పేద పిల్ల చేపల వ్యాపారం | Telugu Kathalu | Bedtime Stories | Panchatantra kathalu | Comedy Videos

బేబీ తల్లిదండ్రులు చనిపోయారు. బేబీ తమ్ముడు నెలల పిల్లవాడు . బేబీ కి ఇది ఒక పెద్ద పరీక్ష తన జీవితాన్ని కాకుండా తన తమ్ముడు జీవితాన్ని కూడా నిలబెట్టాలి అదే ఆమె ఒక ప్రయత్నం. కానీ ఆమెకు ఏం చేయాలో అర్థం కాదు పాపం వాళ్ళ తమ్ముడు ఆకలితో ఏడుస్తూ ఉంటాడు. బేబీ కి ఏం చేయాలో అర్థం కాదు. బేబీ…. తమ్ముడు ఏడవకు రా తమ్ముడు ఏడవకురా తమ్ముడు ఏడవకురా. అమ్మ ఏం చేయమంటావు వీడు ఆకలితో ఏడుస్తున్నాడు . నా దగ్గర డబ్బులు కూడా లేవు వీడికి పాలు పట్టించడానికి అంటూ ఏడుస్తూ చాలా బాధపడుతుంది . ఆమెకు ఎక్కడైనా డబ్బులు దొరుకుతాయేమో అని చెప్పి ఇల్లంతా వెతుకుతుంది . ఇంతలో ఒక చోట ఆమెకు 20 రూపాయలకు దొరుకుతుంది. వెంటనే ఆమె కొట్టుకు వెళ్లి 20 రూపాయల పాల ప్యాకెట్ ఒకటి చూసుకొని.
దానిని కాచి వేడి చేసి పిల్లవాడికి పట్టిస్తుంది పిల్లవాడు పూర్తిగా తాగి నిద్ర పోతాడు.
బేబీ తన మనసులో…… అమ్మ ఈరోజు అయితే నేను తమ్ముడు ఆకలి తీర్చి కలిశాను కానీ రేపటి పరిస్థితి ఏంటి నేనేం చేయాలి. అని బాగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె ఆలోచిస్తూ దిక్కు లేని వాళ్ళకి ఎవరు దిక్కు ఆ భగవంతుడే కదా బయటికి వెళ్లి అడుక్కుంటే డబ్బులు వస్తాయి అని అనుకొని తమ్ముడు నీ ఇంట్లో పడుకోబెట్టి ఆమె బయటికి వెళ్లి అడుక్కుంటుంది. కానీ చాలామంది….. ఏదైనా పని చేసుకో పాప ఇలా అడ్కోకొకపోతే .
అంటూ ఉచిత సలహా ఇస్తారు కానీ ఎవరూ కూడా దానం చేయకపోవడం చాలా బాధగా అనిపిస్తుంది పాపకు.
పాప తన మనసులో….. వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదా నేను పని చేసుకుంటే మంచిది . నీ పని కోసం ప్రయత్నిస్తుంది అక్కడ ఇక్కడ తిరుగుతుంది కానీ ఎక్కడా పని దొరకదు.
చిన్నపిల్లల నువ్వు ఏం పని చేస్తావు అని మళ్ళీ విమర్శిస్తూ ఉంటారు.
పాప ఏడుస్తూ చాలా బాధపడ్డా తూ చెరువు దగ్గర కూర్చుని అందులో రాళ్లు వేస్తూ ….. చిన్న పిల్లని అని చెప్పి ఎవరూ కూడా నాకు పని ఇవ్వటం లేదు నేను ఏమి చేయాలి. తమ్ముడు నేను ఎలా బ్రతకాలి అమ్మ నాన్న తమ్ముడు నేను కూడా మీ దగ్గరికి వచ్చేస్తాము తీసుకొని వెళ్ళు అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఎవరో ఒక వ్యక్తి వేసి చేపలు పట్టి …. అబ్బా ఈ రోజుకి కూర కి సరిపోతాయి. అని చెప్పి గాలం ఎర్రలు అక్కడ పడేసి . అక్కడనుంచి వెళ్ళి పోతాడు గమనిస్తుంది . ఆమెకూడా అలాగే చేయాలి అని అనుకుంటుంది . ఇంతలో తన నిద్ర లేచాడు ఏమో అని భయంతో అక్కడ్నుంచి పరుగుపరుగున ఇంటికి వెళ్తుంది తమ్ముడు ప్రశాంతంగా నిద్ర పోతాడు ఆమె హమ్మయ్య అని అనుకుంటుంది . కానీ అంతలోనే అతను ఏడవటం మొదలు పెడతాడు . పాప పిల్లవాడి ఎత్తుకొని బుజ్జగిస్తూ చెరువు దగ్గరికి తీసుకెళ్తుంది. చెరువు ని చూసి అతను ఏడుపు ఆపుతాడు. పాపా …. ఎటు ఇక్కడికి వచ్చాను కదా నాలుగు చేపలు పట్టే అమ్మితే డబ్బులు వస్తాయి. నా తమ్ముడు నేను ఆ డబ్బుతో కడుపు నింపుకోవచ్చు. అని భావించి చేపల పడటం మొదలు పెడుతుంది . తన తమ్ముడికి ఎండ తగలకుండా అతనిపైన గుడ్డ కప్పి ఆమె ఎండలో చేపలు పట్టి కష్టపడుతుంది ఆ పిల్లవాడిని చేపలు తీసుకొని చేపలు అమ్మడం మొదలు పెడుతూ ….. చేపల అమ్మ చెరువు చేపలు పచ్చి చేపలు చెరువు పచ్చి చేపలు తల్లి . రుచికరమైన చేపలు చాలా బాగుంటాయి రండమ్మా తీసుకోండి. అంటూ కేకలు వేస్తూ ఉంటుంది.
ఎవరో ఒక ఆమె వచ్చి చేపలు తీసుకుని అందుకు డబ్బులు ఇచ్చి వెళ్తుంది.
పాప చాల సంతోషపడుతూ ఈ వ్యాపారం చేసుకుంటాను అని అనుకొని డబ్బులు తీసుకొని వెళ్ళి పోతుంది వచ్చిన డబ్బుతో సరుకులు పిల్లవాడికి పాలు అందిస్తూ ఆమె సంతోషంగా ఉంటుంది రోజు పిల్లవాడు తో సహా చెరువు కి వెళ్లడం అక్కడ చేపలు పట్టడం. వాటిని అమ్మడం చేస్తూ వచ్చిన డబ్బుతో వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు.
అయితే చెరువు చేపలు కావడంతో ఆ పని పదే పదే…… పాప చెరువు చేపలు చాలా బాగున్నాయి . రేపు తీసుకొచ్చి పెట్టమ్మా ఎవరికి ఇవ్వద్దు కావాలంటే పది రూపాయలు ఎక్కువ అయినా తీసుకో నాకు మాత్రం ఇవ్వు అంటూ ఎంతో మంది అడుగుతూ ఉంటారు అని సమాధానం చెబుతుంది . అలా కొన్ని రోజుల తర్వాత పాప అందరికీ ఆర్డర్ లాగా తీసుకొని చేపలు పట్టి. చేపలు వాళ్ళ ఇంటిదగ్గర ఇచ్చి. వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని ఉంది అలా ఆమె వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా ఉంటుంది.
అలా రోజులు గడిచాయి పాపం యొక్క వ్యాపారం బాగా సాగడంతో మరికొందరు వ్యాపారస్తులు పుట్టుకు వస్తారు . పాప పక్కనే కూర్చొని వ్యాపారం మొదలు పెడుతూ ఉంటారు….. రావాలమ్మా రావాలి చెరువు చేపలు చాలా అద్భుతంగా ఉంటాయి. రావాలమ్మా రావాలి అందరి కంటే ధర చాలా తక్కువ . అంటూ అమ్మడం మొదలు పెడతాడు. దాన్ని చూసి బేబీ చాలా బాధ మనసులో….. నాకు పోటీగా వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు. నా వ్యాపారం చేసుకుంటున్నాను కదా. తక్కువ అని చెప్తే అందరూ అక్కడికి వెళ్ళిపోతారు ఏమో. అప్పుడు నేను నా తమ్ముడు ఏమై పోతాము. భగవంతుడా నన్ను నువ్వే కాపాడాలి. అంటూ భగవంతుని ప్రార్ధిస్తూ ఉంటుంది. నిజానికి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ పాప దగ్గరే చేపలు కొంటారు ఎందుకు అంటే పాప ఒక చిన్న పిల్లాడిని పట్టుకొని కష్టపడ్డ చూసినవాళ్లు జాలిపడి తీసుకెళ్తారు . ఇంతకుముందే ఖాతాలు ఉండటంతో . పక్కన వాళ్లు ధర తక్కువ అని చెప్పినా కూడా పాప దగ్గరికి తీసుకు వెళుతూ ఉంటారు. అలా రోజులు గడిచాయి పాప కు పోటీగా పెట్టిన వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారం సాగట్లేదు అని వాళ్లే అక్కడికి రావడం మానేశారు . నన్ను చూసి పాప భగవంతునికి మరోసారి ప్రార్థిస్తుంది. ఇక తన వ్యాపారం తాను చేసుకుంటూ వాళ్ల తమ్ముని చూసుకుంటూ సంతోషంగా ఉంటుంది .

Add a Comment

Your email address will not be published. Required fields are marked *