పేద వల్ల మాయ గంట Magical Bell | Telugu Kathalu | Telugu Stories | Telugu Fairy Tales | Moral Stories
వాయిస్ : ఒకానొక మారుమూల గ్రామంలో ఉండే సావిత్రిది ఒక పేద కుటుంబం. తన
భర్త చనిపోవడంతో కీర్తి, బాలు అనే తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ
జీవిస్తూ ఉంటుంది. అనారోగ్యం కారణంగా ఇంటి దగ్గరే ఉంటూ, పిల్లలకు
వండిపెడుతూ, మందులు వాడుతూ ఉంటుంది సావిత్రి. ఇక కీర్తి, బాలు…
ఇద్దరు తమకు చేతనైనా పని చేసుకుంటూ ఉంటారు. అలా వచ్చిన
డబ్బులతోనే తమ తల్లిని చూసుకుంటూ రోజుకొక అనాధకు అన్నం పెడుతూ
మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటారు. అది నచ్చని ఆ ఊరు సర్పంచ్
దామోదర్, కోపంగా ఆ పేదవాళ్ళ దగ్గరికి వస్తాడు.
దామోదర్ : సావిత్రమ్మ..ఓ సావిత్రమ్మా! బయటకు రావమ్మా !
వాయిస్ : ఆ పిలుపులు విని ఇంట్లో ఉన్న సావిత్రమ్మ, కీర్తి, బాలు అనే ఇద్దరు పిల్లలు
బయటికి వస్తారు. ఇంటి ముందుకు వచ్చిన సర్పంచ్ దామోదర్ ను చూసి..
ముగ్గురు పేదవాళ్లు వినయంగా దండం పెడతారు.
దామోదర్ : ఈ దండాలకేమి తక్కువ లేదు. నేను చెప్పింది ఏమిటి? మీరు చేస్తున్నది
ఏమిటి? ఈ ఆన్నదాన కార్యక్రమాన్ని ఆపేయమని చెప్పాను కదా !
సావిత్రి : అంతా పెద్ద మాట అనకండి..మేము చాల పేదవాళ్లం.. ఆన్నదాన కార్యక్రమం
చేసేంత ఆర్థిక స్థోమత మా దగ్గర లేదు బాబు.. ఏదో మాకు కలిగినంతలో
ఒక్కరికి మాత్రం కడుపు నిండా..రెండు పూటలా అన్నం పెట్టగలుగుతున్నాం.
దామోదర్ ; నేను వద్దని చెప్పకా కూడా మీరేలా అనాదకు అన్నం పెడుతున్నారు. ఈ
ఊరి పెద్దగా నా మాటకు మీరు గౌరవించలేనప్పుడు నా ఊరిలో ఉండటానికి
వీల్లేదు.
కీర్తి ; ఊరి పెద్ద మనుష్యులంటే సహాయం చేసేటట్టు ఉండాలి. చేసేవాళ్లను
అడ్డుకునేతట్టు కాదు. అయిన మేము మీ దగ్గర లాక్కుని అనాధాలకు అన్నం
పెట్టడం లేదు కదా!
బాలు : నేను మా అక్క చేతనైన పని చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ,
వచ్చిన డబ్బులో కొంత అనాధలకు అన్నం పెట్టడానికి ఉపయోగిస్తున్నాం.
అంతే !
సావిత్రి : పిల్లలు మీరుండాండీ..పెద్ద వాళ్ళం మేము మాట్లాడుతున్నాం కదా!
దామోదర్ : చూడమ్మా సావిత్ర్రి… మీ మంచి కోరే మనిషిగా చెబుతున్నాను.
డబ్బులుంటే దాచుకోండి. ఎప్పుడో ఒకప్పుడు ఆ డబ్బులు ఉపయోగపడతాయి.
కానీ ఈ దానాలు, ధర్మాలు చేస్తే ఏం వస్తుంది చెప్పు?
సావిత్రి : పుణ్యం వస్తుంది.
కీర్తి ; మనిషి పుట్టుకకు ఒక అర్థం వస్తుంది.
బాలు ; సాటి మనిషిని ప్రేమించలేని వాడు మనిషి కాదు. ఒక కాకి చనిపోతే కొన్ని
వందల కాకులు వస్తాయి. అక్కడ చనిపోయిన కాకి గొప్పతనం కాదు..
చనిపోయిన కాకి కూడా మనలో ఒక్కతి అనుకుంటున్న ఆ కాకులు గొప్పవి.
దామోదర్ : మీ కాకి కథలు వినడానికి రాలేదు. ఏదో బాగా తెలిసిన కుటుంబం కదా!
మంచి చెడు చెప్పితే అర్థమవుతుంది కదా అని నేను వచ్చాను. ఉన్నదంత
దానం చేసుకుని ముష్టి ఎత్తుకుంటానంటే నేనెందుకు వద్దని చెప్తాను మీ
కర్మ !
వాయిస్ ; అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తల్లి ముగ్గురు కలిసి ఇంట్లోకి
వెళ్తారు. కీర్తి, బాలు.. తాళ్ళు, గొడ్డలి తీసుకుని తల్లి సావిత్రి దగ్గరికి వస్తారు.
కీర్తి : అమ్మ.. నేను తమ్ముడు అడవికి వెళ్ళి కట్టెలు తీసుకుని వస్తాం !
సావిత్రి : అలాగే పిల్లలు. జాగ్రత్తగా !
వాయిస్ : కీర్తి, బాలు గొడ్డలి, తాళ్ళు తీసుకుని అడవికి వస్తారు. కట్టెల కోసం ఎండిన
చెట్టును చూస్తుంటారు. ఒక చోట కనబడుతుంది. ఆ ఎండిన చెట్టు దగ్గరికి
వస్తారు. ఆ చెట్టును ముక్కలు ముక్కలుగా కట్టెలుగా నరికి, కట్టుకుని నెత్తిన
పెట్టుకుని ఇంటికి బయలుదేరుతారు. దారిలో..
బాలు : అక్క..మనకు తోచిన విధంగా అనాధాలకు, పేదవాళ్ళకు సహాయం తప్పు
అవుతుందాక్క !
కేర్తి ; కాదు తమ్ముడు. మనం సహాయం చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడూ ఖచ్చితంగా
చేయాలి. చేయలేని పరిస్థితిలో ఉంటే అది వేరే విషయం..కానీ చేసే స్థితిలో
ఉన్నప్పౌడు చేయలేక పోతే అంతకు మించినా పాపం మరొకటి ఉండదు.
వాయిస్ ; అలా మాట్లాడుకుంటూ కీర్తి, బాలు ఇద్దరు కలిసి కట్టెలను తీసుకుని ఇంటికి
వస్తారు. ఆకలిగా ఉందని అన్నం పెట్టమని వాళ్ళ అమ్మకు చెప్పి
కూర్చుంటారు. సావిత్రి అన్నం పెట్టడానికి ముందు అన్నం గిన్నెను చూసింది.
సావిత్రి : ఎవరో ఒకరికే సరిపోతుంది కీర్తి.
కీర్తి : అయితే తమ్ముడికి పెట్టమ్మా! చిన్నవాడు కదా..నేనంటే పెద్దాదానిని కదా !
బాలు : పెద్దదానివే కావొచ్చక్క కానీ ఆడపిల్లవి కదా ! ఆడపిల్లలు ఆకలికి ఓర్చుకోలే
రని నాకు తెలుసక్కా! అందుకే నువ్వు తిను.
వాయిస్ : అలా అక్కాతమ్ముడు వాదించుకుంటూ ఉండగా, ఇంతలో బయటి నుంచి
అమ్మ ఆకాలి..ఆయ్యా ఆకలి అనే అరుపులు వినిపిస్తాయి. వెంటనే కీర్తి, బాలు
ఇద్దరు బయటకి వచ్చి చూస్తారు. ఇద్దరు ఆడవాళ్ళు..ఒకరు కడుపుతో,
మరొకరు మామూలుగా ఉన్నారు. ఆ విషయాన్ని అక్కాతమ్ముడు
గమనించారు.
మామూలు స్త్రీ : పిల్లలు నాకు బాగా అలవుతుంది. కొంచెం అన్నం పెట్టండి.
గర్భవతి స్త్రీ ; నాక్కూడా బాగా ఆకలిగా ఉంది పిల్లలు..దయచేసి అన్నం పెట్టండి.
వాయిస్ : కీర్తి, బాలు ఇద్దరు బాగా ఆలోచన చేసి..కడుపుతో స్త్రీకి అన్నం పెడతారు. ఆ
స్త్రీ కడుపు నిండా తిన్న ఆ గర్భవతి స్త్రీ వెంటనే దేవకన్యలా మారిపోతుంది.
కీరి, బాలు ఆ దేవకన్యని చూసి దండం పెడతారు.
దేవకన్య : పిల్లలు సమయ స్పూర్తి కి తగ్గట్టుగా ఆలోచన చేసి ఆకలి అంటున్న వాళ్ళ
కడుపు నింపుతున్నారు. మీ మానవ సేవకు మెచ్చి మీకు మాయా గంటను
ఇస్తున్నాను. ఈ మాయ గంటతో మీరు ఆకలని తీర్చగలుగుతారు. ఒకసారి
గంట ఊపితే ఒకరికి సరిపడా భోజనం వస్తుంది. అలా మీరు ఎంత మందికి
కావాలంటే అంతా మందికి అన్నం పెట్టొచ్చు.
కీర్తి : మీ ఆశీస్సులు మాయాగంట రూపంలో దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది.
ఇక నుంచి మా ఆన్నదాన సేవ కార్యక్రమం మరింత మంది ఆకలి
తీరుస్తుందంటే సంతోషమే కదా తల్లి !
దేవకన్య : అత్యాశకు పోనంత వరకు మీకు ఈ మాయాగంట సహాయం చేస్తుంది.
అత్యాశకు పోయిన మరుక్షణం మీరు కూడా అంతమై పోతారు. జాగ్రత్త !
వాయిస్ ; అని చెప్పి దేవకన్య మాయావుతుంది. అలా దేవకన్య ఇచ్చిన
మాయాగంటతో కీర్తి, బాలు.. ఆ రోజు నుంచి ఆకలని ఎవరు వచ్చిన వాళ్ళకు
అన్నం పెడుతూ ఆ చుట్టూ పక్కల అన్నదాతలుగా మంచి పేరు
తెచ్చుకుంటారు.
-0-
ఒకానొక మారుమూల గ్రామంలో సావిత్రి, తన పిల్లలైన కీర్తి, బాలుతో కలిసి జీవిస్తూ ఉంటుంది. అనారోగ్యం కారణంగా ఇంటి దగ్గరే ఉంటూ, పిల్లలకు వండిపెడుతూ, మందులు వాడుతూ ఉంటుంది సావిత్రి. ఇక కీర్తి, బాలు ఇద్దరు తమకు చేతనైనా పని చేసుకుంటూ ఉంటారు. అలా వచ్చిన డబ్బులతోనే తమ తల్లిని చూసుకుంటూ రోజుకొక అనాధకు అన్నం పెడుతూ మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటారు. అది నచ్చని ఆ ఊరు సర్పంచ్ దామోదర్, ఆ పేదవాళ్ళ కు వార్నింగ్ ఇస్తాడు. అయిన భయపడకుండా ఆకలని వచ్చిన వాళ్ళకు అన్నం పెడుతూ ఉంటారు. అప్పుడు ఒక గర్భవతి రూపంలో దేవకన్య వచ్చి మాయా గంట ఇస్తుంది. ఆ మాయాగంట ద్వారా కీర్తి, బాలు చాలా మండి ఆకలన్న వాళ్ళకు అన్నం పెడుతూ ఉంటారు.
-0-
Related Posts

బొంగులో చికెన్ | Telugu Kathalu | Telugu Story | Bedtime Stories | Panchatantra kathalu

పేద vs ధనిక పిల్లలు Episode 163 | Telugu Stories | Telugu Kathalu | Banana Dreams TV
