పేద పిల్లల మాయ మనీ చెట్టు | Telugu Stories | Telugu Fairy Tales | Story World Telugu

వాయిస్ : సుందరయ్య పల్లి గ్రామం పక్కనే ఉన్న దట్టమైన అడవి ప్రాంతం అది. ఆ

            అడవిలో యాదగిరి అనే వ్యక్తి, చేతిలో గన్ పట్టుకుని చెట్లను ఎవరు నరక

           కుండా కాపలా కాస్తుంటాడు. అక్కడ లావుగా దృఢంగా పెరిగిన చెట్లను

           చూస్తూ…

యాదగిరి ; మా సారు వాళ్ళకు దిమాకు సరిగ్గా పని చేయడం లేదనుకుంటాను. ఇంత

             పెద్ద అడవిలో బలంగా లావుగా దృఢంగా ఉన్న ఒక పది చెట్లను చూస్తారు.

            వాటిని ఎవరు కొట్టకుండ, ముట్ట కుండా ఉండటానికి నాలాంటి వాడు కాపలా!

           ఈ చెట్లను చూస్తుంటే నాకంతగా గోప్పగా అనిపించడం లేవు.

వాయిస్ : అనుకుంటూ ఉండగా, ఇంతలో అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ మొగుతుంది.

            కాల్ ను రిసీవ్ చేసుకుంటాడు. అవతల ఒక పెద్ద ఇంట్లో ..భూషణ్ అనే వ్యక్తి

           మాట్లాడుతూ ఉంటాడు.

భూషణ్ : ఏరా యాదగిరి..ఎవరైనా వచ్చారా?

యాదగిరి : లేదు సార్..ఇంత వరకు ఎవరు రాలేదు. నేను కంటి మీదా కునుకు

             వేయడం కుండా చూస్తున్నాను సార్ !

భూషణ్ : చెట్ల కోసం, కట్టెల కోసం ఎవరైనా వస్తే మనం ఎంచుకున్న పది చెట్లు             

           వదిలిపెట్టి మిగితావి కొట్టుకెళ్ళమని చెప్పు సార్ !

యాదగిరి : ఇప్పటి వరకు ఎవరు రాలేదు సార్,. ఒక వేళా వస్తే మీరు చెప్పినట్టుగా

             చెప్తాను సార్ !

భూషణ్ : మనం ఎంచుకున్న చెట్లు జాగ్రత్త యాదగిరి.

యాదగిరి : సరే సార్ ! నేను కాపలా ఉండగా..మన అనుకున్న చెట్లను ఎవరు

             కొట్టడానికి వస్తారు సార్..ఎవరు రారు. ఉంటాను సార్ !

భూషణ్ : ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చిన, పోలీసులు వచ్చిన, కొత్త వాళ్ళు వచ్చిన

           నీ దగ్గర ఉన్న లెటర్ చూపించు సరిపోతుంది.

యాదగిరి : అలాగే సార్ !

వాయిస్ : అని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు యాదగిరి. ఇంతలో కీర్తి, బాలు అనే పేద

            పిల్లలు తాళ్ళు, గొడ్డలి పట్టుకుని అడవిలో నడుచుకుంటూ అలా ముందుకు

            వెళ్తుంటారు.

బాలు : అక్క..ఇలా ఎంత దూరం పోదాం చెప్పు!

   కీర్తి : సుబ్రమణ్యం చెప్పినట్టుగా లావుగా, దృఢంగా ఉన్న చెట్లు ఎక్కడ ఉన్నాయో

          ముందుగా మనం చూసుకోవాలి తమ్ముడు. వాటిని కొట్టి సుబ్రమణ్యంకు

         అమ్మితే ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పాడు కదా !

బాలు : సరే పదక్కా!

వాయిస్ : అలా కీర్తి, బాలు మాట్లాడుకుంటూ అడవిలోకి వెళ్తారు. అక్కడ గన్ పట్టుకుని

            దిక్కులు చూస్తున్న యాదగిరిని చూస్తారు. వాళ్ళను కూడా యాదగిరి

           చూస్తాడు. పిల్లలు యాదగిరి దగ్గరికి వస్తారు.

యాదగిరి : ఏం పేద పిల్లలు..కట్టెల కోసం అడవి మొత్తం తిరిగుతునే ఉన్నారా !

        కీర్తి ; ఆకలి కోసం తప్పదు కాదన్న ! అయిన నువ్వేంటన్న.. మొన్న పడమటి

              దిక్కున ఉన్నావు. నిన్న ఉత్తరం దిక్కున..ఇప్పుడేమో తూర్పు దిక్కున

             కాపలా కాస్తున్నావు. ఇక్కడ కూడా పది చెట్లను ఎన్నుకున్నవా?

యాదగిరి : అవును పిల్లలు..మీకేనా ఆకలి. మీరెనా మనుష్యులు! మేము

            మనుష్యులమే..మాకు ఆకలవుతుంది.

కీర్తి : నీ బదులు కాపలా మేము కాస్తాములే అన్న! అకలంటున్నావు కదా.. నువ్వేల్లి 

       తినేసి రాపో అన్న. నువ్వు వచ్చే వరకు కాపలా కాస్తుంటాము.

యాదగిరి : సరే.. మేము గుర్తులు పెట్టుకున్న పది చెట్లు కానిపిస్తున్నాయి కదా..వాటిని

              చూస్తూ ఉండండి. నేను వెళ్ళి పళ్ళు తినేసి వస్తాను.

వాయిస్ ; అని చెప్పి యాదగిరి, అదే అడవిలో దొరికే పల్లను తినడానికి వెళ్తాడు. ఇదే

            మంచి సమయం అనుకున్న కీర్తి, బాలు.. యాదగిరి ఎన్నుకుని కాపలా

            కాస్తున్న చెట్ల దగ్గరికి వస్తారు. అన్నీ చెట్లను పరీక్షగా చూశారు.

కీర్తి ; తమ్ముడు..అన్న కాపలా కాస్తున్నా పది చెట్లను గమనించావా..లావుగా దృఢంగా

      ఉన్న చెట్లను మాత్రమే ఎన్నుకున్నారు.

బాలు : అవునక్క.. మనలాగే ఈ అన్న వాళ్ళు కూడా కట్టే మిషన్ వాళ్ళతో

         మాట్లాడుకుని ఉంది ఉంటారు. అందుకే ఇలా లావుగా, దృడంగా ఉన్న చెట్లను

         ఎన్నుకున్నారు.

కీర్తి : నాకెందుకో అనుమానంగా ఉంది తమ్ముడు. అది నిజమా కాదా తెలుసుకోవడానికి

       నేనిప్పుడు చిన్న తప్పు చేస్తాను.. ఆ చిన్న తప్పుడు వల్ల వాళ్ళు ఎందుకు

       ఇలాంటి చెట్లను ఎన్నుకుని కాపలా కాస్తున్నారో తెలుస్తుంది.

వాయిస్ : అని చెప్పి కీర్తి, ఆ చెట్టుకున్న ఎర్ర బట్టను పక్కనే ఉన్న మరొక చెట్టుకు

            కడుతుంది. తిరిగి ఏమి తెలియనట్టుగా చెట్లను చూస్తూ ఉంటారు. ఇంతలో

            వాళ్ళ దగ్గరికి యాదగిరి వస్తాడు.

యాదగిరి : పేద పిల్లలు…మీరికా మీకు కావల్సిన చిన్న చిన్న ఎండిన చెట్లను

            కొట్టుకుని వెళ్ళి అమ్ముకోండి.

కీర్తి : అలాగే అన్న !

వాయిస్ : అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఒక దగ్గర ఒక ఎండిన చెట్టు

         కనబడగానే ఆ చెట్టును చిన్న చిన్న కట్టెలుగా కొట్టుకుని యాదగిరికీ

         అనుమానం రాకుండా అక్కడి నుంచి వెళ్లిపోతారు. అలా ఆ రోజు

         గడిచిపోయింది. మరుసటి రోజున కీర్తి, బాలు..ఎర్ర బట్టను తీసేసిన చెట్టు దగ్గరికి

         వస్తారు. ఆ చెట్టును పరిశీలనగా చూస్తుంటారు. అప్పుడు వాళ్ళకు ఆ చెట్టుకు

         ఉన్న ఒక తొర్ర కనబడుతుంది. అప్పుడు ఆ చెట్టు ఇలా అంటుంది.

మాయ చెట్టు ; నన్ను ముందుగా కొట్టండి. పాపపు సొమ్మును

           మోయలేకపోతున్నాను. నన్ను కొట్టిన తరువాత  వచ్చిన డబ్బులను

          పేదవాళ్ళకు, వృద్ధులకు, అనాధాలకు పంచి పెట్టండి. మీకు అంతా మంచే

          జరుగుతుంది.

వాయిస్ : అని చెప్పి మాయమవుతుంది. వెంటనే కీర్తి,

 బాలు ఆ చెట్టును కొట్టడం మొదలు

          పెడతారు. ఆ చెట్టు కాసేపటికి కిండా పది పోతుంది. అలా కిందా పడి

         పోయినప్పుడు ఆ చెట్టు మొద్దులో నుంచి డబ్బులు బయటికి వస్తాయి.

బాలు : అక్క.. ఈ డబ్బుల గురించి పోలీసు వాళ్ళకు చెప్పుదామా!

  కీర్తి : వద్దు తమ్ముడు. ఈ డబ్బులతో మనమే పేద వాళ్ళకు, అనాధలకు సహాయం

        చేద్దాం !

బాలు : ఇంత డబ్బు ఎక్కడిదని ఎవరైనా మనల్ని అడిగితే ఏమి చెప్పుదామక్క!

   కీర్తి : మాయా చెట్టు ఇచ్చిందని చెప్పుదాం తమ్ముడు.

బాలు : నువ్వు పెద్ద దానిని అన్నీ విధాలుగా ఆలోచన చేసి ఉంటావు కదా! నువ్వు

         ఎలా చెప్పితే అలా ?

వాయిస్ : అని చెప్పి అక్కడి నుంచి ఆ డబ్బులను తీసుకెళ్లిపోతారు. కొన్ని రోజుల

         తరువాత..కొంత కొంత డబ్బును తీసుకెళ్లి అనాధ ఆశ్రమలకు ఇస్తుంటారు పేద

          పిల్లలైన కీర్తి, బాలు ! ఆ విధంగా పేద పిల్లలైన కీర్తి, బాలు తమ వంతుగా

          సేవలు చేస్తూ ఉంటారు.

-0-

భూషణ్, యాదగిరి కలిసి హవాలా డబ్బులను చెట్ల మొద్దులలో పెట్టి ఊరు దాటిస్తుంటారు. అందుకు కావల్సిన చెట్లను అడవిలో చూసుకుని వాటిని మరొకరు కొట్ట కుండా యాదగిరి కాపలా కాస్తుంటాడు. అదే అడవిలో కట్టెలు కొట్టుకుని అమ్ముకుంటూ ఉంటారు కీర్తి, బాలు అనే పేద పిల్లలు. యాదగిరి ఆ అడవిలో చెట్లను ఎన్నుకుని కాపలా కాస్తుంటాడు. అక్కడ కీర్తి, బాలుకు అనుమానం వచ్చి యాదగిరీ తినడానికి వెళ్ళగానే చెట్టుకు కట్టిన క్లాత్ ను మరొక చెట్టుకు కట్టి, ఆ చెట్టులో ఉన్న డబ్బులను తీసుకుని పేదవాళ్ళకు పంచి పంచి పెడుతుంటారు.

-0-

Add a Comment

Your email address will not be published. Required fields are marked *