పేద పిల్లల వెదురు బొంగుల ఇల్లు | Telugu Stories | Telugu Fairy Tales | Story World Telugu

ఒక ఊరిలో బాలు కీర్తి అనే ఇద్దరు అనాధ పిల్లలు ఉండేవారు, వారికి ఉండడానికి ఇల్లు లేక, కనీసం వాళ్ళ బాగోగులు పట్టించుకునే వాళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతుండేవారు, అలా వాళ్ళు తోచిన  చేసుకుంటూ ఉండేవారు, ఒక్కోరోజు పొలం పనులకు పోతుండేవారు, ఒక్కోరోజు పథ ఇనుప సమన్లు అమ్మే దగ్గరికి పనికి పోతుండేవారు, ఈ పని ఆ పని ఏమి లేకుండా ఎక్కడ పని దొరికిది అక్కడికి పోతూనే ఉండేవారు, అలా చేసినప్పటికీ వాళ్లకి ప్రతి రోజు పని దొరికేది కాదు. కొన్ని రోజులుగా పని లేక పోవడంతో బాలు కీర్తి పని గురించి అడగడానికి వాళ్లకి అప్పుడప్పుడు పని ఇచ్చే వీరయ్య దగ్గరికి వెళ్లారు, వీరయ్య దగ్గరికి వెళ్లిన తరువాత వీరయ్యతో ఈ విధంగా మాట్లాడారు

బాలు : వీరయ్య తాత నువ్వొక్కడివే మాకు అప్పుడప్పుడు పని ఇస్తుండేవాడివి, నీకు తెలుసు కదా తాత మాకు రెక్కక ఆడితేనే డొక్కా ఆడుతది అని కానీ గత కొన్ని రోజులుగా నువ్వు మాకు పని ఇవ్వడమే మానేసావు, నువ్వు మాకు పని ఇవ్వక కొన్ని వారాలు అవుతుంది అని అంటాడు

కీర్తి : అవును తాత నువ్వు మాకు పని ఇవ్వడం లేదంటే నీ దగ్గర పని లేదా లేక నీ ఆరోగ్యం బాగులేదేమో అని కనుక్కుందామని వచ్చాము కానీ చూస్కుంటే నీ ఆరోగ్యం బాగానే ఉంది, కానీ తాత నువ్వు మాకు పని ఎందుకు ఇవ్వడం లేదు అన్న విషయం మేము తెలుసుకోవచ్చా అని అడుగుతుంది కీర్తి

వీరయ్య : చూస్తే మీరు భూమికి జానెడంత లేరు, మీరు నన్ను నిలదీసి మాట్లాడుతున్నారా? మీకు నేను పని ఇవ్వాలని ఏమయినా రాజ్యాంగం లో రాసి ఉందా? మీరు ఎదో గొప్ప పనికల్లోలు అని మీకు మీరు అనుకుంటే సరిపోదు అది మీతో పని చేయించుకుంటున్న యజమాని అనుకువాలి మీకు ఒక్క విషయం చెబుతున్న గుర్తు పెట్టుకొండి మీఋ పని మంతులు అని చెప్పి నేను మీకు పని ఇవ్వలేదు, ఆ సమయానికి నాకు కావలసిన కూలి వాళ్ళు దొరకక పోతే మీకు పని ఇచ్చాను మీకు ఇప్పటికైనా మీ స్థాయి ఏంటో తెలిసింది కదా ఇక వేళ్ళని అని బాలు కీర్తి లను బలవంతంగా వెళ్ళగొడతాడు వీరయ్య

వీరయ్య చేసిన అవమానానికి బాలు కీర్తి ఎంతో బాధ పడుతూ తాము ఉంటున్న చెట్టు కిందకు వెళ్తారు, అప్పుడు బాలు కీర్తి తో ఇలా అంటాడు

బాలు : అక్క  మనం ఉంటున్న పరిస్థితి చూస్తుంటే నాకు చాలా అవమానకరంగా ఉంది అక్క, మన గుర్తింపు చూపించుకోవడానికి మనకి అమ్మ నాన్న లేరు కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు, మన లాంటి వాళ్ళని ఎవరైనా వీరయ్య చూసినట్టు చులకన గాఎం చూస్తారు అని అంటాడు

కీర్తి : తమ్ముడు నువ్వు చెప్పింది నిజమేరా? మనకంటావు ఒక గుర్తింపు ఉండాలంటే మనకి అమ్మ నాన్న అయినా ఉండాలి లేదంటే కనీసం ఇల్లు అయినా ఉండాలి. పోయిన అమ్మ నాన్నలని ఎలాగూ తీసుకురాలేము కనీసం మనకంటూ ఒక ఇల్లు అయినా కట్టుకోవాలి రా అని అంటుంది

బాలు : అవునక్క మనకంటూ ఒక ఇల్లు ఉండాలి కానీ ఇంటిని ఎక్కడ కట్టుకుందాము అని అంటాడు

కీర్తి : ఊరిలో ఎవరి స్థలాలు వాళ్ళకే ఉన్నాయి మనం ఊరి చివరన ఉన్న చెరువు దగ్గర నిర్మించుకుందాము అని అంటుంది

కీర్తి అన్న మాటలు నచ్చడంతో బాలు కీర్తి ఇద్దరు కలిసి చెరువులోనుంచి మట్టిని తీసుకువస్తూ కొన్ని నెలల పాటు కష్టపడి చెరువులో దొరికిన మట్టితో ఒక ఇంటిని నిర్మించుకుంటారు, అలా వాళ్ళకంటూ ఉన్న ఒక ఇంట్లో చాలా సంతోషంగా జీవిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ సంతోషం ఎంతో కాలం నిలవలేదు, అకాలంగా వచ్చిన వరదలు వాళ్ళ సంతోషాన్ని దూరం చేశాయి,

బాలు : అక్క మనం కొన్ని నెలల పాటు కష్టపడి కట్టుకున్న ఈ ఇల్లు కనీసం కట్టినన్ని రోజులు కూడా లేదు కదా, ఏమి వర్షాలొ ఏమో  ఈ వర్షాలకు సమయం సందర్భం లేకుండా పోయింది అని అంటాడు

కీర్తి : ఎవరిని ఏమి అని ఎం లాభం తమ్ముడు, ఎన్ని వర్షాలు వచ్చిన కనిసం నిండని ఈ చెరువు ఈ సరి మాత్రం కట్ట తెగి మరి మనం ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంటిని కూల్చేస్తాయని కలగన్నామా? ఇది ఎవరి తప్పు కాదు ఇదంతా మన దరిద్రం అంతే, మన రాతే బాగుంది ఉంటే మనం కూడా అందరి లాగానే అమ్మ నాన్నలతో ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం కదా రాత బలీకే ఇవన్నీ మనం ఏది చేసినా ఇంతే మనకి వేరే దారి కూడా లేదు పదా ఇంకో దగ్గర మల్లి ఇంకో ఇల్లు నిర్మించుకుందాం అని అంటుంది కీర్తి

బాలు కీర్తి చెరువు పక్కనే నడుచుకుంటూ వెళ్తుండగా వాళ్లకి ఒక వెదురుబొంగు నీటిపై తేలి యాడుతూ కొట్టుకుపోతూ కనిపిస్తుంది

అలా నీటిపై కొట్టుకుపోతున్న వెదురుబింగుని చూసిన బాలు కీర్తి తో ఇలా అంటాడు

బాలు  ; అక్క ఆ వెదురుబొంగుని చూడు నీటిపై ఎలా తేలియాడుతుందో, దాని చూస్తుంటే నాకు ఒక ఆలోచన వచిందోయ్ అని అంటాడదు

కీర్తి : దాన్ని చూస్తే నీకు ఆలోచన రావడం ఏంటి తమ్ముడు, సరే నీకు ఎం ఆలోచన వచ్చిందో చెప్పు అని అంటుంది

బాలు : మన ఇల్లు మట్టి ఇల్లు అవ్వడం వల్లనే కదా వచ్చిన వరదలకు మొత్తం మట్టి అంతా కొట్టుకుపోయింది, అదే ఒక వేళా మనది వెదురుబొంగుల ఇల్లు అయి ఉంటె కొట్టుకుపోతున్న వెదురుబొంగు లాగా నే మన ఇల్లు కూడా నీటిపై తేలియాడుతూ ఉండేది కదా అని అంటాడు

కీర్తి : తమ్ముడు నువ్వు చిన్నోడివియు అయినా బలే పెద్ద సలహా ఇచ్చ్చావురా/ నువ్వు చెప్పినట మనం కొన్ని కొన్ని వెదురుబొంగులు థీచుకొని వాటి తో ఒక ఇంటిని నిర్మిద్దాం అని అంటుంది కీర్తి

అలా బాలు కీర్తి ఇద్దరు కలిసి అడవికి వెళ్లి కొన్ని కొన్ని వెదురుబింగులు తెస్తూ ఉంటారు, అలా కొన్ని రోజులలో చాలా వెదురుబొంగులు జమ చేస్తారు

బాలు : అక్క మనం నీటికి భయపడుతూ ఎక్కడో ఇల్లు కట్టుకునే బదులు, చేరువలోనే నీటిపై ఒక ఇంటిని కట్టుకుంటే సరిపోతుంది కదా, వరదలు వచ్చిన ఏమి వచ్చినా నీరు బయటకు పోతాయ్ తప్ప చెరువులోని ఉన్న మనల్ని ఏమి చేయవు, ఒక వేళ చెలువులో నీరు ఎక్కువైనా కూడా మనం వెదురుబొంగుల వల్ల నీటి పైనే ఉంటాము తప్పా మనకి ఎటువంటి హాని జరగదు అని అంటాడు

అలా బాలు ఇచ్చిన సలహా మేరకు బాలు కీర్తి యిద్దరు కలిసి చెరువులోని నీటిపై ఒక వెదురుబొంగుల ఇంటిని నిర్మిస్తారు, అప్పటినుంచి ఏ కష్టం రాకుండా ఇద్దరు ఎంతో సంతోషంగా ఉంటారు

1 మినిట్ స్టోరీ

బాలు కీర్తి అనే ఇద్దరు అనాధ పిల్లలు ఎవరు లేక పోవడం తో తమకి తోచిన పని చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు, పని దొరికిన రోజు కడుపునిండా అన్నం తిని పని లేని రోజు పస్తులు ఉంటారు, అలా ఉండగా ఓరోజు బాలు కీర్తి కలిసి తమకు ఒక ఇల్లు ఉండాలని చెరువు పక్కనే ఒక ఇంటిని నిర్మించుకుంటారు, అది మట్టి ఇల్లు అవ్వడం తో వరదలకు కూలి పోతుంది, తరువాతహ్హ బాలు కీర్తి ఇద్దరు బాగా ఆలోచించి చెరువులో నీళ్లపైన్నా ఒక వెదురుబొంగుల ఇంటిని నిర్మిస్తారు, అలా వెదురుబొంగుల ఇంట్లో ఉంటూ బాలు కీర్తి తెగ సంతోషపడిపోతుంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *