బులు ఇస్తాడు భూషణ్. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. రోజు భూషణ్ ఫోన్ చేసి చెప్పడం.. ఎవరో ఒకరు వచ్చి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి టైర్లను తీసుకుని వెళ్ళడం చేస్తుంటారు. దాంతో కొన్ని రోజుల్లోనే సూరయ్య, మంచి ఇల్లు కట్టుకుంటాడు. టూ వీలర్ కొనుకుంటాడు.

వాయిస్ : ఒక రోజున చెప్పులు కుట్టడానికి పాత టైరు కావాలని సూరయ్య దగ్గరికి వస్తుంది కీర్తి. సూరయ్య డబ్బులు లెక్క పెట్టుకుంటూ, అక్కడున్న వాటిలో ఏదైనా ఒకటి తీసుకెళ్ళమని చెప్తాడు. కీర్తి ఒక టైరు తీసుకుని తన చెప్పులు కుట్టే షాపు దగ్గరికి వస్తుంది. అప్పుడే అక్కడికి మప్టిలో ఉన్న ఇన్స్పెక్టర్ విక్రమ్, ఒక ఫోటో పట్టుకుని వాళ్ళ దగ్గరికి వస్తాడు. తన దగ్గర భూషణ్ ఫోటోను బాలుకు చూపిస్తూ అతని గురించి అడుగుతాడు. బాలు ఏదో చెప్తుంటాడు. చెప్పుల కోసం కీర్తి టైరును కట్ చేస్తుండగా అందులో నుంచి డబ్బులు బయటికి వస్తాయి. వాటిని చూసి అక్కడ ఉన్న బాలు, కీర్తి, ఇన్స్పెక్టర్ విక్రం షాక్ అవుతారు.

విక్రం : కీర్తి, నీకు ఈ టైరు ఎవరించారు ?

కీర్తి : సూరయ్య షాపు దగ్గర తీసుకొచ్చాను సార్ !

వాయిస్ : వెంటనే విక్రం, ఫోన్ చేసి వివరాలు చెప్తాడు. కానిస్టేబుల్ మల్లేష్, పోలీస్   జీపు తీసుకుని విక్రం దగ్గరికి వస్తాడు. ఇద్దరు జీపులో వెళ్లి సూరయ్యను పట్టుకుంటారు. అతనితో ఫోన్ మాట్లాడించి భూషణ్ ను అక్కడికి రప్పిస్తాడు. భూషణ్ రాగానే భూషణ్, సూరయ్యను అరెస్ట్ చేస్తాడు. భూషణ్ మీద ప్రకటించిన డబ్బును కీర్తికి, బాలుకు అందజేస్తాడు విక్రం.. దాంతో కీర్తి, బాలు సంతోషంగా జీవిస్తూ ఉంటారు.

-౦-

ఒకానొక ఊరిలో కీర్తి, బాలు అనే పేద పిల్లలు ఉండేవాళ్ళు. చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. భూషణ్ అనే హవాలా మనీ దొంగ, పోలీసులకు దొరక్కుండా సూరయ్య అనే టైరు పంచర్ షాపు అతనితో కలిసి, టైరులలో హవాలా మనీ పెట్టి సప్లయ్ చేస్తుంటాడు. అప్పటికే ఇన్స్పెక్టర్ విక్రం, మప్టిలో భూషణ్ ఫోటో పట్టుకుని వెతుకుతూ ఉంటాడు. ఒక రోజున చెప్పులు కుట్టడానికి పాత టైరు కావాలని సూరయ్య షాపు నుంచి తీసుకుని తన చెప్పులు కుట్టే షాపు దగ్గరికి వస్తుంది. అప్పటికే ఇన్స్పెక్టర్ విక్రం, బాలు భూషణ్ ఫోటో చూపిస్తూ వివరాలు అడుగుతుంటాడు. కీర్తి టైరు కట్ చేయడంతో అందులో నుంచి డబ్బులు బయటికి వస్తాయి. దాంతో కీర్తి, బాలు ఇద్దరు కలిసి సూరయ్య, భూషణ్ ను పట్టిస్తారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో కీర్తి, బాలు సంతోషంగా జీవిస్తూ ఉంటారు.

-౦-

Add a Comment

Your email address will not be published. Required fields are marked *