పేద పిల్లల స్కూల్ టీచర్ | Telugu Stories | Telugu Kathalu | Banana Dreams TV Telugu

అతి కృష్ణాపురం అనే గ్రామం. అక్కడ శోభ అనే పేద అమ్మాయి ఉండేది. వాళ్లకు చాలా పేద కుటుంబం. తండ్రి తాగుడుకు బానిసై చనిపోయాడు. తల్లి నాలుగిళ్లలో పాచి పని చేసుకుంటూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తూ ఉండేది. పాపకి బాగా చదువుకోవాలని అలాగే ఉండేది కానీ ఇంటి పరిస్థితి బాగోక ఆమె బడికి వెళ్లలేకపోతున్నది. రోజులు గడుస్తున్నాయి
శోభ…. అమ్మ నాకు చదువుకోవాలని ఉందమ్మా. నన్ను బడికి పంపించవా.
తల్లి శారద….. బడి ఎక్కడ దగ్గర్లో ఎక్కడైనా ఉందా. చాలా దూరంలో ఉంది. ఈ రోజు రాను పోను చార్జీలు ఎంత. బళ్లో డబ్బులు కట్టాలి అంటే ఎంత అవుతుంది అమ్మో ఇదంతా నా వల్ల కాదమ్మా.
శోభ….. కానీ నేను బాగా చదువుకుంటాను అమ్మ పెద్ద డాక్టర్ అవుతాను అమ్మ.
తల్లి….. మనలాంటి వాళ్లకి కొన్ని కలలు ఎప్పుడూ కలలాగే ఉండిపోతాయి అమ్మ. అవి ఎప్పటికీ నెరవేరవు.
( ఇంట్లో విజయ అనే ఒక టీచర్ అక్కడికి వస్తుంది)
విజయ…. ఎందుకు అలా అనుకుంటున్నారు ఇప్పుడు పేదవాడి కల నిజం చేయడానికి నేను వచ్చాను. ఉచితంగా నేను చదువు చెప్పడానికి వచ్చాను. పదో తరగతి వరకు ఉచితంగా అన్నీ పుస్తకాలతో సహా నేను అందిస్తాను. ఆ తర్వాత పైసలకి ప్రభుత్వం వారు కచ్చితంగా సహాయం చేస్తారు.
తల్లి….. ఎవరండీ మీరు.
విజయ….. నేను ఇక్కడ పిల్లలకు చదువు చెప్పడానికి వచ్చిన టీచర్ని నా పేరు విజయ.
మీ ఊరి పెద్ద శంకరయ్య ఇంట్లో నేను చదువు చెప్తును. రేపటి నుంచి పాపను నా దగ్గరికి పంపించండి.
శారద…. సరే అలాగే పంపిస్తాను టీచర్ గారు.
విజయ….. బాగా చదువుకొని ఎవరికి తెలియని ఊరి గురించి అందరూ గొప్పగా చెప్పుకొనే లాగా చేయాలి. మీ ఊర్లో ప్రభుత్వం వాళ్ళు ఒక బడి ని ఏర్పాటు చేయలి. దానికి పునాది రాయి నువ్వే ఆవ్వాలి.
శోభ…. సరే టీచర్ గారు.
(నెక్స్ట్ డే)
తల్లి…. అమ్మ శోభా బడికి వెళ్లి బాగా చదువుకొని. మంచి పేరు తీసుకురావాలి.
శోభ…. తప్పకుండా అమ్మ. నేను వెళ్లి వస్తాను.
( అని చెప్పి అక్కడ నుంచి విజయ ఉన్న చోటికి వెళ్ళింది)
విజయ్….. పాప నువ్వు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం కూర్చో నీకు ఈ రోజు పాటలు నేర్పిస్తాను.
(పాప కూర్చుంటుంది)
టీచర్ బోర్డు మీద అక్షరాలను ఒక్కొక్కటిగా చదివి అర్థమయ్యేలాగా చెబుతుంది.
విజయ…. ఇప్పుడు మొదటి అక్షరం ఆ నుంచి మనం మొదలుపెడదాం ఆ అంటే అమ్మ. ఆ అంటే ఆవు . ఇ అంటే ఇల్లు. ఈ అంటే ఈగ
పాప….. ఇంకా పిల్లలు ఎవరు రాలేదు కదా
టీచర్. మనం కొంచెం సేపు ఆగు దామ.
టీచర్….. మనం ఎవరి కోసం ఆగకూడదు.
వాళ్లు వస్తే మళ్ళీ మొదటి నుండి చెప్తాను కానీ వాళ్లు ఆలస్యంగా వచ్చినందుకు చిన్న శిక్షను అనుభవించాల్సి ఉంటుంది.
మన జీవితంలో ఏదైనా ముఖ్యమైన పని ఉంటే. ఆ పనిని ఎవరో వ్యక్తుల కోసం దానిని వాయిదా వేయకూడదు. ఆ సమయంలో ఏది చేయాలో అది మనం చేయాల్సి ఉంటుంది.
పాప…. సరే టీచర్.
(విజయ పాఠాలు మొదలు పెట్టింది. ఇంతలో కొంతమంది పిల్లలు అక్కడికి వస్తారు.)
విజయ….. చూడండి మీరు ఆలస్యంగా వచ్చినందుకు కాళ్లు గోడకు చేతులు నేలకి
ఆనించి నిలబడండి .
(పిల్లలు అందరూ అలాగే చేస్తారు)
విజయ…. రేపు కనుక ఆలస్యంగా వస్తే ఇంత కంటే కఠినమైన శిక్ష విధిస్తారు సమయానికి బడికి రావాలి. బుద్ధిగా శ్రద్ధగా చదువుకోవాలి.
అర్థమైంది కదా.
పిల్లలు…. అర్థం అయింది టీచర్.
ప్రతిరోజూ టీచర్ వాళ్లకి పాటలు నేర్పిస్తూ ఉంటుంది. రోజులు గడిచాయి.
ఒకరోజు
శారద….. శోభ ఇంతవరకు బడి కి వెళ్ళలేదు ఆలస్యం అవుతుంది కదా.
శోభ…… అమ్మో నేను బడికి వెళ్ళాను అమ్మ. టీచర్ గారు నన్ను కొడుతున్నాడు తిడుతున్నాడు. కాదు అందరినీ తిడుతున్నారు. మనం పేదవాళ్లం అనే కదా ఆమె ఇష్టం వచ్చినట్టుగా మనతో ప్రవర్తిస్తుంది.
మమ్మల్ని కొట్టినా కూడా ఎవరు ఏమి మాట్లాడవు అని ఎందుకంటే ఉచితంగా చెబుతుంది కదా చదువు. బహుశా
అందుకే అనుకుంటా.
శారద….. సర్లే అమ్మాయి అయితే వెళ్ళకు . ఇంట్లోనే పని పాట నేర్చుకో.
(శోభ ఇంట్లోనే పనులు చేసుకుంటూ ఉంటుంది.)
రెండు రోజులు గడిచాయి.
శోభ…. నాకు బడికి అంటే ఈ పనులు చేసుకోవడానికి చాలా బాగుంది.
శారద…. మరి అప్పుడు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. డాక్టర్ అవుతాను అవుతాను అని. నీ మాటలు నమ్మి ఈ నిన్ను డబ్బులు కట్టి ఇ ఏదన్నా బడిలో చేర్పిస్తే డబ్బు లేని గోవింద అయ్యేది. నీకు ఈ పనులే బాగుంటే ఇదే చేసుకో.
(ఇంతలో విజయ అక్కడికి వస్తుంది)
విజయ….. శారద గారు మీరు చెప్పాల్సిన మాటలు ఇవే నా. పెద్దవాళ్ళు పిల్లలకు బుద్ధి చెప్పాలి కానీ చెడి పోవాలనీ చెప్పకూడదు.
శారద….. టీచర్ గారు మీరు ఊరికే పిల్లల్ని కొడుకు తిడుతూ ఉంటే మీ దగ్గర చదువు నేర్చుకోవడం కోసం ఎవరు వస్తారు.
విజయ…. వులి దెబ్బలకి బాధపడితే శిల శిల్పం కాదు. దున్నే టప్పుడు బాధపడితే నేల కడుపులో బంగారం పట్టదు.
అలాగే ఈ చిన్న చిన్న దెబ్బలు ఎవరైనా బాధపడతారు. అయినా నేను ఒక దెబ్బ కొట్టేది నీ మంచి కోసమే. నేను కొడతా అన్న భయంతో తరువాత రోజు అదే తప్పు చేయరు అని .
శారద…… అయ్యో మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాము టీచర్ మమ్మల్ని క్షమించండి.
శోభ….. టీచర్ మీరు చెప్పింది నిజంగా నిజం నేను అంత దూరం ఆలోచించలేదు.
నన్ను క్షమించండి.
విజయ….. మరేం పర్వాలేదు పాపా రేపట్నుంచి బడికి రా.
(అని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.) మరుసటి రోజు పాప ఎప్పటిలాగే తర్వాత బయటికి వెళ్తుంది చాలా శ్రద్ధగా చదువుకుంటూ ఉంటుంది.
విజయ…. పాప నువ్వు అందరికంటే చాలా చక్కగా చదువుకుంటున్నావు. ఇలాగే చదువుకొని గొప్ప దానివి అయిపోవాలి.
పిల్లలు మీరు కూడా శోభనీ చూసి నేర్చుకోండి.
చక్కగా చదువుకుంటారు మీరు ప్రయోజకులు అవుతారు.
పిల్లలు….. సరే టీచర్ .
కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ వాళ్ళందరూ పెద్ద పెద్ద చదువులు చదివి ఎవరికీ తెలియని ఆ గ్రామాన్ని అందరికీ తెలిసేలా చేస్తారు.
శోభ పెద్దదవుతుంది .
ఆమె పదో తరగతిలో గొప్ప విజయాన్ని సాధించింది. ఆమె ఇంటికి పత్రికల వాళ్ళు వచ్చారు.
శోభ…. మీ అందరి నీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎంతటి విజయాన్ని సాధించడానికి కారణం మా విజయ టీచర్.
ఆమె మా పేదవాళ్ళకి చదువు చెప్పడానికి వచ్చి మమ్మల్ని ఇంత గొప్ప వాళ్ళని చేసింది.
మీడియా వాళ్లలో ఒక ఆమె …… ఆమె ఎవరో మాకు చూపిస్తారా.
శోభ…. విజయ టీచర్ వెనకాల ఎందుకు నిలబడ్డాను ముందుకు రండి.
విజయ….. మీ అందరికీ చాలా కృతజ్ఞతలు ఈ టీవీ ముందు పుట్టిన వాళ్ళందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఎన్నో సంవత్సరాలుగా ఈ ఊరిలో పాఠశాల లేదు.
ఎన్ని సంవత్సరాలు నేను పడిన కష్టమంతా ఈ రోజు తిరి పోయినందుకు సంతోషంగా ఉంది. ఇదంతా ముఖ్యంగా శోభ సంపాదించింది. ప్రభుత్వం వాళ్లు బయట నుంచి ఒక పాఠశాల నీ కొంత మంది ఉపాధ్యాయులను . ఈ ప్రదేశానికి పంపించాలని నేను కోరుకుంటున్నాను.
ఈరోజు తర్వాత వార్త అన్నిట్లో రావడం వలన
ప్రభుత్వం వారు అక్కడ పాఠశాలను ఏర్పాటు చేస్తారు. ఇంకా అక్కడ పిల్లలు అందరూ సంతోషంగా బడికి వెళ్లి చదువుకుంటారు.
ప్రభుత్వం వాళ్ళకి గొప్పతనం తెలియ జేసిన టీచర్ విజయ గారికి మరియు శోభ కి సన్మానం చేస్తారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *