పేద పిల్లల మాయా మనీ బావి | Telugu Stories | Telugu Kathalu | Banana Dreams TV Telugu
వాయిస్ : గోపాల పట్టణమనే ఊరిలో కీర్తి, బాలు అనే పేద పిల్లలు ఉంటారు. కూలీ
పనులు చేసుకుంటూ అలా వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తూ ఉంటారు.
ప్రతిరోజులాగే ఆ రోజు కూడా తయారై, బాక్స్ పట్టుకుని వచ్చి కూలీల అడ్డ
మీదా నిలబడుతారు. దిక్కులు చూస్తుంటారు. ఎవరు ఈ రోజు పనికి
పిలుస్తారా అని! పావుగంట, అరగంట, గంట గడిచిపోతుంది. ఎవరు పనికి
పిలవరు. అందరూ పెద్దవాళ్ళనే కూలీ పనులకు తీసుకెళ్తూ ఉంటారు. కీర్తి,
బాలును అసలు పట్టించుకోరు.
కీర్తి : ఏంటీ తమ్ముడు ఈ రోజు ఇలా జరుగుతుంది. ఎప్పుడు లేనిది పొద్దున్న
మట్టి పొయ్యి మీద అన్నం గిన్నె జారిపడింది. నీళ్ళు మోస్తుంటే చేతి నుంచి
కుండ జారీ కింద పడి ముక్కలయింది. సరేలే ఈ రోజు లేచిన గడియా
బాగాలేదనుకుని కూలీ పని కోసం అడ్డ మీదికి వస్తే ఈ రోజు ఇప్పటి వరకు
పనికి ఎవరు పిలవలేదు.
బాలు : అదే నాకు అర్థం కావడం లేదక్కా! నిన్నటి వరకు అరె పిల్లలు మా దగ్గర
పనికి రండి…అక్కడ కంటే నేను పది రూపాయలు ఎక్కువ ఇస్తానని
చెప్పేవాళ్లు. అలాంటిది ఈ రోజు అసలు మనల్ని చూసిన చూడకుండా ఏమి
తెలియనట్టుగా ముఖాలు తిప్పుకుని వెళ్లిపోతున్నారు.
కీర్తి : అదిగో అలా భద్రన్న వస్తున్నాడు కదా…అడుగుదాం !
వాయిస్ : ఇంతలో వాళ్ళను చూసి కూడ చూడకుండా వెళ్లిపోతున్న భద్రన్నను
పిలుస్తారు పేద పిల్లలు కీర్తి, బాలు! అప్పుడు భద్రన్న, తిరిగి వాళ్ళ దగ్గరికి
వస్తాడు. ఇలా అంటాడు.
భద్రన్న : అరె కీర్తి, బాలు..నేను మిమ్ముల్ని చూడలేదు. ఇంకా ఇక్కడే ఏం
చేస్తున్నారు. ఇంటికి పొండి. ఈ రోజు నుంచి మిమ్ముల్ని పనుల్లోకి ఎవరు
పిలుచుకపోరు. ఇక మీరు ఇంటి దగ్గర ఉండండి.
కీర్తి : ఈ రోజు నుంచి మమ్ముల్ని ఎందుకు పనులకు తీసుకబోరు. మేము ఏం
పాపం చేసినమన్న! మమ్ముల్ని ఎందుకు పనుల్లోకి తీరుకోరు. మేము
బతకాలి కాదన్న.
బాలు : నేను మా అక్క చేసిన తప్పు ఏంటన్నా! ఎవరు ఏమి చెప్పిన బుద్దిగా పని
చేసుకుంటూ పోతున్నాం. మాట్లాడినా దానికంటే ఎక్కువ పని చేయించుకున్న
నేను మా అక్క ఏనాడూ ఎవరిని ఎదిరించి అడగలేదు.
భద్రన్న : ఎట్లా చెప్పితే మీకు అర్థమవుతుంది. ప్రభుత్వం ఈ రోజు నుంచి చిన్న
పిల్లలను పనిలోకి తీసుకోవద్దని గట్టిగా చెప్పింది. అలాకాదని ఎవరైనా
పనిలోకి తీసుకుంటే జైలుకు పంపిస్తామని గట్టిగా చెప్పింది.
కీర్తి : అరె అన్న ఆ ప్రభుత్వానికి ఏం తెలుసు మా బాధలు! నోటి మాటలు, పేపర్
మీదా రాతలు చూడటానికి వినడానికి బాగుంటాయి. కానీ ఆ మాటలు బువ్వ
పెట్టవు. ఆ రాతలు కడుపు నింపవు.
బాలు : చెప్పిన వాడు బాగుంటాడు. రాసిన వాడు బాగుంటాడు. మధ్యలో
నలిగిపోయేది మాలాంటి పేద పిల్లలే అన్న.
కీర్తి : అయిన కాళ్ళు చేతులు ఇచ్చిన దేవుడే కడుపు కూడా ఇచ్చాడు. ఆ
పొట్టకూటి కోసం దొంగతనాలు, దోపిడీలు చేయడం తప్పు కానీ, చేతనైన కూలీ
పని చేసుకోవడం తప్పు ఎలా అవుతుందన్న?
భద్రన్న : మీరు అడిగిన ఒక్క దానికి కూడా నా దగ్గర సమాధానం లేదు పిల్లలు. కానీ
ఒక్కటి మాత్రం చెప్పగలను. ఈ రోజు నుంచి మిమ్ముల్ని ఎవరు పనిలోకి
తీసుకోరు. అందుకు కారణం మీరు చిన్నపిల్లలుగా ఉండటమే, పుట్టడమే!
కీర్తి : మరి మాకు మాయలు, మాజిక్కులు తెలియవు కదా పెద్దగా అయ్యా డానికి!
వాయిస్ : ఎంత చెప్పిన ఈ పిల్లలు వినిపించుకునేలా లేరని ఏమి మాట్లాడకుండా
అక్కడి నుంచి భద్రన్న వెళ్ళిపోతాడు. బాధగా ఏడుస్తూ…ఆ అడ్డ మీదికి
కూలీల ఆకోసం వచ్చే వాళ్ళ దగ్గరకు పోయి మేము పనికి వస్తామని
బతిమాలి బతిలాలి అలిసిపోయి ఛీ కొట్టించుకుని చీవాట్లు తిని…ఇక చేసేది
ఏమి లేక బాధ నిండిన మనసులతో ఏడుస్తూ అడ్డ దగ్గరి నుంచి ఇంటికి
వస్తారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. చిన్నపిల్లలని చెప్పి ఎవరు పని
ఇవ్వరు. దాంతో అడుక్కోవడం మొదలు పెడతారు. అది పిసినారి గోవింద్
ఇళ్లని తెలియక ఆ ఇంటికే వెళ్ళి ఇంత అన్నం పెట్టమని అడుగుతుంటారు.
కీర్తి : అయ్యా…అమ్మా…ఎవరు లేరా ఇంట్లో! పేద పిల్లలం వచ్చాం…బాగా ఆకలిగా
ఉంది. ఏదైనా పెట్టండి.
బాలు : రాత్రి అన్నమైన పరువాలేదండీ. రొట్టెలు గట్టిగా ఉన్న ఇవ్వండి తింటాము.
వాయిస్ : అని కీర్తి, బాఊ అరుస్తూ ఉంటారు. హల్లో కూర్చున్న గోవింద్ కు కీర్తి, బాలు
అరుపులు వినబడిన, వినబడనట్టుగా కూర్చుని ఏవేవో లెక్కపు వేసుకుంటూ
ఉంటాడు. ఇంతలో అతని భార్య శారద, రాత్రి మిగిలిన అన్నాన్ని పట్టుకుని
వెళ్తుంటే, గోవింద్ కు ఒక ఆలోచన వస్తుంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు
అన్నట్టుగా అతడి ఆలోచన అతడికి ఉంది. దాంతో వెంటనే శారదను ఆగమని
చెప్పి, గోవింద్ బయటికి వచ్చి కీర్తి, బాలును లోపలికి తీసుకెళ్తాడు.
గోవింద్ : చూడండి పిల్లలు…ఇలా పని చేయకుండా అడుక్కుని తినడం వల్ల ఎక్కడ
లేని సోమరితనం వచ్చేస్తుంది. అందుకనీ ఏదైనా పని చేసుకుని బతకాలి.
కీర్తి : మాకేమన్నా సరదానా బాబుగారు..మాకు పని చేయలేనే ఉంది కానీ పనిచ్చే
వాడు లేడే !
గోవింద్ : నేనున్నాను కదా పిల్లలు! నేను చెప్పిన పని చేస్తే, ఈ అన్నంలో సగమన్నం
పెడతాను. దానికి మీరేమంటారు.
శారద : ఏమండీ…వాళ్ళు పిల్లలు…దేవుళ్ళతో సమానం! పిల్లలతో ఆటలు వద్దండీ!
గోవింద్ : తమరు కొంచెం మూస్తే !
వాయిస్ : అని చెప్పి కీర్తి, బాలును తీసుకుని పాతబడిన బావి దగ్గరికి వస్తాడు. వచ్చేది
వానా కాలం కదా! నీళ్ళు నిలువ పెట్టుకోవాలి. ఆ మట్టిని మొత్తం తవ్వమని
చెబుతాడు. కీర్తి, బాలు పని దొరికిందని ఆ బావిలో పెరుకుపోయిన మట్టిని
తవ్వి బయట పడేస్తుంటారు. అప్పుడు ఒక పెట్టె దొరుకుతుంది. ఆ పెట్టెను
గోవింద్ కు ఇవ్వబోతుంటే, అందులో ఏమైనా తిండిబోతు దెయ్యాలు ఉంటే
నా పనైపోతుందని గోవింద్, ఆ పెట్టని వద్దని పక్కన పెట్టేస్తాడు. అలా కీర్తి,
బాలు ఆ బావిలోని మట్టిని మొత్తం బయట పడేస్తారు. దాంతో సంతోష
పడుతూ గోవింద్ వాళ్ళకు సగం అన్నాన్ని పెట్టి…అందులో మరింత సగం చెరీ
సగం వేస్తాడు. కీర్తి, బాలు అన్నం తింటారు. నీళ్ళు తాగేసి అక్కడున్న పాత
పెట్టెను తీసుకుని తమ ఇంటికి వస్తారు కీర్తి, బాలు.
వాయిస్ : గోవింద్ చెప్పినట్టుగా ఇంటికి వచ్చిన తరువాత పెట్టె తెరుస్తాడు. అందులో
అంతా బంగారం ఉంటుంది. అసి చూసి పేద పిల్లలు ఆనంద పడతారు. వాళ్ళ
కష్టాలు తీరాయని సంబర పడతారు. బావి ఇచ్చిన పాత పెట్టె బంగారాన్ని
అమ్ముకుని సొంత ఇల్లు కట్టుకుని మంచి బట్టలు కొనుకుంటారు. అలాగే
మంచి స్కూల్లో జాయిన్ అవుతారు. బుద్దిగా చదువుకుంటూ ఉంటారు.
-0-
సింగిల్ లైన్ స్టోరీ
గోపాల పట్టణమనే ఊరిలో కీర్తి, బాలు అనే పేద పిల్లలు ఉంటారు. కూలీ పనులు చేసుకుంటూ బతుకుతూ ఉంటారూ. కొన్ని రోజుల తరువాత చిన్న పిల్లలను పనిలోకి తీసుకోవద్దని ప్రభుత్వం చెప్పడంతో కీర్తి, బాలును ఎవరు కూలీ పనిలోకి తీసుకోరు. దాంతో బాగా తెలిసిన భద్రన్నతో బాధపడుతూ ఉంటారు. అతను ఓదార్చి అడుక్కుని బతకమని చెప్పి అక్కడి నుంచి వాళ్ళను వదిలి పెట్టి వెళ్ళిపోతాడు. ఇక చేసేది ఏమిలేక కీర్తి, బాలు అడుక్కుంటూ పిసినారి గోవింద్ ఇంటి దగ్గరికి వెళ్ళి అడుకుంటూ ఉంటారు. పిసినారి బాగా ఆలోచించి అన్నం పెడతానని మట్టితో కూడుకుపోయిన బావిని బాగుచేయిస్తాడు. అప్పుడు ఆ పేద పిల్లలకు ఆ బావిలో ఒక పెట్టె దొరుకుతుంది. అందులో తిండిబోతు దెయ్యాలు ఉంటాయని పిల్లలకు ఇస్తాడు. కీర్తి, బాలు ఆ పెట్టెను తీసుకుని వెళ్ళి చూస్తారు. అందులో బంగారం ఉంటుంది. అది చూసి సంతోష పడుతూ ఆ బంగారాన్ని అమ్ముకుంటూ కొత్త ఇల్లు, కొత్త బట్టలు కొనుక్కుని బుద్దిగా చదువుకుంటూ ఉంటారు.
-0-
Related Posts

అండర్ గ్రౌండ్ ఇల్లు Underground House | Telugu Kathalu | Stories in Telugu| Panchatantra Kathalu

పేద పిల్లల చేపల పంట | Telugu Stories | Telugu Kathalu | Banana Dreams TV Telugu
