పేద పిల్లాడి బొంగుల కారు | Telugu Kathalu | Bedtime Stories | Panchatantra kathalu |Fairy Tales

వల్లపురం అనే గ్రామంలో  విష్ణు అనే ఒక వ్యక్తి ఉండేవాడు.అతను బాగా డబ్బున్న వ్యక్తి. అతని కొడుకు పేరు కృష్ణ.

కృష్ణ కి డబ్బు ఉందని పొగరు చాలా ఎక్కువ ఉండేది అందుకే తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడుతూ ఉండేవాడు. అది ఊర్లో ఉంటున్నావ్ బాలు వాళ్ళది పేద కుటుంబం ఆ విషయం తెలిసిన దగ్గర్నుంచి కృష్ణ బాలుని ఎక్కువగా ఆటపట్టిస్తూ అల్లరిచేస్తూ ఉండేవాడు. ఆ విషయమై బాలు చాలా బాధ పడుతూ ఉండేవాడు. రోజులు గడిచాయి కానీ అతనిలో మార్పు మాత్రం రాలేదు అప్పుడు ఈ వినాయక చవితి వచ్చింది . పిల్లలు పెద్దలు అందరూ కలిసి చందాలు వసూలు చేస్తూ ఉన్నారు. అప్పుడు కృష్ణ…. ఈ సంవత్సరం బొమ్మని మేము ఇస్తాము . దానికి కావాల్సిన అన్ని ఖర్చులు మేమే చూసుకుంటాను మీరు చందాలు వసూలు చేయాల్సిన అవసరం లేదు. కార్యము మొదటి నుంచి చివరి వరకు అన్ని మేము చూసుకుంటాం . అని అంటాడు. అందుకు వాళ్లు సరే అని చెప్పి చందాలు వసూలు చేయకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఇది ఇలా ఉండగ  అక్కడ బాలు కూడా వాళ్ల వీధిలో వినాయకుడిని స్థాపించాలని నిర్ణయించుకొని చందాలు వసూలు చేస్తారు. ఇక వినాయక చవితి రానే వచ్చింది . కృష్ణ చెప్పినట్టుగా ఒక పెద్ద వినాయకుని తీసుకొచ్చి పందిరి లో ఉంచుతారు. బాలు చందాలు పోగు చేసిన విధంగానే వాళ్ల స్థాయికి తగ్గట్టుగా ఒక చిన్న వినాయకుడి తీసుకువచ్చి ఉంచుతారు. ఇక పూజలు పూర్తయిపోయాయి కృష్ణ ఊర్లో ఎవరు బొమ్మలు పెట్టరా అని చెప్పి చూడ్డానికి వెళ్తాడు అన్ని బొమ్మలు చూసి చివరగా బాలు స్థాపించిన విగ్రహం దగ్గరికి వస్తాడు అది చాలా చిన్నగా ఉంటుంది దాన్ని చూసి…..హా హా ఏరా బాలు మీ స్థాయికి తగ్గట్టుగానే పెట్టారే. అయినా మా వినాయకున్ని చూడరా ఎంత పెద్ద గా ఉన్నాడో. పూజలు ఘనంగ చేస్తాము నిమజ్జనం కారులో మరింత ఘనంగా చేస్తాము. మీరు అవన్నీ చేయనప్పుడు ఇలాగా వినాయకుని అవమానించడం ఎందుకు . అని నోటికొచ్చినట్టు గా మాట్లాడుతూ ఉంటాడు. బాలు మాటలకు చాలా బాధపడుతూ తన మనసులో…. భగవంతుడా నీకు ధన పేద భేదాలు లేవు నీ దృష్టిలో మేము అంతా సమానమే కదా మరియు అతని ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు నాకు అర్థం కావట్లేదు అతని ప్రవర్తన మార్చుకో భగవంతుడా అంటూ భగవంతున్ని ప్రార్థిస్తాడు తన మనసులో. కొంచెం సమయం తర్వాత కృష్ణ అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఐదు రోజుల తర్వాత కృష్ణ వాళ్లు స్థాపించిన గణపయ్య విగ్రహాన్ని కారు మీద కూర్చోపెట్టి  ఊరేగింపు చేస్తూ  చాలా ఘనంగా నిమజ్జనం జరిపిస్తాడు. ఆరోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు  కృష్ణ కి బాలు కనబడతాడు. బాలుతో కృష్ణ….. ఏరా బాలు నిన్ను చూసావా నిమజ్జనం ఎంత బాగా చేసాము అది అలా ఉండాలి జనం అందరూ నిన్న జరిగిన ఉత్సవం గురించి చెప్పుకుంటున్నారు అది వినాయక చవితి అంటే . మీరు ఉన్నారు 9వ రోజు తీసుకు వెళ్తారు కదా అప్పుడు చూస్తానులే రిక్షాను సైకిల్మీద పెట్టుకొని తీసుకు వెళ్తారు కదా .హా హా హా మిమ్మల్ని చూసి వినాయకుడు కూడా నవ్వుకుంటాడు రా . అని చాలా అవమానం మాట్లాడతాడు బాలు బాధపడుతూ అక్కడనుంచి వెళ్ళి పోతాడు.

బాలు తన మనసులో ….. కృష్ణ మాటలకి హద్దులేకుండా పోయింది అతని మాటలకి అడ్డుకట్ట వేయాలి అంటే నేను వాడు చేసిన దానికంటే ఎక్కువగా చేయాలి . కానీ అంత డబ్బు వసూలు కాలేదు. నేను ఇవ్వడానికి నా దగ్గర కూడా లేవు. అని చాలా ఆలోచిస్తూ బాధపడతాడు అప్పుడు అతనికి ఒక ఆలోచన వస్తుంది . అతను …. మా నాన్నకి రిక్షా ఉంది కదా రిక్షా అని ఎదురు బొమ్మలు కారు గా మార్చి వినాయకుడిని అందులో కూర్చోబెట్టి ఊరేగింపు చేస్తాను. అప్పుడు అందరికళ్ళు ఆకారం మీదే ఉంటాయి ఆ వచనం మీదే ఉంటాయి . అందరూ దాని గురించి చెప్పుకుంటారు అప్పుడు కృష్ణ అహంకారం అనుగుతుంది.అని అనుకొని వాళ్ళ నాన్న రిక్షాని ఎదురు బొంగులతో కారు లాగా తయారు చేస్తాడు .

అది చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు అది ఒక రిక్షా అని ఎవరికీ అర్థం కాదు అచ్చం కారు లాగే ఉంటుంది. భాలు దానిని పనిచేసినప్పటికీ మరింత కొత్తగా ఏదైనా చేయాలి అనుకుంటాడు ఒక బ్యాటరీ సహాయంతో అది కొంత వారికి వేగంగా నడిచే లాగా చేస్తాడు. నవరాత్రులు గడిచాయి. నిమజ్జనం రోజు బాలు తన తయారుచేసిన కారులో వినాయకుని తీసుకొని అక్కడ చిన్నా పెద్దలతో కలిసి ఊరేగింపు చేస్తూ ఉంటాడు దాన్ని చూసిన ప్రజలందరూ ఆశ్చర్యపోతూ….. అద్భుతంగా ఉంది ఈ కారు . అంటూ పొగుడుతూ దాని గురించి తెలుసుకుంటారు. అందరూ బాలు నే దానిని తయారు చేసాడు అని తెలుసుకొని ప్రశంసిస్తారు. దాన్ని చూసి కృష్ణ మండిపోతూ ఉంటాడు. తర్వాత జరగాల్సిన కార్యక్రమం అంతా పూర్తి అవుతుంది. ఊరి మొత్తం కూడా ఆ కారు గురించి చెప్పుకుంటారు.

కృష్ణ దానిని అవమానంగా భావించి ఇంట్లో నుంచి అస్సలు బయటకు రాడు. ఇక మిగిలిన పదకొండు రోజులు 15 రోజులు విగ్రహాలు ఉంచిన వాళ్లు కూడా బాలు సలహాని తీసుకొని ఆ ఎదురు బొంగుల కారుని తయారు చేసి నిమజ్జనం జరుపుతారు. అలా బాలు కి ఆ ఊర్లో చాలా మంచి పేరు వస్తుంది. గర్వపడిన కృష్ణకి బుద్ధి వచ్చి తలదించుకున్నాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *