పేద పిల్ల మసాలా పల్లిల వ్యాపారం|Telugu Kathalu | Telugu Stories | Telugu Moral Stories | Fairy Tales

రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఉన్న ఒక మారుమూల గ్రామంలో ప్రీతీ అనే అమ్మాయి రైల్వే స్టేషన్లో బుట్టలో పల్లీలు పెట్టుకొని అమ్ముతూ ఉండేది . ప్రీతికి తల్లి దండ్రులు ఎవరూ లేరు. ఊరికి కొంత దూరం లో ఒక పాత ఇంట్లో నివాసం ఉండేది, ఆమె ఇంటి పక్కనే ఉన్న కొంత స్థలం లో కొన్ని పల్లీల చెట్లు అలాగే కొన్ని రకాల పూల చెట్లు  పెంచుకుంటూ వాటిని కోసుకుంటూ రోజు వచ్చిన పల్లీలలో కొన్నింటిని ఏయించి కొన్నిటిని ఉడక బెట్టేది, అలా చేసిన వాటిని ఒక బుట్టలో పెట్టుకొని వచ్చి పోయే ట్రైన్లకి అమ్ముతూ ఉండేది, అలా వచ్చిన డబ్బుతో పూట గడుపుతూ ఉండేది,  అలా ఉండగా ఒకరోజు ఎన్ని చెట్లు వెతికినా పల్లీలు కానీ ఏ రకమైన పూలు కానీ దొరకలేదు,  అప్పుడు ప్రీతీ తనలో తాను ఇలా అనుకుంటూ ఉంటుంది.

ప్రీతీ : అయ్యో దేవుడా రోజు కనీసం ఒక్క పూట అయినా అన్నం తినేదానిని ఈరోజు అది కూడా లేకుండా చేశావా? నాకు ఈ పని తప్ప వేరే ఏ పని రాదు, వేరే ఏ పనికి వెళ్ళలేను అలాగని ఇప్పటికి ఇప్పుడు ఇవ్వి పండవు, ఏమి చేసేది దేవుడా? ఈ రోజుకి ఇలా పస్తులు ఉండవలసిందేనా అని అనుకుంటుంది.

అలా కొన్ని రోజులు గడుస్తాయి ప్రీతీ ఇంట్లో పండే ఏ పంటా పండదు,  తనకి గత కొన్ని రోజులుగా ఏమి తినకుండా అలాగే ఇంట్లోనే ఉంటుంది. అలా ఉండగా

ప్రీతీ : ఇక నా వళ్ళ అవ్వడం లేదు, ఈ చెట్లని చూస్తేనేమో కనీసం నాపై దయ చూపించడం లేదు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి, ఇక నైనా ఎదో ఒకటి తినక పోతే నేను బ్రతకలేను, ఇన్ని రోజులు నాకు ఎప్పుడు ఇలా అనిపించలేదు కానీ ఇప్పుడు అనిపిస్తూఉంది మా అమ్మ నాన్న ఉండి ఉంటె నాకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో అని అనుకుంటుంది

ప్రీతీ : సరే ఇప్పటి వరకు ఈ చెట్లు నన్ను అకాపాడతాయి అని చూసింది చాలు, ఇక నుంచైనా వేరే పని ఏదైనా వెతుక్కోవాలి నాకు ఇది తప్ప వేరే ఏ పని రాదు అని కూర్చుంటే కష్టమే, ఎదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఇంటి బయటకు వెళ్తుంది ప్రీతీ

బయటకు వెళ్లిన కీర్తి

కీర్తి : ముందుగా మా ఊరి సర్పంచ్ ఇంటికి వెళ్తాను అయన నాకు ఎదో ఒక పని చూపిస్తాడు అని అనుకుంటూ కొంత ముందుకు వెళ్ళగానే  ఇన్ని రోజులు తినక పోవడం వల్ల నీరసంతో కళ్ళు తిరిగి పడిపోతుంది ప్రీతీ

కొంత సేపటి తరువాత అటుగా వెళ్ళ్తున్న రంగన్న అనే వ్యక్తి నిస్సహాయతగా పడిపోయి ఉన్న ప్రీతిని చూస్తాడు

రంగన్న : అయ్యో అక్కడ ఎవరో పడిపోయి ఉన్నారు, బహుశా అదిన్నా అపాయం లో ఉన్నారేమో నేను వెళ్లి చూస్తాను అని అక్కడికి వెళ్తాడు,

అక్కడ పడిపోయి ఉన్న ప్రీతీ చూసి

రంగన్న : అయ్యో ఈ పాప చాలా నీరసంగా ఉన్నట్టు ఉంది, బహుశా కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది ఈ అమ్మాయిని సర్పంచ్ ఇంటికి తీసుకెళ్తే అతనే తగిన వైద్య చికిత్సలు అందిస్తాడు, అనుకోని ప్రీతి సర్పంచ్ ఇంటికి తీసుకెళ్తాడు, తీసుకెళ్ళినాక రంగన్న సర్పంచ్ తో

