పేద పిల్లల మాయ టమాటా ATM | Telugu Stories | Telugu Kathalu | Banana Dreams TV Telugu
వాయిస్ : కనీస వసతుల్లేని మారుమూల పల్లెటూరు అది. అలాంటి ఊరిలో కీర్తి, బాలు
అనే ఇద్దరు పేద పిల్లలు ఉంటారు. ఆ ఊరికి ఆరు కిలో మీటర్ల దూరంలో
ఉండే టౌన్ లో ఒక కృష్ణ మెకానిక్ షాపు ఉంటుంది. అందులో కీర్తి, బాలు
పని చేస్తూ, వచ్చే జీతం డబ్బులను ఒక్కొక్క రూపాయిని అతి జాగ్రత్తగా
ఖర్చు పెడుతూ కరెంట్ లేని ఒక పూరి గుడెసెలో ఉంటూ జీవనం సాగిస్తూ
ఉంటారు. ప్రతి రోజులాగే ఆ రోజు కూడా మెకానిక్ షాపులో పని
ముగించుకుని ఊరికి వస్తారు. దారిన నడుస్తూ…
బాలు : అక్క మనం ఈ మెకానిక్ షాపులో పని చేయబట్టి ఏడాది దాటింది కదా!
కీర్తి : అవునురా బాలు! ఏడాది అవుతుంది. అయితే…
బాలు : ఏడాది తరువాత మనకు జీతం డబ్బులు పెంచుతానని చెప్పాడు కదా!
కీర్తి : అవును బాలు…మనం రేపోకసారి మన షాపు ఓనర్ కలిసి గుర్తు చేద్దాం!
వాయిస్ : అని ఆ రోజున పని ముగించుకుని ఇంటికి వెళ్తూ దారిలో ఉన్న అనురాగ
నిలయమనే పేరున్న ప్రహరీ గోడ చోట నిలబడి, ప్రేమగా, బాధగా ఎదురుగా
కనిపిస్తున్న మట్టి ఇల్లును చూస్తుంటారు అక్కాతమ్ముడైన కీర్తి, బాలు.
కారుతున్న కన్నీళ్లతో బాధపడుతూ బాలు ఇలా అంటాడు.
బాలు : అక్క…మనం లేని తాకట్టులో ఉన్న ఇంటిని చూస్తుంటే ఏమైనిపిస్తుంది నీకు?
కీర్తి : బాలు… చివరి క్షణంలో అమ్మ చనిపోతు ఎలాగైనా ఈ ఇంటిని ఆ తాకట్టు
నుంచి విడిపించి మనల్ని ఇక్కడే బతకమని చెప్పిన మాటలే గుర్తుకు
వస్తున్నాయి తమ్ముడు.
బాలు : అవునక్క…మన ఇద్దరి కోసం నలుగురం కలిసి ఉండొచ్చని ఎంతో ప్రేమగా
కష్టపడుతూ అమ్మ నాన్న ఈ ఇంటిని కట్టుకున్నారని అమ్మ మనకు
ఎన్నోసార్లు చెప్పింది కదా!
కీర్తి : అవును బాలు…అమ్మ చెప్పిన ప్రతి మాట ఇంకా నా చెవుల్లో
మారుమోగుతూనే ఉన్నాయి తమ్ముడు. ఇటుక మీద ఇటుక పేర్చి కట్టింది
కాదు తమ్ముడు ఈ ఇల్లు. మన అమ్మానాన్నల కన్నీటి బొట్టును ఒకదాని
మీదా ఒకటి పేర్చి కట్టిన ఇల్లు ఇది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నరసింగరావుకు
మాత్రం దక్కనీయొద్దు.
బాలు : వాడు ఈ మన మట్టిల్లు తీసుకుని ఏం చేసుకుంటాడక్కా! వాడికి కావాల్సింది
డబ్బులు…వాడు మన ఇంటి తాకట్టుగా పెట్టుకుని ఇచ్చిన డబ్బులు ఎన్నో
చెప్పు!
కీర్తి : మొత్తం కలిపి ఆ నరసింగరావుకు యాబైవేల రూపాయలు ఇస్తే మన ఇల్లు
మన పొలం మనకు వెనక్కి వస్తాయి.
బాలు : ఇప్పుడు మనం చేయాల్సింది…డబ్బులు ఎలా సంపాదించాలన్నది. మనకు
అతి తక్కువ సమయం ఉంది. రాత్రి పగలు ఎంత కష్టపడిన మనకిచ్చిన
గడువు వరకు యాబై వేలు సంపాదించడం కానీ పోగేయ్యడం కానీ కకుదరదు.
కీర్తి : అలా అనుకోవద్దు తమ్ముడు. చివరి లెక్క తేలే వరకు ఓటమిని కానీ
గెలుపును ఒప్పుకోవడానికి వీల్లేదు. మనం మరింత ఎక్కువగా డబ్బులు
సంపాదించే మార్గాలు వెతకాలి.
వాయిస్ : అని మాట్లాడుకుంటూ ఇద్దరు కలిసి వాళ్ళ పూరీ గుడిసె దగ్గరికి వస్తారు.
అన్నం పెట్టుకుని పచ్చడి కలుపుకుని తింటూ ఉంటారు.
బాలు : అక్క అది…
కీర్తి : బాలు…తినేటప్పుడైనా ప్రశాంతంగా తిందాం!
వాయిస్ : అనుకుని కీర్తి, బాలు అన్నం తిని మంచంలో పడుకుంటారు. ఎక్కువ
డబ్బులు సంపాదించే మార్గాల గురించి ఆలోచన చేస్తూ అలా నిద్రలోకి
జారుకుంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కీర్తి, బాలు ఆలోచన
చేస్తూనే మెకానిక్ షాపులో పని చేస్తూ ఉంటారు. ఒక రోజున రిపేర్ కిచ్చిన
తన బైక్ ను తీసుకెళ్లడానికి ఆకాష్ వచ్చాడు. తన క్యాష్ లేదని ఏటీఎం కోసం
అడుగుతాడు. అప్పుడు కీర్తి, ఏటీఎం ఎక్కడ ఉందో చెబుతుంది. ఆకాష్ వెళ్ళి
డబ్బులు తీసుకొచ్చి, ఆ డబ్బు ఇచ్చేసి తన బైక్ ను తీసుకెళ్లిపోతాడు
ఆకాష్. అప్పటి నుంచి కీర్తికి ఏదైనా డబ్బులకు పని చేసి పెట్టె మిషన్ కు
తయారు చేయాలని అనుకుంటుంది. బాలుకు కూడా చెప్పుతుంది. కానీ ఆ
మిషన్ ఏమిటన్నది వాళ్ళకు అర్థం కాలేదు. మల్లె బాగా ఆలోచన చేయడం
మొదలు పెట్టారు.
వాయిస్ : ఒక రోజున టమాటలు అమ్ముతున్నా వాడితో ఒక పెద్దావిడ ధర
ఎక్కువవుతుందని, అంతా పెట్టి కొనలేనని చెబుతుంది. అప్పుడు పేద
పిల్లలైన కీర్తి, బాలు…బాగా ఆలోచన చేసిన ఏటీఎం ను తయారు చేస్తారు.
ఏటీఎం…ఎనీ టైమ్ టమోటా ఇచ్చే మిషన్…! పది రూపాయల కాగితం
వేయండి…తాజా నిగనిగలాడే టమోటాలను తీసుకెళ్ళండి అంటూ ప్రచారం
చేస్తారు. ఆ ఊరి బస్టాండ్ దగ్గర ఆ ఏటీఎంను పెడతారు. టౌన్ ప్రజలు…కీర్తి
బాలు చెప్పింది విని తక్కువ ధరకే టమోటాలు వస్తున్నాయని చాలా మంది
లైన్ కట్టేశారు. ఎవరికి ఎన్ని టమోటాలు కావాలో అన్నీ పది రూపాయల
నోట్లు వేస్తున్నారు. ఆ టమాటా మిషన్ నుంచి వచ్చే తాజా టమోటాలను
చూసి మురిసిపోతుంటారు.
వాయిస్ : రోజు మెకానిక్ షాపులో పని అయ్యాక, ఏటీఎంను ఇంటికి తీసుకెళ్లి, డబ్బులు
లెక్క చూసుకుని, మిగితా టమోటాలు అందులో పెట్టేవాళ్ళు. అలా
అక్కాతమ్ముడైన కీర్తి, బాలు…ఏటీఎం సహాయంతో నరసింగరావుకు
కట్టాల్సిన డబ్బులను సంపాదిస్తారు. ఆ డబ్బులను తీసుకుని నరసింగరావు
ఇంటికి వెళ్తారు. అక్కడ అతనితో మాట్లాడి, డబ్బులు కట్టేసి ఆ ఇంటి
కాగితాలు తీసుకుంటారు. అక్కడి నుంచి కీర్తి, బాలు ఇద్దరు సంతోషంగా
తమ మట్టిల్లు దగ్గరికి వస్తారు. ఇద్దరు కలిసి ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న
చెత్త చేదరాన్ని క్లీన్ చేసి, పక్కనే ఉన్న బోరింగ్ పంపు నుంచి నీళ్ళు
తీసుకొచ్చి ఇల్లంతా కడుగుతారు కీర్తి బాలు! ఇంటి ముందు ముగ్గులు
పెట్టి…ఇంట్లో పాలు పొంగిస్తారు. చనిపోయిన తమ తల్లి దండ్రుల ఫోటోలు
తీసుకుని ఇంట్లోకి వస్తారు. గోడలకు పెడతారు. ఫోటోలకు పూల దండలు
వేస్తారు. తమ తల్లిదండ్రులకు నమస్కరిస్తూ…
కీర్తి : అమ్మ నాన్న పైలోకం నుంచి మీరు మమ్ముల్ని చూస్తున్నారని మాకు
తెలుసు. మేము కొత్తగా ఒక ఏటీఎం వ్యాపారం పెట్టాం. ఆ వ్యాపారం బాగా
సక్సెస్ అయింది. నేను తమ్ముడు మీరు అనుకున్నట్టుగా డబ్బులు సంపాదించి
ఆ నరసింగరావు చేతిలో నుంచి మన ఇంటిని కాపాడుకున్నాం.
బాలు : ఇప్పుడు మీ ఆత్మ శాంతిస్తుందని నేను అనుకుంటున్నాను అమ్మనాన్న!
ఇప్పటి వరకు మీ కోరిక నెరవేరే వరకు కష్ట పడ్డాం. ఇప్పుడు నా ముందు నా
బాధ్యత ఉంది. ఆ బాధ్యతను కూడా ఎలాంటి అడ్డంకులు రాకుండా
నిర్వర్తించేలా చూడండి. అప్పుడు ఒక కొడుకుగా మీకు, తోడబుట్టిన
తమ్ముడిలా అక్కకు రుణం తీర్చుకున్న వాడినవుతాను.
వాయిస్ : అని దండం పెట్టుకుంటారు. ఆ తరువాత తమ సొంత ఇంట్లో పాయసం
వండుకుని తింటారు. అలా సంతోషంగా ఏటీఎం వ్యాపారాన్ని కొనసాగిస్తూ
ఉంటారు.
-0-
సింగిల్ లైన్
కనీస సౌకర్యాలు లేని మారుమూల పల్లెటూరిలో కీర్తి, బాలు అనే ఇద్దరు పేద పిల్లలు ఉండేవాళ్లు. ఆ ఊరికి ఆరుకిలోమీటర్ల దూరంలో ఉన్న టౌన్ లో ఒక మెకానిక్ షాపులో పని చేసుకుంటూ వచ్చిన జీతం డబ్బులలో కొత్త దాచుకుని, తమ కోసం తమ తల్లిదండ్రులు తాకట్టు పెట్టిన ఇంటిని కాపాడుకోవాలని కొంత డబ్బును దాచుకుంటూ ఉంటారు. ఆ పేద పిల్లలకు ఉన్న తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఎలా అని ఆలోచన చేస్తూ, ఇల్లు చేజారిపోతుందేమోనని బాధపడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకు ఏటీఎం గురించి తెలుస్తుంది. అదే సమయంలో టమాటలు ధర పెరిగిపోతుంది. అప్పుడు ఆ ఇద్దరు పేద పిల్లలు బాగా ఆలోచన చేసి ఒక టమాటా ఏటీఎంను తయారు చేస్తారు. అందులో టెన్ రుపీస్ వేయగానే ఒక తాజా టమాటా బయటికి వచ్చేలా తయారు చేసి బస్టాండ్ దగ్గర పెడతారు. బాగా ప్రచారం చేస్తారు. అండతో అందరూ ఆ ఏటీఎం ద్వారా టమాటలు కొనుకుంటారు. అలా వచ్చిన డబ్బులతో ఆ పేద పిల్లలు తమ సొంత ఇంటిని దక్కించుకుంటారు. సంతోషంగా జీవిస్తూ ఉంటారు.
-0-
Related Posts

పేద పిల్ల మాయా డబ్బుల మెషిన్ Telugu Kathalu | Telugu Stories | Panchatantra Kathalu | Fairy Tales

బాత్రూం లో దెయ్యం తల్లి | Telugu Kathalu | Moral Stories | Bedtime Stories | Panchatantra kathalu
