పేద పిల్లల మాయా బంగారు కోడి Episode 141 | Telugu Stories | Telugu Kathalu | Banana Dreams TV Telugu

రచన – నందిని కృష్ణ, 9390462106 

వాయిస్ : రాజపాలెం అనే ఊరిలో కీర్తి, బాలు అనే ఇద్దరు పేద పిల్లలు ఉండేవాళ్ళు.

            ఊరి పక్కనే ఉన్న అడవిలో కట్టెలు కొట్టుకొచ్చి అమ్ముకుంటూ ఉంటారు.

            అలా వచ్చిన డబ్బులతోనే పచ్చడి మెతుకులు తింటూ, తమ తాగుబోతు

           తండ్రి శివయ్యను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు.

            తల్లి గంగమ్మ చనిపోవడంతో తండ్రి శివయ్య తాగుడుకు బానిసయ్యాడు.

            పిల్లల ఉన్నారనే విషయం మర్చిపోయి, ఎప్పుడు తాగుతూ ఉంటాడు.

           అదీకాక తాగడానికి డబ్బులు కావాలని పిల్లలను కొడుతూ ఉంటాడు.

           ఒక రోజున కట్టెల కోసం అడవికి వెళ్ళడానికి కీర్తి, బాలు ఇంట్లో నుంచి

           బయటికి వస్తారు. బయట మంచంలో పడుకున్న తండ్రి శివయ్య లేచి

           నిలబడ్డాడు.

శివయ్య : నా ప్రాణానికి ప్రాణమైన పిల్లలు.. తాళ్ళు గొడ్డలి పట్టుకుని కట్టెల కోసం

            అడవికి వెళ్తున్నారా

    కీర్తి : అవును నాన్న.. నువ్వు నీ బాధ్యత నుంచి తప్పించుకున్నావు. కానీ మేము

          అలా చేయలేము కదా నాన్న. మాకంటూ ఈ లోకంలో ఉన్నది నువ్వే నాన్న.

శివయ్య : ఆ విషయం నాకు తల్లి. కానీ మీకు తెలియని విషయం చెప్పనా.. నేను

           కూడా బతుకున్నది, తాగుతున్నది మీ కోసమే పిల్లలు. తల్లి లేని పిల్లలు

           ఎలా బతుకుతారని బాధపడుతూ ఇష్టం లేకపోయినా తాగుతున్నాను.

బాలు : ఎలా బతుకుతారని బాధపడుతూ తాగడం ఎందుకు నాన్న? నువ్వు మాతో

         పాటు అడవికి ముగ్గురం కలిసి కట్టెలు ఆ అడవి తల్లిని నమ్ముకుని కట్టెలు

           కొట్టుకుని అమ్ముకుందాం! ఇప్పుడు ఇద్దరం కాబట్టి రెండు రూపాయలు

          వస్తున్నాయి. నువ్వోస్తే ముగ్గురం అవుతాం. అప్పుడు మూడు రూపాయలు

          వస్తాయి కదా! అలా వచ్చిన డబ్బులతో మనం చాలా సంతోషంగా బతకొచ్చు

          నాన్న!

శివయ్య : ఈ రోజు నేను పనికి రాను పిల్లలు…నా మామూలు నాకివ్వండి. మీ

            పనులకు మీరు పొండి.

     కీర్తి : నిన్న కొట్టిన కట్టెలు అమ్ముడు పోలేదు నాన్న. అందుకే ఈ రోజు డబ్బుల్లేవు.

           సాయంత్రం వచ్చాక ఇస్తాం. అప్పటి వరకు ఇంటి దగ్గరే పడుకో నాన్న!

వాయిస్ : డబ్బులు లేవని చెప్పగానే శివయ్యకు ఎక్కడ లేని కోపం వచ్చింది. దాంతో

            డబ్బులు ఇవ్వండి…డబ్బులు ఇవ్వండి..లేకపోతే చంపేస్తానని బెదిరిస్తూ

            ఇద్దరినీ కొడుతూ ఉంటాడు. కీర్తి,బాలు ఏమి మాట్లాడకుండా ఆ దెబ్బలను

           భరిస్తూ ఉంటారు. కొట్టి కొట్టి అలిసిపోయీ మంచంలో పడిపోతాడు శివయ్య.

           బాధపడుతూ కన్నీళ్లను తుడుచుకుని కీర్తి, బాలు ఇద్దరు కలిసి అడవికి

           వస్తారు. ఎండిన చెట్టు కోసం చూస్తుంటారు. ఒక చోట కనబడుతుంది. తమ

           దగ్గర గొడ్డలి సహాయంతో కీర్తి, ఆ చెట్టును కట్టెలుగా కొడుతుంది. వాటిని

            మూటలుగా కట్టుకుని నెత్తిన పెట్టుకుని అడవి నుంచి బయలుదేరుతారు.

             అలా అడవిలో నడుచుకుంటూ ముందుకు వెళ్తు.. తాగుడుకు బానిసైన

            తమ తండ్రిని ఎలా మార్చుకోవాలో అర్థం కాక, తన తండ్రి కొట్టిన దెబ్బల

            నొప్పులకు తట్టుకోలేక బాధపడుతూ ఇద్దరు అలా వెళ్తుంతారు.

వాయిస్ : ఆ అడవిలోని ఒక గొయ్యిలో పడిపోయిన మహర్షి…కంగారూ పడుతూ..

మహర్షి : నన్ను ఎవరైనా కాపాడండి..ఎవరైనా ఉన్నారా? కాపాడండి.

వాయిస్ : అని అరుస్తూ ఉంటాడు. ఆ అరుపులు విని కీర్తి…

కీర్తి : బాలు..నీకేమైనా అరుపులు వినిపిస్తున్నాయా !

బాలు : అవునక్క..ఎవరో కాపాడండి అని అరుస్తున్నట్టుగా వినబడుతుంది.

 వాయిస్ : కీర్తి, బాలు ఆ అరుపూల శబ్ధం వస్తున్న దిశను గమనిస్తూ అక్కడికి

             వస్తారు. అక్కడ ఒక గొయ్యిలో మహర్షి పడిపోయి ఉంటాడు. కీర్తి, బాలు

            ఇద్దరు క్షేమంగా ఆ మహర్షిని బయటకు తీస్తారు. ఆ మహర్షి సంతోష సంతోష

             పడతాడు.

మహర్షి : మిమ్ముల్ని చూస్తుంటే చాలా పేద పిల్లల్లా ఉన్నారు. బతకడానికి ఇబ్బంది

            పడుతూన్నట్టుగా కూడా అనిపిస్తుంది. నేను మీకు మాయా కోడిని ఇస్తాను.

           అది మీకు బంగారు గుడ్డును ఇస్తుంది. వజ్రాలు ఇస్తుంది.

వాయిస్ : అని చెప్పి మాయా బంగారు కోడిని ఇస్తాడు. ఆ పిల్లలు ఆ కోడిని తీసుకుని

            ఇంటికి వస్తారు. అది రోజు పెడుతున్న బంగారం గుడ్డును, ఇస్తున్న

            వజ్రాలను అమ్ముకుంటూ, అలా వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తూ

           ఉంటారు. తండ్రి ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బులు ఇస్తుంటారు. అలా

           కొన్ని రోజులు గడుస్తాయి. ఒక రోజున తాగుబోతు శివయ్యకు అనుమానం

           వస్తుంది.  

శివయ్య : ఇదేమిటి? ఎప్పుడు డబ్బులు అడిగిన లేవనే వాళ్ళు. నాతో దెబ్బలు

            తినేవాళ్ళు. ఈ మధ్య నేను అడగకపోయిన డబ్బులు ఇస్తున్నారు. పైగా

           అడవికి వెళ్లి కట్టెలు కూడా కొట్టుకు రావడం లేదు. పిల్లలకు ఇన్ని డబ్బులు

           ఎలా వస్తున్నాయి. ఎక్కడ నుంచి వస్తున్నాయ.. తెలుసుకోవాలి!

వాయిస్ : అని ఒక రోజున తాగకుండా తాగినట్టుగా వచ్చి మంచంలో పడుకుని తన

            పిల్లలను గమనిస్తూ ఉంటాడు. అది గ్రహించలేని కీర్తి, బాలు మాయా

             బంగారు కోడి పెట్టెతో మాట్లాడుతూ.. వజ్రాలు, బంగారు కోడి గుడ్డు

             తీసుకుంటారు. అది కిటికీ దగ్గర నిలబడి చూస్తున్న శివయ్య సంబర

             పడతాడు. అత్యాశకు పోతాడు.

శివయ్య : బంగారు కోడి గుడ్డు అని వినడమే కానీ ఇలా చూసింది లేదు. ఈ బంగారు

           కోడి, బంగారు గుడ్డు ఇస్తుందంటే, ఆ కోడి కడుపులో చాలా బంగారు గుడ్లు

           ఉంది ఉంటాయి. కోసి వాటిని తీసుకుంటాను.