రంగన్న : అయ్యా ఈ అమ్మాయి ఎవరో రోడ్డుమీద పడి ఉంది చూస్తే చ్చాలా రోజులుగా ఎం తిన్నట్టుగా లేదు, ఆ నీరసం వల్లనే ఇలా పడిపోయి ఉంటుంది, మీరు ఏమైనా అచేయగలరని మీ దగ్గరికి తీసుకొచ్చాను అని జరిగిన విషయమా అంతా పూసా గుచ్చినట్టు వివరణ ఇస్తాడు.

కొంత సేపటికి ప్రీతీ కళ్ళు తెరుస్తుంది, సర్పంచ్ ఆమెకు అన్నం పెట్టిస్తాడు

ప్రీతీ మల్లి మామూలు స్థితికి వచ్చాక సర్పంచ్ తనతో ఇలా అడుగుతాడు

సర్పంచ్ : అమ్మ ఎవరు నువ్వు నిన్ను ఎక్కడా చూసినట్టుగా లేదు, నువ్వు ఎక్కడనుంచి వచ్చావు అని అడుగుతాడు,

ప్రీతీ : అయ్యా నేను ఇదే ఊరిలో చివరన ఒక పాత ఇంట్లో ఉంటుంన్నాను, ట్రైన్ లో చిరుతిండ్లు అమ్మి వచ్చ్హిన డబ్బులతో కడుపును నింపుకుంటూ ఉంటాను, కానీ గత కొన్ని రోజులుగా నా పని నడవడం లేదు, నాలుగు రోజులుగా ఏమి తినలేదు, మీ దగ్గరికి వచ్చ్హి ఆడదైనా పని అడుగుదామని వచ్చాను, కానీ ఇలా వస్తానని అనుకోలేదు, అలాగైతే ఏముంది కానీ నాకు ఒక పని ఇప్పించండి అయ్యా చేసుకుంటూ పొట్ట నింపుకుంటూ ఇక్కడే బ్రతికేస్తాను అని అంటుంది

సర్పంచ్ : నువ్వు ఓ చిన్న పిల్లవి నీతో పని చేయించడమే తప్పు కానీ నువ్వు బాగా ఆత్మభిమానం ఉన్న పిల్లలా కనిపిస్తున్నావు కాబట్టి, నీకు రోజు నువ్వు చేసే పనే ఇస్తాను కానీ నాకు ఒక మాట ఇవ్వాలి అని అంటాడు

ప్రీతీ : మీరు పని ఇస్తే అదే పదివేలు మీకు ఎలాంటి పని చేయమన్న చేస్తాను, ఎలాంటి షరతులకైనా వెనకాడదను అని అంటుంది ప్రీతీ

సర్పంచ్ : నేను నీకు నా పొలం లో అరా ఎకరం ఇస్తాను దాంట్లో ఏ పంట పండించుకుంటావో నీ ఇష్టం, ఆ పంటకు అయినా పెట్టుబడి అంతా నేను బరిస్తాను, వచ్చిన పంటతో నీకు తెలిసిన పననే పొద్దునంతా ట్రైన్ దగ్గర అమ్ముకోవడం చేసుకో కానీ సాయంత్రం అవ్వగానే మన ఊరిలో ఉన్న రాత్రి బడికి వెళ్లి చదువుకోవాలి అని అంటాడు

ప్రీతీ : అలాగే అయ్యా చాలా బాగా చదువుకొని మీ పేరు పైకి తీసుకొస్తాను అని అంటుంది

సర్పంచ్ : నీ  చదువుకు నువ్వు చేసే పని వల్ల ఏ ఆటంకం కలిగినా పని మానెయ్యాల్సి ఉంటుంది అని అంటాడు

ఆ షరతుకి ప్రీతీ కూడా ఒప్పుకుంటుంది

ఇంకా ఆరోజు నుంచి ప్రీతీ కాలం వర్షాలతో సంబంధం లేకుండా ఆ పొలం లో చాలా రకాల పంటలు పండించి అమ్ముతూ ఉంటుంది, అలా చేయడం వల్ల కొంత డబ్బు పోగుచేసుకుంటుంది, అలా వచ్చిన డబ్బుతో పుస్తకాలు పెన్నులు కొనుక్కుంటుంటూ ఉంటుంది, పొద్దున్న ఆ పని చేసుకుంటూ సాయంత్రం బడికి వెల్తూ ప్రీతీ చాలా తెలివైన అమ్మాయి అని చదువుల తల్లి అని ఊరి వాళ్ళతో ప్రశంసలు పొందుతుంది.  

Add a Comment

Your email address will not be published. Required fields are marked *