పేద పిల్ల సమోస | Telugu Kathalu | Bedtime Stories | Panchatantra kathalu | Fairy Tales

ఆమె పేరు బేబీ ఆమె ప్రతిరోజు బడికి వెళ్లి తన చదువు డి సాగిస్తూ ఉంటుంది. తల్లి శాంతి గర్భవతి ఈమధ్యనే తండ్రి చనిపోవడం వాళ్లకి చాలా బాధాకరమైన విషయం. గర్భవతి అయిన తల్లి కష్టమనేది బేబీకి తెలియకుండా తానే కష్టపడి పని చేస్తూ .బేబీనీ చదివిస్తూ ఉంటుంది నెలలు గడిచాయి. బేబీ స్కూల్ నుంచి తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళ ఇంటికి తాళం వేసి ఉంటుంది. బేబీ చాలా కంగారు పడుతూ….. ఎక్కడికి వెళ్ళింది ఇంకా పని నుంచి రాలేదా . అయ్యో నా మతి మండా అమ్మ పనికి వెళ్ళలేదు కదా కానీ ఎక్కడికి వెళ్లి ఉంటుంది. అని చాలా కంగారు పడుతూ ఉంటుంది.
ఇంట్లో అక్కడే ఉన్న ఒక ముసలావిడ …. అమ్మ బేబీ మీ అమ్మకి పురుటి నొప్పులు వస్తే హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు. నువ్వు అక్కడికి వెళ్ళు అని చెబుతుంది ఆమె సరే అని చెప్పి అక్కడికి వెళుతుంది . అక్కడ బేబీ చాలా అమాయకంగా అటు ఇటు చూస్తూ ఉంటే ఇంతలో డాక్టర్ అక్కడకు వచ్చి….. పాప ఎవరు నువ్వు అని అడుగుతుంది.
బేబీ….. మా అమ్మ పేరు శాంతి అండి ఈరోజు హాస్పిటల్లో చేర్పించారు అంట . అని చెబుతోంది అందుకు డాక్టర్…. పాప నీకు నాన్న లేడా. అందుకు ఆమె లేడు అని సమాధానం చెబుతుంది.
డాక్టర్…. మరి బంధువులు ఎవరైనా ఉన్నారా. బేబీ ….. బంధువులు ఎవరు మాకు తెలిసిన వాళ్ళు లేరండి . ఎందుకు ఇలా అడుగుతున్నారు అని అంటుంది.
డాక్టర్ పాపను తన తల్లి ఉన్న గదిలోకి తీసుకెళ్లి మొదలుపెడుతుంది.
పాప మంచం పై ఉన్న తల్లితో….. అమ్మ మా నిద్రపోతున్నావా లేమ్మ. అమ్మ ఒక సారి లేమా
అని అంటుంది ఇంతలో డాక్టర్ వాళ్ళ తమ్ముని తీసుకొని అక్కడికి వస్తుంది .
తమ్ముని బేబీ చేతికి ఇచ్చి…. మీ తమ్ముడి నువ్వే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీ అమ్మ లేని లోటు తీర్చాలి . అంటుంది ఆ మాటలకు బేబీ …. కంగారు పడుతూ మా అమ్మ కి ఏమైంది. అమ్మ అమ్మ అంటూ ఏడవడం మొదలు పెడుతుంది. డాక్టర్ …. మీ అమ్మ ఇంకా రాధమ్మ మీ అమ్మ చనిపోయింది. అని సమాధానం చెప్పడంతో ఆమె మరింత ఏడుస్తూ….. అమ్మ నేను తమ్ముని ఏం చేయాలి . నేను ఎలా చూసుకోవాలి నేనే చిన్నపిల్లనీ అమ్మ. నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఎలా అమ్మ వీడి కోసమైనా లేమ్మా . ఏడుస్తుంది డాక్టర్ పాపకు ఓదార్పు చెప్పి . చిన్న పిల్లల్ని ఎలా చూసుకోవాలో వాడికి ఈ సమయానికి పాలు ఎలా పట్టించాలి అనేది అని చెప్పి ధైర్యాన్ని నింపి అక్కడి నుంచి పంపిస్తుంది.
కొన్ని రోజుల తర్వాత బేబీ చుట్టుపక్కల వాళ్ళు ఆమెను ఓదారుస్తాడు కానీ ఒక్కరు కూడా సహాయం చేసింది లేదు అక్కడే ఉన్న
ముసలి ఆవిడ మాత్రం బేబీ మీద జాలిపడి బేబీ తో…. అమ్మ నాకు పెన్షన్ వస్తుంది కదా. ఆ డబ్బులు నీకు కొంచెం ఇస్తాను పిల్లాడికి నీకు కావాల్సిన తెచ్చుకో. అని అంటుంది బేబీ ఏడుస్తూ….. నిన్ను నీ కొడుకులు వదిలేసారు చుట్టుపక్కల వాళ్ళు ఎవరూ కూడా పట్టించుకోరు. నీకు వచ్చే డబ్బులు నీకు సరిపోతాయి మళ్ళీ మాకు ఇవ్వడం ఎందుకు అమ్మమ్మ మా బ్రతుకు మేము బ్రతుకుతాము. నాకోసం నువ్వు ఇబ్బంది పడకు అమ్మమ్మ అని అంటుంది.
ముసలావిడ….. ఇబ్బంది ఏముందమ్మా. మనిషికి మనిషి సహాయం కావాలి. అంటూ ధైర్యం చెబుతుంది కొన్ని నెలలుగా ఆమె డబ్బులు ఇస్తుంది బేబీ ఆ డబ్బుని కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెడుతూ మిగిలిన దాచిపెడుతుంది కొన్ని రోజుల తర్వాత ఆమె ఆ డబ్బులతో సమోసా వ్యాపారం చేయడం మొదలుపెడుతుంది. పిల్లవాడిని ఎత్తుకుని రైల్వే స్పెషల్ లో
…… సమోసా వేడివేడి సమోసా సమోసా సమోసా . రావాలి బాబు రావాలి రావాలి అమ్మ రావాలి అంటూ సమోసా అమ్మడం మొదలు పెడుతుంది అలా వచ్చిన డబ్బుతో ఇల్లు గడుపుతూ. ఎవరైతే ఆ పాపకు సహాయం చేసిన ముసలావిడ ఆమెకు తాను ఇచ్చిన డబ్బులు మొత్తం తిరిగి ఇస్తుంది. ఆ ముసలావిడ చాలా బాధపడుతు…. చిన్న వయసులో నీకు ఎంత పెద్ద కష్టం వచ్చిందమ్మా భగవంతుడు మీ ఇద్దరిని చల్లగా చూడాలి అంటూ ధైర్యం చెబుతుంది. ప్రతిరోజు బేబీ తన తల్లిని తలుచుకుంటూ ఏడుస్తూ భగవంతుని ప్రార్ధిస్తూ తన వ్యాపారం చేసుకుంటూ ముందుకు సాగుతుంది. ప్రతిరోజు వ్యాపారం చేసుకుంటూ వచ్చిన డబ్బుతో తన తమ్ముడి కి కావాల్సిన పాలు పట్టిస్తూ తను స్వయంగా వంట తయారు చేసుకొని తింటూ పనులు మొత్తం చేసుకుంటూ తన తమ్ముడికి తానే ఒక తల్లి లాగా మారుతుంది . అతని బాగోగులు చూసుకుంటూ అలాగే వ్యాపారం చేసుకుంటూ ముందుకు సాగుతుంది దాన్ని చూసి చుట్టుపక్కల వాళ్లు …. అయ్యో పాపం ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద కష్టం వచ్చిందో.
అంటూ పాపం తలిచే వాడే కానీ సహాయం చేసే వాళ్ళు ఉండరు . పాపం ఎవరూ లేని ఆ ముసలావిడ బేబీ కి తోడుగా ఉంటూ మంచి చెడు చెబుతూ ఆమెకు ధైర్యం చెబుతూ ఉంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *