పేద పిల్లల బంగారు నీళ్ల బావి Episode 149 |Telugu Stories | Telugu Kathalu | Banana Dreams TV Telugu
వాయిస్ : గగన్ పూర్ విలేజీలో కీర్తి, బాలు అనే పేద పిల్లలు ఉండేవాళ్లు. ఇద్దరు ఇంటి
అరుగు మీదా కూర్చుని ఏడుస్తుంటారు. కాసేపటికి కీర్తి తెరుకుని..
కీర్తి : బాలు ఏడవకు..ఏడిస్తే మన సమస్యలు తీరేటివి కావు.
బాలు : మరి ఏమి చేస్తే మన సమస్యలు తీరుతాయి, ఏమి చేస్తే మన ఆకలి కష్టాలు
తీరుతాయి.
కీర్తి ; అదే నాకు అర్థం కావడం లేదు బాలు..నిన్నటి వరకు ఇళ్ళల్లో పని చేసుకునే
వాళ్ళం. ఏమైనా దొరికితే తినేవాళ్లం. ఇప్పుడు అలా కాదు కదా !
బాలు ; అవునక్క.. పని పోతే దొంగ అని ముద్రా వేసి కొడుతున్నారు. అక్కడ మనం
చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాం !
కీర్తి : అవును బాలు..కాంతమ్మ ఇంట్లో పని చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఇంకా
నా కళ్ల ముందు కదులుతూనే ఉంది. ఆ రోజు వాళ్ళు నిన్ను కాళ్ళు చేతులు
కట్టేసి కొడుతున్నప్పుడు నువ్వు అరిచిన అరుపులు ఇంకా చెవులో ప్రతి
ధ్వనిస్తూనే ఉన్నాయి.
బాలు : ఈ లోకంలో మంచికి రోజులు లేవని అర్థమవుందక్క.
కీర్తి : అందుకే తమ్ముడు..నేనొక నిర్ణయానికి వచ్చాను తమ్ముడు.
బాలు : నీ నిర్ణయం ఏదైనా సరే అక్క..నేను దానిని ఆచరిస్తానక్క నువ్వు చెప్పినట్టుగా
మనం చనిపోదమక్కా! అప్పుడే మనకు ఈ ఆకలి కష్టాలు ఉండవు.
కీర్తి : అవునురా తమ్ముడు..అందుకే బాగా ఆలోచించి నేను ఆ నిర్ణయానికి వచ్చాను.
మనం చనిపోతే మనమే ఆకలి కష్టాల నుంచి బయటపడిన వాళ్ళమవుతాము.
బాలు : ఊరు చివర ఉన్న చెరువులో దూకి చనిపోదామా!
కీర్తి : వద్దు తమ్ముడు..మన చావు నీళ్ళను కలుషితం చేస్తుంది. దాంతో ఊరి వాళ్ళు
నీళ్ళు తాగరు. పశువులకు కూడా తాగించరు. మన చావు మనకు సంతోషాన్ని
ఇవ్వాలి కానీ ఊరి వాళ్ళకు బాధను కాదు తమ్ముడు..అందుకే నీళ్ళు వద్దు.
బాలు : మరెక్కడ చనిపోదామక్కా!
కీర్తి : నేను అదే ఆలోచన చేస్తున్నాను తమ్ముడు. మనం చావడానికి సరైన చోటు
ఎక్కడ ఉందా అని ? కానీ ఏ చోటు సరిగ్గా ఉన్నట్టుగా అనిపించడం లేదు.
వాయిస్ : అక్కాతమ్ముడు ఇద్దరు కాసేపు మౌనంగా ఆలోచించడం మొదలు పెట్టారు.
వాళ్ళు ఎంత ఆలోచన చేసిన కీర్తి, బాలుకు ఎలా చనిపోవాలి అన్న ప్రశ్నకు
ఇంకా జవాబు దొరక్క లేదు. ఆలోచన చేస్తూనే ఉన్నారు. పది నిమిషాల
తరువాత.. బాలుకు ఏదో గుర్తుకు వచ్చివాడిలా సంతోష పడుతూ..
బాలు : అక్క నీళ్ళల్లో దూకి చనిపోతే నీళ్ళు కలుషితమవుతాయని అంటున్నావు కదా!
కీర్తి : అవును తమ్ముడు.
బాలు : అయితే మన ఊరికి ఉత్తరాన పెద్ద కొండ ఉంది కదా ! ఆ కొండెక్కి అక్కడి
నుంచి దూకితే రాళ్ళ మీదా పడతాం. అప్పుడు తల పగులుతుంది. దెబ్బకు
మన ప్రాణం గాల్లో కలిసిపోతుంది.
కీర్తి : తల పగిలితే కచ్చితంగా చనిపోతాం. అదే కాళ్ళు చేతులు విరిగితేనే కొత్త
సమస్యలు వస్తాయి తమ్ముడు. అప్పుడు మన బతుకు మరింత నరకంగా
ఉంటుంది. కాళ్ళు చేతులు బాగున్నాయి కాబట్టి అక్కడో ఇక్కడో ఎక్కడో
అడుక్కుంటూ ఇలా బతుకుతున్నాం. అదే కాళ్ళు చేతులు విరిగితే ఇక అంతే
సంగతి !
వాయిస్ ; ఇంతలో వాళ్ళ దగ్గరికి ఒక ముసలావిడ వస్తుంది.
ముసలావిడ : బాబు..నాకు బాగా దాహంగా ఉంది. కొన్ని నీళ్ళు ఇస్తారా!
వాయిస్ ; బాలు ఏమి మాట్లాడకుండా వెళ్ళి ఒక గ్లాస్ నిండా నీళ్ళు తీసుకొచ్చి ఆ
ముసలావిడకు ఇస్తాడు. ఆ ముసలావిడ నీళ్ళు తాగుతుంది. ఆ తరువాత
అక్కడి నుంచి వెళ్లబోతు…ఆ పేద పిల్లలను గమనిస్తుంది. వాళ్ళు ఏదో
ఆందోళనలో ఉన్నట్టుగా అనిపోస్తుంది. అప్పుడు ప్రేమగా…
ముసలావిడ : చిట్టితల్లీ..మీరిద్దరు ఏదో ఆందోళనలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. మీ
సమస్య ఏమిటో చెప్పితే, నాకు తోచిన సలహా ఇస్తాను.
కీర్తి : ఏమీలేదవ్వ..మేము ఆకలి కష్టాకాను ఎదుర్కోలేక పోతున్నాం. చని పోదామని
అనుకుంటున్నం!
బాలు : కాకపోతే ఎక్కడ..ఎలా చనిపోవాలన్నది అర్థం కావడం లేదు. అందుకే అప్పటి
దీర్ఘంగా ఆలోచన చేస్తున్నాం పెద్దవ్వ !
ముసలావిడ : ఓస్ ఇంతేనా…మీ ఇంటి దగ్గర బావి ఉంది కదా ! అందులో దూకి
చనిపోండి.
కీర్తి : చనిపోవడానికి అందులో నీళ్ళు ఉండాలి కదా !
ముసలావిడ : నీళ్ళు లేవా ! అప్పుడు మీరే నీళ్ళు మోసుకోండి. మీరు ఎంత వరకు
మునుగుతారో అంతా వరకు నీళ్ళు మోసుకోండి. ఆ తరువాత బావిలోకి
దూకి చనిపోండి. అప్పుడు మీ ఆకలి కష్టాలు తీరుతాయి కదా !
వాయిస్ : ముసలావిడ చెప్పింది విని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు.
ఆలస్యం చేయకుండా కీర్తి, బాలు ఇద్దరు రెండు కుండలను తీసుకుని కీలో
మీటర్ దూరంలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి అందులోని నీళ్ళను కుండలతో
తీసుకొచ్చి బావిలో పోస్తుంటారు. అలా రోజంతా నీళ్ళు చెరువు నుంచి
తీసుకొచ్చి ఆ బావిలో పోస్తుంటారు. అలా ఆ రోజంతా కీర్తి, బాలు ఇద్దరు
కలిసి కుండలతో నీళ్ళు మోస్తూనే ఉంటారు. అలా మోసిన నీళ్ళతో బావి
నిండుతుంది. అప్పుడు ఆ బావిలోని నీళ్ళపైన ఒక చిన్న తెలియాడుతూ
ఉంటుంది. వింతగా ఆ పెట్టెను తీసుకుని తెరుస్తారు. ఆ పెట్టెలో నుంచి ఒక
తెల్లని పొగ బయటికి బచ్చి బంగారుకన్యలా మారిపోతుంది. ఆ బంగారు
కన్యను చూసి కీర్తి, బాలు ఇద్దరు దండం పెడతారు.
బంగారు కన్య : పిల్లలు నీళ్ళు లేని ఈ బావిలో ఎంత కష్టపడి బందీగా ఉన్న నన్ను
విడిపించారు. ఇక ఈ బావి బంగారు నీళ్ళ బావిగా మారి మీ
అవసరాలను తీరుస్తుంది. నిశ్వార్థంతో మీరు ఆపదలో ఉన్న వాళ్ళను
ఆదుకోండి. మీకు మంచి పేరు తీసుకొస్తుంది.
వాయిస్ : అని చెప్పి బంగారు కన్య మాయమవుతుంది. ఆ బావిలోని నీళ్ళు బంగారు
రంగులో మెరుస్తూ ఉంటాయి. కీర్తి, బాలు సంతోష పడుతూ..
కీర్తి : తమ్ముడు ఇప్పుడు మనం ఆకలి కష్టాలతో చనిపోవాల్సిన అవసరం లేదు.
మనమే స్వార్థానికి పోకుండా..అసలైన పేదవాళ్లను, ఆకలితో ఉన్నవాళ్లను
గుర్తించి వాళ్ళకు సహాయం చేద్దాం !
బాలు : నువ్వేలా చెప్పితే అలా అక్క !
వాయిస్ : అని బాలు ఆ బంగారు నీళ్ళను చేతుల్లోకి తీసుకుంటాడు. అంతే.. బంగారు
బిక్సెట్ లా మారిపోతుంది. అలా ఆ పేద పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్న బంగారు
నీళ్ళ బావి ద్వారా పేదవాళ్ళ ఆకలి, అవసరాలను తీరుస్తూ సంతోషంగా
జీవిస్తూ ఉంటారు.
-0-
పేద పిల్లలైన కీర్తి, బాలుకు ఎక్కడ పని దొరకదు. చేయడానికి వాళ్ళను నమ్మి ఎవరి పని ఇవ్వరు. దాంతో ఆకలి బాగా అవుతుంది. అది తట్టుకోలేక అక్కాతమ్ముడు కలిసి బాధపడుతూ, వాళ్ళ జీవితం గురించి తలుచుకుని ఏడుస్తుంటారు. ఆకలికి తట్టుకోలేక చెరువులో పడి, కొండ మీది నుంచి దూకి చనిపోవలని అనుకుంటారు. అప్పుడు ఒక పెద్దవిడా వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఉన్న బావిలో నీళ్ళను నింపి అందులోనే దూకి చావమని చెప్పుతుంది. అలాగే కీర్తి, బాలు చేస్ద్తారు. అప్పుడు ఆ బావిలో నుంచి బంగారు కన్య ప్రత్యక్షమై..వాళ్ళకు బంగారు నీళ్ళను ప్రసాదించి, వాటితో జీవించమని చెబుతుంది. అప్పటి నుంచి కీర్తి, బాలు ఆ బంగారు నీళ్ళను అమ్ముకుంటూ జీవిస్తూ ఉంటారు.
-0-
Related Posts

సర్కస్ చేసే ఏనుగు పిల్ల_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

కాపాడుతున్న నాగిని_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu
