పేద పిల్లల హోలీ పండుగ Episode 161 | Telugu Stories | Telugu Kathalu | Banana Dreams TV

బాలు కీర్తి ఇద్దరు ఇంటి ముందు దిగులుగా కూర్చుంటారు, ఊరిలో అందరు హోలీ పండుగ వస్తుందని రంగులు కొనుక్కునే హడావిడిలో ఉండడం చూసి బాలు కీర్తి ఎంతో బాధపడుతుంటారు, అలా ఉండగా బాలు కీర్తి తో ఇలా అంటాడు

బాలు : అక్క ఊరిలో జనాలందరూ చూడు హోలీ పండుగ వస్తుందని ఎంత ఆనందంగా ఉన్నారో, అందరు రంగులు కొనుక్కొని చాలా సంబరంగా వేడుకలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మనం మాత్రం మన దగ్గర డబ్బులు లేక అందరిని చూస్తూ కూర్చీన్నాము, అక్క నాకు కూడా హోలీ ఆదుకోవాలని అందరిలా రంగులు కొనుక్కిని స్నేహితులాతో తిరగాలని చాలా అందంగా ఉంది అక్క అని అంటాడు,

కీర్తి : మనకి డబ్బులు లేవు తమ్ముడు మనం పేదవాళ్లం కదా మనం రంగులు ఎలా కొనుక్కుంటాము వాళ్లంతా చాలా ధనవంతులు ఒకవేళ మనం రంగులు తీసుకొని వాళ్ళతో ఆడడాన్నికి వెళ్లినా కూడా వాళ్ళు మనల్నివు కనీసం దగ్గరకు కూడా రానివ్వరు అని అంటుంది కీర్తి బాలు ని ఓదారుస్తూ

బాలు కీర్తి అలాగే దిగులుగా కూర్చుని ఉంటారు. ఇంతలో బాలు మాట్లాడుతూ

బాలు : అక్క మనకి ఎలాగూ రంగులు కొనుక్కునే స్థోమత లేదు కదా మనం ఓక్ పని చేద్దాం, మనం పని చేసి డబ్బులు సంపాదించుకున్దామన్న కూడా మనకి ఎవ్వరు పని ఇవ్వడం లేదు కదా, మనం ఊరంతా తిరుగుతూ రంగులు అడుక్కుందాం, ఎవరైనా మన పరిస్థితి చూసి మన మీద జాలి పడితే గనక మనకి ఎంతో కొంత రంగులు సహాయం చేస్తారు అని అంటాడు, ‘

కీర్తి : సరే తమ్ముడు నీకు ఎలాగూ రంగుల పండుగ జరుపుకోవాలని కోరికగా ఉంది కదా మనకి ఇది తప్పా రంగులు దొరకడానికి వేరే దారి లేదు పదా వెళ్లి రంగులు అడుక్కుందాం అని అంటుంది.

బాలు కీర్తి కలిసి రంగులు అడుక్కోవడానికి పంకజం అనే ఆవిడ్స ఇంటికి వెళ్తారు.

బాలు : అమ్మ మేము చాలా పేదవాళ్లం మాకు రంగులతో హోలీ పండుగ జరుపుకోవాలని చాలా కోరికగా ఉంది, మీరు మా మీద కొంత దయ ఉంచి కొంత రంగు ఏదైనా దానం చేస్తే మేమియు కూడా అందరిలాగానే రంగులతో పండుగ జరుపుకుంటాము అని అంటాడు.

పంకజం :ఏంటి ఈ మధ్య పండుగలు జరుపుకుంటామని కూడా అడుక్కుంటున్నారా., మీరు కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారేమో మీ మొఖాలకి హోలీ పండుగ అవసరమా రంగులతో ఆదుకోక పోతే మీరేమన్న చచ్చిపోతారా అని అంటుంది.

కీర్తి : అమ్మ మా పరిస్థితులు బాలిక ఇప్పుడు వాడుకుంటున్నాము, అలా అని మేము మీరు ఎంత మాట అంటే అంత మాట పడలేము అని అంటుంది కో[పంగా

పంకజం : అంత రోషం ఉన్నవాళ్ళైతే ఇలా అడుక్కోవడానికి రారు, మీ మొఖాలు చూస్తుంటే ఇంత బిక్షం కూడా వెయ్యబుద్ది అవ్వడం లేదు, ఇంకా రంగులు ఇస్తాన పోండి పోండి ఇక్కడనుంచి అని అంటుంది.

కీర్తి : చూసావా తమ్ముడు నేను ముందే చెప్పను కదా ఈరోజుల్లో ఎవ్వరు కూడా దానం చెయ్యడానికి కూడా ఇష్టపడడం లేదని అని అంటుంది

బాలు : ఇలా ఊరి వాళ్లతో మాటలు పడ్డానికి కారణం నేనే కదా అక్క అయినా మన లాంటి పేదవాళ్ళకి కోరికలు ఉండకూడదా అక్క ఆశలు కోరికలు కూడా దబ్బున వాళ్ళ సొంతమేనా అక్క అని అంటాడు.

కీర్తి : ఈ రోజుల్లో అన్ని పనులు కోరికలు ప్రేమలు కూడా డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి తమ్ముడు అని అంటుంది.

ఇలా ఏడుస్తూనే బాలు కీర్తి ఇంటికి వెళ్ళిపోతారు. అలా వాళ్ళు చూస్తుండగానే హోలీ పండుగ రోజు వస్తుంది, ఊరిలో అందరు రంగులు చల్లుకుంటూ ఎంతో సంబరంగా హోలీ పండుగ జరుపుకుంటారు. బాలు కీర్తి ఇంటి బయటకు వెళ్లి ఒక చెట్టు కింద కూర్చుని అందరిని చూస్తూ ఉంటారు.

బాలు : అక్క మన అమ్మ నాన్న కూడా ఉండి ఉంటె మనం కూడా వాళ్ళలా ఎంతో ఆనందడఁగా హోలీ పండుగ చేసుకునే వాళ్ళమేమో కదా అని అంటాడు

కీర్తి : మనకెలాగూ ఆదుకునే స్థోమత లేదు కదా కనీసం చూసి ఆనంద పడడమే అని అంటుంది. ఇంతలో బాలుకి కొంత దూరం లో ప్రవీణ్ అనే ఒక ధనవంతుల కొడుకు కనిపిస్తాడు. బాలు కొంత సేపు అతన్నే గమనిస్తూ ఉంటాడు అతనిని ఎవ్వరు పట్టించుకోవడం కూడా లేదు అతను ఎంతో నిరాశగా అతను కొనుక్కున్న రంగులు అతనే తన మీద చల్లుకుంటూ ఉంటాడు. అతన్ని చూస్తున్న బాలు కీర్తి ని పిలిచి ఇలా అంటాడు

బాలు : అక్క ఆ ప్రవీణ్ చూడు అతనితో ఎవ్వరు హోలీ ఆడడం లేదని అతని రంగులు అతనే పూసుకుంటూ నిరాష తో తిరుగుతున్నాడు, అని అంటాడు

కీర్తి అవునురా తమ్ముడు నేను కూడా ఇందాక నుంచి అతన్నే చూస్తున్నాను అని అంటుంది.

ఇంతలో ప్రవీణ్ బాలు కీర్తి దగ్గరికి వస్తాడు.

చెట్టు కింద ఒంటరిగా కూర్చున్న బాలు కీర్తిని చూసి

ప్రవీణ్ ; మీరేంటి ఇలా ఒంటరిగా కూర్చున్నారు ఊరందరు ఎంతో ఆనందంగా పండుగ జరుపుకుంటున్నారు కదా మీరు ఆడడం లేదా అని అంటాడు.

బేలు : ప్రవీణ్ అన్న మా దగ్గర తిండి తినడానికే డబ్బులు లేవు ఇంకా రంగులు కొన్నుకోవడానికి ఎక్కడనుంచి తీసుకురావాలి, పోనీ ఎవరైనా ఇస్తారేమో అని అడిగితే రంగులు ఇవ్వకపోవడమే కాకుండా ఎంతో అవమానించారు ఇక ఎవ్వరిని ఏమి అడగకూడదని నిర్ణయించుకొని నిరాంయించున్నాం అందుకే అందరు ఆడుతుంటే ఇక్కడ కూర్చుని చూస్తున్నాము అని అంటాడు.

ప్రవీణ్ : మా అన్న దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నాకు ఎన్ని అడిగినా ఇస్తాడు కానీ ఎంత డబ్బులు ఉంది మాత్రం ఏమి లాభం నాకు స్నేహితులు అంటూ ఎవ్వరు లేరు, అందుకే ఇంత మంది ఉన్నా నేను ఒంటరిగాఎం తిరుగుతున్నాను, మీకు మంచి స్నేహితులు కావలి నాకు కూడా మీలాంటి స్నేహితులే కావలి ఈరోజు నుంచి మనం మంచి స్నేహితులుగా ఉందాం అని అంటాడు.

ప్రవీణ్ మాటలకు బాలు కీర్తి కూడా ఒప్పుకుంటారు, ఇక ప్రవీణ్ దగ్గర ఉన్న రంగులు తీసి బాలు కీర్తి మీద చల్లుతాడు, వెంటనే బాలు కూడా ప్రవీణ్ దగ్గర రంగు లాక్కొని ప్రవీణ్ మీద మరియు కీర్తి మీద చల్లుతాడు, ఇక బాలు కీర్తి ప్రవీణ్ కలిసి హోలీ పండుగ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఆరోజు నుంచి బాలు కీర్తి ప్రవీణ్ ఎంతో స్నేహంగా తిరుగుతుంటారు.

షార్ట్ స్టోరీ

ఊరిలో అందరు హోలీ పండుగ చేసుకోవడానికి సిద్ధం చేసుకుంటుంటే బాలు కీర్తి తమ దగ్గర డబ్బులు లేకపోవడం తో తమ దుస్థితిని గురించి ఆలోచిస్తూ ఎంతో బాధపడుతుంటారు. పండుగ రోజు ఒక చెట్టు కింద కూర్చొని ఊరిలో ప్రజలందరి హోలీ ఆడుతుంటే వాళ్ళని చూస్తూ ఉంటారు, అప్పుడే ప్రవీణ ఎం ఒక పిల్లాడు వచ్చి బాలు కీర్తి తో తనకి స్నేహితులు ఎవ్వరి లేరని తనతో స్నేహం చేతారా అని అడుగుతాడు, బాలు కీర్తి కూడా సరే అని ఒప్పుకోవడం తో బాలు కీర్తి ప్రవీణ్ కలిసి హోలీ పండుగా చాలా ఆనందంగా జరుపుకుంటారు, అలా వాళ్ళు ముగ్గురు మంచి స్నేహితులుగా మారతారు,

Add a Comment

Your email address will not be published. Required fields are marked *