పేద పిల్లల వ్యవసాయం Episode 145 |Telugu Stories | Telugu Kathalu | Banana Dreams TV Telugu

బాలు కీర్తి ఇద్దరు తమకు ఉన్న కొంత పొలం లోనే నాట్లు వేస్తూ ఉంటారు, అలా నాట్లు వేసిన తరువాత కొంత సేపటికి బాలు కీర్తి తో ఇలా అంటాడు.

బాలు : అక్క మనకి ఈ పొలం ఉన్నదన్న పేరే తప్ప దీని వల్ల మనకి ఏ రకమైన ఉపయోగం ఆకూడా ఉండడం లేదు, మొత్తం పని మనమే చేయడం అంటే మన వల్ల కావడం లేదు, ఎవరినైనా పనికి తెచ్చుకుందాం అంటే వాళ్లకి ఇవ్వడానికి మన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు, ఇప్పుడు ఈ పని కూడా సగం చేసే లోపే మన ఒంట్లో శక్తి లేకుండా అయిపోయింది అని నీరసంగా అంటాడు

కీర్తి : చూడు బాలు మనకి ఎక్కడికి వెళ్లిన ఏ పని దొరకదు, మనం చిన్నపిల్లలం అని ఎవ్వరు కూడా పని ఇవ్వడానికి నిరాకరిస్తారు, మనకి డబ్బు సంపాదించుకోవడానికి ఈ పొలం తప్ప వేరే మార్గం లేదు, కాబట్టి కష్టమైనా నష్టమైనా మనం ఈ పని చేయక తప్పదు అని అంటుంది

అలా తమ శాయశక్తులా ప్రయత్నించి బాలు కీర్తి కలిసి ఇద్దరే పొలం మొత్తం నాటు వేసేస్తారు, నాటు వెయ్యడం పూర్తయైన తరువాత ఒంట్లో రవ్వంత కూడా ఓపిక లేకుండా పోతుంది ఇద్దరికీ అలానే ఇంటికి వెళ్ళిపోతారు

ఇంటికి వెళ్లిన తరువాత కీర్తి బాలు తో ఇలా అంటుంది

కీర్తి : తమ్ముడు నష్టమో నిష్టూరమో ఎలాగోలా మనమైతే నాటు వెయ్యడం పూర్తి చేసాము, ఇంకా కొన్ని రోజులు పొలాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి, ఒక్క 3 – 4 నెలలు జాగ్రత్తగా చూసుకోగలిగామంటే పొలం ద్వారా మనకి తినడానికి బియ్యం వస్తాయి పైగా మిగిలిన పంట అమ్మడం వల్ల డబ్బులు కూడా వస్తాయి అని అంటుంది

బాలు  ; అక్క అంత ఊహల్లోకి వెళ్ళిపోకు మనం ఇప్పుడు కేవలం నాట్లు మాత్రమే వేసాము అసలైన పని ఇప్పుడే మొదలవుతుంది, అయినా మనకి పంట నష్టపోవడం ఏమైనా కొత్తనా ఇప్పటికి ఎన్నిసార్లు నష్టపోయిన కూడా నువ్వు మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా  పొలం చేస్తూనే ఉంటున్నావు, నువ్వు చేసేదే కాక నాతో కూడా చేషిస్తున్నావు అని అంటాడు కోపంగా

కీర్తి : తమ్ముడు నువ్వు పొలాన్ని అవమానించడం అంటే మనం తినే తిండిని అవమానించినట్టే, పొలం పని చేయడం తక్కువ పని లా భావిస్తే పొలం లో నుంచి పాండే పంట తినడం కూడా తక్కువ పనే అవుతుంది, వ్యవసాయం ని అవమానించే వాడికి తిండి తినే హక్కు లేదు, నేను ఈ పొలం చేయడం ఆపేదే లేదు, నీ ఇషటమైతే నాతో రా లేదంట నీ ఇష్టం వాచినట్టు చేసుకో నిన్ను నేను ఆపను అని అంటుంది

బాలు : అక్క ఎదో తెలిసి తెలియక మాట్లాడుతానులే అక్క నిన్ను వదిలి పెట్టి నేను ఎక్కడికి వెళ్లగలను చెప్పు నీతోనే వస్తాను పొలం పని కూడా చేస్తాను అంటాడు

అప్పటినుంచి బాలు కూడా కీర్తి తూ కలిసి పొలం కి వెళ్లడం, ఇద్దరు కలిసి ఎంతో కష్టపడుతూ పొలం పనులు చేస్తూ ఉంటారు.

అలా కొద్దీ రోజుల్లోనే వాళ్ళ పంట ఎదిగి వస్తుంది, అది చూసి బాలు కీర్తి ఇద్దరు ఎంతో సంతోశిస్తారు

కీర్తి : చూసావా తమ్ముడు మన పంట ఎలా ఎదిగి వచ్చిందో? నా మాట విన్నీ నాతో పాటు పొలం కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది రా నువ్వు లేక పోయి ఉంటె నిజంగా నేను ఇంతలా పొలాన్ని కాపాడుకోగలిగేదాన్ని కాదు అని అంటుంది

బాలు : అక్క అలా మాట్లాడకు నాకు నువ్వు కాకుంటే ఇంకా ఎవరున్నారు, నీ మాట నేను  వినక పోవడం ఏంటక్కా? కోపడడానికైనా ప్రేమపడడానికి అయినా నాకు నువ్వు మాత్రమే ఇంకోసారి నన్ను వేరు చేసి మాట్లాడకు అని అంటాడు

కీర్తి : సరేలే తమ్ముడు ఇంకా కొన్ని రోజుల్లో పంట కోతకి వస్తుంది, మనం పంటనంతా కోసి కళ్లానికి తీసుకెళ్లి అమ్మేద్దాం అమ్మే ముందే మనకి కావలసినన్ని వడ్లు తీసుకుందాం అని అంటుంది

బాలు  : వమునక్కా కానీ అక్క మనం ఇన్నిరోజులు కాపాడుకుంది ఒక ఎత్తయితే ఇప్పుతినుంచి ఇంకొక ఎత్తు, ఇప్పుడు గనక పంట ఏ మాత్రం తేడా వచ్చినా మన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది, ఇప్పటినుంచి మనం ఈ పొలం దగ్గరే ఉందాము అని అంటాడు

కీర్తి : తమ్ముడు నీకు ఒక నిజం చెప్పాలి, మన అమ్మ నాన్న నువ్వు చిన్న పిల్లాడిలా ఉన్నప్పుడు చనిపోయారు, నాన్నకి అమ్మకి ఈ పొలం అంటే ఎంతో ఇష్టం ఎప్పుడు పొలం దగ్గరే ఉండేవారు, మన అమ్మ నాన్న మన ఊరిలోనే అందరికంటే ఎక్కువ పంట పండేంచేవారని ఇప్పటికి ఊరిలో పేరు ఉంది, కానీ వచ్చిన పంటని అంతా ఊరి జనాలకి లేని వాళ్ళకే పంచేవారు, అందరు తమ వాళ్ళే అనుకునే వారు,కానీ చివరకు మనల్ని ఒంటరి వాళ్ళని చేసి వెళ్లారు, అమ్మ నాన్నలకి ఈ పొలం అంటే అంత ఇష్టం కాబట్టే నాకు ఈ పొలం అంటే అంత ఇష్టం నీకు చాలా సర్వర్లు చెప్పాలనుకున్నాను కానీ నువ్వు అర్ధం చేసుకుంటావో లేడీఓ అని చెప్పలేదు, ఇప్పుడు చెప్పాల్సిన సమయం వచ్చింది కాబట్టి చెప్తున్ననుఁ అని అంటుంది

బాలు : అక్క ఇన్నిరోజులు నీ కోసం మాత్రమే పొలానికి రావాలి అని అనుకున్నాను కానీ అమ్మానాన్నల కి కూడా పొలం అంటే ఇంత ఇష్టం అని తెలిసాక నేను ఎలా వదులుకుంటాను అక్క ఇప్పటినుంచి నేను ఉన్నంతకాలం ఈ పొలం మీదే ఆధారపడి బ్రతుకుతాను ఇప్పటి నుంచి చూడు నా పని తనం అని అంటాడు

అలా పొలం కోతకి వచ్చేవరకు బాలు కీర్తి కళ్ళు కాయలు కాసేలా కపాల గా ఉంటారు, పంట మొత్తం కోతకి వచ్చిన తరువాత ఇద్దరు తెగ సంతోషపడుతూ ఉంటాయారు

బాలు : అక్క మన కష్టం ఫలించింది మన పంట పండింది ఇక కొత్త కోసి కుప్పలు వేసి కళ్లానికి తీసుకెళదాం అని అంటాడు

ఎంతో కష్టపడి బాలు కీర్తి కలిసి వదలని కళ్లానికి చేరుస్తారు, అక్కడ వదలని అమ్మి కొంత డబ్బు తీసుకుంటారు

డబ్బు తీసుకొని ఇంటికి వచ్చిన తరువాత బాలు కీర్తితి ఇలా అంటాడు

బాలు : అక్క ఇన్నిరోజులు ఎదో నువ్వు ఇబ్బంది పడుతున్నావని చేసానే తప్ప నాకు ఏ మాత్రం కూడా ఇష్టం లేదు, కానీ ఇప్పుడు నుంచి అమ్మ నాన్నలంకోసం నేను ఈ పని చేస్తూనే ఉంటాను, పొలం లో తిరుగుతూ ఉంటె అమ్మ నాన్నల ఒడిలో ఉన్నట్టుగా ఉంటుంది నాకు అని అంటాడు

కీర్తి : అవును తమ్ముడు నాకు కూడా అలానే ఉంటుంది అందుకే క్రమం తప్పకుండా పొలానికి వెల్తూ ఉంటాను అని చెబుతుంది.

పంట అమ్మేగా వచ్చినా డబ్బులో కొంత డబ్బు పక్కన పెట్టి ఇద్దరు కలిసి తమకు మల్లి పొలం వెయ్యడానికి కావలసిన విత్తనాలు తేవడానికి వేరే ఊరు వెళ్తాడు

అలా బాలు కీర్తి అమ్మ నన్నలా గుర్తుగా పొలాన్ని చేసుకుంటూ బ్రతుకుతుంటారు

 1 మినిట్ స్టోరీ

అమ్మ నాన్నల లకు ఎంతో ఇష్టమైనా పొలం లో పంట పండించాలని కీర్తి అనుకుంటూ ఉంటుంది, కానీ ఆవిషయం తెలియని బాలు మాత్రం పొలం అంటే అదేదో విచిత్రమైన పనిలా ఇబ్బంది పడుతుంటాడు, కీర్తి ఒకేరోజు బాలు కి ఆ పొలం అంటే అమ్మ నాన్నలకి ఎంత ఇష్టం అని చెబుతుంది, అప్పటి నుంచి బాలు కీర్తి ఇద్దరు కాళీ ఎంతో కష్టపడుతూ పొలం పనులు చేస్తూ ఉంటారు, కొన్ని రోజులే పంట చాలా బాగా పండుతుంది, దానిని మార్కెట్ కి తీసుకెళ్లి అమ్మగా వచ్చిన డబుతో ఇద్దరు తమకు కావలసిన ఇంటి సామాన్ల

తో పాటు మల్లి పంట వెయ్యడానికి కావలసిన విత్తనాలు కూడా  తెచ్చుకుంటారు, అలా అమ్మ నాన్న ఇచ్చిన పొలం లో పంట పండిస్తూ బాలు కీర్తి ఎంతో ఆనందంగా బ్రతుకుతుంటారు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *