పేద పిల్లల మాయా మామిడి పండు ఇల్లు | Telugu Stories | Telugu Fairy Tales | Story World Telugu

 కీర్తి బాలు అనే ఇద్దరు అనాధ అక్క తమ్ములకి ఊరిలో ఒక ఇల్లు ఉండేది, అమ్మ నాన్నలు చనిపోయిన తరువాత ఉన్న ఆస్తితో బాలు కీర్తి అదే ఇంట్లో ఉన్నడబ్బులతో బ్రతుకుతుండేవారు, కానీ ఊరి వాళ్లందరికీ బాలు కీర్తి ఇంటిపైనే కన్ను ఉండేది, దానికి కారణం లేకపోలేదు, కారణం ఏంటంటే బాలు కీర్తి తల్లిదండ్రులు చాలా చాలా ధనవంతులు, పెద్ద ఇల్లు కట్టారు ఇంటి నిండా డబ్బే ఉండేది, అంత ఆస్తి ఉన్నా వాళ్ళు ఎప్పుడు పొగరుగా ప్రవర్తించేవారు కాదు, ఎవరికైనా అవసరం ఉందంటే ముందే ఉండేవారు, వారికి చేతనైనంత సహాయం చేసేవారు, అందువల్ల ఊరిలో బాలు కీర్తి తల్లిదండ్రులకు మంచి పేరు ఉండేది, కానీ కొన్ని నెలల క్రితం వేరే ఊరు పని మీద వెళ్లి వస్తుండగా కార్ ప్రమాదం లో అక్కడికక్కడే చనిపోయారు, అప్పటి నుంచి బాలు కీర్తి ఇద్దరే లంక అంత పేద ఇంట్లో ఉండేవారు, అమ్మ నాన్న లేని లోటు పూడ్చేవారు లేక తమలో తాము రోజు ఏడుస్తూ బ్రతికేవారు కానీ చొసి వారు అలా అనుకునే వాళ్ళు కాదు, అదే ఊరిలో విజయ అనే ఒక ఆవిడ ఉండేది, ఆవిడకు బాలు కీర్తి అన్నా వాళ్ళ కుటుంబం అన్న ఎంతో కోపంతో రగిలిపోతుండేది, బాలు కీర్తి అమ్మ నాన్న చనిపోయారని తెలిసి ఎంతో సంతోషపడింది. అలా ఉండగా ఒకరోజు బాలు కీర్తి ఉంటున్న ఇంటికి కొంత దూరం నిలబడి ఇలా అనుకుంటుంది

విజయ : ఈ ఇద్దరు పిల్లల ప్రాణానికి ఇంత పెద్ద ఇల్లు అవసరమా? వేల అమ్మ నాన్న ఎంత మందిని ముంచి ఉంటె ఇంత ఆస్తి  సంపాదించి ఉంటారు, పైకేమో మంచి వాళ్ళలా నటించడం వాళ్ళ అందరికి వాళ్ళ చేసే మోసం కనిపించదు, కేవలం మంచి వాళ్ళు అని మాత్రమే బ్రమిస్తున్నారు ఈ పిచ్చి జనం, అందరికి అన్ని పంచె వాళ్ళదగ్గర ఇంత డబ్బు ఎక్కడినించి వచ్చింది అని మాత్రం ఏ ఒక్కరు ఆలోచించారు, సరేలే ఎలా వస్తే నాకేంటి ఎంత మందిని మోసం చేస్తే నాకేంటి ఎలా గైన చేసి ఈ ఇంటిని నేను సంపాదించుకోవాలి అని అనుకుంటుంది. ఒక రోజు మంచి సమయం చూసి ఎవరు లేరని నిర్ణయించుకున్న తరువాత బాలు కీర్తి దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది.

విజయ : ఏమే కీర్తి, ఎరా బాలు గా ఇంత మంచిగా మీ అబ్బా సంపాదించిన సొమ్ము అన్నట్టు తెగ తిరిగేస్తున్నారు ఇల్లంతా లేవండి లేవండి తొందరగా బయటకు పోండి అని అంటుంది దౌర్జన్యంగా

బాలు : మా ఇల్లు అన్నట్టు ప్రవరాతించడం ఏంటి ఇది మా ఇల్లెగా? ఇంతకీ నువ్వు ఎవరు మా ఇంటికి వచ్చి మమ్మల్నే బయటకు పో అంటున్నావు అని అంటాడు

విజయ : ఏంటి మీ ఇల్లా మీ నాన్న ఈ ఇంటిని కట్టడానికి నా దగ్గర కొన్ని లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు, 3 సంవత్సరాలలో వాటిని తీరుస్తాను అన్నాడు, అలా తీర్చలేని పక్షం లో ఇంటిని జప్తు చేసుకోమని నాకు వీలునామా రాసిచ్చాడు ఈరోజుతో ఆ గడువు పూర్తయ్యింది చదువుస్తే చదువుకోండి కానీ ముందు ఇంటి నుంచి బయటకు వెళ్ళండి అని వీలునామా బాలు కీర్తి మీదకు విసిరేస్తుంది.

కీర్తి : మా నాన్న ఏంటి మీ దగ్గర అప్పు తీసుకోవడం ఏంటి? మా నాన్న దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, నీ దగ్గర అప్పు తీసుకున్నదంటే నమ్మ దానికి మేమేమి తెలివిలేని వాళ్ళం కాదు అని అంటుంది

విజయ : మీ నాన్న దగ్గర కోట్లు ఉంటె నాకేంటి ఆ కోట్లని నిజమేనా లేక మీకు తెలియకుండా ఇంకా ఎవరికైనా రాసిచ్చాడేమో నాకెలా తెలుస్తుంది నా దగ్గర అప్పు తీసుకున్నాడని చెప్పను కదా వెళ్ళండి ఇక్కడనుంచి అని బాలు కీర్త్తి ని ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొడుతుంది.

విజయ : హమ్మయ్య ఎలాగోలా చేసి వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాను ఇక ఇంత పెద్ద ఇల్లు నా సొంతం అని అనుకుంటూ ఆ ఇంట్లో నే ఉంటుంది.

బాలు కీర్తి విజయ ఇచ్చిన వీలునామా పట్ట్టుకొని ఊరి పెద్దమనిషి దగ్గరికి వెళ్తారు. జరిగిన విషయమంతా అతనికి చెప్తారు, అతని బాలు కీర్తి ఇంటికి వస్తాడు.

అతన్ని చూసిన విజయ షాక్ అవుతుంది.

పెద్ద మనిషి : ఏంటి విజయ ఇప్పుడు నీ కళ్ళు వీళ్ళ మీద పడ్డాయా? చిన్న పిల్లలని కూడా ఆలోచించకుండా ఎంత పని చేసావు, నువ్వు తాయారు చేసినిది దొంగ వీలునామా దీంతో నిన్ను పోలీసులకు కూడా పట్టించొచ్చు కానీ నేను ఆ పని చెయ్యడం లేదు, ఊరిలో ఏ ఒక్కరిని సంతోషంగా ఉండనివ్వవా నువ్వు ఛీ పో ఇంకొక సారి ఈ ఇంటి వైపు కానీ ఈ పిల్లా వైపు కానీ కన్నెత్తి చోసిన నిన్ను పోలీసులకు అప్పజెబుతాను అని బెదిస్తాడు. దాంతో విజయ బయపడి అక్కడనుంచి వెళ్లి పోతుంది.

బాలు : బాబాయ్ నువ్వు చేసిన సహాయానికి చాలా కృతజ్ఞతలు బాబాయ్, సమయానికి దేవుడిలా వచ్చి మమ్మల్ని కాపాడావు, నువ్వు గనక మాకు సహాయం చేసి ఉండక పోతే మా బ్రతుకు నానాశనం అయ్యి ఉండేది అని అంటాడు.

అలా కొన్ని రోజులు గడిచిపోతాయి, ఇది జరిగిన విషయం అందరియు మరిచిపోయినప్పటికీ విజయ ఇంకా మరిచిపోకుండా ఎలాగైనా పాగా తీర్చుకోవాలని చూస్తుంటుంది.

విజయ : బాలు కీర్తి మిమ్మల్ని ఏమి చేతనో చూడండి, నాకు దక్కని ఇంట్లో ఎంత దర్జాగా ఉంటున్నారు రా లాగండి మీ పని చెప్తాను అని అంటూ ఒక రోజు రాత్రి వచ్చి ఇంటిని కాల పెడుతుంది, లోపలే ఉన్న బాలు కీర్తి పొగాకు ఊపిరాడక బయటకు వచ్చేస్తారు, బాలు కీర్తి చూస్తుండగానే ఇల్లు మొత్తమ్ కాలిపోతుంది.

బాలు : అక్క మనకంటూ ఉన్న ఒక్క ఇల్లు కూడా కాలిపోయింది ఎవరో తెలియదు కానీ ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారు, మన అమ్మ నాన్నల జ్ఞాపకాలు కూడా ఇంటితో పాటు కాలిపోయాయి అని అంటూ బాలు కీర్తి ఏడుస్తూ ఉంటారు.

అలా రెండు మూడు రోజులు గడిచిపోతాయి,

బాలు : అక్క ఇక నా వల్ల కావడం లేదక్కా ఆకలికి చచ్చిపోయేలా ఉన్నాను కనీసం తినడానికి కూడా ఏమి లేవు అని అంటుంటాడు

కీర్తి : నాక్కూడా అలాగే ఉంది తమ్ముడు కానీ ఏమి చేద్దాం అని అంటుంది కీర్త్తి ఇంతలో వాళ్ళ పక్కనే ఉన్న ఒక మామిడి చెట్టు మించి రెండు కాయలు కింద పడతాయి ఎంతో ఆకలితో ఉన్న బాలు కీర్తి వెంటనే వాటిని తిందామని చేతిలోకి తీసుకుంటారు. వాళ్ళ చేతిలోకి రాగానే మామిడి పళ్ళు పెద్దగా అవుతుంటాయి అలా అయ్యి ఒక ఇల్లులా మారిపోతాయి, మాయా మామిడి పండు ఇల్లు మాట్లాడుతూ ఇలా అంటుంది.

ఇల్లు : పిల్లలు మీ అమ్మ నాన్న నేను అడవిలో జంతువుల కాళ్ళ మధ్యలో నలిగిపోతుంటే మీ అమ్మ నాన్న నన్ను నన్ను తీసుకొచ్చి రోజు నీరు పోస్తూ ఇంత దాన్ని చేశారు, ఈరోజు వాళ్ళ ఋణం తీర్చుకునే అవకాశం వచ్చింది, ఇది ఒక మాయా ఇల్లు ఇందులో మీకు కావలసిన ప్రతి ఒక్కటి దొరుకుతుంది, మీకు ఏమి కావాలన్న చెట్టు మొదటికి వెళ్లి చెప్తే చాలు, మీరు ఇంట్లోకి ఇల్లే లోపు అది వచ్చ్చేస్తుంది అని అంటుతోంది, బాలు వెంటనే వెళ్లి చెట్టు మొదలు దగ్గర నించొని మాకు చదువుకోవడానికి పుస్తకాలు కావలి అని అంటాడు, అనగానే కొని పుస్తాకాలు ప్రత్యక్షం అవుతాయి, కీర్తి చెట్టు మొదటి దగ్గరికి వెళ్లి మాకు చాలా ఆకలిగా ఉంది మాకు కొంత భోజనం కావలి అని అంటుంది. వెంటనే వాళ్ళ ముందు రకరకాల వంటలు ప్రత్యక్షం అవుతాయి. వాటిని కడుపునిండా తిని మాయా మామిడి పండు ఇంట్లో ఆనందంగా జీవిస్తుంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *