పేద పిల్లల మాయా రెక్కల ఆవు | Telugu Stories | Telugu Fairy Tales | Story World Telugu

వాయిస్ : సుందరయ్య పల్లి గ్రామంలో ఉండే కీర్తి, బాలు అనే ఇద్దరు పేద పిల్లలు, వాళ్ళ

            దగ్గర ఉన్న పాలిచ్చే ఆవును చూసుకుంటూ, ఆ పాలను అమ్ముకుంటూ

            ఉంటారు. పాలు అమ్మగా వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తూ ఉంటారు. ఒక

            రోజు సాయంత్రం  కీర్తి, బాలు ఇద్దరు కలిసి మేత కోసం పొలం దగ్గరికి వెళ్ళిన

           ఆవు, దూడను తీసుకుని ఇంటికి వస్తుంటారు.

బాలు : అక్క.. ఇలా రోజు ఆవు, దూడను కలిపి మేత కోసం పొలం దగ్గరికి తీసుకెళ్ళడం

          పెద్ద పనైపోతుంది. అలా కాకుండా ఉండటానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది.

   కీర్తి : అన్నీ ఐడియాలు పనికి రానివి. పని తప్పించుకునేటివి. అంతే కదా తమ్ముడు.

బాలు : అలా ఏమి కాదు. ఈ ఐడియా వల్ల ఇద్దరికీ ఉపయోగాలు ఉంటాయి.

   కీర్తి : ముందు నీ దగ్గర ఉన్న ఆ ఐడియా ఎంటో చెప్పు తమ్ముడు.  దాని వల్ల

          ఎవరికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో నేను చెప్తాను.

బాలు : ఇలా రోజు మేత కోసం ఆవు, దూడను తీసుకెళ్ల కుండా మనమే గడ్డిని కోసి

          తీసుకొచ్చి వాటికి మూడు పూటలా వేస్తే సరిపోతుంది ఏమంటావక్కా? 

   కీర్తి : బాగానే ఉంది తమ్ముడు..నాక్కూడా ఒక ఆలోచన వచ్చింది. అది నువ్వు

         చేయాలి. అప్పుడే ఆవు, దూడను ఒక దగ్గరాలా కాటేసి ఉంచుదాం తమ్ముడు.

బాలు : నీకొచ్చిన ఆలోచన చెప్పక్క!

   కీర్తి :  నిన్ను ఒక నాలుగు రోజులు గదిలో బందిస్తాను. నువ్వు ఆ గదిలో నాలుగు

          రోజులు ఉండ గలిగితే అప్పుడే నేను ఈ ఆవు, దూడను కూడా ఒక చోట

          కట్టేస్తాను.

వాయిస్ : అక్క కీర్తి చెప్పిన ఆలోచన తమ్ముడు బాలుకు  ఏ మాత్రం నచ్చలేదు.

            వెంటనే…

బాలు : వామ్మో..నాలుగు రోజులు నేను ఒకే గదిలో ఉండాలా! ఉండలేనక్క! ఒక గదిలో

         కట్టేసినట్టుగా ఉంటుంది. కాళ్ళు చేతులు ఆడవు.

  కీర్తి : కదా..ఆ ఆవు, దూడను కూడ ఒక దగ్గర కట్టేసి రోజు గడ్డి వేస్తుంటే వాటికి

        ఇబ్బందిగానే ఉంటుంది. జీవి ఏదైనా కానివ్వు తమ్ముడు…వాటి నైజాన్ని

        మర్చిపోవద్దు.

బాలు : భలే బాగా చెప్పావక్కా! నా అక్కవు అనిపించుకున్నావు.

వాయిస్ ; అలా కీర్తి, బాలు ఇద్దరు మాట్లాడుకుంటూ.. ఆవు, దూడను తోలుకుని

            ఇంటికి వస్తారు. ఇంటి ముందు ఉన్న పశువుల కొట్టంలో ఆవు, దూడను

            కట్టేస్తారు.

      కీర్తి : ఒరేయ్ తమ్ముడు..ఇంట్లోకి వెళ్ళి పాలు పితికే గిన్నె ఉంటుంది. తీసుకుని!

వాయిస్ : కీర్తి మాట చెప్పగానే బాలు ఇంట్లోకి వెళ్ళి పాలు పితికే గిన్నె తీసుకొచ్చి కీర్తికి

            ఇస్తాడు. కీర్తి ముందుగా దూడ చేత పాలు తాగించి, ఆ తరువాత పాలు

           పీతికి, పాల డబ్బాలో పోస్తుంది. రోజు సాయంత్రం పూట కూడా పాలు

           కొనేవాళ్లూ ఆ రోజు కూడా వస్తుంటారు. రంగయ్య వస్తాడు. అతనికి పాలు

           పోస్తుంది. శారద వస్తుంది ఆమెకు పాలుపోస్తుంది. వచ్చిన వారికి

           వచ్చినట్టుగా పాలు పోస్తుంది కీర్తి. పాలు తీసుకుని వెళ్లిపోతారు అందరూ.

          చీకటి పడగానే కీర్తి, బాలు అన్నం పెట్టుకుని తింటారు. ఆ తరువాత మంచంలో

          దుప్పటి కప్పుకుని పడుకుంటారు. ఓ అర్థరాత్రి వేళా..శంకర్ అనే పశువుల

           దొంగ, ఆ ఆవు, దూడ దగ్గరికి వస్తాడు దొంగలించాడీకి ! అతని రాకను

         గమనించలేని ఆవుకు బంగారు రెక్కలు ప్రత్యక్షమవుతాయి. అలా గాలిలోకి

           ఎగిరి, ఆకాశంలో అలా విహరించి తిరిగి కిందికి వస్తుంది. అది చూసిన శంకర్..

శంకర్ ; అంటే ఈ పేద పిల్లల దగ్గర మాయా బంగారు రెక్కల ఆవు ఉంది. వెంటనే ఈ

          విషయం పటేల్ కు చెప్పాలి. లేకపోతే కడుపు ఉబ్బి పేలిపోతుంది. నేను

          చచ్చిపోతాను.

వాయిస్ ; అని ఆ దొంగ శంకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కీర్తి, బాలు ప్రశాంతంగా

            పడుకుంటారు. మరుసటి రోజున కీర్తి, బాలు నిద్ర లేచే సరికి పటేల్ మనిషి

            సింగడు  కనిపిస్తాడు.

   కీర్తి : బాలు..వీడేవగో మన కంటే ముందు లేచి మన ఇంటి ముందున్నాడు.

బాలు : ఎవరన్న నువ్వు ? మా ఇంటి దగ్గర ఏమి చేస్తున్నావు ?

సింగడు : బయపడకండి.. నేనేమీ చేయను. మీరు, మీతో పాటు ఆ ఆవు, దూడను

            తీసుకుని పటేల్ దగ్గరికి రండి.

వాయిస్ : అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సింగడు. ఇక చేసేది ఏమీలేక బాలు,

            కీర్తి ఇద్దరు కలిసి ఆవు, దూడను తీసుకుని పటేల్ ఇంటికి వెళ్తారు. పటేల్

           బయటికి వస్తాడు. పటేల్ దగ్గర శంకర్ కూడా ఉంటాడు. కీర్తి, బాలు ఇద్దరు

          కలిసి పటేల్ దండం పెడతారు.

పటేల్ : ఏరా బాలు.. మీకు ఆ ఆవు దూడ ఎక్కడిరా!

బాలు : మావే పటేలా ! మా అమ్మనాన్న చనిపోతు మాకిచ్చిన ఆస్తి..పటేలా!

పటేల్ : సరే.. ఈ రోజు మా ఇంట్లా దవత్ ఉంది. పాలు చాలా కావాలి. ఆవు, దూడ మా

          ఇంటి దగ్గరే ఉండనివ్వు.

వాయిస్ : ఏమి మాట్లాడకుండా బాలు, కీర్తి.. ఆవు, దూడను వదిలిపెట్టి వెళ్లిపోతారు.

           రాత్రి అవుతుంది. ఆవుకు బంగారు రెక్కలు రాలేదు. దాంతో శంకర చెప్పింది

          అబద్దమని తేలింది. వాడిని తీట్టి పంపిస్తాడు. ఉదయం బాలు, కీర్తి వెళ్ళి ఆవు,

            దూడను తెచ్చుకుంటారు. ఒక రోజు రాత్రి… కీర్తి, బాలు పడుకుంటారు. శంకర్

            వచ్చి ఇంటికి, కొట్టానికి నిప్పు పెడతాడు. అంతే కీర్తి, బాలు బయటికి

            వస్తారు. ఆవుకు వెంటనే బంగారు రెక్కలు ప్రత్యక్షమవుతాయి. అది చూసి,

            కీర్తి, బాలు షాక్ అవుతారు.

రెక్కల ఆవు : పిల్లలు మంటలు ఎక్కువగా వ్యాపించేలా ఉన్నాయి. నా మీద ఎక్కి

                కూర్చోండి

వాయిస్ : అని చెప్పగానే కీర్తి, బాలు ఎక్కి ఆవు మీదా కూర్చుంటారు. అంతే అక్కడి

            నుంచి తన దూడను తీసుకుని బంగారు రెక్కల ఆవు ఆకాశంలోకి

            ఎగురుతూ పిల్లలను మరొక చోటుకు తీసుకెతుంది. కిందా వాలుతుంది. కీర్తి,

            బాలు ఆవు మీది నుంచి కిందకు దిగుతారు.

   కీర్తి ; గోమాత..నువ్వు మాయా బంగారు రెక్కల ఆవువా !

ఆవు ; అవును పిల్లలు.. అయిన నేను మిమ్ముల్ని ఏమి చేయను నా గురించి మీరు

          బాధపదొడ్డు. భయపదొడ్డు. నేను మీతో ఉండటం వల్ల నీకు సంతోష, డబ్బులు

          హోదా కలుగుతుంది. అందుకనీ మీరేమీ గుడ్డిగా ఎవరు చెప్పిన నమ్మకండి.

         పాలు పీతికి ఎప్పటిలాగే అమ్ముకోండి. అలా వచ్చే డబ్బులతోనే సంతోషంగా

          బతకండి. ఎప్పుడైనా షికారుకు వెళ్లాలనిపిస్తే చెప్పండి..నా మీదా కూర్చుండ

         బెట్టుకుని ప్రపంచం మొత్తం తిప్పుతాను.

బాలు ; రెక్కలతో నిన్ను ఎవరైనా చూస్తే..

ఆవు : చూసిన కళ్ళు కనబడవు. చెప్పినోరు మాట్లాడదు. చూపించిన చేయి కదలదు!

వాయిస్ : ఆ రోజు నుంచి కీర్తి, బాలు..పాలు పీతికి అమ్ముకుంటూ, అప్పుడప్పుడు

             విహార యాత్రకు వెళ్ళేవాళ్లు.

-0-

పేద పిల్లలైన కీర్తి, బాలు..తమ దగ్గర ఉన్న ఆవు, దూడను చూసుకుంటూ పాలు పీతికి అమ్ముకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్నది బంగారు రెక్కల ఆవు అని వాళ్ళకు తెలియదు. రోజు రాత్రి పూట అందరూ పడుకున్న తరువాత…ఆవుకు బంగారు రెక్కలు వచ్చి ఆకాశంలో ఎగురూతూ ఉంటుంది. అది ఒక రోజున ఒక దొంగ చూస్తాడు, వెళ్ళి ఆ విషయం..ఆ ఊరి పటేల్ కు చెప్తాడు. అతను కూడా నిజామా కాదా అని తెలుసు కోవడానికి తన దగ్గర పెట్టుకుంటాడు. కానీ ఆ ఆవు.. మాయా ఆవు కాదని ఆ పెద్దమనిషి అక్కడి నుంచి పంపిస్తాడు. దాంతో ఆ దొంగ పిల్లలు, ఆవు ఉంటున్న ఇంటికి కాల్చేస్తాడు. దాంతో రెక్కల ఆవు…కీర్తి, బలును అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. అది చూసిన వాళ్ళ కళ్ళు పోతాయి. మాట పడిపోతుంది.

-0-

Add a Comment

Your email address will not be published. Required fields are marked *