పేద పిల్లల మాయా బంగారు మామిడి పళ్ళు | Telugu Stories | Telugu Kathalu | Banana Dreams TV Telugu
వాయిస్ : దేవాపూర్ విలేజీలో మారయ్య అనే ఒక మామిడి తోట యజమాని
ఉండేవాడు. అతని దగ్గరే కీర్తి, బాలు అనే ఇద్దరు పేద పిల్లలు పని
చేస్తుంటారు. వాళ్ళ పని రాత్రి పూట మామిడి తోటలో దొంగలు పడకుండ
చూడటం, పగలంతా మామిడి పళ్లను అమ్ముకుని రావడం. అలా అమ్మిన
మామిడి పళ్ళకు వచ్చిన డబ్బులను తీసుకొచ్చి మారయ్యకు ఇవ్వడం ! వాయిస్ : అలా కాకుండా ఈ రెండింటిలో ఏ తప్పు జరిగిన మారయ్య, కర్ర తీసుకుని
కీర్తి, బాలును కొడుతూ ఉంటాడు. ఆ పూట అన్నం పెట్టకుండా, నీళ్ళు
ఇవ్వకుండా ఇదే మీరు చేసిన తప్పుకు శిక్ష అంటూ ఆ తోట దగ్గర ఉన్న
చిన్నపాటి ఇంట్లో బందించి బయటి నుంచి తాళం వేసుకుని వెళ్ళిపోతాడు. ఒక
రోజు చీకటి పడిన తరువాత..
మారయ్య : కీర్తి, బాలు..మామిడి పళ్ళు కోతకొచ్చాయి. ఇప్పుడే దొంగ వెధవలు..తమ
చేతి వాటం చూపిస్తారు. మీరు జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉండండి. ఒక
మామిడి పండును దొంగలు ఎత్తుకెళ్లిన.. మీ చర్మంతో నేను కొత్తరకం మామిడి
పళ్లను తయారు చేస్తాను. జాగ్రత్త !
వాయిస్ : అని కోపంగా చెప్పి, మామిడి తోట నుంచి ఇంటికి బయలుదేరాడు. కీర్తి,
బాలు..ఆ తోట దగ్గర ఉన్న చిన్నపాటి ఇంట్లో ఉంటూ ఆ తోటకు
కాపలాదారుల్లా పని చేస్తూ ఉంటారు. మారయ్య అక్కడి నుంచి వెళ్లిపోగానే…
బాలు : అక్క..పటేల్ వెళ్లిపోయాడు కదా ! మనం వెళ్ళి అన్నం తిందాం పదా! బాగా
ఆకలిగా ఉంది.
కీర్తి : బాలు నువ్వేళ్లి అన్నం పెట్టుకుని తిను. ఈలోగా నేను తోట కావాలి ఉంటాను.
చీకటి పడింది కదా ! దొంగలు ఆ తోట చుట్టుపక్కలే తగిన సమయం కోసం
కాచుకుని కూర్చుంటారు.
బాలు : నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా తిన్ననా అక్క ! తింటే ఇద్దరం కలిసే
తిందాం..లేకపోతే వద్దు. నేను ఇలాగే ఆకలి కడుపుతో పడుకుంటాను.
వాయిస్ : తమ్ముడు బాలు అలా అనేసరికి కీర్తికి జాలేస్తుంది. ఆ తరువాత తమ్ముడు
తన మీదా చూపిస్తున్న ప్రేమకు ముచ్చట వేస్తుంది. ఏమి మాట్లాడకుండా
బాలు దగ్గరికి వచ్చి, తమ్ముడి చేతిని పట్టుకుని ఆ తోట దగ్గర ఉన్న
చిన్నపాటి ఇంట్లోకి వెళ్తారు. అన్నం ఆవకాయ పచ్చడి వేసుకుని తింటూ
ఉంటారు.
బాలు : అక్క..మన పటేల్ మనకు ఎప్పుడు చూడు ఆవకాయ పచ్చడి, అన్నం ఈ
రెండే పంపిస్తాడు. ఆవకాయ పచ్చడి తిని తిని పచ్చడి అంటేనే విసుగొచ్చేలా
ఉంది.
కీర్తి : కానీ తమ్ముడు ఆకలితో ఖాళీ కడుపును రాత్రి ఉంచొద్దు. నేను పొద్దున్నే పటేల్
తో మాట్లాడుతాను.
బాలు : సరే అక్కా! ఈ పూట తింటాను.
వాయిస్ : అలా కీర్తి, బాలు ఇద్దరు కలిసి మామిడి కాయ పచ్చడితో అన్నం తింటారు.
ఆ తరువాత చార్చ్ లైట్ పట్టుకుని తోట కావాలి చేస్తుంటారు. అప్పుడు
వాళ్ళకు కొద్ది దూరంలో ఉన్న ఒక మామిడి చెట్టు నుంచి మామిడి కాయలు
కింద పడుతూ కనిపిస్తాయి. ఇద్దరు టార్చ్ లైట్ తో ఆ మామిడి పళ్ల చెట్టు
దగ్గరికి వస్తారు. ఆ చెట్టు మీదున్న దొంగ శీనయ్యను చూస్తారు.
కీర్తి : శీను మామ..మేము నిన్ను చూశాం! కిందికిరా !
వాయిస్ : చెట్టు మీదున్న శీనయ్య అనే దొంగ, కీర్తి, బాలును చూసి, చెట్టు మీది నుంచి
కిందకు దూకేస్తాడు. అప్పుడు అతని ఒక కాలు విరుగుతుంది.
శీనయ్య : అమ్మా..కాలు విరిగినట్టుంది. ఒక్కటే నొప్పిగా ఉంది.
కీర్తి : నీకేన్ని సార్లు చెప్పాను మామ..ఇలా రావొద్దు. ఇప్పుడు నువ్వోచ్చావు.
నిన్ను చూసి కాపలాగా ఉన్న పేద పిల్లలు కీర్తి, బాలు ఏమనడం లేదని
అందరూ రెచ్చిపోతారు. అప్పుడు నేను నా తమ్ముడు ఆ పటేల్ చేతిలో
చచ్చిపోతాం !
శీనయ్య : వద్దమ్మా.. అంతా పెద్ద మాటలు ఆనకు. ఇంట్లో తినడానికి సరుకులు లేవు.
చిన్నోడికి పాలు కొనడానికి కూడా డబ్బుల్లేవు. అందుకే..ఇలా వచ్చాను తల్లి.
కీర్తి : వచ్చి ఏమిటి లాభం.. చెట్టు మీది నుంచి పడ్డావు. కాలు విరిగినట్టుంది. రేపటి
నుంచి ఆ పిల్లల పరిస్థితి ఏమిటి ? మాలాగే ఎక్కడో ఒక చోట పనికి పెట్టు !
శీనయ్య : మన్నించూ తల్లి..నేనే మళ్ళీ రాను. అబ్బా కాలు నొప్పిగా ఉంది. బహుశా
విరిగినట్టుంది.
వాయిస్ : కీర్తి, కింద పడిన మామిడి పళ్లను ఒక బుట్టలో వేసి, శీనయ్య తల మీదా వేసి
అక్కడి నుంచి పంపిస్తుంది. అప్పుడే అదంతా చూస్తున్న మరయ్య, వాళ్ళ
దగ్గరికి వస్తాడు. కోపంగా వాళ్ళను చూస్తూ..
మారయ్య : మామిడి పళ్ళు రోజు ఎలా మాయమవుతున్నాయా అనుకున్నాను..
ఇప్పుడు తెలిసింది..మీరే దగ్గరుండి దొంగతనం చేపిస్తూ ఆ తరువాత వాళ్ళ
నుంచి డబ్బులు తీసుకుంటున్నారు కదూ !
వాయిస్ : కర్ర తీసుకుని కీర్తి, బాలును కొడతాడు. కీర్తి, బాలు..వద్దు పటేలా..కొట్టొద్దు
పటేలా..మేము ఏ తప్పు చేయలేదు పటేలా..అని ఎంత బతిమాలిన
వినకుండా కొడుతూనే ఉంటాడు. ఆ దెబ్బలకు ఇద్దరు సృహ తప్పి
పడిపోతారు. అది చూసి..
మారయ్య : ఇక్కడే ఇలాగే బయట చావండి !
వాయిస్ : అని చెప్పి మారయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఓ అర్థరాత్రి వేళా..కీర్తి,
బాలుకు మెళుకువ వస్తుంది. ఒల్లంతా వాతాలతో నొప్పి లేస్తుంది.
బాలు : పేదవాళ్ళకు సహాయం చేయడం తప్పు కాదా కదక్క!
కీర్తి : మన మన దృష్టిలో కాదు తమ్ముడు..కానీ పటేల్ దృష్టిలో తప్పే ! ఇక ఇక్కడ
ఉండొద్దు తమ్ముడు..వెళ్లిపోదాం !
వాయిస్ : అప్పుడు వాళ్ళ ముందున్న మామిడి చెట్టు మెరుస్తూ..
మామిడి చెట్టు : పేద పిల్లలు..మంచివాళ్ళకు, పేద వాళ్ళకు సహాయం చేయాలనే మీ
సుగుణం నాకు నచ్చింది. మీరు ఇక్కడే ఉండండి. మీ పటేల్ పనులు
చేసుకుంటూ.. నేనిచ్చే బంగారు మామిడి పళ్లను అమ్ముతూ
పేదవాళ్ళకు, మంచి వాళ్ళకు సహాయం చేయండి. పైనున్న మీ
అమ్మానాన్న సంతోషిస్తారు.
వాయిస్ : అమ్మానాన్న అనగానే పేద పిల్లలకు తమ తల్లిదండ్రులు గుర్తుకు వస్తారు.
వెంటనే వచ్చి ఆ మెరుస్తున్న మామిడి చెట్టును హద్దుకుంటారు. అలా ఆ
రోజు నుంచి ఆ మాయా మామిడి చెట్టు ఇచ్చే బంగారు పళ్లను అమ్ముతూ
కీర్తి, బాలు.. పేదవాళ్ళకు, మంచివాళ్ళకు, వృద్ధులకు ఉచితంగా సేవ చేస్తూ
ఉంటారు. మారయ్య తోటలోని చెట్లన్నీ ఎండిపోతాయి. ఒక మాయా మామిడి
చెట్టు మాత్రం బంగారు మామిడి పళ్లను కీర్తి, బాలుకు ఇస్తూ ఉంటుంది. ఆ
బంగారు మామిడి పళ్లను పటేల్ పట్టుకుంటాడు. వెంటనే అవి నల్లగా
మారిపోతాయి. తను చేసిన తప్పు తెలుసుకుంటాడు మారయ్య. ఆ మాయ
మామిడి చెట్టు ముందు బాధపడుతూ..
మరయ్య : తల్లి నన్ను మన్నించు. ఇక నుంచి నేను కూడా నాకు తోచిన విధంగా
సహాయం చేస్తుంటాను.
వాయిస్ : అని వేడుకుని బంగారు మామిడి పళ్లను పట్టుకుంటాడు. అవి బంగారంలా
మెరుస్తూ ఉంటాయి. ఇక ఆరోజు నుంచి మారయ్య, కీర్తి, బాలు బంగారు
మామిడి పళ్లను అమ్ముతు సంతోషంగా జీవించసాగారు.
-0-
సింగిల్ లైన్ స్టోరీ
దేవాపూర్ విలేజీలో మారయ్య అనే ఒక మామిడి తోట యజమాని ఉంటాడు. అతని దగ్గర కీర్తి, బాలు అనే ఇద్దరు పేద పిల్లలు పని చేస్తుంటారు. పగలంతా మామిడి పళ్లను అమ్ముకుని రావడం. రాత్రి పూట దొంగలు పడకుండ చూడటం లాంటివి చేస్తుంటారు.
ఒక రోజున శీనయ్య అనే ఒక దొంగ మామిడి పళ్ల దొంగతనానికి వచ్చి కాళ్ళు విరగొట్టుకుంటాడు. అతను బతకడానికి మామిడి పళ్లను ఇచ్చి పంపిస్తారు పేద పిల్లలు.
అది చూసి మారయ్య, కర్ర తీసుకుని కీర్తి, బాలును కొడుతూ ఉంటాడు. సృహ తప్పిపోతారు. అప్పుడు మాయా మామిడి చెట్టు ప్రత్యక్షమై బంగారు మామిడి పళ్లను ఇస్తాను..వాటితో పేదవాళ్ళ ఆకలి తీర్చమని చెబుతుంది. మారయ్య తను చేసిన తప్పు తెలుసుకుని మంచిగా మారిపోతాడు.
-0-
Related Posts

చందమామ దొంగతనం | Telugu Kathalu | Bedtime Stories | Panchatantra kathalu |Comedy Videos |Fairy Tales

వరదల్లో అన్న చెల్లెలు | Telugu Kathalu | Telugu Story | Bedtime Stories | Panchatantra kathalu
