పేద పిల్లల మాయ మనీ ఆటో | Telugu Stories | Telugu Kathalu | Banana Dreams TV Telugu

వాయిస్ : అది రామచంద్రపురమనే ఊరు. ఆ ఊరిలో పేద పిల్లలైన కీర్తి, బాలు అనే
అక్కాతమ్ముడు ఉండేవాళ్లు. ఇద్దరు పెయింటింగ్ పనులకు వెళ్ళేవాళ్లు. అలా
వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తూ ఉండేవాళ్లు. ఒక రోజున కీర్తి, బాలు
ఇద్దరు పెయింటింగ్ బ్రేష్ లు పట్టుకుని లేబర్ అడ్డ మీదా నిలబడతారు.
కీర్తి : నాలుగు రోజుల నుంచి పని దొరకడం లేదు. ఈ రోజైన దొరికితే బాగుంటుంది.
ఏమంటావు బాలు?
బాలు : దొరకాలక్క! ఇంట్లో తినడానికి ఏమి లేవు. మనమిద్దరం ఉన్నాం కాబట్టి
ఏదో రకంగా నెట్టుకొస్తున్నాం. అదే అమ్మా నాన్న బతికి ఉంటే మనకు ఈ
పరిస్తితి వచ్చేది కాదు కదా!
కీర్తి : వద్దులే తమ్ముడు…ఎప్పుడు మనం చిన్నప్పుడు చనిపోయిన
అమ్మనాన్నల గురించి తలుచుకుని బాధపడటం ఎందుకు చెప్పు? అయిన
అమ్మవాళ్లు మనకు తోడుగా నీడగా ఉన్నారు.
బాలు : నీకు కనిపిస్తున్నారా అక్క!
కీర్తి : లేదు తమ్ముడు. కానీ నాకు ఆ భావన అప్పుడప్పుడు అనిపిస్తుంది
తమ్ముడు.
బాలు : అక్క నువ్వు డబ్బులు చాలా తక్కువ మాట్లాడుతున్నావు. మనకు అక్కడ
వర్క్ ఎక్కువతుంది. అందుకని కొంచెం డబ్బులు ఎక్కువగా అడుగక్క!
కీర్తి : అలాగే తమ్ముడు ! వాళ్ళు మనకు చెప్పెటప్పుడు ఒక విధంగా
చెబుతున్నారు, అక్కడికి వెళ్లాక మరొక విధంగా పని చేయించుకుంటున్నారు
తమ్ముడు.
బాలు : ఇప్పుడు మనకు అర్థమయింది కదాక్క! అందుకే డబ్బులు ఎక్కువడుగు.
వాయిస్ : ఇలా తమ కష్టానికి తగిన విధంగా డబ్బులు రావడం లేదని అక్కాతమ్ముడు
మాట్లాడుకుంటూ ఉండగా, బైక్ మీదా వాళ్ళ దగ్గరికి చంద్రయ్య అనే ఒక పెద్ద
మనిషి వస్తాడు. అతనిని చూసి పిల్లలు నమస్తే పెడతారు. చంద్రయ్య కూడా
నమస్తే పిల్లలు అంటాడు.
చంద్రయ్య : మీకు ఫర్ఫెక్ట్ గా పెయింటింగ్ వేయడం వస్తుందా!
కీర్తి : మేము చిన్నపిల్లలమని మరి చులకన చూడకండి. మేము పెయింటింగ్
వేయడంలో ఫర్ఫెక్ట్ !
బాలు : మా గురించి మేము గొప్పగా చెప్పుకోవడం దండగ! మాకు మీరు పనిచ్చి
చూడండి. అప్పుడు మీరే మెచ్చుకోకుండా ఉండలేరు.
వాయిస్ : అక్కాతమ్ముడైన కీర్తి, బాలును బైక్ మీదా కూర్చుండ బెట్టుకుని పని దగ్గరికి
తీసుకొస్తాడు చంద్రయ్య. అది చిన్నపాటి ఇల్లు. ఆ ఇంటికి పెయింటింగ్
వేయాలని చెప్పి, అందుకు కావాల్సిన పెయింట్స్ ఇస్తాడు చంద్రయ్య.
చంద్రయ్య : పిల్లలు మీరు ఆ ఇంటికి పెయింటింగ్ వేస్తూ ఉండండి. మాకు ఇంకొక ఇల్లు
ఉంది. అక్కడ కూడా పెయింటింగ్ వేయాలి.
కీర్తి : ఆ ఇంటికి కూడా వేరే డబ్బులు ఇవ్వాలి.
బాలు : అవునంకుల్…ముందుగానే చెబుతున్నాం. ఆ తరువాత చెప్పలేదని
మమ్ముల్ని అనోద్దు.
చంద్రయ్య : అలాగే పిల్లలు!
వాయిస్ : అని చెప్పి చంద్రయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కీర్తి, బాలు ఇద్దరు ఆ
ఇంటికి పెయింట్ వేస్తూ ఉంటారు. అరగంటలో ఒక ఇల్లు పూర్తయింది. పది
నిమిషాలలో వస్తానని చెప్పి వెళ్ళిన వ్యక్తి. ఇంకా రాలేదని అతని కోసం
చూస్తూ ఉంటారు కీర్తి, బాలు. చంద్రయ్య తిరిగి వస్తాడు. మరొక ఇంటికి కీర్తి,
బాలును బైక్ మీదా తీసుకెళ్తాడు చంద్రయ్య. కీర్తి, బాలు సరదాగా
మాట్లాడుకునూ ఆ ఇంటికి కూడా పెయింట్స్ వేస్తారు. అలా గంట
గడిచిపోయింది. చీకటి పడుతున్న వేళ ! ఇంటికి వెళ్లడానికి సిద్దంగా
ఉంటారు కీర్తి, బాలు. చంద్రయ్య వాళ్ళను ఎక్కించుకుని ఒక అడవి మార్గాన
ముందుకు వెళ్తూ ఉంటాడు.
కీర్తి : అంకుల్…ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము.
చంద్రయ్య : మీ ఇంటికి వెళ్తునం కీర్తి.
బాలు : అప్పుడు ఈ అడవిలో నుంచి ఎందుకు? అలా మెయిన రోడ్డు మీది నుంచి
వెళ్ళే వాళ్ళం కదా!
వాయిస్ : చంద్రయ్య ఏమి మాట్లాడకుండా, అడవిలో ఒక చోట బైక్ ను ఆపేస్తాడు.
కీర్తిని, బాలును దిగమని చెప్పగానే అక్కాతమ్ముడు బైక్ దిగుతారు.
చంద్రయ్య : నేను మీకు ఒక్క పైసా ఇవ్వను ఏమి చేసుకుంటారో చేసుకోండీ.
వాయిస్ : అని చెప్పి అక్కడి నుంచి బైక్ మీదా వెళ్లిపోతుంటాడు చంద్రయ్య. కీర్తి, బాలు
ఆపమని బతిమాలుతూ చంద్రయ్య బైక్ వెనకాలే వెళ్తూ ఉంటారు. కానీ
చంద్రయ్య బైక్ ఆపకుండా ముందుకు వెళ్లిపోతుంటాడు. వెళ్ళిపోతాడు.
గుడ్డిగా చంద్రయ్యను నమ్మి మోస పోయామని బాధపడుతూ, ఇంతకు
ముందు బైక్ వచ్చిన దారిలో వెనక్కి దైర్యంగా నడుచుకుంటూ రోడ్డు వైపు
వెళ్తున్నా కీర్తి, బాలుకు ఒక చోట…ఒక మహర్షి పడి పోయి ఉంటాడు.
అతను దాహం దాహం అంటూ ఉంటాడు. వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగులో
నుంచి నీళ్ళ బాటిల్ తీసి నీళ్ళు తాగిపిస్తారు. ఆ మహర్షి కాసేపటికి
కోలుకుంటాడు. ఒక మాయా బ్రేష్ ఇస్తాడు ఆ మహార్సి !
మహర్షి : ఇదొక మాయా బ్రేష్ ! దీనిని మీరు మంచి కోసమో వాడాలి. అప్పుడే
డబ్బులు వస్తాయి.
వాయిస్ : అని చెప్పి మహర్షి మాయమవుతాడు. కీర్తి, బాలు ఆ బ్రేష్ తీసుకుని రోడ్డు
మీదికి చేరుకుంటారు. అక్కడ లిఫ్ట్ కావాలని అడుగుతూ ఉంటారు. ఎవరు
ఇవ్వరు.
వాయిస్ : లిఫ్ట్ కావాలని అడిగి అడిగి కీర్తి, బాలు అలిసిపోతారు. దీనంగా రోడ్డు మీదా
కూర్చుంటారు. అప్పుడే మల్లయ్య అనే ఒక తాత, తన ఆటో నడుపుతూ ఆ
రోడ్డున వెళ్తూ, దీనంగా కూర్చున్నా కీర్తి, బాలును చూస్తాడు. వాళ్ళ దగ్గరికి
వచ్చి, మాట్లాడి వాళ్ళను వాళ్ళ ఇంటి దగ్గర దింపుతానని చెప్పి ఆటో
ఎక్కించుకుని, అరగంటలో పిల్లలు చెప్పిన అడ్రస్ దగ్గర దింపేసి
వెళ్ళిపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కీర్తి, బాలు పెయింటింగ్
వేస్తూ బతుకుతూ ఉంటారు.
వాయిస్ : ఒక రోజున కీర్తి, బాలు పెయింటింగ్ పని కోసం అడ్డ మీదా ఎదురుచూస్తూ
ఉండగా, వాళ్ళ దగ్గరికి దిగులుగా ఉన్న మల్లయ్య తాత వస్తాడు. అతని
దిగులుకు కారణం తెసుకుంటారు కీర్తి, బాలు. అడ్డ మీది నుంచి మల్లయ్య
తాత ఇంటికి వస్తారు. అక్కడ ఆటో విరిగి పోయి కనబడుతుంది. కీర్తి, బాలు
తమ దగ్గర ఉన్న మాయా బ్రేష్ తో ఆటోకు పెయింటింగ్ వేస్తారు. అంతే ఆ
ఆటో డబ్బులున్న ఆటోలా మారిపోతుంది.
కీర్తి : మీరు మంచి మనసుతో ఏ పని తలపెట్టిన మీకు అంతా మంచే జరుగుతుంది.
పేదవాళ్ళకు డబ్బులు సహాయం చేస్తూ ఉంటే, మీకు మరిన్ని డబ్బులు ఈ
మాజికల్ మనీ ఆటో ఇస్తుంది. నీ స్వార్థానికి వాడుకుంటే తినడానికి తిండి
ఉండదు. తాగడానికి నీళ్ళు. అసలు బతికే నరకంగా తయారవుతుంది.
మల్లయ్య : నేను ఇప్పటి వరకు అందరికీ చేతనైన సహాయం చేస్తూ వచ్చాను కానీ నా
స్వార్థం నేనెప్పుడు చూసు కోలేదు. చూసుకొను కూడా! మీరిచ్చిన
మ్యాజికల్ ఈ మనీ ఆటోతో మానవసేవ చేసుకుంటూ ఏ జీవితం
గడిపేస్తాను.
వాయిస్ : అని చెప్పి మల్లయ్య తాత మనీ ఆటో తీసుకుని వెళ్లిపోతుంటాడు.
-0-

Add a Comment

Your email address will not be published. Required fields are marked *