పేద పిల్లల విజయం Episode 62| Telugu Stories | Telugu Fairy Tales
వాయిస్ : చందాపూర్ విలేజీలో ఉండే రమణ ఒక వంటవాడు. పెళ్లిళ్లకు, పెరంటాలకు,
సీమంతాలకు, తద్దీనాలకు ఇలా కార్యక్రమం ఏదైనా కానివ్వండి…ఖచ్చితంగా
రమణ వంట ఉండాలి అనేంతగా పేరు తెచ్చుకున్నాడు రమణ. అతనికి అన్నీ
పనుల్లోనూ అతని భార్య సుజాత చేదోడు వాదోడుగా ఉంటూ జీవిత
భాగస్వామి అనిపించుకుంది. వాళ్ళ భార్యాభర్తల అనుబంధానికి తీపి గుర్తుగా
దేవుడు వాళ్ళకు కీర్తి, బాలు అనే ఇద్దరు పిల్లలను ఇచ్చాడు. వచ్చిన
వంటను నచ్చిన విధంగా చేసుకుంటూ, తమ కష్టంతో కట్టుకున్న ఇంట్లో
కలతలు లేకుండా సంతోషంగా జీవిస్తూ ఉండేవాడు.
సుజాత : కన్ను మూసే వరకు ఈ జీవితం ఇలా సాగుతూ ఉంటే బాగుంటుంది.
రమణ : సంతోకరమైన సమయంలో చావు మాట ఎందుకు సుజాత. మనకు తెలిసి
మనం ఎవరికి ఎలాంటి మోసం చేయలేదు. పాపం మూట కట్టుకోలేదు.
దేవుడు ఖచ్చితంగా నీ కోరికను నెరవేర్చుతాడు.
సుజాత : అప్పుడు దేవుడికి నీ తలనీలాలిస్తాను.
రమణ : ఇది మరి బాగుంది సుజాత. మొక్కులు నీయ్ ! తీర్చుకునేది నువ్వు. కానీ
బలైపోతున్నది నేను. ఇదేమి బాగాలేదు.
సుజాత : భార్యాబిడ్డల కోసం తప్పదు. వీళ్ళు కావాలంటే వాటిని అక్కడ చేయాలి.
రమణ : చేస్తాను. అప్పుడే కదా పిల్లలు సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు. సరే నేనెల్లి
పిల్లలను స్కూల్ నుంచి తీసుకొస్తాను.
సుజాత : పిల్లల కోసం వేడి వేడిగా తినడానికి ఏదైనా చేస్తాను.
వాయిస్ : రమణ పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాల దగ్గరికి వస్తాడు. అక్కడ కీర్తి, బాలు
తప్ప మరే ఇతర పిల్లలు ఉండరు. కీర్తి, బాలు ఆ స్కూలు ఆవరణలో ఉన్న
ఒక చెట్టు కిందా కూర్చుని ఏడుస్తూ ఉంటారు. ఆ పిల్లల పక్కనే ఉన్న హెడ్
మాస్టర్ సుందరయ్య, పిల్లలను ఓదార్చుతూ ఉంటాడు.
మాస్టర్ : కీర్తి, బాలు…అరవింద్ కు ఏమి కాదు. మీరు భయపడకండి. దైర్యంగా ఇంటికి
వెళ్ళండి. ఏమైనా ఉంటే నేను మీ అమ్మానాన్నతో మాట్లాడుతాను. ఇప్పుడు
ఇంటికి వెళ్ళండి.
వాయిస్ : ఏమి మాట్లాడకుండా కీర్తి, బాలు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి రమణ
వస్తాడు. ఏడుస్తున్న పిల్లలను చూసి కంగారూ పడతాడు. ఏమైందని హెడ్
మాస్టర్ సుందరయ్యను అడుగుతాడు. సుందరయ్య జరిగింది మొత్తం
చెప్పడం మొదలు పెడతాడు. బాలు, మహేందర్ ఇద్దరు తమ తల్లిదండ్రులు
మిగితా తల్లిదండ్రుల కంటే గొప్పవాళ్లని వాదన చేసుకుంటూ ఉంటారు. వాదన
కాస్త కోపంగా మారుతుంది. దాంతో మా తల్లిదండ్రులు గొప్పవాళ్లని మహేందర్,
బాలును కొడుతుంటే…అది చూసి బాధపడిన కీర్తి, మహేందర్ దగ్గరికి వచ్చి
ఆగండని గట్టిగా నెట్టేస్తుంది. అంతే…
మహేందర్ తన బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోలేక పక్కనే ఉన్న రాయి మీదా
దనెల్ మని పడతాడు. తలకు పెద్ద గాయమవుతుంది. అంబులెన్స్ ను పిలిచి
దగ్గరలో ఉన్న హాస్పటల్ కు తీసుకెళ్తారు. హెడ్ మాస్టర్ సెల్ ఫోన్
మొగుతుంది. మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు. రమణతో ఇలా అంటాడు.
సుందరయ్య : చూడు రమణ, అరవింద్ కు ఎలాంటి ప్రాణాపాయం లేదు. అందుకనీ
వాళ్ళు కేసు పెట్టడం లేదు. ఒకవేళ కేసు పెడితే కీర్తి జైలుకు వెళ్తుంది. అలా
కాకుండా ఉండాలంటే రెండు లక్షలు అడుగుతున్నారు. ఆలోచించుకో
రమణ. ఇప్పుడు పిల్లలను తీసుకుని ఇంటికి వెళ్ళు. ఉదయం వరకు
డబ్బులు సర్ధుబాటు చెయ్ !
వాయిస్ : ఏమి మాట్లాడకుండా కీర్తి, బాలును తీసుకుని రమణ ఇంటికి వస్తాడు.
సుజాతకు జరిగింది చెప్తాడు. ఆలస్యం చేయకుండా రమణ, సుజాత ఇంటి
కాగితాలు తీసుకుని ఆ ఊరి పెద్ద మనిషి మారయ్య దగ్గరికి వెళ్తారు. విషయం
చెప్పి ఇంటి కాగితాలు పెట్టి రెండు లక్షలు అప్పుగా తీసుకుంటారు.
మారయ్య : చెప్పిన టైమ్ వరకు వడ్డీ అసలు రెండు కలిపి ఇస్తేనే ఇప్పుడున్న మర్యాద
ఉంటుంది. లేకపోతే మాటల్లో తేడా వస్తుంది. మర్యాదలో తేడా వస్తుంది.
రమణ : అలా రానివ్వను లెండి. మీకు చెప్పిన సమయనికే వడ్డీ, అసలు కలిపి
ఇచ్చేస్తాను.
వాయిస్ : కేసు కాకుండ ఉండాలని అరవింద్ నాన్నను కలిసి రెండు లక్షలు ఇస్తాడు.
తిగిరి డబ్బులు ఇచ్చే వరకు ఆ ఇంట్లో ఉండొద్దని మారయ్య చెప్పడంతో వేరే
ఇంటికి వెళ్లిపోతారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి.
వాయిస్ : అలా జరిగినప్పటి నుంచి రమణ, సుజాత…ఇద్దరు తమ పిల్లలను కూడా
తమతో పాటు వంట పనులు చేయడానికి తీసుకెళ్ళేవాళ్ళు. కూరగాయలు
కట్ చేయించే వాళ్ళు. నీళ్ళు మోయించే వాళ్ళు. అలా వంట పనులు
నేర్చుకుంటారు కీర్తి, బాలు! ఒక రోజున జోరుగా గాలి వీస్తూంది. బోరున వర్షం
పడుతూ ఉంటుంది. ఆ వానకు ఇప్పుడు ఉంటున్న ఇల్లు తడిసి పోయి
కురుస్తూ ఉంటుంది. పిల్లలు తడవకుండా ఉండటానికి మంచంలో పడుకోపెట్టి,
భార్యాభర్తలిద్దరూ బియ్యం సంచులతో కుట్టిన చాపలాంటి పరాదను ఏర్పాటు
చేసుకుని బాధపడుతూ ఉంటారు.
సుజాత : ఇలా ఎంత కాలం బతుకుదాం మామా!
రమణ : మన తల రాతలు మారే అవకాశం వచ్చే వరకు సుజాత!
సుజాత : నాకు అలాంటి అవకాశం మనకొస్తుందనే ఆశ లేదు.
రమణ : నిరాశ నిన్ను క్రుంగదీస్తుంది. అదే ఆశ నిన్ను పైకిలేపుతుంది.
సుజాత : మీరెన్ని చెప్పిన నాకు ఎలాంటి ఆశ లేదు. తిరిగి మళ్ళీ మనం ఇంతకు
ముందులా బతుకుతామనే భరోసా కూడా రోజు రోజుకు పోతుంది.
వాయిస్ : అని మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటారు. అలా రోజులు గడుస్తాయి.
ఒక రోజున ఆ ఊరి పెద్ద మనిషి మారయ్య, రమణ సుజాతల దగ్గరికి వస్తాడు.
మారయ్య : చూడు రమణ..నువ్వు డబ్బులు కట్టేలా లేవు. కాకపోతే నీకు నీ ఇంటిని
దక్కించుకునే అవకాశం ఒకటి ఇవ్వాలని అనుకుంటున్నాను.
వాయిస్ : ఆ మాట విని రమణ, సుజాతలు సంతోష పడుతూ అవకాశం కొరకు ఆశగా
చూస్తుంటారు. మారయ్య ఆ అవకాశం ఇస్తాడు. వంటల పోటీ పెట్టి ! ఈ
పోటీలో మారయ్య కొడుకు సుదర్శన్, రమణ పిల్లలు కీర్తి, బాలు
పాల్గొంటారు. కరెంట్ పొయ్యి మీదా వంట చేస్తూ ఉంటాడు. కట్టెల పొయ్యి కేర్తి,
బాలు వండుతూ ఉంటారు. అరగంటలో వంట పూర్తవుతుంది. వెజ్ బిర్యానీ,
ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ…పరోటా, సమోసా…చపాతీ…ఇలా అన్నీ రకాల
వంటలు చేయించారు. ఇద్దరు పెద్ద మనుషులు వచ్చి సుదర్శన్ వండిన
వంటలను తిని చూస్తారు. ఆ తరువాత కీర్తి, బాలు చేసిన వంటలను తిని
చూస్తారు. ఆ ఓఎద్ద మనుష్యులు మాట్లాదుకుని కీర్తి, బాలు విన్నర్ గా
ప్రకటిస్తారు. ఆ విధంగా పేద పిల్లలైన కీర్తి, బాలు వంటలు బాగా చేసి తమ
ఇంటిని సాధించుకుంటారు.
-0-
Related Posts

పేద పిచ్చుక పుట్టినరోజు | Telugu Stories | telugu Fairy Tales | Best Birds Stories Telugu

పేద పిల్లల మాయా మనీ చేప 2 Episode 146 |Telugu Stories | Telugu Kathalu | Banana Dreams TV Telugu
