పేద పిల్లల మాయా మనీ చేప 2 Episode 146 |Telugu Stories | Telugu Kathalu | Banana Dreams TV Telugu
వాయిస్ : మట్టిపల్లి అనే ఊరిలో కీర్తి, బాలు అనే ఇద్దరు పేద అక్కాతమ్ముడు
ఉండేవాళ్లు. తోడు నీడగా ఉండాల్సిన ఆ తల్లిదండ్రులు ఈ పిల్లలను ఒకరికి
ఒకరిని తోడు నీడగా చేసి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇక అప్పటి
నుంచి చేపలు పట్టుకుని, వాటిని అమ్ముకుని, అలా వచ్చిన డబ్బులతో
వంట వార్పు చేసుకుంటూ అలా బతికేస్తుంటారు.
ఒక రోజున చెరువు గట్టు మీద నిలబడి చేపలు పడుతూ ఉంటారు కీర్తి, బాలు.
అరగంట…గంట…రెండు గంటలు..ఇలా గంట మీద గంట గడిచిపోతుంది కానీ
వాళ్ళకు మాత్రం చేపలు పడటం లేదు.
కీర్తి ; నాకు తెలుసు ఈ రోజు మనకు పస్తులే ! ఇలా ఎన్ని గంటలు కూర్చున్న మనకు
చేపలు పడవని అర్థమయింది. ఎండ కూడా ముదురిపోతుంది. ఇలాగే కూర్చుని
ఉంటే కళ్ళు తిరిగి పడిపోవడం ఖాయం ! ఇంటికి వెళ్ధామా తమ్ముడు.
బాలు : నేనేమీ కావాలని ఆలస్యం చేయలేదక్కా! అసలే చలి కాలం. బాగా చలి
పెడుతుంది. వెచ్చగా దుప్పటి కప్పుకోగానే అలా నిద్ర పట్టింది.
కీర్తి : వెచ్చని దుప్పటి కప్పుకోగానే నిద్ర వచ్చినప్పుడు, ఆ దుప్పటి తీసినప్పుడు
మెళుకువ రావాలి కదా ! ఎందుకో రాలేదు..?
బాలు : అంతా చలిలో ఎలా అక్కా! అందుకె రాబుద్ది కాలేదు.
కీర్తి ; అలా రానందుకే ఇలా మనం ఈ రోజు ఖాళీ చేతులతో వెళ్తున్నాం.
వాయిస్ : అని అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్లాలని నడుచుకుంటూ వెళ్తూ
ఉంటారు. అక్కాతమ్ముడి మధ్య మౌనం. ఏమి మాట్లాడకుండా అలా ముందుకు
నడుచుకుంటూ వెళ్తుంతారు. అలా మౌనంగా నడవడం ఇద్దరికీ ఇష్టం లేదు.
కానీ అక్కడ పరిస్థితికి ఇద్దరు ఏమి మాట్లాడకుండా ముందుకు వెళ్తున్నారు.
బాలు : నేనెందుకు మాట్లాడాలి..నేను మాట్లాడను ఒక్క రోజు ఒక గంట చేపలు
పట్టడానికి ఆలస్యమైనందుకు నా మీదా అరుస్తుందా..నేను మాట్లాడను.
వాయిస్ : అనుకుంటూ బాలు ముందుకు నడుస్తుంటాడు.
కీర్తి : మనం రోజు అన్నం పెడుతున్న పని ఇదే అయినప్పుడు మన పని మనకు
శ్రద్ద ఉండాలి కదా! మన వెనుక తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తులు
లేవు మనం పని చేయకుండా ఉండటానికి ! ఆ విషయం ఎన్నో సార్లు
చెప్పాను. అయిన తప్పు చేసింది తమ్ముడే కదా! నిజంగానే చలి బాగా
పెడుతుంది. ఈసారికి మన్నించేస్తాను.
వాయిస్ ; అనుకుంటూ ముందుకు నడుస్తూ కీర్తి, తన ముందు నడుస్తున్న తమ్ముడు
బాలుతో ఇలా అంటుంది.
కీర్తి : బాలు..ఇప్పుడు నువ్వు మన్నించమని నా కాళ్ళ మీదెమి పడొద్దులే!
వాయిస్ : ఆ మాట విని బాలు ఆగిపోయి, కీర్తిని చూస్తూ..
బాలు : అబ్బా చా..నేను చేయని వాటి గురించి నువ్వు ఊహించుకుంటే అది నా
తప్పు కాదు. నీ ఊహ నీ ఇష్టం !
కీర్తి : అక్కను కాబట్టి అన్నీ విధాలా ఆలోచన చేసి నేను నిన్ను మన్నించాను. రేపటి
నుంచి మళ్ళీ మన పాత టైమ్ కి చెరువు దగ్గరికి వద్దాం!
వాయిస్ ; అలా అక్కాతమ్ముడు ఇద్దరు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తుంతారు. ఒక
దగ్గర దారిలో మూడు చేపలు కిందపడి నీళ్ళు లేక తల్లాడుతూ
కనిపించాయి. వాటిని చూశారు.
బాలు : అక్క..మనకు ఈ రోజు చేపలు దొరకలేదనే బాదొద్దు. ఒకటి కాదు రెండు,
ఏకంగా మూడు చేపలు దొరికాయి. వీటిని తీసుకుని వెళ్ళి మనం అమ్ముకుని
ఆ డబ్బులను దాచి పెట్టుకుందాం !
కీర్తి ; ఈ రోజు బాగా పొద్దు పోయింది కదా బాలు..ఇప్పుడు చేపలు తీసుకెళ్ళితే
కొనడానికి ఇళ్ళల్లో ఎవరు ఉండరు. అందరూ పనులకు పోతారు. తిరిగి, తిరిగి
అలిసిపోవడం ఉంటుంది తప్ప ఫలితం ఉండదు.
బాలు ; అయితే ఈ మూడు చేపలను తీసుకుని ఇంటికి వెళ్ళి రేపు అమ్ముకుందాం!
రేపు కూడా ఎవరు కొనకపోతే మనమే వండుకుని తీనొచ్చు కదా!
కీర్తి : అలాగే బాలు. ఇప్పుడు మాత్రం ఆ మూడు చేపలను తీసుకుని ఇంటికి వెళ్దాం!
ఆకలవుతుంది. ఏమైనా చేసుకుని తిందాం తమ్ముడు.
బాలు : సరే అక్క !
వాయిస్ : అని బాలు కిందా పడిన చేపలను బుట్టలో వేసుకుంటాడు. అక్కడి నుంచి
ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు. బుట్టలోని చేపలను ఇంటి ముందున్న గోళంలో
వేస్తారు. అవి తినడానికి దానను కూడా వేస్తారు. ఆ తరువాత కీర్తి, బాలు
ఇద్దరు కలిసి ఆడుకునే బాలు తీసుకుని బయటికి వెళ్ళి ఆడుకుంటూ
ఉంటారు. చీకటవుతుంది. కీర్తి, బాలు మరొక్కసారి గోళంలోని చేపలకు దాన
వేసి, వాళ్ళు తినేసి పడుకుంటారు. చలి కావడంతో చల్లి ఎక్కువగా ఉంటుంది.
అందువల్ల అక్కాతమ్ముడు ఇద్దరు చలికి లేవలేకపోతారు. ఎండ వచ్చిన
తరువాత లేస్తారు. అప్పుడు ఇద్దరు కలిసి ఆ చేపలను పట్టుకుని
అమ్ముకోవడానికి కీర్తి, బాలు ఇద్దరు బయతుల్దేరారు.
కీర్తి : చేపలమ్మా చేపలు.. తాజా చేపలు !
బాలు : ఇప్పుడే చెరువులో పట్టి తీసుకోస్తున్నాం మీ కోసం..చాలా చాలా తాజాగా
ఉన్నాయి.
వాయిస్ : కీర్తి, బాలు ఇద్దరు కలిసి ఊరంతా తిరుగుతారు. ఎవరు ఆ చేపలను కొనరు.
ఇకా లాభం లేదనుయికుని ఆ చేపలను వండుకుని తినాలని అనుకుంటారు.
తిరిగి తిరిగి ఇంటికి వస్తారు. కట్టెల పొయ్యి పోయి మీద కీర్తి బియ్యం
పెడుతుంది. బాలు ముందుగా ఒక చేపను కట్ చేస్తాడు. ఆ చేపలో అన్నీ
డైమండ్స్ ఉంటాయి. వెంటనే బాలు ముందు డైమండ్స్ దేవకన్య
ప్రత్యక్షమవుతుంది. కీర్తి, బాలు అశ్చర్య పోతారు.
డైమండ్ దేవకన్య : భయపడకండి..మీ దగ్గర ఉన్న మరో రెండు చేపలను కట్ చేయి బాలు !
వాయిస్ : బాలు వెంటనే మరొక చేపను కట్ చేస్తాడు. డబ్బుల దేవకన్య
ప్రత్యక్షమవుతుంది. మూడో చేపను కట్ చేస్తాడు. బంగారు దేవకన్యలా
ప్రత్య్క్షమవుతారు.
డైమండ్ దేవకన్య : దాన్యవాదాలు పిల్లలు..మీ వల్ల మాకు శాపవిమోచనం జరిగింది.
మీరు సంతోషంగా ఉండండి. మా నుంచి మీకు ఎప్పుడు ఎలాంటి సహాయం
కావాలన్న అడగండి. మేము చేసి పెడతాం ! ఇప్పుడు నేను మీరు
సంతోషంగా బతకడానికి డైమండ్స్ ఇస్తున్నాను.
వాయిస్ : అని చెప్పి డైమండ్స్ ఇస్తుంది.
మనీ దేవకన్య : పిల్లలు..నేను కూడా మీరు ఇప్పుదూ సంతోషంగా బతకడానికి
డబ్బులను ఇస్తున్నాను.
వాయిస్ : అని చెప్పి డబ్బులు ఇస్తుంది.
బంగారు దేవకన్య : పిల్లలు..నా తృప్తి కోసం నేను మీకు ఈ బంగారు నాణేలను
ఇస్తున్నాను.
వాయిస్ : అని చెప్పి బంగారు నాణేలు ఇస్తుంది. పేద పిల్లలు కీర్తి, బాలు సంతోషంగా ఆ
ముగ్గురు దేవకన్యాలకు దండం పెడతారు. ఆ ముగ్గురు దేవకన్యలు కార్యసిద్ది
ప్రాప్తిరాస్తూ అని దీవించి తిరిగి చేపల్ల మారి అక్కడ మాయమైపోతారు. కీర్తి,
బాలు తమ దగ్గర డబ్బులను, డైమాండ్స్, బంగారాన్ని చూసి
మురిసిపోతారు.
-0-
సింగిల్ లైన్ స్టోరీ
పేద పిల్లలైన కీర్తి, బాలు..మట్టిపల్లి గ్రామంలో చేపలు పట్టుకుని వాటిని అమ్ముకుంటూ అలా వచ్చని డబ్బులతో బతుకు ఉంటారు. ఒక రోజున ఆలస్యంగా చెరువు దగ్గరికి వెళ్తారు చేపలు పట్టాలని. కానీ అక్కడ గంటల సమయం గడిచిన చేపలు పడవు. దాంతో కోపంగా ఇంటికి తిరిగి వస్తుండగా…దారిలో కిండా మూడు చేపలు కనిపిస్తాయి. వాటిని ఇంటికి తీసుకొచ్చి అమ్మాలను చూస్తారు కానీ అమ్ముడు పోవు. దాంతో కీర్తి, బాకు వండుకుని తిందామని ఆ మూడు చేపలను కట్ చేస్తారు. అంతే ఆ చేపలు దేవకన్యాల మారి డైమండ్స్, డబ్బులు, బంగారం ఇస్తాయి. వాటితో ఆ పిల్లలు సంతోషంగా ఉంటారు.
-0-
Related Posts

పేద పిల్లల బంగారు గర్భవతి ఆవు | Telugu Stories | Telugu Kathalu | Banana Dreams TV Telugu

ఒక్క టైర్ బైకు Single wheel Bike | Telugu Kathalu | Telugu Stories| Stories in Telugu | fairly tales
