పేద వారి దీపావళి | Telugu Kathalu | Telugu Stories| Stories in Telugu | Moral Stories

గోవిందాపురం అనే గ్రామంలో వీర, లక్ష్మి అనే పేద దంపతులు ఉండేవారు, వారికి ఒక కూతురు ఉండేది, ఆమె పేరు కమల, కమల చాలా మొండి పిల్ల, తల్లిదండ్రుల మాట ఎప్పుడు వినేది కాదు, ఎప్పుడూ గోల చేస్తూనే ఉండేది, కమల చేసే పనులు వీర లక్ష్మిలకు ఎప్పుడు తల నొప్పిగానే ఉండేది, ఒకరోజు లక్ష్మి వీర దగ్గరికి వచ్చి

లక్ష్మి :- ఏమండీ మన అమ్మాయి కమల రోజు రోజు చేసే పనులకు అంతు పంతు లేకుండా పోతుంది. ఈరోజు మన ఇంటి దగ్గర ఉన్న ఆ ధనవంతులైన రమేష్ వాళ్ళ కూతురు విమలని చూసి తన దగ్గర ఉన్న బొమ్మలు ఆ అమ్మాయి వేసుకునే బట్టలు చూసి కమలకి కూడా అలాంటివే కావాలని అడుగుతూనే ఉంది అండి. మొన్నటికి మొన్న విమల దగ్గరకి ఆదుకోవడానికి వెళ్లి ఎవరూ తన దగ్గర లేని సమయం చూసి ఆమె వాళ్ళ దగ్గర ఉన్న అందమైన బొమ్మలు ఎత్హుకొచ్చింది, తరువాత రమేష్ వాళ్ళు మన ఇంటికి మీదకి గొడవకు వచ్చారు, నేను ఎదో సర్ది చెప్పడం వల్ల వెళ్లిపోయారు, కమలతో ఎలానో ఏమో అన్నది చూస్తుంటే నాకు ఎంతో బాధగా భయంగా ఉంది నాకు, అని చెబుతుంది.

వీర :- నాకు కూడా తెలిసింది లక్ష్మి, కానీ ఏమి చేయాలో నాకు కూడా అర్ధం కావట్లేదు, మొన్న కమల నా దగ్గరికి వచ్చి ” నాన్న ఇంకా కొన్ని రోజుల్లోనే దీపావళి పండుగ వస్తుంది, మీరు ఏమి చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు, నాకు చాలా మతాబులు కావాలి ఒక వేళ మీరు కనక చాలా మతాబులు తేకపోతే మాత్రం నేను ఇంటి నుండి వెళ్ళిపోతాను”, అని నన్ను బెదిరించింది,

నాకు ఏమి చేయాలో అర్ధం కాలేదు కమల్ మన చేయి దాటి పోయినట్టు అనిపిస్తుంది. అని బాధ పడతాడు

ఇంతలో అక్కడికి వచ్చిన కమల

కమల :- నాన్న అమ్మ ఇద్దరు ఇక్కడే ఉన్నారా? నాన్న ఇంకా కొన్ని రోజుల్లోనే దీపావళి వస్తుంది, నీకు ముందే చెప్పాను కదా, దీపావళికి పటాకులు కావాలి అని, మన ఇంటి పక్కన ఉన్న విమల వాళ్ళ నాన్న దీపావళికి చాలా మతాబులు తీస్తానని చెప్పాడంటా, నాకు వాలకంటే ఎక్కువ కావాలి మీరు ఎం చేస్తారో ఎలా చేస్త్తారో చూడండి అని చెప్పి వెళ్ళిపోతుంది.

లక్ష్మి :- ఏంటండీ కమల మరి ఎలా చేస్తుంది దీన్ని ఎలా అదుపు చేయాలో నాకు ఏ మాత్రం అర్ధం కావట్లేదు అని చెబుతుంది.

అలా రోజులు గడుస్తూనే ఉంటాయి. ఇంతలో దీపావళి పండుగ దగ్గర పడుతుంది.

 ఒకరోజు వీరమ్మ అనే  లక్ష్మి దగ్గరికి వచ్చి

వీరమ్మ :- ఏంటమ్మా లక్ష్మి ఎలా  తీసుకున్న అప్పు కట్టకుండా  తిరుగుతారు చెప్పండి, మీరేదో మంచివారని మా ఆయనకు గొడవ పడి మరి మీకు అప్పు ఇప్పించాను కానీ మీరు మాత్రం అప్పు కట్టక పోవడమే కాకుండా కనిపించినా కూడా మొకం చాటేసుకొని పోతున్నారు, ఇది ఎక్కడి న్యాయం,  మీరు బాగానే ఉన్నారు, నేను రోజు మా ఆయనతో మీ అప్పు గురించి గొడవ అవుతుంది, ఇక నా ఓపిక చచ్చిపోయింది, మీరు మర్యాదగా దీపావళి రోజు వరకు ఇచ్చారా మంచిగా ఉంటుంది, లేదంటే మిమ్మల్ని రోడ్డుమీద పడేసి మీ ఇల్లుని లాక్కోవలసి వస్తుంది జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతుండగా కమల కనిపిస్తుంది

వీఆరమ్మ కమలాన్ని తన దగ్గరికి పిలిచి

వీరమ్మ :- చూడు కమల మీ అమ్మ నాన్న నీకోసం ఎంత కష్టపడుతున్నారో నీకు తెలియడం లేదు, నీ సంతోషం కోసం రాత్రిబవళ్ళు నిద్రాహారాలు మానేసి కష్టపడుతున్నారు, నువ్వు వాళ్ళతో ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే ఏమి సంబంధం లేని నాకే చాలా బాధగా అనిపిస్తుంది, ఇంకా నిన్ను అంత కష్టపడి పెంచుతున్న మీ అమ్మ నాన్నలకు ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడు నీకు ఎం కావాలో వాళ్ళని అడగడమే కానీ నువ్వు అడిగిన దానికోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో నీకు తెలుసా? నీ కోరికలు తీర్చలేక., ఇంటిని గడపలేక పనులు దొరక్క వాళ్ళు రోజు రోజు నరకం అనుభవిస్తున్నారు, ఇక నీ ఇష్టం అని కమలకు చెబుతున్నది వీరమ్మ

వీరమ్మ మాటలు విన్న తరువాత కమల తన తల్లిదండ్రులని ఎంత బాధపెడుతుందో అర్ధం అవుతుంది తనకి, వీర లక్ష్మి దగ్గరికి వెళ్లి

కమల :- నాన్న నేను ఇన్రోజులు మిమ్మల్ని ఎంత బాధపెట్టానో నాకు ఇప్పుడు అర్ధం అయ్యింది, ఇక మిమ్మలను బాధ పెట్టను నాన్న, నాకు దీపావళి కి మతాబులు వద్దు ఏమి వద్దు మీరు నాతో ఉండండి చాలు అని అంటుంది

ఆ మాటలకు వీర లక్ష్మి మనసులు కరిగి పోతాయి

లక్ష్మి :- చూడమ్మా నీకు అడిగింది ఇవ్వడం మా బాద్యత, ఇన్ని రోజులు నువ్వు మా మాట వినడం లేదని బాధ పడ్డాము కానీ ఇప్పుడు నువ్వు మారిపోయావు మాకు అదే చాలు, మా శక్తికి సరిపడే అని పటాసుకు తీసుకు వస్తాము తల్లి, వాళ్ళు డబ్బున్న వాళ్ళు, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా తిరిగి పొందగలరు, కానీ మనం అలా కాదు కదా, ఒకొక్క పూట తిండి  కోసం రోజుల తరబడి కష్టపడాల్సి ఉంటది, అని చెబుతారు, చూస్తుండగానే దీపావళి వచ్చేస్తుంది,

ధనవంతుల కూతురైనా విమల చాలా రకాల టపాసులు పేల్చుతూ ఎంతో సంబరంగా ఉంటుంది, కానీ కమలకి వాళ్ళ తల్లి దండ్రులు ఇచ్చిన కొంత టపాసులతోనే పండుగ చేసుకుంటూ విమల కంటే ఎంతో ఆనందంగా బ్రతుకుతుంది,

దీనిని బట్టి మనం అర్ధం చేసుకోవలసిన నీతి ఏంటంటే మన దగ్గర ఎంత డబ్బులు వున్నాయి, మన తల్లిదండ్రులు ధనవంతుల కాదా అని కాదు మన చూడవలసినది, మన తల్లి దండ్రులు మన కోసం ఎంత కష్టపడుకుతున్నారు అని చూడగలిగితే అదే నిజమైన సంతోషం.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *