పేద పిల్లల రివేంజ్ Episode 152 |Telugu Stories | Telugu Kathalu | Banana Dreams TV Telugu

వాయిస్ : అది విక్రమ్ పూర్ విలేజి. అందులో నివసించే రైతు వీరయ్య, తన మొదటి

           భార్య శారద చనిపోవడంతో తన పిల్లలైన కీర్తి, బాలుల అలనా పాలనా

          చూడ్డానికి రంగమ్మను రెండో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు. కీర్తి, బాలు

          అయోమయంగా చూస్తుంటారు.

వీరయ్య : పిల్లలు..ఇదిగోండి అమ్మ! ఇక నుంచి మిమ్ముల్ని బాగా చూసుకుంటుంది.

            మీకు అన్నం తినిపిస్తుంది. మిమ్ముల్ని ఆడిపిస్తుంది. మీకు కథలు

           చెబుతుంది. మీరు ఎక్కడికి తీసుకెళ్లమంటే అక్కడికి తీసుకెళ్లి మీకు అన్నీ

           చూపిస్తుంది. మీకు నచ్చింది కొనిపిస్తుంది.

కీర్తి ; అయితే మాకు అమ్మ బాగా నచ్చింది నాన్న!

బాలు : కానీ నాన్న..అమ్మను చూస్తుంటే నాకెందుకో అలా అనిపించడం లేదు. మా

         ఇంటికి అమ్మ వచ్చిందని సంతోష పడుతుంటే, అమ్మ మాత్రం మమ్ముల్ని

        చూడకుండా, ఏం చేస్తుందో చూడండి!

వాయిస్ : బాలు చెప్పిన మాట విన్న వీరయ్య, రంగమ్మను చూస్తాడు. రంగమ్మ

           మాత్రం వాళ్ళ మాటలు, చూపులు, పిలుపులు ఏ మాత్రం పట్టానట్టుగా

            ఏకగ్రతతో ఇంటిని చూస్తూ ఉంటుంది. సంతోష పడుతూ..

రంగమ్మ : ఆహా..మాటల్లో నమ్మలేదు కానీ ఇప్పుడు ఇల్లును చూస్తుంటే

            నమ్ముతున్నాను. మా ఆయన మంచి ఆస్తి పరుడే! వీలైనంత తొందరగా

          ఆస్తిని నా మీద రాయించుకోవాలి.

వాయిస్ : అనుకుంటూ వాళ్ళను చూస్తుంది. తండ్రి ముగ్గురు కలిసి తననే

           చూస్తుండటం ఆమెకు కొంచెం ఇబ్బంది అనిపించిన వెంటనే తెరుకుని..

రంగమ్మ : ఏంటీ..తండ్రి ముగ్గురు కలిసి అలా చూస్తున్నారు. నేను కొత్తగా వచ్చాను 

            కదా.. ఇక నుంచి నేనే కదా ఇంటిని చూసుకునేది. అందుకే

           చూసుకుంటున్నాను.

వీరయ్య : చూసుకోవడం తప్పు కాదు..నేను నిన్ను పెళ్లి చేసుకున్నది నా పిల్లలను

           చూసుకోవడానికి! నా ఇంటిని చూసుకోవడానికి కాదు. ఈ ఇల్లు, నాకున్న

           పొలాలు అన్నీ నా కీర్తి, బాలు పిల్లలకే రంగమ్మ!

వాయిస్ : అని వీరయ్య పిల్లల గురించి ప్రేమగా చెప్పిన, అది తనకు జరిగిన

            అవమానంగా రంగమ్మ అనుకుంది. అప్పుడు ఒక విష బీజం రంగమ్మలో

          నాటుకుపోయింది. తన భర్త తన మాట వింటు తన చెప్పు చేతల్లో ఉండాలని

          అనుకుంటుంది. ప్రయత్నం చేస్తుంది. అలా రోజులు గడుస్తుంటాయి.

          అనుకున్నట్టుగానే భర్త వీరయ్యను తన చెప్పు చేతల్లో పెట్టుకుంది. ఇక  

          పిల్లలను ఇబ్బందులు పెట్టడం మొదలు పెట్టింది. ఒక రోజున.. పిల్లలకు అన్నం

          పెట్టకుండా.. తను మాత్రం పెట్టుకుని తింటూ ఉంటుంది.

కీర్తి : అమ్మ..ఆకలవుతుంది..అన్నం పెట్టమ్మా!

వాయిస్ : ఆ మాట విని లాగిపెట్టి కీర్తి చెంప మీదా కొడుతుంది రంగమ్మ.

రంగమ్మ : అమ్మ ఏంటే అమ్మ.. నేను మిమ్ముల్ని కనలేదు. నేను మీకు అమ్మను

            కాను..అమ్మగారిని. ఇక నుంచి మీరు నాకు పిల్లలు కాదు..కూలీ వాళ్ళు.

            పనివాళ్లు. అమ్మగారంటూ నన్ను పిలవాలి. నేను చెప్పింది చేయాలి.

          పనులు చేస్తేనే అన్నం పెడతాను. పని చేయకపోతే అన్నం ఉండదు. పస్తులు

          పడుకోవలసి ఉంటుంది.

కీర్తి : అలాగే అమ్మగారు.

రంగమ్మ : ఏమే కీర్తి.. రేపటి నుంచి నేను లేచేసరికి వాకిలి ముగ్గుతో ఉండాలి. వంటగది

            వంటలలో ఉండాలి. ఇల్లు తడిబట్టతో శుబ్రంగా ఉండాలి. బట్టలు దండం మీదా

            ఉండాలి. పనులు అయ్యాక నేను అన్నం పెట్టె వరకు అలా ఎదురు చూస్తూ

           ఉండాలి. ఆకలవుతుందని నాకు చెప్పొద్దు.

కీర్తి ; అలాగే అమ్మగారు. !

రంగమ్మ : ఒరేయ్ బాలు..ఇక నువ్వు చేయాల్సిన పనులు.. పొద్దున్నే పోయి బర్రె

           పాలు తీసుకుని రావాలి. నేను లేచే సరికి బావిలోని నీళ్ళు తోడి గోళం,

           బాకీట్లు, డబ్బాలు నింపాలి. ఏ ఒక్కటి ఖాళీగా ఉన్న నీకు అన్నం ఉండదు.

          ఖాళీ కడుపు మాత్రమే ఉంటుంది.

వాయిస్ : అలా రంగమ్మ సవతి పిల్లలు చేయాల్సిన పనులను అప్పగిస్తుంది. రంగమ్మ

            చెప్పినట్టుగా కీర్తి, బాలు పొద్దునే లేచారు. చెంబు పట్టుకుని పాల కోసం పక్క

           వీధిలో ఉంటున్న సుందరమ్మ ఇంటికి వెళ్తాడు. పాలు తీసుకొస్తాడు. బావి

           దగ్గర నీళ్ళు చేది గోళం, డబ్బాలు, బాకీట్లు నింపుతాడు. కీర్తి లేచి జాదు కట్ట

          తీసుకుని బయట ఊడుస్తుంది. కల్లాపి చల్లుతుంది. ముగ్గులు వేస్తుంది. ఆ

          తరువాత వంటగదిలోకి వస్తుంది. కూరగాయలు కట్ చేసి వంట చేస్తుంది. తడి

          బట్ట వేసి ఇంటిని శుభ్రంగా చేస్తుంది.

వాయిస్ : రంగమ్మ అప్పుడే లేచి బయటికి వచ్చి చూస్తుంది. బావి దగ్గర నీళ్ళు

            నిండుగా ఉంటాయి. వాకిట్లో ముగ్గు ఉంటుంది, వంట గదిలో వంట పూర్తి చేసి

           ఉంటుంది. తడిబట్టతో ఇల్లు శుభ్రంగా మెరుస్తూ ఉంటుంది.

రంగమ్మ : చెప్పిన పని చెప్పినట్టుగా చేశారు. బతికి పోయారు. లేకుంటే ఈ రోజు నా

            చేతిలో మీకు ఘన సత్కారం జరిగేది. కుక్కల్లాగా కాపలా ఉండండి. నేను

           మళ్ళీ వస్తాను.

వాయిస్ ; అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది రంగమ్మ. కీర్తి, బాలు బాధపడుతూ

            ఉంటారు. కాసేపటికి రంగమ్మ తయారై వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని

            కీర్తికి, బాలు..కిచెన్ ముక్కలు చూపిస్తూ ఆహా..ఒహా అంటూ తినేస్తుంది. కీర్తి,

            బాలు బిక్కుమంటూ చూస్తుంటారు. రంగమ్మ తినేసి వెళ్లిపోతుంది. కీర్తి,

            బాలు వచ్చి చూస్తారు. అన్నీ ఖాళీగా ఉంటాయి. వెళ్ళి బాధగా నీళ్ళు

           తాగుతారు. ఆలా రోజులు గడుస్తూ ఉంటాయి. కీర్తి, బాలు పెరిగి పెద్దవాళ్ళు

          అవుతారు. వీరయ్య చనిపోతు ఆస్తి మొత్తం పిల్లల పేర్ల మీదా రాసి

          చనిపోతాడు. ఇప్పుడు రంగమ్మ బతుకు చిత్రం ఏమిటో ఆమెకే అర్థం కావడం

          లేదు. ఒక రోజున…

కీర్తి : మేము పెద్దవాళ్లం అయ్యాం..ఆస్తి రాదు. నీకు పిల్లలు లేరు. మేము నీ పిల్లలం

       కాము. నీ భర్త లేడు. నువ్వు మాకు అవసరం లేదు.

వాయిస్ : రంగమ్మ బాధ పడుతూ..

రంగమ్మ : అలా కాదు బిడ్డ..

వాయిస్ ; కీర్తి లాగి పెట్టి రంగమ్మ చెంప మీదా కొడుతుంది.

     కీర్తి : నీకు ఇక్కడ బిడ్డల్లేరు. అమ్మాగారని పిలువు. అలా అయితే ఇక్కడ ఉండు.

           లేకపోతే వెళ్లొపో !

వాయిస్ : ఆ మాట వినగానే రంగమ్మకు గతంలో తను చేసిన పొరబాటు గుర్తుకు

           వస్తుంది.

కీర్తి : ఇదిగో ఇక్కడ నువ్వు ఉండాలంటే పని మనిషిగా, వంట మనిషిగా ఉండాలి. పని చేయాల్సిన పనులెంటో తెలుసు కదా!

రంగమ్మ : తెలుసమ్మాగారు !

వాయిస్ : అని చెప్పి రంగమ్మ పొద్దునే లేచింది. చెంబు పట్టుకుని పాల కోసం పక్క

           వీధిలో ఉంటున్న సుందరమ్మ ఇంటికి పాలు తీసుకుని వస్తుంది. బావి

           దగ్గర నీళ్ళు చేది గోళం, డబ్బాలు, బాకీట్లు నింపుతుంది. ఆ తరువాత లేచి

           జాడు కట్ట  తీసుకుని బయట ఊడుస్తుంది. కల్లాపి చల్లుతుంది. ముగ్గులు

           వేస్తుంది. ఆ తరువాత వంటగదిలోకి వస్తుంది. కూరగాయలు కట్ చేసి వంట

          చేస్తుంది. తడి బట్ట వేసి ఇంటిని శుభ్రంగా చేస్తుంది.

           డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని కీర్తికి, బాలు..కిచెన్ ముక్కలు తింటూ ఉంటూ

           చూపిస్తూ ఆహా..ఒహా అంటూ తినేస్తారు కీర్తి, బాలు !  

           రంగమ్మ బిక్కుమంటూ చూస్తుంది. కీర్తి, బాలు సంతోషంగా తినేసి

          వెళ్లిపోతారు. ఆకలిగా ఉండటంతో రంగమ్మ అక్కడి వచ్చి  చస్తుది.. అన్నీ

          ఖాళీగా ఉంటాయి. బాధపడుతూ ఉంటుంది. వెళ్ళి కీర్తిని, బాలును

          మన్నించమని వేడుకుంటుంది. ఇక అక్కటి నుంచి అందరూ కలిసి ఉంటారు.

-0-

అది విక్రమ్ పూర్ విలేజి. అందులో నివసించే రైతు వీరయ్య, తన మొదటి భార్య శారద చనిపోవడంతో తన పిల్లలైన కీర్తి, బాలుల అలనా పాలనా చూడ్డానికి రంగమ్మను రెండో పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు. రంగమ్మ మాత్రం ఆస్తి మీదా మోజుతో పిల్లలను చాలా కష్టాలను, ఇబ్బందులను పెడుతుంది. చివరికి చూసుకుంటూ చికెన్ ముక్కలు తింటుంది కానీ పిల్లలకు పెట్టదు. అలా రోజులు గడుస్తాయి. కీర్తి, బాలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. సవతి తల్లి పెట్టిన బాధలను, ఇబ్బందులను తిరిగి కీర్తి, బాలు పెడతారు. అప్పుడు సవతి తల్లికి తను చేసిన తప్పు ఏంటో తెలుస్తుంది. మన్నించమని వేడుకుంటుంది. ఇక అప్పటి నుంచి అందరూ కలిసి మెలిసి సంతోషంగా ఉంటారు.

-0-

Add a Comment

Your email address will not be published. Required fields are marked *