పేద పిల్ల & యమధర్మరాజు | Telugu Kathalu | Bedtime Stories | Panchatantra kathalu | Comedy Videos

బేబీ తండ్రి శంకర్ చనిపోవడంతో
బేబీ తన తండ్రి ప్రేమ కోల్పోతుంది. ఆమె తల్లి శాంతి విధవరాలు గా మారింది.ఆ తల్లి కూతురు ఇద్దరు కూడా ఎంతగానో బాధ పడతారు వాళ్ళకి మగదిక్కు లేదు . మా ఊర్లో ఉన్న మగవాళ్ళ కన్నా మొత్తం బేబీ మీద ఆమె తల్లి మీదే ఉంటుంది. వాళ్ళు బయటికి వెళ్లడానికి కూడా చాల భయపడతారు చిన్న పిల్ల అని కూడా చూడకుండా బేబీ తో చాలా తప్పుగా మాట్లాడారు. దాన్ని తెలుసుకుని ఆ తల్లి కూతురు ఇద్దరు ఎంతగానో ఏడుస్తారు….. అసలు ఇక్కడ ఉన్న మనుషులు ఎవరి కి కూడా జాలి లేదు. అసలు ఏం మనుషులో ఏమో నాకు అర్థం కావటం లేదు. మనిషి లాగా పుట్టిన తర్వాత కొంత మానవత్వం ఉండాలి. కానీ ఇక్కడ అది లేదు. చిన్న పిల్ల అని కూడా చూడకుండా ఇంత అసహ్యంగా ఏలా మాట్లాడతారు. అని ఎంతగానో బాధ పడతారు.
బేబీ….. అమ్మ నువ్వు ఎప్పుడు చెప్తూ ఉంటావు కదా యమధర్మరాజు వచ్చి ప్రాణాలు తీసుకువెళ్తాడు అని మరి నాన్న ప్రాణాలు తీసుకెళ్తుంటే నువ్వు ఎందుకు ఆప లేదమ్మా. అంటూ ఏడుస్తూ ఉంటుంది అందుకు తల్లి …. యమధర్మరాజు మనకి కనిపించాడు అమ్మ కనిపిస్తే నా భర్త ప్రాణాలు నిలపమని ఆయన్ని ప్రాధేయ పడేదాన్ని . ఇంత కష్టం మనకు వచ్చేది కాదు అంటూ ఏడుస్తూ ఉంటారు వాళ్ళకు తినడానికి తిండి కూడా ఉండదు . వాళ్లకి ఏం ఏం చేయాలో తెలియని పరిస్థితి . బయటకు వెళ్లిన సమాజం వారిని చిన్నచూపు చూస్తుంది. అందుకే వాళ్లు భయపడుతూ ఉంటారు. అప్పుడే అనుకోకుండా ఒక స్వామీజీ అక్కడికి వస్తాడు .
స్వామీజీ…. భవతీ భిక్షాందేహి అని అడుగుతాడు లోపల ఉన్న వాళ్ళు ఏమీ మాట్లాడకుండా అలాగే ఏడుస్తూనే వుంటావు ఎంత పిలిచిన వాళ్ళు రాకపోవడంతో ….. లోపల ఎవరూ లేర. అని అని అడుగుతాడు లోపల వాళ్ళు సమాధానం చెప్పలేదు కానీ వాళ్ల ఏడుపులు మాత్రం వినపడుతూ
ఉంటాయి. స్వామీజీ లోపలకు వెళ్లి చేస్తాడు. వాళ్ల స్వామీజీ చూసి …. స్వామీజీ మమ్మల్ని క్షమించండి మీకు మేము ఏమి దానం చేయలేకపోతున్నాను. మా పరిస్థితి బాగోలేదు అంటూ ఏడుస్తూ ఉంటరు. స్వామీజీ జరిగిన విషయం తెలుసుకొని వాళ్లకి దైర్యం చెప్తాడు.
స్వామీజీ తన శక్తితో పాపకి కొన్ని మాయ శక్తులు బహుమతిగా ఇస్తాడు. దాంతో పాపకి కొన్ని ఆత్మలు కనబడుతూ ఉంటాయి . మహానుభావులు కనబడతారు. చనిపోయిన వాళ్లు కనబడతారు.
ఇక స్వామీజీ వాళ్లకి ఆహారం కూడా వచ్చే విధంగా చేస్తాడు. ఆ మాయ శక్తులతో వాళ్ళు రోజు పడుకుంటారు తల్లి కూతురు ఎంతో ప్రేమతో మాట్లాడుకుంటూ కలిసి ఉంటారు. అయితే అలా ఉండగా కొన్ని రోజులు నుంచి బేబీ కలలో యమధర్మరాజు వచ్చి తన తల్లి ప్రాణాలు తీసుకు వెళుతున్నట్లుగా కనబడుతుంటుంది .
దాన్ని చూసి ఆమె భయపడుతూ తల్లిని పట్టుకొని ఏడుస్తూ….. అమ్మ ఎట్టిపరిస్థితిలో నన్ను వదిలి పెట్టి వెళ్ళకూడదు . అమ్మ నన్ను వదిలి పెట్టి వెళ్ళాను అని మాట ఇవ్వు అంటూ ఏడుస్తుంది . ఆ మాటలకి తల్లి ఎంతగానో బాధపడుతూ…. అసలు ఏమైంది తల్లి ఎందుకు అలాగా మాట్లాడుతున్నావు . అని అడుగుతుంది అప్పుడు జరిగిన విషయాన్ని చెబుతుంది.
తల్లి అలా ఏం కాదు అని ధైర్యం చెబుతుంది కొన్ని రోజులు గడిచాయి . కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు రాత్రి సమయం తల్లికి ఒక్కసారిగా గుండెపోటు వస్తుంది. ఆమె చిన్నగా బేబీ బేబీ అంటూ ఉంటుంది . పాప భయంతో….. ఏమైందమ్మా ఏమైంది అంటూ ఉండగానే తల్లి ప్రాణాలు తీసుకువెళ్లడానికి యమధర్మరాజు వస్తాడు. అతను వాళ్ళిద్దరికీ కూడా కనబడతాడు ఎందుకంటే పాపకు స్వామి ఇచ్చిన వరం వల్ల అలాగే ఆమె తల్లి చావు బతుకుల మధ్య ఉంది కాబట్టి.
యమధర్మరాజు తన చేతిలో పాశాన్ని విడిచి తల్లిని తీసుకెళ్తూ ఉండగా ఆమె తల్లి ని పట్టుకొని…. నీకు దండం పెడతాను యమధర్మరాజా నీకు ఇది న్యాయమా నా తండ్రిని నా నుంచి దూరం చేశావు . ఇప్పుడు నా తల్లిని దూరం చేసి నన్ను ఒంటరి దానీ చేయాలనుకుంటున్నావా. నా తల్లి లేకుండా నేను ఎలా ఉంటాను . మీ తల్లి లేకుండా నువ్వు ఉండగలవా అంటూ ఏడుస్తూ యమధర్మరాజుని ప్రాధేయ పడుతోంది .యమ
రాజు కోపంగా…. నేను నీకు కనబడుతున్నాను అంటే అది ఎవరి మహత్యం. ఖచ్చితంగా ఏదో శక్తి నీకు వచ్చింది . కానీ దాన్ని మంచివాడు ఇలా చెడుకి కాదు. నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూన్నాను .
వదులు అని అంటాడు అందుకు పాప…. యమధర్మరాజా నీకు దండం పెడతాను ఈ సమాజంలో తల్లిదండ్రులు లేకుండా ఏ ఆడపిల్ల తన బ్రతుకుని గడపలేదు.
మీరు నా మీద జాలి చూపించి నా తల్లి ప్రాణాలు ని వదిలి పెట్టండి .
తల్లి కూడా ఎంతో ఏడుస్తూ….. యమధర్మరాజా నా బిడ్డ కి వయస్సు వచ్చేంత వరకు నేను ఆమెకు తోడుగా ఉంటాను తర్వాత మీ ఇష్టం ఒక అయ్య చేతిలో దాన్ని పెట్టిన తర్వాత సంతోషంగా నేను మీ దగ్గరికి వస్తాను . అంటూ ఏడుస్తూ బాధపడుతుంది. యమధర్మరాజు వాళ్ళిద్దరి ప్రేమకు బందీ అయి పోతాడు. వాళ్ల కన్నీటి కరిగిపోయి ….. నేను కర్తవ్యాన్ని మొట్టమొదటిసారి తప్పుగా నిర్వర్తించాను. అందుకు శిక్ష నేను అనుభవిస్తాను . కానీ నేను ఈసారి వచ్చినప్పుడు మాత్రం నువ్వు సంతోషంగా నాతో రావాలి. అని అంటాడు అందుకు తల్లి సరే అంటుంది . ఈక అతను అక్కడ్నుంచి మాయమైపోయాడు.
ఆ తల్లి కూతురు ఒకరిని ఒకరు పట్టుకొని ఆనంద భాష్పాలు విడుస్తారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *