పేద పిల్లల పొడవైన స్కూటర్ | Telugu Stories | Telugu Fairy Tales | Story World Telugu

వాయిస్ : మందార పల్లి అనే ఊరిలో కీర్తి, బాలు అనే ఇద్దరు పేద పిల్లలు ఉండేవాళ్లు.

            చిన్నపాటి ఇంట్లో ఉంటూ అదే ఊరిలో ఉంటున్న దామోదర్ మెకానిక్

            షాపులో పని చేస్తుంటారు. అలా పని చేయగా వచ్చిన డబ్బులతో జీవనాన్ని

            కొనసాగిస్తున్నారు. కీర్తి, బాలు దామోదర్ మెకానిక్ షాపు దగ్గరికి వచ్చారు.

            ఇంకా దామోదర్ రాలేదు. ఆ షాపు తెరుచుకోలేదు.

  కీర్తి : ఈ బాబాయి ఎప్పుడు చూడు ఆలస్యంగా వస్తాడు. చీకటి పడ్డాక వెళ్దామని  

        అడిగితే మరొక గంట ఉండమని అంటాడు.

బాలు : నువ్వు మొహమాటనికి నీతో పాటు నన్ను పని చేయమని చెప్తావు.

   కీర్తి : మొహమాటం కాదు బాలు..కృతజ్ఞత! మనం కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ

          బాబాయ్ చేసిన సహాయం మర్చిపోవద్దు మనం !

బాలు : లేదక్క లేదు..నేను ఎప్పటికీ మర్చిపోను! ఆ సమయంలో నిజంగా మా పాలిట

         ఈ బాబాయ్ దేవుడని చెప్పుకోవచ్చు.

 కీర్తి : చెప్పుకోవచ్చు కాదురా బాలు.. గట్టిగా చెప్పాలి. మనం గట్టిగా నమ్మాలి. మన

       జీవితం ఇలా ఉండటానికి కారణం..ఈ మెకానిక్ దామోదర్ బాబాయ్ !

బాలు : ఆ రోజు ఇద్దరికీ బాగా జ్వరం వచ్చింది. వాంతులు..లేవలేని పరిస్థితి. అప్పట్లో

         చికెన్ గూన్యా అంటూ కొత్తగా వచ్చిన వ్యాధి, వేగంగా వ్యాపిస్తున్న రోజులు అవి.

  కీర్తి : మన ఇంటికి ఇరు పక్కల ఉన్నవాళ్ళు, కనీసం పిల్లలు ఏమైపోయారని కూడా 

         రాలేదు. దారిన పోతున్న దామోదర్ బాబాయ్ మాత్రం మన అరుపులు, కేకలు

         విని ఇంటికి వచ్చాడు. మన పరిస్థితి చూసి చలించిపోయి దగ్గర ఉండి అన్నీ

           చూసుకున్నాడు.

వాయిస్ : అని దామోదర్ వాళ్ళకు చేసిన సేవ గురించి తలుచుకున్నారు. ఇంతలో

            దామోదర్ స్కూటర్ మీదా షాపు దగ్గరికి వచ్చాడు. షాపు దగ్గర నిలబడి 

            ఉన్న పిల్లలను చూసి..

దామోదర్ : నేను వచ్చిన తరువాత చూసి మిమ్ముల్ని రమ్మని చెబుతున్నాను కదా!

              అయిన మీరు నా కంటే ముందుగా షాపుకొచ్చి ఏమి చేస్తారు ? చెప్పితే

             అర్థం చేసుకోవాలి.

బాలు : అయిన మిమ్ముల్ని ఈ డొక్కు స్కూటర్ మీద షాపుకు రావొద్దని చెప్పాను

         కదా! మళ్ళీ ఆ డొక్కు స్కూటర్ మీదే షాపుకు వస్తున్నావు. నా పరువు

          తీస్తున్నావు.

దామోదర్ : అదెక్కడ ఉందిరా బాలు !

బాలు : పాయింట్ షర్ట్ వేసుకుని మా ఇంటి అరుగు మీదా నిలబడింది.

దామోదర్ : అరెరె..పరువుకు అండర్ వేర్ చేయడం మర్చిపోయావురా బాలు !

బాలు : నాలాగ అది కూడా డైబర్ వేసుకుందిలే బాబాయ్ ! 

   కీర్తి : అయ్యో బాబాయ్..ఇలాగే వాదన పెట్టుకుంటారా! షాపు తీస్తారా..ఆ కారు ఓనర్

         వస్తాడు. దానిని ఇంకా రెడీ చేయలేదు. ముందుగా షాపు తెరవండి.

బాలు : లోపల నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి.

దామోదర్ : అంతగా తమరు చేసే పనులెంటో చెప్తారా బాబు!

బాలు : వచ్చి యజమాని సీట్లో కూర్చుంటే ఎలా తెలుస్తుంది చెప్పు. నాలాగా కష్టపడితే

         తెలుస్తుంది పని విలువ..పనికి మనకు సంబంధం గురించి.

దామోదర్ : అబ్బో..మేమింకా మీలా ఉంటే తెలుస్తుందని అనుకున్నామండీ!

బాలు : నాకు అవతల చాలా పనులున్నాయి. నీతో మాట్లాడుతూ ఉంటే  కుదరదు.  

వాయిస్ : అబ్బో అంటూ దామోదర్ తన మెకానిక్ షాపు తెరిచాడు. కీర్తి, బాలు కరవైనా

           కారు దగ్గర రిపేర్ చేస్తుంటారు. ఒక అరగంట తరువాత..ఆ కారు యజమాని

           వస్తాడు.

దామోదర్ : నమస్తే సార్..రండి..కూర్చోండి. బాలు కారు రెడీ అయిందా !

బాలు : అమ్మడానికా..నడపడానికా ! ఏమి లేదు..అమ్మడానికైతే రెడీగా ఉంది..

         నడవడానికి మరి నాలుగు నిమిషాల సమయం పడుతుంది.

వాయిస్ : అది విన్న ఆ కారు యజమాని..

యజమాని : ఈ పిల్లాడు ఎవరండీ? భలే తమాషాగా, సరదాగా ఉన్నాడు. 

దామోదర్ : మా అబ్బాయెనండీ !

వాయిస్ : దామోదర్ చెప్పిన ఆ మాటలకు కీర్తి, బాలు ఇద్దరు సంతోష పడతారు.

            ముగ్గురు కలిసి ఆ కారును రిపేర్ చేసి వచ్చిన ఆ కారు యజమానికి

            ఉస్తారు. అతను ఆ కారు వేసుకుని వెళ్ళిపోతాడు. అలా రోజులు గడుస్తూ

            ఉంటాయి. ఒక రోజున స్కూటర్ మీద దామోదర్ ఇంటి నుంచి షాపుకు

            వెళ్తుండగా, అదుపు తప్పిన కారొకటి దామోదర్ ను గుద్దెస్తుంది. దాంతో రోడ్డు

            మీద పడి సృహ కోల్పోతాడు. ఈ విషయం తెలియక షాపు దగ్గర కీర్తి, బాలు

            ఎదురుచూస్తూ ఉంటారు.  

బాలు : అక్క..బాబాయ్ రోజు వచ్చే టైమ్ కూడా దాటింది. ఒకసారి ఇంటికి వరకు

          వెళ్లొద్దమా !

కీర్తి : ఇంకా కాసేపు చూద్దాం తమ్ముడు!

బాలు : నాకెందుకు ఇంటికి వెళ్ళితేనే మంచిదనిపిస్తుయిందక్క !

కీర్తి : సరే పదా !

వాయిస్ : అని కీర్తి, బాలు ఇద్దరు కలిసి ఆ షాపు నుంచి దామోదర్ ఇంటి వైపు

           నడుచుకుంటూ వెళ్తుంటారు. దారి మద్యలో ఒక చోట గుమిగూడిన జనం

           కనిపిస్తారు. ఏమైందోనని కీర్తి, బాలు వచ్చి చూస్తారు. అక్కడ ఉలుకు పలుకు

           లేకుండా పడి ఉన్నది దామోదర్ బాబాయని తెలుసుకుని అంబులెన్స్ ను

          పిలిపించి దగ్గరలో ఉన్న హాస్పటల్ కు తీసుకెళ్లి పోతారు. దామోదర్ కు

          యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని అతని భార్య సుగుణకు చెప్తారు. ఆమె

          ఏడుస్తూ అరగంటలో హాస్పటల్ కు వచ్చేస్తుంది.

డాక్టర్ : తలకు దెబ్బ తగలడం వల్ల కోమాలోకి వెళ్ళాడు. అతనికి ట్రీట్ మెంట్ చేస్తూనే

          ఉండాలి. అందుకు బాగా ఖర్చు అవుతుంది.

సుగుణ : ఎంత ఖర్చైన పరువా లేదు డాక్టర్.. ఆయన మాకు ప్రాణాలతో కావాలి.

     కీర్తి : అవును డాక్టర్..మా బాబాయిని మళ్ళీ మామూలు మనిషిని ఇవ్వండి.

వాయిస్ : ఆ మాట విని డాక్టర్, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దామోదర్ కు ట్రీట్ మెంట్

           మొదలవుతుంది. అలా రోజులూ గడుస్తూ ఉంటాయి. డబ్బుల కోసం.. ఇల్లు,

           షాపు..బంగారం అమ్మేస్తారు. ఒక పాత స్కూటర్ మాత్రం అలాగే ఉంటుంది.

          కొన్ని రోజుల తరువాత దామోదర్ కు సృహ వస్తుంది. ఇంటికి తీసుకొస్తారు.   

దామోదర్ : పిల్లలు..ఇప్పుడు నేను బతకడమే కష్టంగా మారింది. మీకు అన్నం

              పెట్టలేను. జీతాలు ఇవ్వలేను. మీరెల్లి మరొక పని చూసుకోండి!

వాయిస్ : ఆ మాట అన్న కీర్తి, బాలు బాధపడతారు. ఏమి చేయాలో అర్థం కాదు.

            దామోదర్ బాబాయిని వదిలి పెట్టి వెళ్ళడం ఏ మాత్రం ఇష్టం లేదంటూన్నారు.

           అప్పుడు వాళ్ళకు దామోదర్ పాత స్కూటర్ కమబడింది. పొడవాటి స్కూటర్

           చేసి డబ్బులు సంపాదించవచ్చను ఆలోచన చేసి, వాళ్ళ కున్న తెలివి

         తేటలతో వచ్చిన మెకానిక్ పనితో పొడవాటి స్కూటర్ ను తయారు చేసి..ఆ

          స్కూటర్ ను టాక్సీలా నడుపుతుంటారు పేద పిళ్లైన కీర్తి. బాలు..అలా వచ్చిన

          డబ్బులతో దామోదర్ ను చూసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు.

-0-

మందార పల్లి అనే ఊరిలో కీర్తి, బాలు అనే ఇద్దరు పేద పిల్లలు ఉండేవాళ్లు. చిన్నపాటి ఇంట్లో ఉంటూ అదే ఊరిలో ఉంటున్న దామోదర్ మెకానిక్ షాపులో పని చేస్తుంటారు. అలా పని చేయగా వచ్చిన డబ్బులతో జీవనాన్ని కొనసాగిస్తు ఉంటారు. ఒక రోజునా దామోదర్ కు యాక్సిడేట్ అవుతుంది. దాంతో హాస్పటల్ కు తీసుకెళ్తారు. ఇల్లు, షాపు అమ్మి దామోదర్ను బాగుచేయించుకుంటారు. ఎలా బతకాలని ఆలోచన వాళ్ళకు దామోదర్ పాత స్కూటర్ కనబడుతుంది. దానిని వాళ్ళకు తెలిసీనా మెకానిక్ తెలివితో పొడవాటి స్కూటర్ గా తయారు చేసి టాక్సీలా నడిపిస్తూ ఉంటారు.

-0-

Add a Comment

Your email address will not be published. Required fields are marked *