పేద పిల్లల మాయా వంతెన Episode 76 | Telugu Stories | Telugu Fairy Tales | Story World Telugu

వాయిస్ : దట్టమైన అడవి పక్కనే ఉన్న చిన్న పల్లెటూరు అది. ఆ ఊరిలో కీర్తి, బాలు

            అనే ఇద్దరు పేద పిల్లలు ఉంటారు. అడవిలో దొరికే మూలికలు తీసుకొచ్చి, ఆ   

            ఊరి ప్రజలకు నాటు వైద్యం చేస్తూ, అలా వచ్చే సంపాదనతో జీవిస్తూ

            ఉంటారు. వీళ్ళకు జన్మనిచ్చిన అమ్మ నాన్న లేరు. అలాగే ఆదరించే

            బంధువులు కూడా లేరు. అయిన ఏ మాత్రం భయపడకుండా, ఈ ఊరంతా

             కుటుంబం నాది అంటూ ఆ ఊరి ప్రజలతో కలుపుగోలుగా మాట్లాడుతూ ప్రతి

             ఒక కుటుంబ రేషన్ కార్డులో వాళ్ళ పేర్లు రాయించుకునేంత ప్రేమగా కలిసి

             పోయి బతుకుతూ ఉంటారు.

             ఆ ఊరు నుంచి టౌన్ కు గానీ, చుట్టాల బందువుల ఇంటికి గానీ, చావు

             బతుకులా కోసం గానీ, పెళ్లి పెరంటాల విందుకు కానీ పోవాలంటే, ఆ ఊరు

            నుంచి అవతలి వైపుకు కొండ ఎత్తున రెండు పొడవాటి బలమైన కర్రలను

            కట్టుకుని, వాటిని వంతెనగా వాడుకుంటూ జాగ్రత్తగా రాకపోకలు సాగిస్తూ

            ఉంటారు. ఏదైనా కాలు జారిన, ఎప్పుడైనా చేయి జారిన ఈ భూమ్మీద

             నూకలు చెల్లిపోతాయి. కాదు ఇంకా మిగిలే ఉన్నాయనుకుంటే కాలు,

             చేతులు ఎక్కడికక్కడ విరిగిపోయి బతుకంత నరకాన్ని మోస్తూ బతకాలి.

             ఇలాంటి ప్రమాధాలు జరగకుండా ఉండాలంటే ఆ దేవుడే ఒక మాయా

              వంతెనను వేయాలంటూ వేడుకునే వాళ్ళు.       

వాయిస్ : ఒక రోజున నాటు వైద్యానికి ఉపయోగపడేలా మూలికలు అమ్ముతు

            ఉంటారు.

      కీర్తి : రావాలమ్మా రావాలి…తుమ్ముకు మూలిక, దగ్గుకు మూలిక, జ్వరానికి

            పసరు, కడుపు నొప్పికి పసరు. కాళ్ళ నొప్పులకు కట్టే పుల్ల. చేతి నొప్పులకు

            చేదాకు పౌడర్…ఇలా ఒకటేమి అన్నీ రోగాలకు మా దగ్గర అడవి మూలికల

           వైద్యం లభించును తల్లి !

   బాలు : రండి బాబు రండి…మీ రోగం చెప్పండి. అడవి తల్లి ఇచ్చే ఆకు మందును

            తీసుకెళ్లి వాడండి. ఆరోగ్యంగా బతకండి. అడవి తల్లి ఆకుల మందులు రండి

           తల్లులు రండి !

వాయిస్ : కీర్తి, బాలు అరుస్తూ ఉంటారు. నొప్పుల రోగాలు ఉన్నవాళ్ళు ఆ పేద పిల్లల

            దగ్గరికి వచ్చి, వాళ్ళ రోగం చెప్పి, ఆ పిల్లలు ఇచ్చే మూలికో, పసరో, లేదంటే

            ఆకు వక్క సున్నమో…ఏది ఇచ్చిన తోచినంత ఆ పిల్లలకు ఇచ్చి ఆ పిల్లలు

            ఇచ్చేది తీసుకెళ్తూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున

            పేద పిల్లలు మూలికలు అమ్ముతుండగా, బాధ పడుతూ, ఏడుస్తూ

            భూమయ్య అనే రైతు ఆ పిల్లల దగ్గరికి వస్తాడు. అతనిని చూసి బాధ

             పడుతూ అడుగుతారు.

    కీర్తి : ఏమైంది పెద్దయ్య ? ఎందుకు ఏడుస్తున్నావు? పెద్దమ్మ ఏమైనా అన్నదా!

  బాలు : నువ్వు అన్న మళ్ళీ గొడవ పెట్టుకుంటిరా !

భూమయ్య : లేదమ్మ లేదు. పిల్లలు తల్లిదండ్రుల నుంచి వేరు కాకుండా ఉండేలా

                ఏదైనా మందు ఉంటే ఇవ్వు తల్లి. మీకు కావాలంటే రెండు రూపాయలు

                ఎక్కువగా ఇస్తాను.

వాయిస్ : భూమయ్య అలా అనే సరికి విషయం మొత్తం అర్థమయింది ఆ పేద

            పిల్లలకు! అదే…పెళ్లి అయింది. ఇంటి దగ్గర నాకు నా భార్యకు సుఖం లేదని,

            సంతోషం లేదని వేరే కాపురం పెడతానని ఇంటి దగ్గర భూమయ్య కొడుకు

            అఖిల్ గొడవ చేస్తున్నాడని! అప్పుడు ఆ పేద పిల్లలకు…నిజంగా ఇలాంటి

            మానసిక తతంగాలకు మందు ఉంటే ఎంత బాగుండును. అది కట్టే పుల్ల

             కావొచ్చు, కాకర కాయ పసరు కావొచ్చు. కారెపాకు జ్యూస్ కావొచ్చు…

             ఏదైనా ఉందంటే అలాంటి దానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కదా!

             భూమయ్య బాధపడుతూ…

భూమయ్య : ఉన్న ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చేసుకుని వేరే కాపురం పెడతానని గోలా

                చేస్తుంటే ఈ తండ్రి మనసు తట్టుకోవడం లేదురా పిల్లలు! ఏదైనా

               చేయండిరా?

      కీర్తి : పద పెద్దయ్య ! ఇంటి దాకా పోదాం !

వాయిస్ : అని ఆ పేద పిల్లలు, భూమయ్యతో కలిసి అతనికి ఇంటికి వస్తారు. ఇంటి

             దగ్గర పెట్టె పట్టుకుని, భార్య కాంచనతో, ఏడుస్తున్న కొడుకు దినేష్ ను

             ఎత్తుకుని బయటకు పోవడానికి సిద్దంగా ఉంటాడు. అక్కడికి వచ్చిన కీర్తి,

             బాలు పరిస్థితిని గమనించి, గొడవ బాగా ముదిరిపోయిందని అర్థం

             చేసుకుంటారు. ఈ సమస్యకు పరిష్కారం కూడా ఆలోచిస్తారు. వెంటనే కీర్తి,

            అఖిల్ దగ్గరికి వెళ్తుంది.

   కీర్తి : ఏడుస్తున్న కొడుకును ఎత్తుకుని ఎక్కడికి వెళ్తున్నావన్నయ్య.

అఖిల్ : ఇటు నా తల్లికి అటు వీడి తల్లికి దూరంగా ఎక్కడికో వెళ్ళి బతుకుతాను కీర్తి. ఈ

          అత్తాకోడళ్ళ గొడవలో రోజు బలైపోవడం నా వల్ల కాదు. పాతికేళ్ళ తల్లికి

          భార్యాభర్తల బంధం అర్థం కావాలి కదా! ఇక్కడ మా అమ్మ అర్థం చేసుకోదు.

           అదే పాతికేళ్లు తల్లి ప్రేమను పంచే స్థితిలో ఉన్న భార్యకు అర్థం కావాలి కదా

           తల్లీకొడుకల బంధం ! నేను మోస్తున్న ఈ రెండింటి బాధలు చాలు నాకు.

           అందుకే నా కొడుకును తీసుకుని నేను వెళ్లిపోతున్నాను.

వాయిస్ : అఖిల్ బాధను కీర్తి, బాలు అర్థం చేసుకున్నారు. ఆవుకు దూడ కావాలి.

            దూడకు ఆవు కావాలి. అలాగే ఆవు జన్మ సార్థకతకు తోడు ఎద్దు కావాలి. ఆ

            ఎద్దు నీడకు ఒక ఆవు కావాలి. ఇది అర్థమయ్యేలా కీర్తి, బాలు నచ్చజెప్పి  ఆ

            కుటుంబాన్ని కలిపేస్తారు. దాంతో భూమయ్య సంతోషం పట్టలేక కీర్తి, బాలుకు

            ఆ రాత్రి వాళ్ళ గుడిసెలో భోజనం పెడతాడు కోడికూరతో! అలా రోజులు

             గడుస్తూ ఉంటాయి. కర్ర సహాయంతో ఏర్పాటు చేసుకున్న వంతెనల మీదా

            ఏదొక ప్రమాదం జరుఫుతూనే ఉంది. ఎప్పుడు చూడు ఎవరో ఒకరు కారు,

            చేయి జారీ చనిపోతునే ఉన్నారు.

వాయిస్ : ఒక రోజున మూలికల కోసం అడవికి వెళ్ళిన కీర్తి, బాలుకు బాగా దాహంగా

            ఉంటుంది. వాళ్ళ దగ్గర చెక్క సీసాలో నీళ్ళు కొన్నే ఉంటాయి. ఆ నీళ్ళను

            తాగాలని చూస్తుండగా, వాళ్ళకు ఎక్కడి నుంచో దాహం దాహం అంటున్న

            మాటలు వినబడుతాయి. అటుగా వెళ్ళి చూస్తారు. అక్కడ కిందా పడి దాహం

            దాహం అంటున్న ఒక మహర్షి కనిపిస్తాడు. ఆ నీళ్ళను మహర్షికి తాగిస్తారు.

            కాసేపటికి మహర్షి కోలుకుంటాడు. కీర్తి, బాలును చూస్తూ…

మహర్షి : పిల్లలు…నీ దాహాన్ని పక్కన పెట్టి నా దాహం తీర్చి నన్ను బతికించారు.

           మీకేమి కావాలో కోరుకొండి. మీరు అన్నుకున్నది నేరవేరేలా ఒక వారం

            ఇస్తాను. అది కూడా ఒకటంటే ఒకటే అవకాశం ఉంటుంది. అప్పుడు కీర్తి,

           బాలు…ఇద్దరు కలిసి ఆ ఊరికి ప్రమాదకంగా ఉన్న వంతెన గురించి

            అడుగుతారు.

మహర్షి : తాదాస్థ్ పిల్లలు. మీరు కోరినట్టుగా ఆ వంతెన ఒక ఇకా మీద మాయ వంతెన

           అవుతుంది. చూడటానికి కర్రలతో కనిపిస్తుంది కానీ ఎవరు నడిచిన సిమెంట్

            తో గట్టిగా కట్టిన వంతెనలా మారిపోతుంది. ఇకా అప్పటి నుంచి ఆ వంతెన

             మీద ఎలాంటి ప్రమాదాలు జరగవు. అందరూ ఆ వంతెనను చూస్తూ ఇది

             పేద పిల్లల మాయా వంతెన అంటూ చెప్పుకుంటూ ఉంటారు. 

-0-

సింగిల్ లైన్ స్టోరీ

దట్టమైన అడవి పక్కనే ఉన్న మారుమూల పల్లెటూరిలో కీర్తి, బాలు అనే ఇద్దరు పేద పిల్లలు ఉంటారు. వాళ్ళు అడవిలో దొరికే నాటు వైద్యం మూలికలతో నాటు వైద్యం చేస్తూ అలా వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తూ ఉంటారు. ఆ ఊరు నుంచి రాకపోకలు సాగించాలంటే కర్రల ఏర్పాటు చేసుకున్నా వంతెన ఒక్కటే మార్గం ! కానీ అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అయినప్పటికి మరొక మార్గం లేక ఆ కర్రల వంతెనను వాడుతూ ఉండేవాళ్లు. ఒక రోజున కీర్తి, బాలు నాటు వైద్యానికి కావల్సిన మూలికల కోసం వెళ్లినప్పుడు అక్కడ ఒక మహేర్షి  దాహమంటూ అల్లాడుతుంటే కీర్తి, బాలు తమ దగ్గర నీళ్ళతో ఆ మహర్షి దాహం తీరుస్తాడు. అప్పుడు కీర్తి వాళ్ళు జరుగుతున్న ప్రమాధాల గురించి చెప్తాడు. దాంతో ఆ మహర్షి ఒక మాయా వంతెనను ప్రసాదిస్తాడు.

-0-

Add a Comment

Your email address will not be published. Required fields are marked *