పేద పిల్లల మాయా మనీ జేసీబీ | Telugu Stories | Telugu Kathalu | Banana Dreams TV Telugu

జలంధరపురం అనే గ్రామంలో బాలు కీర్తి అనే ఇద్దరు అనాధ పిల్లలు ఉండేవారు, వాళ్ళు ఊరిలో పెయింట్ పని చేస్తూ డబ్బులు సంపాదించేవారు, ఒక రోజు వాళ్ళు ఒక స్వామిజి ప్రాణాలు కాపాడినందుకు గాను వాళ్లకి ఒక మాయా బ్రష్ ఇచ్చి ఉంటాడు, దాంతో బాలు కీర్తి పేదవాలకి సహాయం చేస్తూ ఊరిలో అందరికి సహాయం చేస్తూ ఉంటారు, దాంతో ఊరందరి దృష్టిలో బాలు కీర్తి మంచి పేరు సంపాదించుకుంటారు, అలా ఊరిలో జనాలందరూ బాలు కీర్తిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు

అలా రోజులు గడుస్తూ ఉంటాయి, ఒక రోజు అదే ఊరిలో ఉండే ఒక jcb డ్రైవర్ అయిన రమేష్ అనే ఒక వ్యక్తి బాలు కీర్తి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు

రమేష్ : పిల్లలు మీ దగ్గర ఒక మాయ బ్రష్ ఉంది కదా అది ఉన్న తరువాత కూడా మీరు రోజు అడ్డా మీదకు వెళ్లి పెయింటింగ్  పనికి ఎవరైనా పిలుస్తారా అని చూస్తూ ఉంటారెందుకు, మీ దగ్గర ఉన్న బ్రష్ తో ఏ పాడైపోయిన గోడ మీదనో లేక పాడైన ఎదో ఒక వస్తువు మీద పెయింట్ వేసినట్టుగా చేస్తే మీకు డబ్బులు వస్తాయి కదా అప్పుడు మీకు ఇలాంటి కష్టాలేమి ఉండేవి కావు కదా అని అంటాడు

రమేష్ మాటలకు బాలు కీర్తి ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుకుంటారు, అప్పుడు బాలు ఇలా అంటాడు

బాలు : అంకుల్ మీకు ఈ విషయం తెలియదా, ఇది ఒక మాయ బ్రష్ దీనిని కేవలం ఆపదలో ఉన్న వారికోసం మాత్రమే ఉపయోగించాలి, అత్యాశకు పోయి ఎలా పడితే అలా దీనిని ఉపయోగిస్తే చివరికి ఏమి మిగలదు అలా కొన్ని సార్లు చేస్తే దీని మాయా శక్తులు కూడా పోతాయి అందుకే మేము దీన్ని కేవలం ఆపదలో ఉన్న వారికోసం మాత్రమే ఉపయోగించుతాము మా సొంత ప్రయోజనాల కోసం మేము దీనిని ఎప్పుడు ఉపయోగించలేదు ఉపయోగించము క్కూడా అని అంటాడు

ఇంతలో కీర్తి మాట్లాడుతూ

కీర్తి : అంకుల్ ఇంతకు ముందు ఇలానే అత్యాశకు పోయి ఒక వ్యక్తి మా దగ్గర నుంచి ఈ మాయ బ్రష్ ని దొంగతనం చేసి తీసుకెళ్లాడు, అతను అత్యాశతో పాలైన దాన్ని ఈ బ్రష్ తో పెయింట్ చేస్తే డబ్బులుగా మారతాయి అనుకోని తన ఇంటినే కాల్చుకున్నాడు, అతని అత్యాశకి కాలిపోయిన ఇల్లే మిగిలింది, అందుకే మేము ఎప్పుడు మా జాగ్రతలోనే ఉంటాము అయినా ఇలా రోజు పనికి వెళ్లి డబ్బులు సంపాదించుకోవడమే మాకు ఆనందంగా ఉంది.  అని చెబుతుంది

రమేష్ : పిల్లలు మీ ఆలోచన విధానం నాకు ఎంతో నచ్చింది, మీరు జీవితంలో చాలా గొప్పోళ్ళు అవుతారు, ఇక నుంచి మీకు ఎవరు లేరని అనుకోకండి ఎప్పుడు ఏ అవసరం వచ్చిన మీ శ్రయస్సు కోరుకునే వ్యక్తిగా ఎప్పుడు మీకు సహాయంగా నేను ఉంటాను అని *అంటాడు రమేష్

రమేష్ మాటలు బాలు కీర్తి లకు ఎంతో నచ్చుతాయి, వెంటనే కీర్తి ఇలా అంటుంది

కీర్తి : మీరు మాకు తోడుగా ఉంటారన్న మాట మాకు ఎంతో నచ్చింది అంకుల్ మాకు ఏ అవసరం వచ్చినా మీ దగ్గరికి కచ్చితంగా వస్తాము. మాకు ఒక ఆప్తుడిలా మీరు మాతో ఉండడని అంటుంది కీర్తి

రమేష్ కీర్తి బాలుతో ఈతో స్నేహంగా ఉంటూ ఉంటాడు అలా చాలా రోజులు గడిచ్చిపోతాయి

రమేష్కి jcb తో చాలా పనులు జరుగుతూ ఉండడం వల్ల చాలా డబ్బులు వస్తాయి, అది చూసిన ఊరి జనాల్లో కొంత మంది రమేష్ ఎదుగుదల చూసి కుళ్ళుకుంటూ ఉంటారు, అలా ఉండగా ఒక రోజు రమేష్ తన దగ్గర ఉన్న jcb ఇంటి ముందు పెట్టి ఎప్పటి లాగ ఇంట్లో పడుకుంటాడు, తెల్లారి ఉదయం వేరే ఊరిలో పని ఉండడం తో jcb దగ్గరకు వచ్చి చూడగానే జేసీబీ మొత్తం కాలిపోయి ఉంటుంది అది చూసి రమేష్ గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటాడు

రమేష్ : అయ్యో అయ్యో నా jcb ని ఎవరో కాల్చేశారు, ఇప్పుడిప్పుడే నేను కొత్త పాపుల నుండి తేరుకుంటున్నాను, ఇప్పుడు ఈ పాడైన jcb తో పనులు చేయడం ఎలా నేను నా కుటుంబాన్ని పోషించుకునేది ఎలా? నా మీద ఆధారపడి ఉన్న నా కుటుంబం పరిస్థితి ఏంటి? అని రమేష్ కాలిపోయినా జేసీబీ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు

రమేష్ jcb కాలిపోయిన విషయం ఆ నోటా ఈ నోటా బాలు కీర్తి వరకు చేరుతుంది,

బాలు కీర్తి పరుగు [పరుగున రమేష్ దగ్గరకు వస్తారు ఏడుస్తూ ఉన్న రమేష్ బాలు కీర్త్తి తో ఇలా అంటాడు

రమేష్ : చూసారా కీర్తి, నేను ఈ మధ్యే కొంత డబ్బు సంపాదించుకుంటున్నాను, కానీ నేను డబ్బు సంపాదించడం ఎవరికో ఇష్టం లేక నా మీద ఇలా పగ తీర్చుకున్నారు ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి అని ఏడుస్తూ ఉంటాడు

ఇంతలో కీర్తి రమేష్ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది

కీర్తి : అంకుల్ మీరేం బాధ పడకండి, మీ ఎదుగుదల చూసి కుళ్లుకున్న ఎవరో దుర్మార్గులు మీ పఠనం చూడడానికి ఇలా చేశారు, మనం ఏడాదవకూడదు వాళ్లకి మరింత ఎదిగి చూపించాలి మా దగ్గర ఉన్న మాయ బ్రష్ తో మీ jcb ని మాయా మనీ jcb గా తాయారు చేస్తాము, మీరు మనీ jcb తో ఊరంతా తిరగండి, ఈ పని చేసిన వాళ్ళు దాన్ని చూసి వాళ్ళు చేసిన పనికి సిగ్గుతో చచ్చిపోతారు అని అంటుంది

కొంతసేపటి తరువాత బాలు తన దగ్గర ఉన్న మాయ బ్రష్ తో కాలిపోయిన జేసీబీ మీద బృష్తో ప్[పాయింట్ వేసినట్టుగా చేస్తాడు వెంటనే అది మ్యాజికల్ మనీ జేసీబీ గా మారిపోతుంది, అది చూసిన అక్కడి ఊరిజనమంతా ఎంతో ఆశ్చర్యపోతారు, అప్పటినుంచి బాలు కీర్తి పాయింటా పనికి పోకుండా రమేష్ తో జేసీబీ పనికి వెల్తూ జేసీబీ నడటం నేర్చుకుంటారు, అలా కొని రోజులు గడిచిన తరువాత బాలు కీర్తి పనికి వెళ్ళినప్పుడు దాచుకున్న డబ్బుతో పాటు కొంత డబ్బు రమేష్ దగ్గర తీసుకొని సొంతగా ఒక జేసీబీ కొనుక్కొని ఊరిలో పనులు చేసుకుంటూ ఉంటారు

అలా కొంత కాలం జేసీబీ పని చేస్తూ చేస్తూ రోజు రోజుకు కొత్త డబ్బులు సంపాదిస్తూ ఉంటారు, అలా వచ్చిన డబ్బులతో కొంత డబ్బు పేదలకు సహాయం చేస్తూ ఉంటారు

1 minute story

బాలు కీర్తి తమ దగ్గర పాత వస్తువులని డబ్బుగా మార్చే మాయా బ్రష్ ఉన్నప్పటికీ కూడా తమ సొంత ప్రయోజనాల కోసం మాత్రం దానిని ఎప్పటికి ఉపయోగించఋ, వాళ్లకి రమేష్ అనే ఓక వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది, వాళ్ళు ముగ్గురు ఎంతో స్నేహంగా ఉంటూ ఉంటారు, రమేష్ జేసీబీ తో చాలా డబ్బులు సంపాదించుకుంటున్నాడన్న కోపంతో ఎవరో రమేష్ జేసీబీ ని కాల్చేస్తారు, బాలు కీర్తి రమేష్ కష్టం చూడలేక వాళ్ళ దగ్గర ఉన్న మాయా బ్రష్ సహాయంతో దాన్ని మ్యాజికల్ మనీ జేసీబీ గా మార్చుతారు,

Add a Comment

Your email address will not be published. Required fields are marked *