పేద పిల్లల మాయ కోడి | Telugu Stories | Telugu Fairy Tales | Story World Telugu

ఆనందపురం అనే ఒక గ్రామం లో కీర్తి బాలు అని ఇద్దరం అది పిల్లలు ఉండేవారు. కీర్తి బాలు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయినప్పుడు నుండి కొళ్లని పెంచుతూ బతికేవారు, ఒకరోజు బాలు కి దగ్గరికి వచ్చి

బాలు ; అక్క మనం ఎన్ని రోజులు ఈ ఊర్లో మాత్రమే కోళ్లను పెంచడం మన కోళ్ల పెంపకం ని వేరే ఊరికి కూడా విస్తరిస్తే మరి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని అంటాడు

కీర్తి ; తమ్ముడు మన దగ్గర డబ్బులు లేవు కదా మనం ఇంక కోళ్లను ఎక్కువ ఎలా చేస్తాము? ఇప్పుడు ఉన్నవాటిని అమ్ముకుంటే వచ్చిన డబ్బులు మన తినడానికి సరిపోతాయి ఇంకా ఎక్కువ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటుంది

బాలు : అక్క మనం ఇలా ఆలోచిస్తూ పోతే ఎప్పటికీ ఇలానే ఉండిపోతాం ఎలాగోలా చేసి మనం ఎక్కువ డబ్బులు సంపాదించి ఇంకా మన వ్యాపారాన్ని విస్తరింప చేయాలి అని అంటాడు

కీర్తి : సరే తమ్ముడు నువ్వన్నట్టు చూద్దాంలే కానీ ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు ఉన్న కోళ్లను ఆలోచిద్దాం

బాలు : అక్క అక్క మన దగ్గర ఉన్న కోళ్ల అన్నిటినీ అమ్మడానికి నా దగ్గర ఒక ఉపయాముంది అని అంటాడు.

కీర్తి ; నీ దగ్గర అపాయమా ఏంటి తమ్ముడు అది చెప్పు మనకు ఉపయోగ పడుతుందేమో చూద్దాం అని అంటుంది.

బాలు : ఏమి లేదక్కా అడవిలో మందులు వాడని కల్తీ లేని ఆహారం దొరుకుందన్న విషయం అందరికి తెలిసిందే కదా, మనం మన కోళ్ళకి ఊరిలో అమ్మే మందులు కలిపినా ఆహారం పెడుతున్నాము, ఇప్పడూ మనం వాటికి కృత్రిమ ఆహారం పెట్టకుండా వాటిని అడవిలో వదిలేసి మనం వాటిని కాపలా గా ఉన్నామనుకో అవ్వి సహజంగా దొరికిన వాటిని తిని దృడంగా తయారవుతాయి అప్పుడు మనం వాటిని తీసుకెళ్లి వేరే ఊరిలో నాటు కూలీలు అని చెప్పి అమ్మి చాలా డబ్బులు సంపాదించవచ్చు అని అంటాడు.

కీర్తి : నీ ఆలోచన చాలా బాగుంది తమ్ముడు మనం ఇప్ప్పుడే మన  కోళ్ళని అడవికి తీసుకేల్దాము అని అంటుంది

బాలు కీర్తి కలిసి తమ దగ్గర ఉన్న కోళ్ళని అడవిలోకి తీసుకెళ్తారు. కోళ్ళని అడవిలో రెండు మూడు రోజులు ఉంచుతారు.

తరువాత పక్క ఊరికి తీసుకెళ్ళి వాటిని అమ్ముతుంటారు.

బాలు : కోళ్ళమ్మ కోళ్లు స్వచ్ఛమైన నాటు కోళ్లు, కృత్రిమ ఆహారం తినకుండా సహజమైన వనసంపద తిని పెరిగిన కోళ్లు అండి, తింటే సహజమైన కొల్లనే తినాలి, లేకుంటే ఊరుకోవాలి అనవసరంగా మందులు వాడిన కోళ్ళని తిని మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి అని అరుస్తూ కోళ్ళని అమ్ముతుంటారు బాలు కీర్తి.

బాలు కీర్తి పట్టుకెళ్లిన కోళ్లు అన్ని ఒక్క రోజులోనే అమ్ముడవుతాయి, తిరిగి ఇంటికి వచ్చిన తరువాత కీర్తి బాలు తో ఇలా ఇలా అంటుంది.

కీర్తి : తమ్ముడు నీ ఆలోచన ఎంత గొప్పగా పనిచేసింది రా, ఇక మనం ఇలానే కోళ్ళని అమ్ముతూ చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు అని అంటుంది.

ఇంతలో మహేష్ అనే వ్యక్తి వస్తాడు,

మహేష్ : బాలు కీర్తి అంటే మీరేనా అని అడుగుతాడు.

కీర్తి మెల్లగా మహేష్ దగ్గరికి వచ్చి

కీర్తి : అవునండి, నేను కీర్తి వీడు నా తమ్ముడు బాలు ఎం జరిగిందండి, మీరు యిక్కడికి వచ్చి మా గురించి ఎందుకు అడుగుతున్నారు అని అడుగుతుంది

మహేష్ : ఎం లేదమ్మా మీరు నిన్న మన పక్కన ఉన్న ఊరిలో కొన్ని సహజమైన కోళ్ళని అమ్మరంట కదా వాటిని వండిన తరువాత వాటి రుచి చాలా గొప్పగా ఉంది, అది మా వాళ్లందరికీ ఎంతగానో నచ్చింది మాకు ఇంకొక వారమ్ రోజులలో ఒక వేడుక ఉంది మీరు ఆ వేడుకకి కొన్ని కోళ్ళని అమ్మాల్సి ఉంటుంది అని అంటాడు. ఇంతలో బాలు ముందుకు వచ్చి ఇలా అంటాడు

బాలు : మా దగ్గర మీ కార్యక్రమానికి కావలసిన అన్ని అందజేసే అన్ని కోళ్లు లేవండి అని అంటాడు

మహేష్ అక్కడ నుంచి వెళ్లి పోతాడు

కీర్తి : తమ్ముడు ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు వదిలేసావు రా ఈ ఒక్క అవకాశం తో మనకి చాలా డబ్బులు వచ్చేవి కదా ఎందుకిలా చేసావు అని అంటుంది.

బాలు : అక్క నీకు అర్ధం అవుతుందా అతను ఏమన్నాడు మన కోళ్ళకి మాంసం మంచి రుచి ఉంది అని అన్నాడు కదా, వాటిని కొల్లగా అమ్మడం కంటే కోళ్ళని ముక్కలుగా చేసి రకరకాల వంటలు చేసి అమ్మితే ఇంకా ఎక్కువ లాభం సంపాదించుకోవచ్చు అని అంటాడు. బాలు మాటలకు కీర్తి కూడా సరే అని అంటుండి.

వాళ్ళ దగ్గర ఉన్న కోళ్ళని ఎప్పటిలాగే అడవికి తీసుకెళ్తారు.

బాలు : అక్క ఈ కోళ్ళని మననం ఇక్కడే కొన్ని రోజులు మేపితే అవ్వి పుష్టిగా తయారవుతాయి, అప్పుడు వాటిని మనం కోసి చికెన్ తో రక రకాల వంటలు తయారు చేసి అమ్ముదాం అని అంటాడు అలా కొన్ని రోజులు గడిచిపోతాయి.

బాలు : అక్క మన కోళ్ళని మల్లి ఊళ్లోకి తతీసుకెళ్లే సమయం వచ్చింది, ఇంటికి వెళ్లి వీటిని కోసే బదులు ఇక్కడే కోసి ఇంటికి తీసుకెళదాం అని అంటాడు. ఇంతలో వాళ్ళ కోళ్ల గుంపులు బాలు కీర్తికి ఒక కొత్త కోడి కనిపిస్తుంది.

బాలు : అక్క ఇదేంటి కోడి మన కోళ్లలా కాకుండా కొత్తగా కనిపిస్తుంది అని అంటాడు.

కీర్తి : నాకు కూడా అదే అనిపించింది రా తమ్ముడు, మనం ఎలాగూ కోళ్ళని కోసి అమ్ముదాం అనుకున్నాం కదా ఆ పని ఇప్పుడు ఈ కోడితోనే మొదలుపెడదాని అని వాళ్లకి కొత్తగా కనిపించిన కోడి తీసుకొచ్చి రెండు మిముక్కలుగా చేస్తారు అది ఒక మాయా కోడి అని వాళ్లకి తెలియదు, వాళ్ళు కోడిని నరకగానే కోడి కడుపులోనుంచి చాలా డబ్బు బంగారం బయటకు వస్తాయి, ఒక్క సారిగా అంత డబ్బు బంగారం మరియు దబ్బబు చూసిన బాలు కీర్తి ఎంతో ఆశ్చర్య పోతారు. అంత డబ్బు చూసే వరకు బాలు కి కొంత అత్యాశ వస్తుంది .

బాలు : అక్క ఒక్క కోడిని చంపితేనే మనకి ఇంత డబ్బు బంగారం వచ్చింది కదా మన దగ్గర ఉన్న అన్ని కోళ్ళని చంపితే మనం ధనవంతులం అయిపోవచ్చు అని అంటాడు. అదే అత్యాశతో తమ దగ్గర ఉన్న అన్ని కోళ్ళని చంపి కడుపులో బంగారం కోసం వెతుకుతుంటారు. ఎన్ని కోళ్ళని చూసిన కూడా వాళ్లకి దబ్బబు కానీ బంగారం కానీ దొరకలేదు.

కీర్తి : తమ్ముడు మనకి కొంత డబ్బు కన్పించగానే విలువలు మరచి పోయి అత్యాశతో మన దగ్గర ఉన్న అన్ని కోళ్ళని చంపేసుకున్నాం ,ఇప్పుదు మన పరిస్థితి మల్లి మొదటికి వచ్చింది, మల్లి కూలి పనులకు పోయి వచ్చిన డబ్బుని పోగుచేసుకుంటూ బ్రతుదాం పదా అని బాలు కీర్తి తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *