పేద పిల్లల మాయ ఆవులు Episode 65 | Telugu Stories | Telugu Fairy Tales | Story World Telugu

ఆనందపురం అనే గ్రామంలో బాలు కీర్తి అనే ఇద్దరు అనాధ పిల్లలు ఉండేవారు, వాళ్ళ అమ్మ నాన్న చనిపోయిన తరువాత ఇద్దరు తమకు తెలిసిన పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉండేవారు ఒకరోజు బాలు కీర్తి దగ్గరకి వచ్చి
బాలు : అక్క మన దగ్గర ఉన్న ఆవు పాలు పితికి ఊరిలో అమ్మి రోజు వచ్చే డబ్బులతో.మనం బ్రతుకుతున్న కానీ ఇంకా కొన్ని రోజుల్లో మన ఆవు పాలు ఇవ్వడం మానేస్తుంది, ఎప్పుడు మన పరిస్థితి ఏంటో నాకు అర్దం కావడం లేదు, మన ఆవు పాలు ఇవ్వడం మానేస్తే మన పరిస్థితి అగమ్య గోచరం అని అంటాడు.
కీర్తి: తమ్ముడు నువ్వు చెప్పింది అన్ని రకాలుగా కూడా నాకున్సమ్మతమే అని అనిపిస్తుంది, కానీ నేను ఇంతకు ముందే చాలా మంది నీ అడిగి చూసాను పని కోసం కానీ ఎవ్వరూ ఇవ్వడం లేదు, ఇక చూడాలి మన ఆవు ఏమి చేస్తుందో అని
అలా బాలు కీర్తి తాము పెంచుకుంటున్న ఆవు పలు పితికి ఆ పాలను ఊరిలో అమ్మి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు, అలా ఉండగా ఒక రోజు కీర్తి ఆవుతో మాట్లాడుతూ ఇలా అంటుంది.
కీర్తి : ఓ ప్రియమైన ఆవు నువ్వు మా అమ్మ నాన్న చనిపోయినప్పడు నుండి నన్ను బాలు నీ ఎంతొప్పెమగా చూసుకుంటూ ఉన్నావు, నీ కడుపులో పుట్టిన బిడ్డకి ఇచ్చె పాలకంటే మాకు ఇచ్చె పాలే ఎక్కువ, మెమ్ కనీసం నువ్వు సరిగ్గా తినే గడ్డి వేసే పరిస్థితుల్లో కూడా లేను, మేమున్నీకునిచిన దాట్లోనే సంతోషంగా ఉంటూ మమ్మల్నించల్లగా చూడు అని అంటుంది
ఇలా కొన్ని రోజులు గడుస్థాయి.
బాలు కీర్తి పెంచుకుంటున్న ఆవు ఒకరోజు అనుకోకుండా కుప్పకూలి పడిపోతుంది. అది చూసిన బాలు కీర్తి ఆవు దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటారు అవుతో
బాలు : అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది, బంగారం లాంటి నా ఆవు ఇలా కుప్పకూలిపోయంది ఎంటి? ఇప్పుడు నీకేమైనా జరిగితే నే బిడ్డ పరిస్థితి ఎంటి, మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు నుంచి కన్న బిడ్డల్లా చూసుకుంటూ ఉన్నావు మమ్మల్ని ఇప్పటికే ఊరిలో అందరూ మమ్మల్ని అనాధ పిల్లలు అని అంటున్నారు, ఇప్పుడు నువ్వు కూడా లేకపోతే మేము అనాధ పిల్లలను అయ్యాము అని మాకు కూడా అనిపిస్తుందని ఏడుస్తూ ఉంటాడు.
పక్కనే ఉన్న కీర్తి కూడా ఎంతో బాధ పడుతూ ఉంటుంది. ఇంతలో ఆవు మాట్లాడుతూ
ఆవు ; బాలు కీర్తి ఇన్ని రోజులుగా మీరు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు ఇప్పటి నుండి నా బిడ్డ బాధ్యత కూడా మీదే, నా దగ్గర నా చిన్నప్పుడు ఒక స్వామీజీ ఇచ్చిన వరం ఉంది, ఆ వరం నేను చనిపోతున్న సమయంలో మాత్రమే వాడగలను అందుకే ఇప్పుడు వాడుతున్నాను అని అంటుంది.
అన్న వెంటనే ఆవు మాయా మూడు ఆవులను ప్రత్యక్షం చేస్తుంది.
ఆవు ; చూడండి పిల్లలు ఈ మూడు ఆవులు ప్రత్యేక శక్తులు కలిగినవి, అని చెప్పి ఆవు చనిపోతుంది.
