పేద పిల్ల మాయా డబ్బుల మెషిన్ Telugu Kathalu | Telugu Stories | Panchatantra Kathalu | Fairy Tales

అది ఒక చిన్న గ్రామం . గ్రామంలో కొన్ని కుటుంబాలు నివశిస్తూ ఉన్నాయి. గ్రామంలో  కృష్ణ శారద అనే దంపతులు నివసిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ కూతురు పేరు బేబీ. బేబీ చాలా మంచి అమ్మాయి అలాగే తెలివైన అమ్మాయి. చక్కగా చదువుకుంటూ ఉంటుంది ప్రజలు అవసరం ఉన్న బేబీ వాళ్ళ ఇంటికి వచ్చి బేబీకి చెప్తూ ఉంటారు. బేబీ తనకున్న తెలివితేటలతో సమస్యను పరిష్కారం చేస్తోంది. అలా చాలా మందికి సహాయం చేస్తూ ఉంటుంది బేబీ. రోజులు గడుస్తుండగా ఒకరోజు ఒక వ్యక్తి గ్రామంలోకి వచ్చి అక్కడ వాళ్లతో….. స్థలమంతా నాది నాకు తెలియకుండా మీరు ఇక్కడ గుడిసెలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు. అంటూ అక్కడ ఉన్న వాళ్ళ పై పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉంటాడు. వాళ్ళు అందరు కూడా చాలా ఆశ్చర్యపోతూ అలా చూస్తూ ఉంటారు.

ఇంతలో బేబీ తల్లిదండ్రులు ఇక్కడికి వస్తారు.

వాళ్లు అతనితో…… ఏం బాబు గారు ఏం మాట్లాడుతున్నారు మీరు. స్థలాలు మాకు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు మా దగ్గర కాగితాలు కూడా  ఉన్నాయి. అని అంటారు అందుకు అతను చాలా కోపంగా…. మరి మా దగ్గర ఉన్నది ఏంటి. కాగితాలు కాదా అంటూ

అక్కడ స్థలానికి సంబంధించిన కాగితాలు చూపిస్తాడు.

వాళ్లు…… మాకు చదువులు లేవు బాబు ఒక్క ఐదు నిమిషాలు అయితే మా అమ్మాయి వస్తుంది. అప్పుడు ఆమె చెబుతుంది .

అని అంటూ ఉండగానే బేబీ అక్కడికి వస్తుంది జరిగిన విషయమంతా తల్లిదండ్రులు చెప్తారు ఆమె అతని చేతిలో ఉన్న కాగితం తీసుకుని చదవడం మొదలు పెడుతుంది.

అందులో ఉన్నది పూర్తిగా చదివి అందరికీ వినిపిస్తుంది….. శేఖర్ అనే వ్యక్తికి స్థలం అంతా చెందాలి అని దీంట్లో ఉంది.

కానీ ప్రభుత్వం వాళ్ళు మాకు పట్టాలు ఇచ్చారు కదా వాటి పరిస్థితి ఏంటి అని అతని ప్రశ్నిస్తుంది అతను … దాంతో మాకు సంబంధం లేదు మీరు ప్రభుత్వం వాళ్ళని అడగండి. అని అంటాడు అందుకు వాళ్లు సారే అంటారు .

అతను…. నేను నేను మీకు రెండు వారాలు సమయం ఇస్తున్నాను. మీరు ఖాళీ చేసి వెళ్లడానికి అని అందుకు వాళ్లు ….. బాబు కొన్ని సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉంటున్నాము. ఇప్పటికిప్పుడు మమ్మల్ని వెళ్లిపోమంటే మేము ఎక్కడికి వెళ్ళాము చెప్పు. నువ్వైనా అర్ధం చేసుకో బాబు.

కావాలంటే మీకు ఎంత డబ్బులు కావాలో చెప్పండి అంతలా కాస్త వేసుకుని ఇచ్చేస్తాము.

అతను పెద్దగా నవ్వుతూ….హా హా హా ఎంత ఇస్తారు అని అనుకుంటున్నారా దీని విలువ మీకు తెలుసా కొన్ని కోట్ల విలువ చేసే మొత్తం స్థలాన్ని మీకు అద్దనకి పావలాకి అనుకున్నారా. మీ ముష్టి మోకాల కి.

అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా కోపంతో….. మాటలు చాలా జాగ్రత్తగా రానివ్వండి. పెద్దవాళ్ళలని గౌరవించి  మాట్లాడుతున్నాము.

మీరు మాత్రం ముష్టివాళ్ళు అని మాట్లాడుతున్నారు పద్ధతి కాదు అంటూ గొడవకు దిగుతారు వాళ్ళందరూ చాలా కోపంగా అతని మీద ఉండడంతో అతనికి మరింత కోపం వచ్చి……. నాకు చాలా కోపం వచ్చింది . ఇంకా ఏం చేసినా కూడా  మీ చేతికి స్థలం రాదు.

అని కోపంగా అక్కడనుంచి వెళ్ళి పోతాడు.

చాలా అర్థం కాదు బేబీ…. ఎవరు బాధపడకండి ముందు ప్రభుత్వం వారితో మాట్లాడదాం. అని చెబుతుంది.

మరుసటి రోజు పై అధికారి దగ్గరికి బేబీ తో సహా కొందరు వెళ్లి మాట్లాడుతారు.

అతను కూడా చాలా అయోమయంగా ఉండిపోయి….. ఎక్కడో చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది అంటూ చాలా బాగా చెబుతాడు. రోజులు గడుస్తున్నాయి ప్రతిరోజు వాళ్ళు అక్కడ ఇక్కడ అధికారి అధికారి అని తిరుగుతూనే ఉంటారు కానీ ఎవరూ కూడా సహాయం తీయకపోవడంతో చాలా డీలా పడిపోతారు.

పాప బేబీ కి ఏం చేయాలో అర్థం కాదు.

తను గుడి దగ్గరకు వెళ్లి భగవంతుని ప్రార్ధిస్తూ….. భగవంతుడా ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు.

ఎన్నో సంవత్సరాలుగా అందరూ సంతోషంగా ఇక్కడే ఉంటున్నాను ఇప్పటికిప్పుడు వెళ్లి పోవాలి అంటే ఎక్కడికి వెళ్దాము స్వామి నువ్వే ఏదైనా మార్గం చూపించు.

అంటూ చాలా బాధపడుతూ భగవంతుని ప్రార్థిస్తున్నాది.

 అప్పుడు అక్కడ ఒక స్వామీజీ ఆమె ప్రార్ధన వింటాడు. అతను పాప వైపు చూసి….. పాప అసలు ఏం జరిగింది అమ్మ ఎందుకు నువ్వు ఇంతగా బాధపడుతున్నావు.

అప్పుడు పాప ఏడుస్తూ స్వామీజీకి జరిగిన విషయాన్ని పూర్తిగా వివరిస్తుంది.

దానివల్ల స్వామీజీ….. నాకున్న మహిమతో అసలు ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను . ఎవరిది తప్పు అనేది నేను చెప్తాను.

అందుకు పాప సరే అంటుంది అతను దివ్యదృష్టితో చూడగా.

అధికారి చాలా చెడ్డవాడు . ఎంతోమందికి లంచాలు ఇచ్చి . స్థలాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు . నకిలీ కాగితాలు పుట్టించి అందరినీ మోసం చేస్తున్నాడు.

అని స్వామీజీ తెలుసుకొని విషయాన్ని పాప తో చెప్తాడు.

అందుకు పాప…. స్వామి అతని కుట్ర ని మనం బయట పెట్టలేమా స్వామి.

స్వామీజీ…. అది చాలా కష్టం తల్లి కానీ ముల్లును ముల్లుతోనే తీయాలి కుట్రని కుట్రతోనే . సాధించాలి అని అంటాడు.

పాప కానీ ఎలా స్వామి అని అంటుంది అప్పుడు తన మాయా తో ఒక ప్రింటర్ ని ప్రత్యక్షం చేస్తాడు.

పాప… ఏంటి స్వామి ఇది అని అంటూ ఉండే లోపే దాని నుంచి డబ్బులు బయటకు వస్తూ ఉంటాయి. దాన్ని చూసి పాప చాలా ఆశ్చర్యపోతుంది….. స్వామి నేను చూస్తే నిజమేనా నిజంగా ఇది అంత డబ్బే నా.

అతను…. అవునమ్మా ఇది నిజంగానే డబ్బు నిజమైన డబ్బు. ఇప్పుడు నీకు ఇది మంచి అవకాశం నువ్వు దానికి బహుమతిగా ఇచ్చి దీని గురించి చెప్పి . స్థలానికి సంబంధించిన కాగితాలు సంపాదించి. దానిని మీ వాళ్ల పేరు కింద రిజిస్ట్రేషన్ చేయించు.

అని అంటాడు అందుకు ఆమె సరే అంటుంది.

కానీ పాప… తన మనసులో ఇందులో   కుట్ర ఏముంది. అనుకుంటూనే మెషిన్ ని తీసుకొని వెళ్ళి పోతుంది.

మరుసటి రోజు యజమాని దగ్గరికి వెళ్లి…. చూడండి ఇది ఒక మాయ మనీ మిషన్. దీనినుంచి మీరు కోరిన డబ్బు వస్తుంది. ఇది మీకు కావాలి అంటే నేను ఇచ్చేస్తాను . కానీ మీరు స్థలాన్ని మా వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేయించాలి.

అతను….హా హా నేను పిచ్చోడిలా కనపడుతున్నానా. ఒక డబ్బా తీసుకువచ్చి డబ్బు గిబ్బు అంటున్నావు.

పాప అతని వైపు చూస్తూనే ఏం మాట్లాడకుండా మిషన్ మీద చేయి వేసి ఉంది అలా చేయి వేసిన వెంటనే డబ్బులు వరుసగా వస్తూ ఉంటాయి దాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు. డబ్బు ని చూసి …. ఇది నిజంగా నిజమైన డబ్బు. అని చాలా సంబరపడిపోతూ ఒక్క నిమిషం కూడా ఆలోచించేది ఏమీ లేదు మొత్తం నీ పేరు రాసి ఇస్తాను అని. హడావిడిగా రెండు రోజుల్లోనే వాళ్ళ పేరున స్థలం రిజిస్ట్రేషన్ చేయిస్తాడు.

ఇక చాలా సంతోష పడతారు ప్రజలందరూ.

రోజులు గడుస్తున్నాయి యజమాని మాత్రం రోజు డబ్బా తో డబ్బు తీసుకుంటూనే ఉంటాడు.

ఒకరోజు ఒక పోలీస్ అధికారి యజమాని ఇంటికి వెళ్లి….. మీ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి మీరు నకిలీ నోట్లని ప్రింట్ చేస్తున్నారు అని.

అతను లేదు కాదు అని అంటూ ఉంటాడు కాల్ పోలీస్ అధికారి లోపలికి వెళ్లి చూడగా.

డబ్బు మొత్తం కనబడుతుంది మిషన్ నుంచి డబ్బు వస్తుంది . పోలీస్ అధికారి దాన్ని చూస్తాడు అవి నకిలీ నోట్లు అని తేలుతాడు దాన్ని విని అతను …. ఇవి నకిలీ నోట్లు కాదు నిజమైనవి అంటూ చూస్తాడు కానీ అవి నకిలీ నోట్లు అని అతను కూడా తెలుసుకొని. అయ్యో అని బాధ పడతాడు పోలీస్ అధికారి అతన్ని జైలుకి తీసుకెళ్ళి పోతాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *