పేద పిల్లల వెదురుబొంగుల వంతెన 3 | Telugu Stories | Telugu Kathalu

వాయిస్ : అది గంగపురామనే గ్రామం. ఆ గ్రామంలో కీర్తి, బాలు అనే ఇద్దరు పేద

            పిల్లలు జీవిస్తూ ఉండేవాళ్లు. పుట్టగానే తల్లిని, పెరుగుతున్న వయసులో

            తండ్రిని పోగొట్టుకుని ఒకరికి ఒకరు తోడు నీడగా మిగిలిపోయి, చేతనైన పని

            చేసుకుంటూ, అలా వచ్చిన డబ్బులతో తమ ఆకలిని తీర్చుకునేవాళ్లూ. అలా

            రోజులు గడుస్తున్నాయి.

            ఒక రోజున ఊరంతా పచ్చబండ కిందా సమావేశమవుతారు. విషయం ఏంటో,

            ఎందుకు అందరూ గుమిగూడరో తెలుసుకుందాని కీర్తి, బాలు అక్కడికి

            వస్తారు.

            అక్కడ సర్పంచ్ మాధవయ్య కూర్చిలో కూర్చుని ఉంటాడు. లలిత అనే ఒక

             స్త్రీ, తెల్లని బట్టల్లో, తొమ్మిది నెలల కడుపు వేసుకుని దోషిలా, సర్పంచ్

            ముందు నిలబడి ఏడుస్తూ ఉంది.

     కీర్తి : సరే లలితక్క…! అక్క బాగున్నావా? ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు?

వాయిస్ : అది విని మాధవయ్య కోపంగా, గట్టిగా…

మాధవయ్య : కీర్తి…అక్కడి నుంచి వెళ్ళు! వెళ్ళి అందరితోపాటు నిలబడి చూడు.

వాయిస్ : సర్పంచ్ మాధవయ్య కోపాన్ని మొదటిసారి చూసిన కీర్తి, కొంచెం

            అదిరిపడుతుంది. తనకు కూడా తొమ్మిది నెలల కడుపు వేసుకుని దోషిలా

            లలిత ఎందుకు నిలబడిందో తెలుసుకోవాలని అనుకుంటుంది. కీర్తి, బాలు

            అక్కడ జరిగేది మొత్తం చూస్తూ ఉంటారు.

లలిత : అయ్యా…నేను చేసిన తప్పుకు కోర్టు నాకు జైలు శిక్ష వేసింది. అది పూర్తిగా

           అనుభవించి ఊరికి వచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఈ పంచాయితీ ఏమిటన్నది

            నాకు అర్థం కావడం లేదు.

మాధవయ్య : నువ్వు చేసిన తప్పుకు న్యాయశాస్త్రం నిన్ను జైలుకు పంపించింది. శిక్ష

                కూడా పూర్తిగా అనుభవించావు. కానీ మన ఊరి ధర్మం ప్రకారంగా…

                భర్తను చంపిన ఆడవాళ్ళను ఊరి నుంచి వెలివేసి పడమట దిక్కున ఉన్న

                అడవిలో వదిలిపెడతారు. అక్కడే ఉండాలి. అక్కడే బతకాలి.

    లలిత : అయ్యా…ఏ భారత స్త్రీ, కావాలని తన పసుపు కుంకుమలను దూరం

             చేసుకోసు కదా! అలా చేసుకునే పరిస్థితి వచ్చిందంటే, ఆ స్త్రీ, తన మొగుడి

             వల్ల నరకం తప్ప, ప్రేమ లేదని, శారీరక బంధం తప్ప తనకు ఎలాంటి

             అనుబంధం లేదని ఎదురుగా కనిపిస్తున్న మనిషిని చూస్తూ, మెడలో

             తాలినీ తెంపేసి అతనిని చంపేస్తుందంటే ఒకసారి ఆలోచించండి.

మాధవయ్య : ఎన్నిసార్లు ఆలోచించిన నువ్వు నీ భర్తను చంపడం తప్పు. అందుకు

                 నీకు తగిన శిక్షగా ఊరి నుంచి వెలి వేయడమే! వెళ్ళి ఊరికి పడమటి

                 దిక్కున ఉన్న అడవిలో జీవిస్తూ ఉండు.

వాయిస్ : అని మాధవయ్య అక్కడి నుంచి లేచి పోతుంటాడు. అది గమనించిన లలిత,

            అతనికి ఎదురుగా వెళ్ళి, ఏడుస్తూ చేతులు జోడించి…

  లలిత : అయ్యా…ఇప్పుడు నేను గర్భవతిని. డెలివరీ సమయం. తోడుగా ఎవరు

            లేకుండా నేనొక్కదానినే దట్టమైన అడవిలో ఎలా ఉంటాను చెప్పండి.

           కూరమైన జంతువులు ఎన్నో తిరుగుతూ ఉంటాయి. నా భర్తను పోగొట్టుకున్న

            నాకు ఇక మిగిలింది నా కడుపులో ప్రాణం పోసుకుంటున్న నా బిడ్డ

           మాత్రమే! తెలిసి తెలిసి చూస్తూ చూస్తూ నా రక్తమాంసాన్ని జంతువల పాలు

            చేయలేను.

వాయిస్ : అవేమీ పట్టించుకోకుండా మాధవయ్య ముందుకు వెళ్లిపోతుంటాడు. లలిత

            కూడా అతనిని వెంబడిస్తూ అరుస్తూ ఉంటుంది. కొద్ది దూరం నడిచిన

            తరువాత, మాధవయ్య అసహంగా నిలబడి ఉంటాడు. లలిత అతని దగ్గరికి 

           వస్తుంది. 

వాయిస్ : లలిత చెప్పింది కూడా నిజమే కానీ ఒక హంతకురాలుగా రాకుండా, ఈ

            మనిషి అన్నట్టుగా చూడాలనే మానవతతో, అక్కడే ఉండి చూస్తున్న కీర్తి,

            బాలు కనిపిస్తారు మాధవయ్య. వాళ్ళను తోడుగా తీసుకెళ్లమని చెప్తాడు.

            అందుకు లలిత సంతోష పడుతుంది. కీర్తి, బాలు మాధవయ్య చెప్పింది విని

            ఆనందపడుతూ లలితతో కలిసి ఆ ఊరికి పడమటి దిక్కున ఉన్న అడవిలోకి   

            వెళ్తారు. ఆ ఊరికి అడవికి మధ్య వారధిగా పనిచేస్తూనే ఉంది వంతేన ! ఆ

            వంతెన పట్టుకుని లలితను తీసుకుని అడవిలోకి వెళ్లిపోతారు. అక్కడ

            వాళ్ళకు తెలిసిన మట్టితో ఇల్లు కట్టే విధ్యను ఉపయోగించి లలిత కోసం

            మట్టితో ఇల్లు కడతారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి.

వాయిస్ : కీర్తి, బాలు చేతనైన పని చేసుకుంటూ, చేతకాని సమయాల్లో అడుక్కుంటూ

            తమ ఆకలిని తీర్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా వాళ్ళకు తోడు లలిత

            అనే ఒక గర్భవతి స్త్రీ వచ్చిందని ఆలోచించి, అడుక్కున్తే వచ్చిన అన్నం

           కూరలతో జాగ్రత్తగా వంతెన మీది నుంచి నడుచుకుంటూ లలిత దగ్గరికి

           వస్తారు.

లలిత : మీ కోసమే అప్పటి నుంచి చూస్తున్నాను. ఎప్పుడు వస్తారా అని!

   కీర్తి : ఆకలవుతుందా!

లలిత : అవునమ్మ! ఇలాంటి సమయాల్లో ఖచ్చితంగా ఆకలవుతుంది. అందుకే

         డాక్టర్స్…తగిన సమయానికి అన్నం తినాలని చెప్తారు.

బాలు : ఈ విషయం మాకు తెలియదు కదా లలితక్క. నువ్వైన చెప్పాలి కదా లలితక్క.

లలిత : చెప్పాలనే అనుకున్నాను బాలు. కానీ…

బాలు : కానీ…వాళ్ళు పేద పిల్లలు. తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలు. వాళ్ళు

         బతకడమే కష్టంగా ఉంటుంది. ఇకా నాకు మాత్రం అన్నం ఎక్కడి నుంచి            

         తీసుకొస్తారని ఆలోచన చేసి కడుపు మడుచుకుంటున్నావా అక్క!

వాయిస్ : ఆ మాటకు ఏడుస్తూ ఉంటుంది లలిత. అది చూసి చలించిపోయి తమ దగ్గర

            ఉన్న అన్నం, పచ్చడి పెడతారు. ఇక ఆ రోజు నుంచి లలితను బాగా

            చూసుకునే వాళ్ళు. ప్రతి రోజు రాత్రి లాగే ఆ రోజు రాత్రి కూడా…మంచంలో

           లలిత పడుకుని ఉంది. కిందా చాప వేసుకుని కీర్తి, బాలు పడుకుంటారు.

            ఉన్నట్టుండి ఉరుములు…మెరుపులు…బీభత్సమైన వర్షం…ఈదులు గాలి…

           వాతావరణం ఘోరంగా మారిపోతుంది.

           ఉరుములు…మెరుపులకు భయపడిన లలిత, నెమ్మదిగా లేచి కిటికీలో

           నుంచి బయటకు చూస్తుంది. వర్షం ఘోరంగా పడుతుంది. కిటికీ దగ్గరికి వేసి

           వచ్చి పిల్లల నడుమ పడుకుంటుంది. తెల్లారింది…కీర్తి, బాలు బయటికి వచ్చి

           చూస్తారు. వంతెన తెగిపోయి ఉంటుంది. ప్రశాంతంగా పారే నది ఇప్పుడు

           ప్రవహిస్తుంది. కొద్ది దూరంలో చెట్లు విరిగి నేల పడ్డాయి. వర్షం చేసిన భీభత్సం

           తలుచుకుని బాధపడుతూ ఉంటారు. అప్పుడు సడెన్ గా కీర్తికి, లలిత

           గుర్తుకు వస్తుంది. ఎప్పుడైనా తనకు నొప్పులు రావోచ్చు. అప్పటిలాగా

           ఇప్పుడు తీసుకెళ్లడానికి వంతెన లేదు. నడుచుకుంటూ తీసుకెళ్లడానికి నది  

          పారాడం లేదు. ఇప్పుడెలా అని బాలుకు చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇద్దరు.

వాయిస్ : అప్పుడు వాళ్ళకు అడవిలో కొద్ది దూరంలో కనిపిస్తున్న వెదురు బొంగులు

            కనిపిస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా…కీర్తి, బాలు ఆ వెదురు బొంగులను

             ఉపయోగించి వంతెనా కడతారు. అలా ఒక్క రోజు గడిచిపోతుంది. లలితకు

             నొప్పులు వస్తుంటాయి. కడుపు నొప్పి అంటూ బాధపడుతూ ఉంటుంది.

             కీర్తి, బాలు లలితను టేసుకుని వెదురు బొంగుల వంతెన సహాయంతో ఆ

            ఊరిలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ నొప్పులను భరిస్తూ…

            పండండి ఆడపిల్లకు లలిత జన్మనిస్తుంది.

            పది రోజులు గడిచిన తరువాత…హాస్పటల్ నుంచి సంతోషంగా లలితను,

            చిన్నపాపను తీసుకుని వెదురు బొంగుల వంతెనా సహాయంతో అడవికి

            తెరుకుని కట్టుక్కున్న మట్టి ఇంట్లో చిన్నారిపాపతో ఆడుకుంటూ సంతోషంగా

           ఉంటారు.

-0-

Add a Comment

Your email address will not be published. Required fields are marked *