ఆవుని ఖననం చేసిన తరువాత బాలు కీర్తి ఎంతో బాధపడుతూ ఉంటారు, అలా బాధ పడుతున్నప్పుడు అటుగా వెళ్తున్న స్వామీజీ వాల్లని చూస్తాడు, స్వామీజీ వాళ్ళ దగ్గరికి వచ్చి
స్వామీజీ : పిల్లలు మీరు ఇంతలా బాధపడుతున్నారు ఏమి జరిగింది అని అంటాడు
కీర్తి జరిగిన విషయమంతా చెబుతుంది స్వామీజీకి
స్వామీజీ : చూడండి పిల్లలు ఇన్ని రోజులు మీ దగ్గర ఉన్న ఆవు కొన్ని సంవత్సరాల క్రితం నా ఆశ్రమం లో ఉండేది, ఆ ఆవు ఏ ఒక్కరోజు కూడా శ్రమ అనకుండా సేవలు చేస్తూ ఉండేది, అందువల్ల నేను తనని చూసుకున్న వాళ్లకి ఒక వరం ఇవ్వొచ్చు అని తనకి వరాన్ని నేనే ఇచ్చాను, అని చెబుతాడు స్వామీజీ
కీర్తి : మాయా మూడు ఆవులు ఇప్పుడు మా దగ్గరే ఉన్నాయి కానీ అవి మాకెలా ఉపయోగపడతాయి అని అడుగుతుంది.
స్వామీజీ : అవ్వీ మూడు మాయా ఆవులు, ఒక్కొక్క అవ్వు వారికంటూ ప్రత్యేక శక్తులు కలిగినవి, మీరు వెళ్లి కోరికలు కోరుకుంటే అవి తీరుస్తాయి, కానీ మీరు అత్యాశకు పోతే మాత్రం మాయా ఆవులు మాయమయి పోతాయి అలాగే మీరు అప్పటివరకు మాయా ఆవుల వల్ల పొందిన వాటిని కూడా కోల్పోతారు అని చెప్తాడు
ఆరోజు నుండి కీర్తి బాలు తమకు కావలసిన వాటిని మాత్రమే వరంగా కోరుకుంటూ ఉంటారు
అలా ఉండగా ఒకరోజు కీర్తి బాలు తో
కీర్తి : తమ్ముడు మనకు కావలసినవి అన్ని ఇలా మాయ మూడు ఆవులు ఇస్తున్నాయి, దానివల్ల మనం లాభం పొందుతున్నామని అనుకుంటున్నాం కానీ అసలు నిజం ఏంటంటే మనం ఏ పని చేయకుండా అన్ని ఆవాసాలు తీరడం వల్ల మనం పని చేత కానీ వాళ్ళలా అయ్యే అవకాశం ఉంది, కాబట్టి మనం ఇక ఈ మాయ ఆవుల మీద ఆధారపడడం మంచిది కాదు, అని అంటుంది
బాలు : అవునక్క నాకు కూడా అలానే అనిపిస్తుంది, మనం వీటిని వదులుకోవడం కూడా సరైన పని కాదు కానీ మనం మన కోసం మాయ మూడు ఆవుల దగ్గర ఏమి కోరుకోకూడదు, మన వల్ల ఇతరులు ఎవరైనా సహాయం పొందుతున్నప్పుడు మాత్రమే వీటి శక్తులని వాడుకుందాము అని అంటదు బాలు
దానికి కీర్తి కూడా సరే అంటుంది, ఇక ఆరోజు నుంచి వాళ్లిద్దరూ మాయ ఆవుల మీద ఆధారపడకుండా వాళ్లకు తోచిన పని చేసుకుంటూ బ్రతుకుతుంటారు, ఎవరైనా ఆపదలో లేదా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వెంటనే మాయ మూడు ఆవుల సహాయం తో వారికి సహాయం చేస్తారు
ఇలా ఊరిలో అందరికి సహాయం చేయడం వల్ల బాలు కీర్తి లకు ఊరిలో ఎంతో మంచే పేరు వస్తుంది, అదంతా గమనించిన బాలు కీర్తితో ఇలా అంటాడు
బాలు : అక్క ఇన్ని రోజులుగా మనని కనీసం పట్టించుకోని ఈ ప్రజలు ఇప్పుడు మనకి జేజేలు కొడుతున్నారు, మనం ఇప్పుడు ఇలా ఉన్నామంటే దానికి కారణం మాత్రం మన ఆవే, మన ఆవు చనిపోతూ చనిపోతూ మనకి ఈ మాయా మూడు ఆవుల్ని ఇచ్చింది, వాటి వల్లనే మనకి ఊరిలో ఇంత గొప్ప పేరు వచ్చింది, అని అంటాడు
కీర్తి : అవును రా తమ్ముడు, మన ఆవు వల్లనే మనకి ఇంత గొప్ప పేరు వచ్చింది, మనం జీవితాంతం ఆవుకి రుణపడి ఉండాలి, దానికోసం ఇప్పుడు మనం ఏమి చేయలేము, దాని బిడ్డని గొప్పగా చూసుకోవడం తప్ప అని అంటుంది కీర్తి
అలా రోజు రోజుకు కీర్తి బాలు ల పేరు ఊరిలో గొప్పగా మారిపోతుంది. బాలు కీర్తి ఆనాధలు అని బాధపడేవారు ఇంతకు ముందు కానీ ఇప్పుడు మాత్రం ఊరి ప్రజలందరూ వాళ్ళని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *