పేద పిల్లల మాయా పిగ్గీ బ్యాంకు Episode 142 |Telugu Stories | Telugu Kathalu |Banana Dreams TV Telugu

వాయిస్ : కేశవపూర్ గ్రామంలో కీర్తి, బాలు అనే ఇద్దరు పేద పిల్లలు ఉండేవాళ్లు. కూలి 

            పోవడానికి సిద్దంగా ఉన్న ఒక పాత ఇంట్లో ఉంటూ, రోజు ఆ ఊరి పక్కనే

            ఉన్న అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చి అమ్ముతు ఉంటారు. అలా ఆ కట్టెలు

            అమ్ముడు పొగ వచ్చిన డబ్బులతో అతి కష్టం మీదా బతుకు జట్కా బండిని

           లాగుతూ వస్తారు. ఒక రోజున కట్టెలు అమ్మగా వచ్చిన డబ్బులను చూస్తూ…

   కీర్తి : బాలు ఈ డబ్బులను ఏం చేద్దాం ?

బాలు : వెళ్ళి చికెన్ బిర్యాన్ని తిందామక్క!

   కీర్తి : ఇంతకు ముందే కదా..పచ్చడి మెతుకులతో కడుపు నిండా తిన్నాం. అప్పుడు

          నీకు అన్నం సరిపోలేదా?

బాలు : అయ్యో అట్లాంటిది ఏమీలేదక్కా! అయితే ఆడుకోవడానికి ఒక బొమ్మను

         కొనుకుందామక్కా! ఇలాగే అన్నం తిన్న తరువాత కాసేపు ఆడుకోవచ్చు.

 కీర్తి : మనం పేద పిల్లలమని తెలిసి మనకు ఇవ్వకుండా వెళ్ళిన ఒక బొమ్మను

        చూపించు తమ్ముడు..అన్నీ బొమ్మలతో ఆడుకుని ఉన్నాం. పక్క కొంచెం

        కూలీపోయిన పక్క గదిలోకి వెళ్ళి చూడు.. మన దగ్గర ఎన్ని బొమ్మలు

         ఉన్నాయో !

బాలు : తినడానికి తిండి ఉంది. ఆడుకోవడానికి బొమ్మలు ఉన్నాయి.. వేసుకోవడానికి

         సరైన బట్టల్లేవక్కా! నీకు నాకు చెరోకా జత బట్టలు తీసుకుందామక్కా!

కీర్తి : చినిగిన, మాసిన పాత బట్టలను చూసి ఎవరో ఒకరు వాళ్ళ దగ్గర ఉన్న ఉన్న

         వాళ్ళ పిల్లల బట్టలు మనకు ఇస్తారు. అవి కూడా కొత్తగానే ఉంటాయి. అవి

           వేసుకోవచ్చు తమ్ముడు.

బాలు : అక్క…ఆ డబ్బును ఏమి చేద్దామో నువ్వే చెప్పక్కా!

   కీర్తి : రేపటి కోసం దాచిపెట్టుకుందాం తమ్ముడు. ఈ రోజు చేసిన పనికి వచ్చిన

         డబ్బులను మనం ఈ రోజే ఖర్చు చేయాలనే ఒప్పందం ఎక్కడ లేదు కదా.

బాలు : లేదక్కా!  అయిన మనం పేద పిల్లలం. మన జీవితాల గురించి ఆలోచించే

         వాళ్ళు లేరు. పట్టించుకునే వాళ్ళు అంతకన్నాలేరు. అసలు మన ఉన్నమో 

         చచ్చామో అని చూసే వారు కూడా లేరు. 

కీర్తి : కదా బాలు..మన గురించి మనమే ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు ఓపిక ఉంది

      కాబట్టి పని చేయగలిగావు. అదే రేపు ఎలా ఉంటుందన్నది మన చేతుల్లో లేదు

       కదా!

బాలు : అలా ఉంటే మనం కూడా అప్పుడు దేవుళ్ళమే కదక్కా !

   కీర్తి : ఇదిగో ఇలా భ్రమపడి పోతామనే రేపు మన జీవితం ఎలా ఉంటుందనేది ఎవరు

         ఊహించలేనిది. అందుకే రేపటి కోసం…రోజు మనం సంపాదించిన దానిలో

         నుంచి కొంచెం కొంచెం దాచిపెట్టుకుందాం! ఏదో ఒక రోజున ఈ దాచి పెట్టుకున్న

         డబ్బే మనకు ఉపయోగపడుతుంది.

బాలు : నువ్వు పెద్ద దానివి. ఏం చేసిన ఎలా చేసిన అన్నీ ఆలోచన చేసి చేస్తావు. ఆ

          నమ్మకం నాకుంది. నువ్వు ఎలా చెప్పితే అలా అక్క! డబ్బులు దాచుకుందాం

         తమ్ముడు అంటే దాచుకుందాం! వద్దు తమ్ముడు ఖర్చు పెట్టుకుందాం

         తమ్ముడు అంటే ఖర్చు పెట్టుకుందాం !

వాయిస్ : అని మాట్లాడుకుంటూ, చివరకు ఎంతో కొంత డబ్బులు దాచుకోవాలని

            అనుకుంటారు. అందుకు అవసరమైన పిగ్గి బ్యాంక్ ను ఒకటి కొనాలని

          అనుకుంటారు. అంతే.. ఆ పిల్లలు ఉంటున్న పక్క గదిలో ధనెల్ మని పైకప్పు

        కూలీన శబ్ధం వస్తుంది. కీర్తి, బాలు అక్కడికి వచ్చి చూస్తారు. అక్కడ వాళ్ళకు

        బంగారు రంగులో మెరుస్తున్న పిగ్గి బ్యాంక్ కనబడుతుంది. దానిని చూసి

        మురిపోతారు. కీర్తి బంగారు పిగ్గి బంక్ ను తీసుకుని తమ్ముడు బాలు దగ్గరికి

        వస్తుంది. బాలు కూడా ఆ బంగారు పిగ్గి బాంకును చూస్తాడు. ఇద్దరికీ

        సంతోషమనిపిస్తుంది.         

బాలు : అక్క దీనిని చూస్తుంటే పాతకాలంలో మన తాతలు ఇందులో పైసలు

          దాచిపెట్టుకునే వాళ్ళనుకుంటాను.

కీర్తి : నాకు కూడా అలాగే అనిపిస్తుంది తమ్ముడు. కానీ దేనిని పై కప్పులో పెట్టి

       ఎందుకు అప్పుడు ఇల్లు కట్టారని అర్థం కావడం లేదు.

బాలు : అంటే ఇప్పుడు నేను చెప్పేది నా ఊహ మాత్రమే…ఇప్పుడు ఉన్నట్టుగా

          అప్పుడు కూడా దొంగల భయం ఎక్కువగా ఉండేవాళ్లు కావొచ్చు. మన తాత

          అలాంటి వాళ్ళకు ఈ బంగారం రూపంలో తయారు చేయించి  దాచి పెట్టి

          ఉంటాడు.

వాయిస్ : కీర్తికి కూడా తమ్ముడు బాలు చెప్పింది నిజమనిపిస్తుంది. ఏది ఏమైనా

           మనం డబ్బులు దాచుకోవదానికి బాగా ఉపయోగ పడుతుందని, కీర్తి, బాలు

           రోజు మిగిలిన సంపాదన అందులో వేస్తూ దాచిపెట్టుకుంటూ ఉంటారు. అలా

           రోజులు గడుస్తూ ఉంటాయి. కీర్తి, బాలు డబ్బులు దాచిపెట్టుకున్న బంగారపు

           పిగ్గి బ్యాంక్…మాయా బంగారు పిగ్గి బ్యాంక్ అని వాళ్ళకు తెలియదు. అది

           నిండిన తరువాత అందులో నుంచి అన్నీ బంగారు కాయిన్స్ వస్తాయని! అలా

           రోజులు గడుస్తూ ఉంటాయి. కీర్తి, బాలు రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని

           అమ్ముకునే వాళ్ళు. అలా వచ్చిన డబ్బులలో కొంత ఖర్చులకు తీసుకుని

           మిగితా డబ్బును పిగ్గి బ్యాంకులో దాచిపెట్టుకుంటూ ఉంటారు. అలా

          దాచిపెట్టుకున్న డబ్బులతో ఆ పిగ్గి బ్యాంక్ నిండిపోయింది. ఒక రోజున ఆ

          బంగారు పిగ్గి బ్యాంక్ నుంచు బంగారు బిళ్ళలు వస్తుంటాయి. కీర్తి, బాలు

          ఆశ్చర్యపోతారు. అప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది. ఇంట్లో దొరికిన బంగారు

          పిగ్గి బ్యాంక్ మాయా బంగారు పిగ్గి బ్యాంక్ అని!

బాలు : అక్క..ఇది మాయా బంగారు పిగ్గి బ్యాంక్ ! మనం ఇందులో డబ్బులు వేస్తుంటే

         తిరిగి అవి బంగారు నాణేలుగా బయటికి వస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ

          బంగారు నాణేలతో ఏం చేద్దామక్కా!

  కీర్తి : మనలాంటి పేద వాళ్ళకు ఉచితంగా అన్నదానం, వస్త్రాదానం చేద్దాం తమ్ముడు.

బాలు : అయితే ముందుగా మనం ఇల్లు కట్టుకుందాం !

   కీర్తి : వద్దు తమ్ముడు..మనకు దేవుడు ఈ అవకాశం కల్పించింది పేదవాళ్ళకు సేవ

         చేయడానికే తప్ప..వాటిని మన స్వార్థం కోసం కాదు. నిజాయితీ, నిస్వార్థం

         ఎక్కడ ఉంటాయో అక్కడ ఎప్పుడు మనశ్శాంతి, సంతోషం ఉంటాయి.

         శాశ్వతమైన వీటిని కాదని మనిషి, అప్పటికప్పుడు ఉండిపోయే సంతోషం కోసం

         పాకులాడుతూ స్వార్థంతో కొంతకాలమో బతుకుతున్నాడు.

బాలు : ఆ కొంతకాలం బతుకైనా మంచిగా బతుకుదామక్కా!

   కీర్తి : నేను అదే కోరుకుంటున్నాను తమ్ముడు.

వాయిస్ : కీర్తి, బాలు తమ దగ్గర మాయా బంగారు పిగ్గి బ్యాంక్ నుంచి వస్తున్న

           బంగారు నాణేలను తిరిగి చమ్మక్ లాల్ బంగారు శేట్ దగ్గర డబ్బులుగా

          మార్చుకుని పేద వాళ్ళకు అన్నదానం, బట్టలు దానం చేస్తుంటారు. అది

           చూసిన చాలామండి పేద పెద్ద వయసు వాళ్ళు కీర్తి, బాలును ఆశీర్వదిస్తారు.

         అందుకు కీర్తి, బాలు మరింతగా కష్టపడుతూ ఆ డబ్బులను తీసుకొచ్చి మాయా

         బంగారు పిగ్గి బ్యాంకులో దాచుకుంటూ ఉంటారు. తిరిగి  వస్తున్న బంగారు

        నాణేలతో పేదవాళ్ళకు అన్నదానం, బట్టల దానం చేస్తుంటారు.

-0-

సింగిల్ లైన్ స్టోరీ

కేశవపూర్ గ్రామంలో కీర్తి, బాలు అనే పేద పిల్లలు, కూలిపోవడానికి సిద్దంగా ఉన్న ఒక ఇంట్లో నివాసం ఉంటూ, ఊరి పక్కనే ఉన్న అడవిలో కట్టెలు కొట్టుకుని వాటిని అమ్ముకుంటూ ఉంటారు. అలా వచ్చిన డబ్బులలో కొంత ఖర్చుపెట్టుకుని మరి కొంత ఆ ఇంట్లో దొరికిన మాయ బంగారు పిగ్గి బ్యాంకులో దాచి పెట్టుకుంటారు. ఆ డబ్బు బంగారు నాణేలుగా మారి బయటికి వస్తుంటాయి. ఆ నాణేలతో పిల్లలు సంతోషంగా ఉంటూ మానవ సేవ చేయాలని అనుకుని..పేద వాళ్ళకు అన్నదానం, బట్టలు దానం చేస్తుంటారు. సంతోషంగా జీవిస్తూ ఉంటారు.

-0-

Add a Comment

Your email address will not be published. Required fields are marked *