వాయిస్ : అని ఇంట్లో పిల్లలు లేని సమయం చూసి ఆ మాయా బంగారు కోడిని

            పట్టుకోవాలని చూస్తుంటాడు. ఆ కోడి ఎగిరేగిరి శివయ్యను తన్నుటూ,

           పొడుస్తూ ఉంటుంది. దాంతో భయపడి అక్కడి నుంచి తప్పించుకుని

           పారిపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. శివయ్య అనారోగ్యం పాలై

           మంచంలో పడుకుని ఉంటాడు. బాలు  తండ్రి దగ్గర ఉంటాడు. మందుల కోసం

          కీర్తి టౌన్ కు వెళ్తుంది. చాలా సమయం గడవడంతో ఇంకా ఇంటికి రాలేదని

          బాలు కంగారూ పడుతూ ఉంటాడు. ఇంతలో ఆ ఊరి రైతు సోమయ్య, ఆ

          ఇంటికి వచ్చి…కీర్తికి యాక్సిడెంట్ అయిందని చెప్పడంతో బాలు ఎలా వెళ్ళాలో

           అర్థం కాక కంగారూ పడుతుంటే, మాయా బంగారు కోడి వచ్చి..

మాయా కోడి : కంగారూ పడకు నేను నిన్ను మీ అక్క దగ్గరికి తీసుకెళ్తాను.

వాయిస్ : అని చెప్పి బైకులా మారిపోతుంది. తన కాళ్ళ కింద రెండు టైర్లు

            ప్రత్యక్షమవుతాయి. బాలు ఆ కోడి మీదా కూర్చుంటాడు. మాయా బంగారు

           కోడి బైకు అలా ముందుకు దూసుకెళ్తూ ఉంటుంది. అది చూసి ఊరి జనాలు

           ఆశ్చర్యపోతారు. బాలు, మాయా బంగారు కోడి బైకు మీదా దెబ్బ తగిలి సృహ

           కోల్పోయిన కీర్తి దగ్గరికి వస్తాడు. కీర్తిని తీసుకుని ఆ మాయా బంగారు కోడి

          బైకు మీదా హాస్పటల్ కు వెళ్తాడు. అక్కడ డాక్టర్, కీర్తిని పరీక్షించి, తగిన

          మందులు రాసి ఇస్తాడు. కళ్ళు తెరిచిన కీర్తి, డాక్టర్ వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పి

         అక్కడి నుంచి మాయా బంగారు కోడి బైకు మీద ఇంటికి వస్తారు. కీర్తి, బాలు

         మాయా బంగారు కోడి చేసిన సహాయానికి చేతులెత్తి దండం పెడతారు.

-0-

సింగిల్ లైన్ స్టోరీ

రాజపాలెం అనే ఊరిలో ఉన్న కీర్తి, బాలు అనే ఇద్దరు పేద పిల్లలు, అడవిలో కట్టెలు కొట్టుకొచ్చి అమ్ముకుంటూ, అలా వచ్చిన డబ్బులతోనే పచ్చడి మెతుకులు తింటూ, తమ తాగుబోతు తండ్రి శివయ్యను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. తాగడానికి డబ్బులు కావాలని పిల్లలను కొడుతూ ఉంటాడు. ఒక రోజున కట్టెల కోసం అడవికి వెళ్ళిన కీర్తి, బాలు.. ఒక గొయ్యిలో పడిన మహర్షిని కాపాడుతారు. అందుకు ఆయన మాయ బంగారు కోడిని ఇస్తాడు. ఆ కోడి బంగారు కోడి గుడ్డు, వజ్రాలను ఇస్తుంది. వాటిని అమ్ముకుంటూ సంతోషంగా జీవిస్తున్న సమయంలో తాగుబోతు శివయ్య చూసి అత్యశకు పోయి మాయా కోడిని కట్ చేద్దామని అనుకుంటాడు. అందుకు తగిన బుద్ది చెప్పుతుంది. ఆ తరువాత యాక్సిడెంట్ అయి చావు బతుకులా మద్య ఉన్న కీర్తిని బైక్ లా మరి హాస్పటల్ కు తీసుకెళ్లి బతికిస్తుంది ఆ మాయా బంగారు కోడి! కృతజ్ఞతలు చెప్తారు కీర్తి, బాలు !

-0-

Add a Comment

Your email address will not be published. Required fields are marked *