పేద పిల్లల పెట్రోల్ దొంగ టీచర్ | Telugu Stories | Telugu Kathalu | Banana Dreams TV Telugu

వాయిస్ : అది కేశవ పూర్ విలేజి. ఊరి ప్రజలందరూ కలిసి ఆ ఊరి సర్పంచ్ గోపయ్య

            ఇంటి దగ్గర ఉన్నారు. అప్పుడే వాళ్ళ దగ్గరికి ఇంట్లో నుంచి గోపయ్య వస్తాడు.

గోపయ్య : ఏంట్రోయి.. ఊరంతా కలిసి కట్టుగా నా ఇంటి మీదికి దండయాత్రకు వచ్చారు.

వాయిస్ : ఆ ఊరి ప్రజలలో ఉన్న ఒక పెద్ద మనిషి…

పెద్ద మనిషి : దండయాత్ర కాదు.. దౌర్జన్యం కాదు సర్పంచ్ గారు. మన ఊరిలో

                జరుగుతున్న పెట్రోల్ దొంగతనం గురించి మీకు తెలిసే ఉంటుంది.

గోపయ్య : అవునవును.. ఈ మధ్య కాలంలో ఈ పెట్రోల్ దొంగతనం గురించి బాగా

             మాట్లాడుకుంటున్నారు.

పెద్ద మనిషి : ఇళ్లల్లో బైకులు పెట్టుకున్న, ఇంటి ముందు ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు

                పెట్టుకున్న.. ఎందులోనూ పెట్రోల్ ఉండటం లేదండీ. అంతా ఉదయానికి

               ఖాళీ అవుతుంది. అది ఎలా అన్నది అర్థం కావడం లేదు.

గోపయ్య : ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది చెప్పండి.. మనలో మనకు బాగా

             తెలిసిన వాళ్ళు చేస్తున్న పని ఇది. వాళ్ళు ఎవరో వాళ్ళకు వాళ్ళుగా

             బయటకు వస్తే బాగుంటుంది. శిక్ష కొంచెం తగ్గుతుంది. కాదని మొండిచేసి

             అలా ఉండిపోతే.. నేను పట్టుకున్నప్పుడు దాని ఫలితం మరింత ఘోరంగా

              ఉంటుంది.

పెద్ద మనిషి : అవునవును.. మన ఊరి సర్పంచ్ గోపయ్య..ఇప్పుడు మనిషి. అదే

              కోపంగా ఉన్నప్పుడూ జంతువు. ఆ జంతువు కరిచే కుక్క కావొచ్చు.

             మాటువేసి పీక్కుతినే నక్క కావొచ్చు..దొంగ చాటున దెబ్బ తీసే పులి

                కావొచ్చు. దొరలా మీదపడి ప్రాణాలు తీసే సింహం కావొచ్చు.

మరొక వ్యక్తి : అంటే నీ ఉద్దేశం ఏమిటి? మన సర్పంచ్ గారు..కుక్క, నక్క, పులి,

                సింహానా! ఇందుకు నేను ఒప్పుకొను. కుక్కలా మొరగడం చూశాను.

                నక్కల జిత్తులు చూశాను. కానీ పులి, సింహంలా చూడలేదు. కానీ

                చూడాలని ఉంది.

గోపయ్య : నీకో దండంరా బాబు..నువ్వాగక్కడ.. ! మీలో ఇది చేస్తున్నది ఎవరనే

             అనుమానం ఉందా!

జానకమ్మ : అది నిజమో కాదో నాకు తెలియడండి. నా  అనుమానం మాత్రమే ! మన

               ఊరిలో ఉన్నారు కదా పేద పిల్లలు కీర్తి, బాలు ! వాళ్ళేనని నా

               అనుమానం.

గోపయ్య : ఎందుకలా అనిపిస్తుంది నీకు.

జానకమ్మ : ఎందుకంటే..ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలు కదా అని మనం ఏ పని

               చెప్పడం లేదు. అలాగని అడుక్కోవడానికి వచ్చినప్పుడు కూడా అన్నం

               పెట్టడం లేదు. దాంతో చేయనికి పని లేదు. తినడానికి తిండిలేదు.

               అప్పుడు ఆ పేద పిల్లలు కూడా బతకాలి కదా ! మరి వాళ్ళు ఈ పని

               ఎంచుకుని చేస్తున్నారేమోనని నా అనుమానం మాత్రమే.. నేను పదే పదే

               చెబుతున్నాను..ఇది నా అనుమానం మాత్రమే ! దయచేసి ఆ పేద

               పిల్లలంటే ప్రేమున్న వాళ్ళు తప్పుగా తీసుకోవద్దు. నాకు ఆ పేద పిల్లలంటే

               ఇష్టం కూడా !

పెద్ద మనిషి : జానకమ్మ చెప్పింది కూడా నిజమానిపించేలా ఉంది. ఎప్పుడు జరగని ఈ

               దొంగతనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతుంది. అది కూడా పేద

               పిల్లలకు పని ఇవ్వమని అనుకున్న రోజు నుంచి. అందుకనే వాళ్ళను

               పిలిపించి అడగండి. అందరి అనుమానం తీరిపోతుంది.

వాయిస్ : ఊరి వాళ్ళు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పారు. అందరి అనుమానం

            ఖచ్చితంగా పేద పిల్లలైన కీర్తి, బాలు పైనే ఉంది. కానీ దొంగలిచ్చిన పెట్రోల్

            మొత్తం ఎక్కడ పెడుతున్నారు. ఎలా దాస్తున్నారు. ఎవరికి

            అమ్ముతున్నారు. ఎలా అమ్ముతున్నారో అనే విషయంపై ఎవరికి ఒక

            విధమైన క్లారిటీ లేదు. సర్పంచ్ పేద పిల్లలను పిలుచుకురమ్మని పెద్ద

            మనిషికి చెప్తాడు. ఆ పెద్ద మనిషి అక్కడి నుంచి పేద పిల్లల దగ్గరికి

             బయలుదేరుతాడు.

            పేద పిల్లలు తమ ఇంటి అరుగు మీదా దిగులుగా కూర్చుని ఉంటారు. పని

            లేదని, తిండి లేదని ఎలా బతకాలని బాధపడుతూ ఉంటారు. ఇంతలో వాళ్ళ

            దగ్గరికీ పెద్ద మనిషి వస్తాడు. సర్పంచ్ గారు పిలుస్తున్నారని చెప్పి కీర్తి,

            బాలును తీసుకుని  వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ ఊరి జనం మొత్తం

            ఉంటారు. వాళ్ళను చూసి షాక్ అవుతారు. ఏమి జరిగి ఉంటుందనేది

            ఊహించుకుంటూ సర్పంచ్ గోపయ్య దగ్గరికి వస్తారు. సర్పంచ్ గారికి

            నమస్కరిస్తారు.

గోపయ్య : ఏమ్మా కీర్తి..నువ్వు నీ తమ్ముడు బాలు బాగున్నారు కదా !

      కీర్తి : ఎలా ఉంటాం చెప్పండి..పేద పిల్లలం..అమ్మ నాన్న లేని అనాధలం. నాకు నా

             తమ్ముడు తోడు. వాడిని నేను నీడ..ఇలా ఒకరికి ఒకరమంటూ ఇలా

             ఉన్నాం.

వాయిస్ : బాధ పడుతూ చెప్పింది కీర్తి.

గోపయ్య : నువ్వు నీ తమ్ముడు కలిసి ఏ పని చేస్తున్నారు ? ఎలా బతుకుతున్నారు ?

    కీర్తి : పనులు చేయడానికి మాకేవరు పనులు చెప్పడం లేదండీ. అలాగే ఎంత

           అడుక్కుంటున్న ఎవరు అన్నం, రొట్టెలు ఏది పెట్టడం లేదండీ. గుళ్ళో

           ప్రసాదం, చెత్త కుప్ప ఇస్తారాకుల మెతుకులు మా కడుపును కొంచెం

           నింపుతున్నాయి. మిగితా సగాన్ని వీధి నీళ్ళు నింపుతాయి.

సర్పంచ్ : మరి పెట్రోల్ దొంగలించి అమ్ముతున్నా డబ్బులు ఏమి చేస్తున్నారూ.

వాయిస్ : ఆ మాట విని కీర్తి, బాలు ఒకరిని ఒకరు చూసుకుంటారు. అమాయకంగా

            ముఖాలు పెట్టి..

  బాలు : పెట్రోల్ ఏంటి ? మేము దొంగతనం చేయడం ఏంటి ? మాకు తెలియదు.

     కీర్తి : అవును బబుగారు. మేము ఎలాంటి దొంగతనం చేయలేదు. మమ్ముల్ని

           నమ్మండి !

గోపయ్య : సరేసరే..ఇప్పుడు నా దగ్గర ఎలాంటి ఆధారం లేదు మీరే పెట్రోల్

            దొంగలిస్తున్నారని చెప్పి శిక్ష  వేయడానికి ! కానీ పట్టుకుంటాను ఏదో ఒక

            రోజున.. ఇప్పుడు వెళ్ళండి !

వాయిస్ : ఆ మాట విని కీర్తి, బాలు అక్కడి నుంచి తమ ఇంటికి వస్తారు. అలా రెండు

            రోజులు గడిచిపోతాయి. ఈ రెండు రోజుల్లో పెట్రోల్ దొంగతనం జరగలేదు. కానీ

            మూడో రోజున ఆ దొంగ ఎవరో తెలుసుకోవాలనే ఒక కారును ఊరి మధ్యలో

            ఉన్న ఒక చెట్టు దగ్గర పెడతారు. ఊరు ఊరంతా గోడల చాటున దాక్కుని ఆ

            పెట్రోల్ దొంగ కోసం చూస్తుంటారు. సరిగ్గా అర్థ రాత్రి..పన్నెండు దాటిన

            తరువాత..సృజన అనే ఒక టీచర్ పెట్రోల్ కోసం క్యాన్, పైపు పట్టుకుని ఆ

            కారు దగ్గరికి వచ్చి.. పెట్రోల్ దొంగతనం చేస్తూ ఉంటుంది. ఆ చూట్టు పక్కల

            దాక్కున్న వారంతా ఆ కారు దగ్గరికి వచ్చి టీచర్ సృజనను పట్టుకుంటారు.

            అక్కడికి వచ్చిన వారిని చూసి టీచర్ సృజన షాక్ అవుతారు. ఊరి వాళ్ళు

           పెట్రోల్ దొంగతనం చేస్తున్నది టీచర్ సృజన అని తెలిసి తలోక మాట

            అంటారు. అప్పుడు టీచర్ సృజన అందరికీ దండం పెట్టి.. బాధ పడుతూ..

టీచర్ సృజన : స్కూల్స్ లేవు. జీతాలు లేవు. ఉన్న ఇద్దరు పిల్లలకు అన్నం పెట్టలేక

                 ఇబ్బంది పడుతున్నాను. అందుకే ఇలా చేస్తున్నాను. అందరూ నన్ను

                 మన్నించండి

వాయిస్ : అని వేడుకుంటుంది. ఆమెను మన్నిస్తారు. పేద పిల్లలైన కీర్తి, బాలు తమ

            మీదా దొంగ అనే అనుమానం పోయినందుకు సంతోష పడుతుంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *